Posts

Showing posts from September, 2019

అ ముద్రిత ఛందస్సు కవితలు

Image
నేటి నా కీర్తన     ప్రాంజలి ప్రభ   రచయత: మల్లాప్రగడ రామకృష్ణ   సారంగ - త/త/త/త UUI UUI - UUI UUI 12 జగతి 2341 ఏముంది నీలోన - నీసుందరమ్మే న  వాభ్యుదయామృత - నీ మానసాహిత్య  సంగీత సౌలభ్య -  సౌందర్య ఉల్లాస  ఉత్తేజ భావమ్ము - నన్నావ హించేను ..... 1   ఏనాటి భంధమ్మో - ఈనాడు నీముందు  నేతాడ లేకున్న - నీవెంత భేదమ్ము    చూపించినా మాట  - నామమ్ము నీమీద  యీనాటి కీ మార దంటే మనస్సొప్పు  ...... 2  ప్రాణమ్ము నీవిందు  - గానమ్ము నీవిందు    ధ్యానమ్ము నీవిందు - కాలమ్ము నీవిందు  గాలమ్ము  నీవిందు - నాపంట పండించె   చాలించు మాయాట -  ఇంకెందుకీ పూట .... 3        మాటల్ వినోదమ్ము - పాటల్ వినోదమ్ము చేతల్ వినోదమ్ము -  లీలల్ వినోదమ్ము  నీ రూపు నీలాలు   - నీకళ్ళు వెన్నెల్లు నాయందు యీపూట - సంతృప్తి కల్పించు .... 4                     గోపాల గోపాల - గోవింద గోవింద  గోపాల గోపాల - గోవింద గోవింద గోపాల గోపాల - గోవింద గోవింద --((*))-- నేటి ఛందస్సు - ప్రాంజలి ప్రభ  రచయత:మల్లప్రగడ రామకృష్ణ   ఇది చిత్రం కాదు పరిణత చెందిన తరుణి నీలి కన్నులు గల నీలాలు ఉన్న నీలవేణి కడలిని కలియుటకు ఉరికే తరం

kavitalu అముద్రిత కవితలు

Image
ప్రాంజలి ప్రభ -  rachayata Mallapragada ramakrishna  శివశివా… నీలీలలు తెలపవా శివా ఇసుక రేణువులోన దూరియుందువు శివా   బ్రహ్మాండమంతయును నిండియుందువు శివా చివురాకులాడించు  గాలిదేవర శివా ఘన కానలను గాల్చు  కారుచిచ్చువు శివా  క్రిమికీటకాదులకు  మోక్షమిత్తువు శివా కాలయమునిబట్టి  కాలదన్ను శివా పెండ్లి జేయరాగ మరుని మండించావు శివా పెండ్లియాడి సతికి సగమిచ్చినావు శివా దక్షయాగము ద్రుంచి సురలందరిని గొట్టి నావు శివా వికటాట్టహాసమున భయపెట్టినావు శివా కడలి చిలుకు వేళ కాలకూటము మింగినావు శివా  తపస్సుతో అడిగిన  వెంటనే ప్రత్యక్షమై వరములిచ్చే శివా    శివశివా… నీలీలలు తెలపవా శివా --((*))-- నేటి కవిత  (ప్రాంజలి ప్రభ ) రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ చిరునగవుల చిందులు చూపి చిరుతలా ఉరకలు పరుగులు పెట్టుట ఎందుకే పరువు పోతుందని వంకచూపి పరుల మాటవిని నన్ను మరచి పోయావెందుకే చరితను వేలెత్తి చూపి దారియేదో తెల్పి మనసు మార్చుట ఎందుకే బరిలో దిగమని ఆశ చూపి వరి కంకులా గాలికి ఉగమన్నావు ఎందుకే చిన్నదానా వలపును చూపి చిన్నమాటకు చిందులు వేయుట ఎందుకే ఉన్నమాటని వాదనచేసి కన్నవారికి న