Posts

Showing posts from June, 2018

భావ రస మంజరి

Image
--((**))-- --((**))-- నేటి కవిత -9-ప్రాంజలి ప్రభ  భావ రసమంజరి రచయత : మల్లాప్రగడ రామకృష్ణ   అతిస్వేచ్ఛ ఇవ్వటం  అది ఒక క్షణికానందం  పర్యవసానం మొండి ధైర్యం ఎదురు తిరిగిన వైనం   పెద్దలకు మాటరాని మౌనం  ధర్మమే ఆరో ప్రాణం          స్నేహమే మరో ప్రాణం  ప్రకృతే నిత్య పాణం  పోరాటమే యవ్వనం  కాలమే గమన మౌనం  అతి ప్రేమ చూపటం ములగ చెట్టు ఎక్కించటం  విశ్వాసం పెంచటం    వినోదంగా మారటం   నోరు విప్పలేక మౌనం తెలివిగా పసిగట్టి ప్రవర్తించటం  భాషా చాతుర్యంతో మెప్పించటం  అతిప్రేమ చూపక జాగర్త పడటం తృప్తి సంతృప్తి మధ్య సాగాలి జీవం  --((**))--  నేటి కవిత- 8-ప్రాంజలి ప్రభ   భావ రసమంజరి  రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  పోనీ, పోనీ,  దేహం ఎటుపోతే నాకేం  పొతే, పోనీ,  నన్ను వదిలి పొతే నాకేం  రానీ, రానీ,  కష్టాల్, నష్టాల్  నాకేం  వస్తే రానీ  భూకంపాల్, పెనుతుఫాన్ నాకేం  కష్టాల్, నష్టాల్,  నా మనసును తాక లేవ్ కోపాల్, తాపాల్, శాపాల్  నన్నేమి చేయ లేవ్ తిట్లు, పోట్లు, ఇక్కట్లు,  నా తనువుని మార్చ లేవ్ కానీ, రానీ, రానీ, పోనీ,  నా హృదయాన్ని కదిలించ లేవ్            కళా క

నేటి : విశ్లేషణ

Image
అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్‌(కథ) సాహితీమిత్రులారా! అంతస్తుకు రెండు అపార్ట్‌మెంట్స్‌ చొప్పున మూడంతుస్తుల్లో ఆరు కాపురాలున్న అయిదారు వందల భవనాల కాలనీ మాది. తీర్చిదిద్దినట్టుండే వీధులు, పంచరంగుల కేకులతో కట్టిన మిఠాయి నిర్మాణాల లాంటి ముచ్చటైన భవంతులు, ఆగంతుకులెవరైనా వస్తే వచ్చిందెవరో తెలుసుకోవడానికి వీలుగా తలుపులో అమర్చి ఉంచిన ‘అద్దపు కన్నూ’, వచ్చిన వాళ్ళెవరైనా ఏదైనా వస్తువులు తీసుకొచ్చి వుంటే చేయి మాత్రం బయటికి చాపి వాటిని తీసుకోవడానికి వీలుగా ఏర్పాటుచేసిన గొలుసు అమరిక. పచ్చని చెట్లతో పూలమొక్కలతో పచ్చిక బయళ్ళతో ప్రశాంత మనోహరమైన వాతావరణం. కాలనీ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ. మెయిన్‌ రోడ్డు పైనుంచి లోపలకు రావడానికి ఏర్పాటు చేసిన ఏకైక ప్రధాన ద్వారం. అక్కడ అహర్నిశలూ కాపలా వుండే ఘూర్ఖాలు. ఇదంతా చూస్తే పూర్వకాలంలో ప్రాగ్జోతిషం, పాటలీపుత్రం, కన్యాకుబ్జం లాంటి మహా నగరాల కెట్టి రక్షణ ఉండేదో అంతటి భద్రత మాకాలనీకీ ఉందని నిస్సందేహంగా చెప్పొచ్చు. కాలనీ వాళ్ళం కదా! పడమట దిక్కున రెండు కిలోమీటర్ల దూరాన ఉన్న ఊరితో మాకట్టే సంబంధాలు ఉండవు. కిరాణాకొట్లు, ఫ్యాన్సీ షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ సదుపా