Posts

Showing posts from March, 2021
[05:51, 25/02/2021] +91 95058 13235: 25.2.2021  ప్రాతః కాల సందేశము వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది ఐదవ అధ్యాయము బలరామకృష్ణులకు ఉపనయన సంస్కారములు - వారు గురుకులమున ప్రవేశించుట 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 45.33 (ముప్పది మూడవ శ్లోకము) తయోర్ద్విజవరస్తుష్టః శుద్ధభావానువృత్తిభిః| ప్రోవాచ వేదానఖిలాన్ సాంగోపనిషదో గురుః॥10031॥ 45.34 (ముప్పది నాలుగవ శ్లోకము) సరహస్యం ధనుర్వేదం ధర్మాన్ న్యాయపథాంస్తథా| తథా చాన్వీక్షికీం విద్యాం రాజనీతిం చ షడ్విధామ్॥10032॥ అంతట గురూత్తముడైన ఆ బ్రాహ్మణుడు (సాందీపని) ఆ సోదరుల యొక్క నిర్మల సేవాభావములకును, సముచిత ప్రవర్తనలకును మిగుల ప్రసన్నుడయ్యెను. అందువలన అతడు వారికి చతుర్వేదములను, షడంగములను, ఉపనిషత్తులను వాత్సల్యపూర్వకముగా నేర్పెను. ఇంకను వారికి ధనుర్వేదమును, మనుస్మృతి మొదలగు ధర్మశాస్త్రములను, న్యాయవైశేషికాది శాస్త్రములను, సంధి, విగ్రహము, యానము, ఆసనము, ద్వైదీభావము, ఆశ్రయము - అను ఆఱు భేదములతో గూడిన రాజనీతి శాస్త్రమును మెలకువలతోగూడ అధ్యయనము చేయించెను. 45.35 (ముప్పది ఐదవ శ్లోకము) సర్వం నరవరశ్రేష్ఠౌ సర్వవిద్యాప్రవర్తకౌ| సకృన్నిగదమాత్రేణ