Posts

Showing posts from October, 2019
Image
 ప్రాంజలి ప్రభ        దీనశరణ్య మహాను భావా      శోభన కీర్తి  శుభాల భావా      రాజ్యసునేత్ర సుమాల భావా      శ్రీకర పాద  విహార  భావా      కౌస్తుభ వక్ష అకార భావా      విశ్వాస సేన విశాల భావా      యోగసునంద సమాన భావా      శ్రీ విద్య విధాత విలోల భావా      సమయస్పూర్తి సహాయ భావా       వినయవిధేయత ముభావ భావా       నిస్వార్ధ సేన తత్పర  భావా       ప్రేమ పూర్వ  దర్శక భావా       త్రికాల దీక్షరూప కాంతి భావా        విలాసవైభవ మనోహర భావా       ప్రసన్న చమత్కార  భావా         విశాల దృష్టి విశ్వాస భావా          --((**))-- ప్రాంజలి ప్రభ  నేటి కవిత (ప్రాంజలిప్రభ ) పువ్వు రచయత: మల్లప్రగడ రామకృష్ణ అకుచాటున పిందె అంకురించే   కొమ్మ రెమ్మలకు ప్రేమను పంచే   ప్రకృతి బలంతో పువ్వుగా విరిసే   అతిశయం తోనే  ఆద మరిచే  పువ్వుగా మారి జ్వాలగా వేలిగే   పెనుగాలికి,పెనవేసి ఉండే   మకరందంతంతో మిడిసిపడే  తుమ్మెద కోసం ఎదురు చూస్తుండే  సుతిమెత్తగా ఉండి  తన్మయమే తుమ్మెద మకరందాన్నికి దారే  సూదిలాంటి పెదాలతో హరించే  పువ్వు పరవశించి ఆనందించే    పరమాత్ముని లీలా మాధుర్యమే  పరమపదించుటకు మార్గమే  పెనవేసుకొని ఉండే బంధమే  నూతన తేజస్సే నిదర్శనమే

kavitalau

Image
చిరునవ్వు దొంతరలు చెదిరి పోయాయి || చీకటులె చిత్రంగ మురిసి పోయాయి || . నిశలెన్నొ కమ్మాయి తొలగించి పోవా వెనుకనే వెన్నెలలు అలిసి పోయాయి || . దూరంగ మిణుకుల్ని చూస్తూనె వున్నా బాటంత కన్నీళ్ళు ఒలికి పోయాయి || . హాసాల అందాలు హత్తు కోనీయవా అనుభూతి కాలాలు చెరిగి పోయాయి || . రెప్పలే దాచాయి కలత తడులెన్నో స్నప్నాలు మెలుకువగ మిగిలి పోయాయి || . ఎలుగెత్తి నావాణి వినిపించ లేను మౌనంలో మాటలే కలిసి పోయాయి || పరిగెట్టే హాసాలకు గాలమెవరు వేస్తారట ॥ సలుపుతున్న వేదనలకు సంకెలెవరు వేస్తారట ॥ ఇంకిపోయి కునుకంతా తిమిరంలో తచ్చాడెను పీడించే రాత్రములకు పానుపెవరు వేస్తారట॥ కరుగుతున్న క్షణాలన్ని కలవరాలు ప్రకటిస్తే జ్ఞాపకాల ప్రతిమలకు ముసుగులెవరు వేస్తారట ॥ గతమైనా కాలమంత గుండె నొదలి పోలేదు ఆగిపోని అశ్రువులకు తాళమెవరు వేస్తారట॥ తపనపడ్డ ఆశలెన్నొ దు:ఖాలను మింగాయి నలుగుతున్న స్వప్నాలకు రంగులెవరు వేస్తారట॥ తడిమనసుతొ తల్లడిల్లి నా వాణీ మూగబోయె గండిపడ్డ కన్నులకు వంతెనెవరు వేస్తారట॥ ........వాణి , 28 march 16 ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ గంగాధరా కరుణ మాపై కురిపించు