Posts

Showing posts from March, 2024
 ప్రాంజలి ప్రభ.. శ్లోక.. తాత్పర్య.. పద్యాలు  001..గచ్చన్ శరీర విచ్చే దావపి భస్మావ శేషా తామ్1 కర్పూర: సౌరభేణేవ జంతు: ఖ్యాతాను మీయతే11 భావం: కర్పూరం వెలిగి ఆరిపోయినా.. సువాసనలు ఇంకా మిగిలి ఉన్నట్లుగా.. సజ్జనుల శరీరం నాశనమైనా.. వాళ్ళ కీర్తి అన్ని కాలాల్లో అలాగే మిగిలిపోతుంది. కం.. ఒప్పు కల లగుట కధలగు  కప్పురము వెల్గియు యారియు వాసనలే ముప్పను మార్చ గలవిధే  చెప్పు పలుకులౌను మంచి తలపే కళగన్  తేటగీతి: కప్పురము వెల్గి యారినా గాని మనకు తత్ సువాసనల్ యింకను తనరునట్లు మంచి వారి యొడలు నాశనమైనగాని వారి కీర్తి సదా నిల్చు వసుధపైన. *** 002..మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుర్జరః ౹     విజ్ఞేన సహ సంయోగః సుధారససమః స్మృతః ౹౹               మూర్ఖుడుతో సంబంధాలు విషకన్నా ఎక్కువ విషం. సజ్జనులతో సహవాసం సుధ అంటే అమృతంతో సమానం. ఆ.. మూర్ఖ బంధ మున్న ముప్పు తోడగుటయే విషము కన్న ఎక్కువే యగుటయు సజ్జన చెలిమి గతి చలువ సుధ లగుటే అమృత మేను త్రాగ ఆత్మ సుఖము  తే.. మూర్ఖ సంపద సంబంధ ముఖ్య మేళ చెలిమియె విషమ్ము యవ్వుటే చేరు గతియు సజ్జనులతో సహన వాస సమయ తృప్తి అమృత మేయగు సహనమ్ము ఆత్మ తృప్తి *** 003..అధర్మేణైధతే తావత్-తతో భద్రాణి పశ్యత