నేటి కవిత ప్రాంజలి ప్రభ
నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు
2016 న జరిగి పోయిన సంఘటనలను మరచి పోదాం
2017 న జరగ బోయేవి ఏమిటో ఎదురు చూద్దాం
జరిగేది జరగక మానదు ఆశపడకు
జరిగినదానిగూర్చి విచారించుట ఎందుకు
జరగబోయేదానిగూర్చి ఆలోచించుట ఎందుకు
జరుగుతున్నది అంటా మనమంచికే అనుకో
క్షణికమైన బ్రతుకుకు ఆయాలు ఎందుకు
జీవితాన శాంతిలేక తిరుగుట ఎందుకు
ఆశకు సమయాన్ని వ్యర్థం చేయుట ఎందుకు
నిజమైన ధర్మమేదో నిదానంగా తెలుసుకో
భ్రమలు కొలుపు ఆకర్షణలు ఎందుకు
నాది అనే భావన మనసున రానీయకు
అందరితో నవ్వులు పంచుకొని బ్రతుకు
అరిషడ్వర్గాలను అదుపులో ఉంచుకో
అమరావతి నగరంలో, పారిజాత వనంలో,
జగదేకవీరుడు అతిలోకసుందరి
ఏకమైన తరుణం - భావ కవితామృతము (ఛందస్సు)
పిచ్చి మనసు తనువునే
కూర్చియు వలపు తలపే
ఏకము అగుట కొరకే
ప్రేమను తెలుపుట కదా
ఈ చిలక కల వెలుగే
రంగుల కథల మలుపే
హంగుల తెలుపు వగలే
పొంగులు కలసి సెగలే
వేడి వలపు సొగసులే
వేకువ పలుకుల వలే
శోభల తలపు తెలిపే
మాటలతొ చిరు నగవే
హృదయ తపన తెలిపే
శృతి పలుకులు చిలికే
ప్రీతి కొరకు నటననే
చూపియు నాగువులొలికే
తామర లతలా సెలయే
రూ పరిమళము చిరుదీ
పం వెలుగులతొ మమతా
నందము శుభము కలిగే
తురుపు కిరణ వెలుగూ
పొద్దు తిరుగు లతలకూ
వేకువ సరయు నది కీ
పొంగు కడలి ఉరకలే
వాంఛ ఫలితము తరుణా
నంద సుమధుర మధురా
నంద భవ బగ తలపే
స్వర్గ సుఖ కల ఒకటే
ప్రతి అణువు కదలికే
ప్రీతి గొనుట మధురమే
శృతులు గొలుపు గళమే
ఒక్క నిముషము సుఖమే
జీవితమునకు సమభా
వాల మగువకు మగడే
సంత మవుటకు మదనా
నంద సుఖము కొరకే
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ - నేటి కవితలు -3
ఎందరున్నా గాని ఎవ్వరు లేనట్టు
ఎవ్వరు లేకున్న అందరున్నట్టు
ఉండి లేకున్నా బ్రమణ మన్నట్టు
భ్రమణం చుట్టూ మనసు ఉన్నట్టు
మనసు మనుగడలో ఉండు గుట్టు
అది ఎప్పుడు చేయ కూడదు రట్టు
గుట్టురట్టు చేయనని చేయాలి ఒట్టు
ఒట్టుకు కట్టుబడి ఉండుటే జీవమన్నట్టు
ప్రకృతిని బట్టి వాక్కు ఉండాలన్నట్టు
వాక్కుబట్టి గౌరవము పెరుగుతున్నట్టు
మనిషి మనుగడకు ఇది ఒక మెట్టు
మెట్టు మెట్టుకి కొత్త ఆలోచన రాబట్టు
కాలము ఎప్పుడు తిరుగు తున్నట్టు
మనిషి ఆయువు తరగి పోతున్నట్టు
దాన ధర్మాలు మన: శాంతికి మెట్టు
ధర్మం తప్పితే భాధపడక తప్పదు ఓట్టు
--((*))--
నేటి కవిత - 96ప్రాణఃజలి ప్రభ ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
దేశ సేవకన్న దేవతార్చన లేదు
స్వార్ధ సేవకన్నా చావు లేదు
సానుభూతి కన్నస్వర్గంబు లేదు
నిజాయితి సేవకన్న నిజము లేదు
భార్యతో కలహము మంచిది కాదు
నాలుకను నిగ్రహించుకోక తప్పదు
రేపటి గురించి ఆలోచించ వలదు
సంపద స్వప్నమని మరువవలదు
జ్ఞానాన్ని పోలిన ఏదియు లేనే లేదు
గడచి పోయిన క్షణం తిరిగి రాదు
అపకీర్తికి మించిన మరణం లేదు
నటనను నేర్చిన మనిషికి ముక్తిరాదు
మునుపున్న సంతతి నేడు లేదు
మునుపున్న పాడి నేడు కానరాదు
చదువున్నానని ధీమా మారుట లేదు
సంపాదనతో మనిషికి బుద్ధి ఉండుటలేదు
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం
మురళీ గాణలీల మాధుర్య మకరంద
రవళీ మోహలీల ఆకర్ష సుఖనంద
సరళీకృత మోక్ష తన్మాయ లతనంద
నవనీతాశ ప్రియ మోహాల వలనంద
పలుభావాల రాగ సంతృప్తి ముఖనంద
పలువేషాల తాప చిన్మాయ రమనంద
సుఖలాలిత్వ సేవ తన్మంత్ర అభినంద
మనసావాచ ప్రీతి కల్పించే సఖి నంద
కరుణాశీల వాళ ఉద్భోద గురునంద
తరుణాదిత్య భావ స్సద్బోధ భగనంద
నవరాగాల ప్రేమ సంతోష లయనంద
తనువాదిత్య శోభ ఆనంద జగనంద
నవమాసాలు బిడ్డ ఆదర్శ సుఖనంద
నవభావాల పుత్ర ఆకాంక్ష సమనంద
నవరూపాల శక్తి స్వరూప చరనంద
నవలోకాల భాగ్య అందించె సుమనంద
వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం
ప్రాంజలి ప్రభ
గోపాల బాల నిన్ను కోరి నీ సన్నిధి చేరి
నీతో నె రాగ లన్ని చెప్పి నీ పెన్నిధి కోరి
నీ చెంత నే నున్న నన్ను నీ దాసుని చేసి
నీ వేణు గానామృతమ్ము తో సంతస చెందె
గోపాల బాల నిన్ను కోరి నీ దీవెన పొంది
నీచెంత ఉండి నే దలాలతో పూజలు చేసి
నా గాధ తెల్పి నీ మనో మహారాణిని నమ్మి
నీ సేవ కల్ప మే ఆశ పాశాలుగను మారె
గోపాల బాల నిన్ను కోరి ఆశయ సిద్ది
పొందాల నే జపాలతో శరీరము వంచి
బంధాలనే వదల్చుకోక నీ లోగిలి చేరి
నీమీద ప్రేమ నన్ను పిచ్చి వాని వలే చేసె
--((*))--
నేటి కవిత
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి నిన్ను నీవు తెలుసుకో
ఏమీలేని రాజ్యాన్ని ఆదుకోమని
అవకాశం ఇచ్చారు మీరు
అందుకే
అమరావతి రాజధాని నిర్మిస్తూ
నదులను అనుసంధానం చేస్తూ
నిరంతరం విద్యుత్తును అందిస్తూ
నిరుద్యోగ భృతిని కల్పిస్తూ
పోలవరం ప్రాజక్టుని నిర్మిస్తూ
పసుపుకుంకుమ క్రింద అందిస్తూ
వృద్ధులకు ఇచ్చే భృతిని పెంచేస్తూ
ఉద్యోగజీతభత్యాలు సక్రమమంగా ఇస్తూ
పేదవారికి పక్కాగృహాలు కల్పిస్తూ
ఇంకా ఇంకా ఎన్నోమరెన్నో సేవలు చేస్తూ
అందుకే
మీముందుకె వస్తున్నా తెలుగు దేశం
ప్రగతి పధాన్ని గమనించి ఓట్లు వేసి
మరొక్క సారి అవకాసమ్ ఇవ్వమని కోరుతున్నా
అమరావతి ప్రగతి ప్రపంచదేశాలకు తెలిపేందుకు
నేను ఒంటరివాణ్ణి కాను
నాకు మీరందరు ఉన్నారు తోడు
ప్రశాంతత కొరకు చేస్తున్నాను
ఆశయసాధనకు ఉన్నారు తోడు
అన్నిరంగాలలో ప్రగతిని తెస్తున్నాను
అవి నిలుపుటకు ఉన్నారు తోడు
ప్రతిఒక్కరు నవ్వుతూ ఉండాలని కోరుతున్నాను
అందరి ఆకలి తీర్చుటకు ఉన్నారు తోడు
విద్యార్థుల నిరాశను తొలగిస్తున్నాను
ఆధునిక విధానానికి ఉన్నారు తోడు
ఇష్ట పడే వారెవ్వరిని వదులుకోను
అభిమానందతో నాతో ఉన్నారు తోడు
చరిత్రలో చిరస్థాయిగా ఉండేలా చేస్తున్నాను
నీడనిచ్చే చెట్టులా మీరు ఉన్నారు తోడు
నిస్తేజపు బ్రతుకు మనకొద్దని తెల్పుతున్నాను
చెడుని దహించివేయుటకు ఉన్నారు తోడు
ఓ మనిషి నిన్ను నీవు తెలుసుకో
అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకో
--((**))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: ప్రాంజలి ప్రభ
నిత్య లోక సంచారిని నేను
నారదుని మాత్రం కాను
పక్షి లాగ సంచరిస్తూ ఉంటాను
గరుడ పక్షి ని మాత్రం కాను
రంగు రంగులతో మెరిసి పోతాను
సీతాకోక చిలకను మాత్రంకాను
ప్రపంచ ప్రజలను ఆకాశంలో త్రిప్పుతాను
నేను పుష్పక విమానము మాత్రమం కాను
నక్షత్రాలు మధ్యలో తిరుగుతాను
నేను చంద్రుని మాత్రం కాను
వేడిమిని భరించి తిరుగుతాను
కాని నేను సూర్యుని మత్రంకాను
ఊపిరి నింపుకొని కదులుతాను
నేను మేఘాన్ని మాత్రం కాను
సముద్రాలు దాటి ప్రయాణిస్తాను
హనుమంతుడను మాత్రము కాను
భూమిపై భారమంతొమోపి యగురుతాను
బొద్దింక ను మాత్రం కాను
ఇంతకీ నన్ను గమనించి ధర్మ మార్గాన
నడిపించవా శివా " ఓం నమ: శివాయ :"
రాజకీయ పార్టీ పెట్టు
బురద రాజకీయాలు
వలస రాజకీయాలు
కుటుంబ రాజకీయాలు
నీకు తోడుండక పొతే ఒట్టు
ఒకరి పై ఒకరి విసుర్లు
నంగ నాచి కబుర్లు
పెరుగుతున్న బ్రోకర్లు
నీకు తోడుండక పొతే ఒట్టు
వితండ వాదాలు
పదవితో పోరాటాలు
కొలువులో నిరాశపరులు
నీకు తోడుండక పొతే ఒట్టు
పాద యాత్రలు
ముదిరిన కేసులు
నమ్మించే వాగ్దానాలు
నీకు తోడుండక పొతే ఒట్టు
ప్రజా సొమ్ముతో యాత్రలు
ప్రజా సొమ్ముతో భవనాలు
ప్రజా సొమ్ముతో శిలావిగ్రహాలు
నీకు తోడుండక పొతే ఒట్టు
వాస్త వానికి దారి
నమ్మకానికి విలువ
ఆదరణకు కొదువ
నీకు తోడుండక పొతే ఒట్టు
శల్యు లుండవచ్చు
శకును లుండవచ్చు
శణేశ్వరులుండవచ్చు
ఆశ తోడుండక పొతే ఒట్టు
--((*))--
ప్రాంజలి ప్రభ తీయని కలలు కని
చల్లని గాలిలో తిరిగి
మనసుతెర కదిలి
వేడిగాలికి చెదిరి
కళ్ళుతెరిచి
వళ్ళు విరిచి
మైమరిచి
గాలి కౌగిలింతగ మారి
పగలో రేయో తెలిసి
కదలనీయక కదలి
చుంబనాలకి చిక్కి
అలసి పోయి
మల్లెలు వాడి
వెచ్చని తెరగాలి తొలగి
చల్లగా సర్దుకొని
మబ్బు తొలగి
మంచు కరిగి
నాకు నీవు ఒకటే
నీకు నేను ఒకటే
చల్లని గాలితో
వెచ్చని జోడి
ఓం శ్రీరాం - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి prabha

ఏకాంతంలో జ్ఞానాన్ని గ్రహించు
వంటరి తనంలో ఓర్పు వహించు
నీలోణ ఉన్న ధర్మాన్ని గ్రహించు
ధర్మాన్ని నలుగురికి భోధించు
చీకటిలో వెలుగును చూపించు
నిద్దరలేని వానికి దారి చూపించు
వేసే తప్పటడుగులను గ్రహించు
తప్పుపడకుండా మనసు నిగ్రహించు
మంచిని నలుగురికి పంచు
ప్రతివిషయము వ్యక్తపరచు
నిత్యము తృప్తిగా ప్రేమించు
మెదడులో వ్యతరేకం తుంచు
ఆశలకు చిక్కక చలించు
ప్రేమ అమృతమును పంచు
నీవు చెడు నీతిని ఎదిరించు
నగ్నంలోని నిజాన్ని గ్రహించు
తెల్లటి వస్త్రాలను ధరించు
ప్రకృతి సమయాన్ని పాటించు
మన:శాంతిని కల్పించు
మనోనిబ్బరముగా జీవించు
ప్రాంజలి ప్రభ

పై నేమో నీలి తెర
క్రిం దేమో ధూళి తెర
మధ్యేమో మమత తెర
మనసే మనిషి చెర
స్త్రీ భోగమే మరో చెర
నిత్యం క్షణ మొక చెర
లోకాన్ని కమ్మే పొర
భిన్నత్వంలో ఏకత్వ పొర
కళ్ళని మోసం చేసే పొర
కొందరికి వెయ్యాలి ఎర
సుఖ దు:ఖాల ఎర
నమ్మకము పై ఎర
సమదృష్టి తో చూసే పొర
దక్కినదానితో తృప్తి చెందే పొర
తపిస్తూ సుఖాన్ని పట్టికొని పొర
--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
నిన్ను మరువలేను
నిన్ను వదల లేను
నన్ను నేను మరిచాను
నీ సేవచేయ తగనైతినా
దేవాది దేవుడని తల్చువేళ
నాపై తామసము చూపుట నీకేళ
దీన జనులను బ్రోవవా ఈవేళ
దయ చూపవా మాపై నీలీలా
నిదిరిస్తున్నావా ఈవేళ
నీకు జోల పాడాలని నాకలా
అవకాశము ఉన్నది ఈవేళ
అనుమతి ప్రసాదించవా నీలీలా
మందమతితో ఉన్నాను ఈ వేళ
నీ పదసన్నిది దాటను ఏ వేళ
నన్ను క్షమించవా కరణాల వాళ
తరియింప చేయవా నీ లీలతో కృష్ణా
--((*))--
ప్రాంజలి ప్రభ
మనసులేని మనిషిగా నీ వక్కడ
మనసున్న లేనివాడిలా నా నిక్కడా
కలలో కూడా రానా నీ కక్కడ
మనసుకి నిదురే రాదు నా కిక్కడా
బలము పెరుగుతుందా నీకక్కడ
నిరసము కమ్ముకుంటుందిక్కడా
మనుగడకు బాధ లేదు నీ కక్కడ
మమతకు కరువై ఉన్నా నానిక్కడా
ఆశలతో ఒదిగి ఉన్నావు నీ వక్కడ
ఆశయ సాధన లేక ఉన్నా నానిక్కడా
నన్నొదిలి సంపదే ముఖ్యమా నీకక్కడ
అనారోగ్యంతో ఉన్నాను నా నిక్కడా
ధనముకన్న సుఖము కావాలి నీకక్కడ
పిలుపు కోసం ఎదురు చూస్తున్నా నిక్కడా
మనసుతో సుఖము పంచుతా నీకక్కడ
నిన్ను మరువను నీ తలపే నా కిక్కడా
కాలమే మారుస్తుంది నిన్ను అక్కడ
ఆశతో జీవించక తప్పదు నా కిక్కడా
నాకోసం ఎదురు చూస్తూ ఉండాలి అక్కడ
ఇప్పుడే బయలుదేరాను నా నిక్కడా
సాగుతున్నది ప్రేమలేఖ అక్కడా ఇక్కడా
దూరమైనా ప్రాణుల భాధ చెప్పలేము ఎక్కడా
--((*))--
ప్రాంజలి ప్రభ

అదికాదు, ఇది కాదు, ఏదీ కాదు
రాజకీయ నాయకుల పలుకు
నిన్న, నేడు, రేపు, అనుట కాదు
అనుకున్నది సాదించుట కొరకు
నవ్వుల ఏడ్పులతో పనికాదు
బుద్ధిని వక్రబుద్ధిగా మార్చకు
చేసి చేయ లేదనుట కాదు
నిజాయతి మరచి చేయకు
ఉన్నా లేదని చెప్పుట కాదు
మనకు దాపరికం ఎందుకు
మాటను పంచుటయే కాదు
మర్మం తెలిపి సాగు ముందుకు
తక్కువ చేసి మాట్లాడుట కాదు
గుణాన్ని మరచుట ఎందుకు
భోగమే శాశ్వితం అనుట కాదు
కష్టాలు చూసి భయ పడకు
Comments
Post a Comment