229 నేటి కవిత -యెందరో, మరెందరో






నేటి కవిత 
ప్రాంజలి ప్రభ  (ఒక )
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

Image may contain: one or more people

నిత్యం ఉండే శబ్దం ఒక నాదం
నాదానికి మనసు ఒక ఉల్లాసం 
మనోఉల్లాసానికి అది ఒక అద్భుతం    
అద్భుతం ఎగసి పడే ఒక కెరటం 

కెరటాల ఉరవడి ఒక మనోహరం
కళ్లుకళ్లు కలుసుకుంటే తిరుగు ఒక మనసు 
అది మనసుకు కల్గించు ఒక ఆహ్లాదం  
ఆహ్లాదం మనో వాంఛ ఒక ఫలం 

తరంగాల లాస్యాలు ఒక స్పందనం
ఉత్సాహంతో కదిలే ఒక హృదయం 
అది హృదయానికి ఒక కేంద్రం 
కేంద్రం చూపు నిత్య  ఒక విన్యాసం 

చినుకుల విన్యాసాలు ఒక ఉల్లాసం
తడిపొడి లాటల్తో కలుగు ఒక ఆనందం 
అది ఒక ఆనంద ఒక పారవశ్యం  
పారవస్యం తో ఒక మమేకం 
    
ఆకుల గల గల శబ్దం ఒక కల
కల కల సాగే నదీ ఒక ఉరవడి  
ఊగే చెట్ల కొమ్మలు ఒక గాలి 
వాయుతరంగ గాలులు ఒక లాలి
స్వర విహారాలు మనసుకు ఒక జాలి

మబ్బుల గర్జనలు ఒక స్వరాలు
హృదయ శబ్దాలు  ఒక ప్రేమలు 
స్నేహాల భావాలు ఒక చిహ్నాలు
మాటల కలయకలు ఒక ఆందాలు

--((*))--



నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లప్రగడ రామకృష్ణ

అమ్మా అమ్మా అమ్మా
అనరాని మాటలన్నానమ్మా
అంధుడిగా మారానమ్మా
అలసి పోయానమ్మా
అమ్మా అమ్మా అమ్మా
ఆడదే లోకమనుకున్నానమ్మా
ఆకలి,దాహం అదేననుకున్నానమ్మా
అది కపట ప్రేమని తెలియదమ్మా
అమ్మా అమ్మా అమ్మా
తెలియక బాధపెట్టానమ్మా
తెలిసాక నీవు కానరావేవమ్మా
తెల్లని వన్నీ పాలనుకన్నానమ్మా
అమ్మా అమ్మా అమ్మా
నన్ను మన్నించవా అమ్మా
నీకు భూదేవికున్న ఓర్పు ఉన్నదమ్మా
కాలం నన్ను బ్రమలో ఉంచిదమ్మా
అమ్మా అమ్మా అమ్మా
మాయకు చిక్కి పతనమయ్యానమ్మా
ఆశకు పోయి ఆరోగ్యం చెడిందమ్మా
కమ్మిన పొరతొలగి వేడుకుంటున్నానమ్మా
అమ్మా నాన్నా ఆది దేవతలని
గ్రహించ లేకపోయానమ్మా
అమ్మమాట వినక, నాన్న మాట లెక్కచేయక ఆడదే అమృతం అని భావించి తిరిగానమ్మా, క్షమించమ్మా
తల్లిని మించిన దైవములేదని
తండ్రిని మించిన గురువేలేడని
మీరున్నంతవరుకు గమనించలేకపొయ్యానమ్మా,నాన్నా
మిమ్ము దూరం చేసుకొని నేను ఉండలేనమ్మా, అమ్మా అమ్మా నాన్నా నాన్నా పాదపూజ చేయాలని ఉందమ్మా
కన్నీరుతో మీపాదాలు కడుగతా నాన్నా
ఆదిదేవతులు కరుణించారు
మీ పాదసేవే నాకు స్వర్గం

నేటి కవిత
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
"యెక్కవ"

ఆకాశానికి శబ్దమెక్కువ 
ఆకారానికి ఆలోచనెక్కువ
అకాల మృత్యువుకు తొందరెక్కువ
అకాల చుట్టానికి ఆశ లెక్కువ
అలలకు పరుగులెక్కువ
అలసటకు దడ యెక్కువ
అలంకారానికి అద్దంయెక్కువ
అరటితోటకు నీరు యెక్కువ
ఆశ్చర్యానికి కల్పనలెక్కువ
ఆనందానికి తొందరెక్కువ
ఆర్భాటానికి ఖర్చు ఎక్కువ
ఆరోగ్యానికి ఆకలెక్కవ
ఆరాటానికి పోరాటం యెక్కువ
ఆకలికి తొందరెక్కువ
ఆవేశానికి ప్రేమ యెక్కువ
ఆదాయానికి ఆశ యెక్కువ
అనారోగ్యాన్ని మందులెక్కువ
అక్కరకు స్నెహితులెక్కువ
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునికి
కళ్యాణాలు యెక్కువ
యెక్కువనుకుంటే అన్నీ యెక్కువే
త్రృప్తి లేకపోతే అన్నీ తక్కువే
నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 


ఓ నేస్తమా నీవే నాకు గురువు 
నె నున్న స్థితిని సరిదిద్దినావు
నా ఊపిరే నాకు అసలు గురువు  
ప్రతి దినము బలిమి నా హితవు

నా హృదయస్పందన  మలుపు 
 నియమం వల్ల మనసు కుదుపు 
సరిదిద్దు కోలేని వయసు తలపు   
అదే  బుద్ధి నన్ను ఉసి గొలుపు 

ప్రతి క్షణము ఒక ఉహ మెరుపు
ప్రతి తరుణం ఒక ప్రేమ పిలుపు 
ప్రతి ఘడియ ఒక న్యాయ తలపు 
నిత్యము సత్యము వైపు గెలుపు 

మానవత్వంతో ధర్మం నిలిపు   
సమానత్వంతో సమం జరుపు 
అమాయకత్వంతో ఆశ అరుపు 
మౌనవత్వంతో మరులు గొలుపు 

సూర్యోదయము మనకు మేలుకొలుపు 
సుర్యాస్తమము మనకు నిద్రకు పిలుపు 
సుర్యకంతులే మన భవిషత్తుకు మలుపు 
సూర్యునితో మన పరుగు ఆరోగ్యానికి మెరుపు  

--((*))--


నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత :మల్లాప్రగడ రామకృష్ణ

కాలాన్ని బట్టి నడిస్తే
మనస్సు పట్టి ప్రవర్తిస్తే
వయస్సు తట్టి తలిస్తే
నిత్య మన:శాంతే కదా

కులాన్ని బట్టి ఆచరిస్తే
మతాన్ని బట్టి బోధిస్తే
స్నేహన్ని బట్టి సహకరిస్తే
నిత్య మన:శాంతే కదా

కోపాన్ని బట్టి నటిస్తే
వేషాన్ని బట్టి సేవిస్తే
గళాన్ని బట్టి అనుకరిస్తే
నిత్య మన:శాంతే కదా

త్యాగాన్ని బట్టి కరునిస్తే
తత్వాన్ని బట్టి బోధిస్తే
పద్యాన్ని బట్టి పఠిస్తే
నిత్య మన:శాంతే కాదా

తరుణాన్ని బట్టి తపిస్తే
తమకాన్ని బట్టి తాగిస్తే
తప్పుల్ని బట్టి గమనిస్తే
నిత్య మన:శాంతే కదా

న్యాయాన్ని బట్టి నడిస్తే
ప్రమేయాన్ని బట్టి ప్రేమిస్తే
ప్రమాదాన్ని బట్టి ఊహిస్తే
నిత్య మన: శాంతే కదా



























































నేటి కవిత
ప్రాంజలి ప్రభ
పదవి
Places to visit
పదవి అందరికీ హాయి
ప్రజల్ని వంచించటం హాయి
పుత్ర వ్యామోహానికి హాయి
వాగ్దానాలకు ఇంకా హాయి

పెదవి చీకటి హాయి
చీకు చింతలు లేని రేయి
చీకటి వ్యాపారానికి హాయి
చిరునవ్వుల మధ్య ఇంకా హాయి

కొరివి చీకటిలో హాయి
కోరిక పదవిలో హాయి
తీరిక ఓటులో హాయి
చీలిక తంతులో ఇంకా హాయి

చదివి చదవలేని హాయి
చమత్క రించుటలో హాయి
చరిత్ర సృష్టించుటలో హాయి
చామంతుల ఆటల్లో ఇంకా హాయి

తెలివి నాదంటానికి హాయి
చప్పేది వాదించటానికి హాయి
తప్పు చేసి తప్పించుటలో హాయి
తనవారిని రక్షించుటలో  ఇంకా హాయి

పదవి నిలుపు కోవటంలో ఉండదు హాయి
పెదవికి ఆశపడి పొందుటలో ఉండదు హాయి
కొరివి పక్కలో పెట్టుకుంటే ఉండదు హాయి
చదివి ప్రజలకు‌ సహకరించకపోతే ఉండదు ఇంకా  హాయి






నేటి కవిత
పంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగ్గడ రామకృష్ణ
మనోవాంఛ

జవ్వని చూపులు చిలకి రంగరిస్తూ
నవ్వుతూ నవరత్నాలు చూపుతూ
కవ్విస్తూ కనకాంబరాలు చల్లుతూ
గువ్వలా గుస గుస లాడి గోల చేస్తూ
సవ్వడి చేసి చిందులు వేస్తూ
రివ్వున సాగే తోకచుక్కలా సాగుతూ
చవ్వన ప్రాస తినాలని వత్తిడిచేస్తూ
యవ్వారం అంతా బయట పెడ్తు
తవ్విన కొద్దీ నీకు నోరూరిస్తూ
దువ్విన కొద్దీ శృంగారాన్ని అందిస్తూ
కొవ్వు ఉన్నదంతా కరిగిస్తూ
కెవ్వు కెవ్వు అనే అరిచేలా చేస్తూ
మువ్వల మురిపం చూపిస్తూ
గవ్వల ఆటను నేర్పిస్తూ
దివ్య వెలుగును చూపిస్తూ
భవ్య మైన భాగ్యాన్ని ఇస్తూ
యవ్వనాన్ని దార పోస్తూ
నువ్వా నేనా అని పోటీ పడ్తు
సువ్వి సువ్వాల అని ఆడిస్తూ
ఉవ్విళ్లూరే హృదయాన్ని ఇస్తా
--((*))--


నేటి కవిత
ప్రాంజలి ప్రభ
పదవి
Places to visit
పదవి అందరికీ హాయి
ప్రజల్ని వంచించటం హాయి
పుత్ర వ్యామోహానికి హాయి
వాగ్దానాలకు ఇంకా హాయి

పెదవి చీకటి హాయి
చీకు చింతలు లేని రేయి
చీకటి వ్యాపారానికి హాయి
చిరునవ్వుల మధ్య ఇంకా హాయి

కొరివి చీకటిలో హాయి
కోరిక పదవిలో హాయి
తీరిక ఓటులో హాయి
చీలిక తంతులో ఇంకా హాయి

చదివి చదవలేని హాయి
చమత్క రించుటలో హాయి
చరిత్ర సృష్టించుటలో హాయి
చామంతుల ఆటల్లో ఇంకా హాయి

తెలివి నాదంటానికి హాయి
చప్పేది వాదించటానికి హాయి
తప్పు చేసి తప్పించుటలో హాయి
తనవారిని రక్షించుటలో  ఇంకా హాయి

పదవి నిలుపు కోవటంలో ఉండదు హాయి
పెదవికి ఆశపడి పొందుటలో ఉండదు హాయి
కొరివి పక్కలో పెట్టుకుంటే ఉండదు హాయి
చదివి ప్రజలకు‌ సహకరించకపోతే ఉండదు ఇంకా  హాయి
--((**))--
ప్రాంజలి ప్రభ
రచయాట మల్లాప్రగడ రామకృష్ణ

నేను నాది అనకురా
జీవితమే ఒక వేదమురా

సుఖదు:ఖాలకు నిలయమురా
బందనాలనుండి విముక్తి పొందాలిరా
సహనంతో కర్మ విముక్తి పొందాలిరా
ప్రాపంచిక సుఖాలు వదిలితే శాంతిరా
నేను నాది అనకురా
జీవితమే ఒక వేదమురా
గురుబోధలో సత్యాన్ని తెలుసు కోవాలిరా
జ్ఞానంతో నిర్వి కల్ప సమాధిని చేరాలిరా
నిర్వాణ స్థితి యొక్క ఆనందాన్ని పొందాలిరా
భేదము చూడక అంతా ఒకటేనని భావించాలిరా
నేను నాది అనకురా
జీవితమే ఒక వేదమురా
అత్యుత్తమ సేవలలో జీవితము గడపాలిరా
ఇతర సంభందాల మాటలకు లొంగక ఉండాలిరా
ధర్మ పలుకులతో అవ్యక్తమైన ఆనంద స్థితి పొందాలిరా
స్వత్సమైన ఎరుక స్థితిలో ఉండి కార్యం నిర్వహించురా
నేను నాది అనకురా
జీవితమే ఒక వేదమురా
నిన్ను నీవు తెలుసుకోవటానికి ప్రయత్నించుమురా
సప్త ధాతువులతో కూడిన శరీరము మనదిరా
కామ క్రోధ,మోహ,మద,మాశ్చర్యములను గెలవాలిరా
పంచ భూతాలకు లొంగి జీవితము సాగించాలిరా
నేను నాది అనకురా
జీవితమే ఒక వేదమురా
స్త్రీ లోలునిగా మారక స్త్రీని గౌర వించుమురా
స్త్రీ శక్తిని తక్కువ చేసి ఎప్పుడు మాట్లాడుకురా
స్త్రీ సుఖ సౌఖ్యములను అందించే కలియుగమురా
మాత, పిత, గురు, దేశ, సేవే నిత్యమని గమనించాలిరా
నేను నాది అనకురా
జీవితమే ఒక వేదమురా
--(*)--
Remove
G
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:  
ప్రాంజలి ప్రభ.కం - 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
నేటి కవిత - ఏది రాజకీయం


ఏమిటి ఈ లోకం 
ఎవ్వరికీ అర్ధం కాని వైనం 
ఏనోట విన్నా స్వార్ధం 
ఏమాట విన్నా స్వార్ధపూరిత రాజకీయం 

ఎవ్వరకీ ఊహ కందనిది 
ఎత్తుగడ సంపాదన పరం 
ఎత్తుకు పై ఎత్తులు వేసి  
ఎదను ఊరించిన రాజకీయం 

ఏ చూపుకు దొరకనిది
ఏరు వాకలా పొంగు పొంగి  
ఏర్పాటుతో ఎవరికీ దక్కనిది 
ఏతం వేసి తోడిన తరగనిరాజకీయం  

ఏనాడో ఆవిర్భవించినది 
ఏదడిగినా చేస్తానని చెప్పునది 
ఎల్లలు లేక విస్త రించునది 
ఏర్పాటు వారికోసం ఉన్న రాజకీయం 

ఎంతో వినమ్రతా భావం కలిగి 
ఎన్నో చేయలేని మాటలు చెప్పి  
ఎక్కడా లేనిది మీకు అందిస్తానని
ఏర్పాటు ప్రజలను నమ్మించే రాజకీయం    

ఎంతో ప్రేమ వలకబోసి 
ఏదడిగితే అది ఇస్తానని చెప్పి 
ఎక్కడ లేని విషయాలు చెప్పి 
ఎందరినో నమ్మించే నిజ రాజకీయం 

ఏదున్నా అధికారమే వారి స్వాస  
ఏమన్నా పదవి వారి ఆయుధం 
ఎలాఉన్నా ఓటును పట్టే విధం  
ఏ ఒక్కరినీ వదలని నేటి రాజకీయం 

--((*))--

నేటి కవిత - ప్రాంజలి పబ్ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ  

గుండె జల్లు మన్నది 
తోక ఊపుతూ కుక్క కదిలింది 
ఎవరెవరు అనే  కేక
మరలా ఘల్లు ఘళ్లు 

వేళా పాలా లేదు 
అదే పనిగా నొక్కఁకురా 
కరంటు సోకిందా చస్తావ్
నేను వచ్చేదాకా ఆగు 

ఆంతర్యం చెప్పాలని వత్తావా
ఏదైనా అమ్ముకోవాలని వత్తావా   
సంగీతస్వరం వినాలని వత్తావా 
ఏదైనా దోచుకోవాలని వత్తావా 

తలుపు తెరిస్తే మాత్రం ఆగుతావ్ 
కరంటు లేకపోతె మూగ అవుతావ్  
చేశేపనికి అంతరాయం కలిగిస్తావ్ 
దిష్టుబొమ్మలా ఇళ్లల్లో  ఉన్నావ్ 

ఇనకి నేనెవరో చెప్పండి ?



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ .కం - నేటి కవిత
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

కెరటంలా తాపమెగసి పడు
గుట్టు రట్టు కాకుండా "జీవితం" గడుపు
కన్ను మూసినా వెంట పడు
కన్నె మనసు "అర్ధం" చేసుకొని గడుపు

కోటి రహస్యాలు వెంబడి పడు 
కోరిన మనసు "పుట్టఅని" తెలిసి గడుపు
కల్వలేని వ్యామోహంతో తడబడు
కాలంతో ఒదిగి "కర్మలు" చేసి గడుపు

వెల్గు కొంతవరకు వెంబడించు చుండు 
పొద్దు గుట్టు చప్పుడు "కాకుండా" గడుపు 
నీడ కడ వరకు జీవితముగా ఉండు 
మనము చేసిన "ధర్మమే" నీడగా గడుపు 

కునుకు సగము జీవితముగా ఉండు
మిగతాది మధుర "కలల" జీవితము గడుపు 
స్త్రీకి తాళిబొట్టుతో మనసు మారుచుండు
స్వంత భావాలతో "భర్త పిల్లల"తో గడుపు   

--((*))--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:  
ప్రాంజలి ప్రభ.కం - 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
నేటి కవిత - ఏది రాజకీయం


ఏమిటి ఈ లోకం 
ఎవ్వరికీ అర్ధం కాని వైనం 
ఏనోట విన్నా స్వార్ధం 
ఏమాట విన్నా స్వార్ధపూరిత రాజకీయం 

ఎవ్వరకీ ఊహ కందనిది 
ఎత్తుగడ సంపాదన పరం 
ఎత్తుకు పై ఎత్తులు వేసి  
ఎదను ఊరించిన రాజకీయం 

ఏ చూపుకు దొరకనిది
ఏరు వాకలా పొంగు పొంగి  
ఏర్పాటుతో ఎవరికీ దక్కనిది 
ఏతం వేసి తోడిన తరగనిరాజకీయం  

ఏనాడో ఆవిర్భవించినది 
ఏదడిగినా చేస్తానని చెప్పునది 
ఎల్లలు లేక విస్త రించునది 
ఏర్పాటు వారికోసం ఉన్న రాజకీయం 

ఎంతో వినమ్రతా భావం కలిగి 
ఎన్నో చేయలేని మాటలు చెప్పి  
ఎక్కడా లేనిది మీకు అందిస్తానని
ఏర్పాటు ప్రజలను నమ్మించే రాజకీయం    

ఎంతో ప్రేమ వలకబోసి 
ఏదడిగితే అది ఇస్తానని చెప్పి 
ఎక్కడ లేని విషయాలు చెప్పి 
ఎందరినో నమ్మించే నిజ రాజకీయం 

ఏదున్నా అధికారమే వారి స్వాస  
ఏమన్నా పదవి వారి ఆయుధం 
ఎలాఉన్నా ఓటును పట్టే విధం  
ఏ ఒక్కరినీ వదలని నేటి రాజకీయం 

--((*))--


నేటి కవిత 
ప్రాంజలి ప్రభ.కం
రచయినా: మల్లాప్రగడ రామకృష్ణ  

మూగ సైగలలోని  భావాన్ని 
మనసు లోని అంతరార్ధాన్ని  
మగువ లోని మౌనవత్వాన్ని 
మర్మ మేళ  విప్పగలం 

మాటలలోని చమత్కారాన్ని  
ఊహల్లోని తనువు సోయగాన్ని 
కళ్ళలోని  అమాయకత్వాన్ని 
చూసినా ఎలా  పలక గలం      

ఎద లోపల మెదిలే తమకాన్ని 
తెలుసుకున్న విషయ భారాన్ని 
మనసును వేధించే భావాన్ని 
బయట కెలా చెప్పగలం 

నోటి నుండి వెలువడే పదభాష్యాన్ని       
విజ్ఞత చూపని వివేకాన్ని  
వివరించినా అదుపుచేయని గళాన్ని 
అదుపుఉంచు టేల నేర్పగలం 

తీరని కోర్కల ఆవేశాన్ని
రగులుతున్న అగ్ని పర్వతాన్ని 
ఆవిరై పోతున్న జలాన్ని  
ఎప్పుడు ఆర్పగలం 

కదిలే బ్రతుకు వక్ర మార్గాన్ని  
గమ్యము చూపని విద్యావిధానాన్ని 
ఉపాధి కల్పించలేని రాజకీయాన్ని 
ఎప్పుడు మార్చగలం 

బ్రతుకు నేర్పే ధర్మాన్ని 
మనుగడకు పలికే సత్యాన్ని 
అవసరానికి పనికొచ్చే న్యాయాన్ని    
ఎచ్చట నేర్వ గలం 

పరమాత్ముని  ధ్యానించే నమ్మకాన్ని 
వదలక వేడు కంటున్న వాళ్ళం 
మీకెవరికన్నా తెలిసిన విధానాన్ని 
చెపితే అనుకరించి గలం   

--((*))--



నేటి కవిత 
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ

కళ్ళలోని నీరు కరుణకు తెలుసు
భూమిలోని నీరు నింగికి తెలుసు
నదిలోని నీరు సముద్రునికి తెలుసు 
నీలో ఉన్న నీరు నాకేమి తెలుసు

వ్యాపారంలో కిటుకు యజమానికి తెలుసు
వ్యవసాయములో కిటుకు రైతుకి తెలుసు
వయ్యారంలో కిటుకు వగలరాణికి తెలుసు
నీలో ఉన్న కిటుకు నాకేం తెలుసు

పుత్తడి లో కల్తీ కంసాలికి‌ తెలుసు
కుండలలో కల్తీ కుమ్మరికి తెలుసు
బట్టలలో కల్తీ చాకలికి తెలుసు
నీలో ఉన్న కల్తీ నాకేం తెలుసు

మోసంచేసే తెలివి నాయకులకు తెలుసు
దొంగను పట్టుకొనే తెలివి రక్షకులకు తెలుసు
వటులను ఆకర్షించే తెలివి వెలయాలికి తెలుసు
నీలో ఉన్న తెలివి నాకేం తెలంసు

హోలి ఆడాక యేమవుతుందో తెలుసు
జోలి మోసాక యేమవుతుందో తెలుసు
కూలి ఇచ్చాక యెంతౌతుందో తెలుసు
ఆలి అయ్యాక యెంజరుగుతుందో నాకేం తెలుసు

--((*))--

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ  
 విద్యార్ధి   

అద్యాపకులు పిల్లలకు అవగాహన శక్తి కల్పించాలి 
పిల్లలను విద్యతో పాటు వ్యాయామం  చేయించాలి
ప్రతి ఇంట్లో  మానసిక శక్తిని మనొశక్తిగా మార్చాలి
లేత హృదయాలకు భాదఅనేది లేకుండా పెంచాలి

నేటి  విద్యా విధానాలు సమగ్రంగా మార్పు  తేవాలి 
ఆశక్తకరమైనా పాఠాలతోమనస్సును ఆకట్టుకోవాలి     
మాతృబాషతో నేర్చిన విద్యకు ఉద్యోగాలు  ఇవ్వాలి 
అన్య భాష కోసం అధిక శ్రమతో ఎందుకు చదవాలి

తల్లితండ్రుల ప్రవర్తన పిల్లలపై ఉంటాయని గమనించాలి
డబ్బుందని అహంకారం చూపిస్తే పిల్లలలో మార్పు చూడాలి 
కులమత విచక్షణ చూపిస్తే పిల్లలకు విద్య రాదని గుర్తించాలి
పిల్లలకు స్వేచ్చ ఇచ్చి, మంచి, చెడుగురించి కధలు చెప్పాలి

మార్కులకోసం అరిస్తే పిల్లలు బెదిరి పారిపోతారని తెలుసుకోవాలి 
ఇంగ్లీషులోనే మాట్లాడాలని హింసిస్తే  ఆ స్కూల్ల ను  తొలగించాలి
పిల్లలపై అసబ్యపదజాలమును, వాడేఅద్యాపకులను తీసివేయాలి 
పిల్లలను అను కరించే ఉపాద్యాయులు భోదించటం నేర్చు కోవాలి

పొటి తత్త్వం పెంచుకొని గతం కన్నా మిన్నగా ఎదగాలి 
పిల్లల ప్రవర్తనలను తల్లి తండ్రులు గమనిస్తూ ఉండాలి 
పిల్లలకు డబ్బు అందించిన ఖర్చుల ప్రశ్నలు వేయాలి
పిల్లల వృద్ధికి  తల్లి తండ్రుల బాధ్యతతో  గమనించాలి   

ఆత్మావిశ్వాసం - ఉంటె - ప్రతివిద్యార్ధి - ఒకమేధావి - అవుతాడు
= అహంకారంతో- ఉంటె - దెశ ద్రోహిగా - మారుతాడు           

<<(^)>>

ప్రాంజలి  ప్రభ.కం 
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ 



కాలం కదులు తుంది 
అది నీవు గమనించ లేవు 
యవ్వనం ఎదుగు తుంది
అది నీవు గుర్తించ లేవు

ఆత్రుత నిన్ను చుట్టి వేస్తుంది
అయినా ఏమీ చేయ లేవు
భద్రత అని అని పిస్తుంది 
అయినా ఎవ్వరికి చెప్పలేవు

నీలో చాలీ చాలని చదువుంది 
చదివిన దాన్ని ఉపయోగించ లేవు    
ఇది ఉపాధికి బరువుగా మారింది 
బతుకు రైలును కదల్చ  లేవు 

కాస్తూ కూస్తో ధనము ఉంది 
ఖర్చుపెట్టే దమ్ములు  లేవు     
ధనము మంచులా కరుగుతుంది 
అయినా భయముతో ఉండలేవు  

నీవు కన్నవాళ్లకు భారంగా ఉంది 
అయినా నీలో సంకల్పాలు లేవు 
నిన్ను కంటి పాపాల చూడటం ఉంది 
అయినా నడవడికలో మార్పుల్లేవు 

నీ ఊపిరి ఎవరికోసమో తెలియ కుంది 
నీ శక్తి ఎవరికి ధారపోయ్యాలో తెలియ కుంది 
నీకు కన్న ఋణం తీర్చాలని ఉంది  
నీవు చేద్దామన్నా సమాజం అడ్డు పడుతుంది  

అయితే నిన్ను కన్నవారిది తప్పా 
నిన్ను భరించే భూ మాతది తప్పా 
నిన్ను ఉపయోగించుకోలేని దేశంది తప్పా 
నిన్ను సృష్టించిన బ్రహ్మది తప్పా 

కళ్ళు తెరచి  నిజాన్ని గ్రహించు 
కష్టపడి ఎవ్వరికీ భారం కాకుండా జీవించు 
అన్నది అంతరాత్మ 
--((*))--


నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత. మల్లాప్రగడ రామకృష్ణ




గాలానికి చివర కడతారు యర
యర సోయగాలకు చిక్కుతుంది చాప
ఆచాపను తినేవారు యెందరో, మరెందరో


సింహం ఆకలికి యేనుగు కుంభస్తలంపై
దాడిచేసి ఆకలి తీర్చుకోవడం సహజం. 
వేట అంటూ మూగ జీవాలను
 తినేవారు యెందరో మరెందరో

హోదా అనే ఆకలి రాజకీయంలో,
ప్రభుత్వంలో ప్రతి మనిషిలో ఉండుట
సహజం. దీనికోసం కొందరి ప్రాణాలు 
బలి చేసే వారు యెందరో మరెందరో.

పులి పంజా యెత్తి ఆత్మను రక్షించు కవడం సహజం.
చీటికి మాటికి పంజా యెత్తే మనుష్యుల మధ్య
ఉండే అమాయక ప్రాణాలను
బలిచేసే వారు యెందరో మరెందరో.

తన పొట్టను నింపుకొనుటకు తన అతి తెలివిని
 ప్రదర్శించుట నక్కకు సహజం. 
మనుష్యులలో ఉన్న నక్క బుద్దిని తెల్సు కోలేక 
ప్రాణాలను బలి చేసే వారు యెందరో మరెందరో.

కోడి తనవంతుగా తెల్లవారు ఝామున
 అరచి మనుష్యులను మేల్కొల్పడం సహజం,
 తన ప్రాణాలను తీసేలోకంలో ఉన్నానని తెలియదు. 
అట్లే డబ్బుకోసం కొందరు మనుష్యులు 
మూర్ఖుల వద్దే పనిచేసి ప్రాణాలను 
బలి చేసే వారు యెందరో మరెందరో.

--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు