నేటి కవిత - మనస్సు నీది

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ.కం

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 



వయస్సు ఉరకలో ఎవ్వరు 
ఏమి చెప్పిన వినలేని ప్రేమ 
చిగురించి వికసిస్తే సుఖ ప్రేమ 
వికసించక వకులిస్తే అమరప్రేమ 

పేమ భావాలు 

మనసు విప్పి చెప్పలేని - మనస్సు నీది
మనస్సు కమ్ముకున్న నళిని - మెరుపు నీది
నళిని మెరుపును పంచుకోని - వయస్సు నీది 
వయస్సు రహస్యాలు దాచుకోని - సిగ్గు  నీది   

సిగ్గు దొంతర్లు అందించలేని - ప్రేమ నీది 
పరువంతో ప్రేమను పంచలేని - తరుణం నీది 
తరుణంలో ఎటూ తేల్చుకోలేని - సొగసు నీది 
సొగసు అందాన్ని ఇవ్వలేని - ప్రయాణం నీది 

ప్రయాణంలో సుఖం పొంద లేని - క్షణం నీది
క్షణమైనా నవ్వులాట అనేది లేని - చూపు నీది 
చూపులతో తోడుని గ్రహించ లేని - తత్త్వం నీది 
నీ తత్త్వం కాలానికే అంతు పట్టని - ప్రేమ నీది 

బ్రతికించే బ్రతుకు బాట చూపలేని - చదువు నీది    
చదువుతో సంస్కారం కూడ చూపలేని - యశస్సు నీది 
యశస్సుతో ఉషస్సును పొందలేని - తపస్సు నీది 
తపస్సుతో ప్రేమను అందుకో లేని - బుద్ధి నీది    
  
ప్రేమన్నది ఒక పిచ్చి - మనసన్నది మరో పిచ్చి 
మాయ తో ఒక పిచ్చి - మనుగడ కోసం మరో పిచ్చి 
--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు