నేటి కవిత "  ప్రేమ లీలను మరచిపోతున్నా 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

విద్య బోధించే ముందు గణపతిని మర్చిపోతున్నా 
అభ్యసించుట ముందు అద్దుకోవటం మర్చి పోతున్నా
ముద్దలు తినే ముందు ఆత్మారాముణ్ణి మర్చి పోతున్నా
ఉద్యోగం చేసే ముందు అధికారాన్ని మర్చి పోతున్నా

మంత్రం చదివే ముందు అమ్మవారిని మర్చి పోతున్నా
ప్రార్ధన చేసే ముందు ఆలోచనను మర్చి పోతున్నా     
ప్రేమను పంచె ముందు అనుభూతిని మర్చి పోతున్నా 
సుఖాన్ని పొందే ముందు గుండెచప్పుడు మర్చి పోతున్నా

మెప్పుని పొందే  ముందు శ్రమ ఫలితం మర్చి పోతున్నా
శ్రమను పంచే ముందు  కష్టసమయం  మర్చి పోతున్నా
స్నేహాన్ని పొందే ముందు అభిపాయాన్ని మర్చిపోతున్నా
ద్వేషాన్ని చూపే ముందు మౌన నీడల్ని మర్చి పోతున్నా 

దైవ ప్రార్ధన ముందు ఆత్మ ధైర్యాన్ని మర్చిపోతున్నా
తల్లి తండ్రుల ముందు ప్రేమ భావాన్ని మర్చి పోతున్నా 
దేశ సేవల ముందు ఆశాగుణాన్ని మర్చి పోతున్నా
ప్రేమత్యాగాల ముందు దేహ ఆరోగ్యం మర్చి పోతున్నా
  
అర్ధనారీశ్వర తత్వాన్ని తెలుసుకున్నా
సత్య ధర్మ న్యాయాన్ని మాత్రం మరువకున్నా     
తల్లి తండ్రుల ప్రేమను గౌరవిస్తూ బతుకుతున్నా

--((**))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు