నేటి కవిత
పంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ



వధూవరులను ఆశ్విరదించి తెచ్చిన
గిఫ్ట్ చేత నుంచి అక్ష్ణతలతో దీవించు తుంటే
భోజనాలకు  దయచేయండి అన్న పిలుపు
విన్నాక  చూసాను ఏర్పాట్లు 
  
భళి భళిరా భోజనాలు ఏర్పాట్లు భళిభళిరా
ఎండలో వళ్ళు జల్లు మని చళ్ళని ఏర్పాట్లురా

వేడి వేడి అన్నములో ముద్దపప్పు
ఆవకాయ కలిపి, నెయ్యి తాడించి తింటే ఆ రుచేవేరు
వేడి వేయి అన్నములో గోంగూర
పచ్చడి కలిపి, నూనె తడిచి తింటే ఆ రుచేవేరు

వేడి వేడి అన్నములో గుత్తి ఒంకాయ
కూర గుటకలు, వేస్తూ తింటూ ఉంటే ఆ రుచేవేరు
వేడి వేడి అన్నములో ఆకు కూర
పప్పుకలిపి, చల్ల మిరప నంచు తుంటే ఆ రుచేవేరు

వేడి వేడి అన్నములో పనస పొట్టు
కూర, వడియాలు నంచుకు తింటే ఆ రుచేవేరు
వేడివేడి అన్నములో గుమ్మడి కాయ
పులుసు, పోసుకొని జుర్రుతూ ఉంటే ఆ రుచేవేరు

కిస్మిస్, జీడిపప్పు కల్పిన సేమ్యా
పాయసం, గుటకలు వేస్తూ త్రాగుతు ఉంటే ఆ రుచేవేరు   
వేడి వేడి అన్నములో గడ్డ పెరుగు
కలిపి చెక్కరకేళి నంచుకు తుంటూ ఉంటే ఆ రుచేవేరు

ఏ స్వీటూ తినాలో అర్ధం చేసు కోలేక
తనలో షుగర్ ఉందని సర్దుకు పోతూ ఉంటే ఆ రుచేవేరు
ఆకు వక్క సున్నం కలిపిన కిల్లిని
నోటిలో ఉంచి నమిలి నోరు ఎర్రగచేసి ఉంటే ఆ రుచేవేరు

ఆహా ఓహో వివాహ భోజనంబు
మనసు ఊరించే వంటకాల పసందు

భళి భళిరా భోజనాలు ఏర్పాట్లు భళి భళిరా
ఎండలో వళ్ళు జల్లు మని చళ్ళని ఏర్పాట్లురా

భళి భళిరా భోజనాలు ఏర్పాట్లు భళిభళిరా
ఎండలో వళ్ళు జల్లు మని చళ్ళని ఏర్పాట్లురా


 --((*))--



నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ



తాడును పాముగ తలచుట సహజమే
ప్రేమను బ్రమగ ఎరుగుట సహజమే
వేషము మోసము అనుట సహజమే
విషయపు వాసన నిలుపుట సహజమే

పాపము పుణ్యము చేయుట సహజమే
తప్పును ఒప్పుగ ఎంచుట సహజమే
మంచిని చెడుగా చూచుట సహజమే
చెడుని మంచిగా వర్ణించుట సహజమే

మౌనపు మేఘం కురియుట సహజమే 
వేడికి మంచు కరుగుట సహజమే
మారని సత్యం అందుట సహజమే
తెలిసి న్యాయం చెప్పుట సహజమే

పుట్టుట గిట్టుట తెల్పుట సహజమే
నవ్వుట ఏడ్చుట తెల్పుట సహజమే
అవ్నంటే కాదంటే ఒప్పుట సహజమే
వచ్చుట పోవుట పల్కుట సహజమే

కలలు రాత్రుల్లో వచ్చుట సహజమే 
కళలు  పగల్లో  నేర్చుట సహజమే 
కధలు కొందరు వ్రాయుట సహజమే 
కలువ  ఉదయం  విచ్చుట సహజమే 

--((***))--

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
స్త్రీ హృదయం

స్త్రీ హృదయం నవనీతం 
అది పాషానంగా మారకుండా చూడు
స్త్రీ స్వేస్చ ఒక్కో తరుణం 
అది అవకాశంగా మారకుండా చూడు

స్త్రీ ఔనత్యమే ఒక జీవితం 
అది ప్రశంసించి మోసపోకుండా చూడు
స్త్రీ స్వాతంత్రమే కుటుంబం 
అది తపించే జపం మారకుండా చూడు 

స్త్రీ సంతృప్తియే మనో నేత్రం 
అది మనుష్యుల గతి చెడకుండా చూడు 
స్త్రీ సౌందర్యమే స్త్రీకి వేదం 
అది చిరునవ్వులప్రేమ వాడకుండా చూడు 

స్త్రీ ఆకర్ష ప్రేమ భావ స్వభావం 
అది పయనించే నది గమ్యంచేరేట్టు చూడు
స్త్రీ దిశ తీర్పు నిత్యసమానత్వం 
అది ఉద్యోగం సహనం చెడకుండా చూడు 

స్త్రీ వాదం ఎప్పుడూ చల్లని హిమం
అది కరిగేగుణం ఉన్నా భాధలేకుండా చూడు
స్త్రీ ఆలోచనా ఎంతో ప్రోత్సాహం 
అది సమాజంలో నిరుత్శాహంకాకుండా చూడు 

--((***))--


నేటి కవిత 
ప్రాంజలి ప్రభ 
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 


ఓ మనిషీ తెలుసుకో -1
పుట్టుకతో మనిషిలో చేరే కొన్ని అవలక్షణాలు 
ఈ లక్షణాలు ఉన్నవారు జీవితమే పతనం 


1 : : రాగము : : 
రావణాసురుడు సీతను చెరపట్టి రాగము చెంది ఆ రాగము వలన నశించుట. 
నరకుడు కన్యలను చెరపట్టి రాగము చెంది ఆ రాగము వలన నశించుట

రాగము ఒక రోగము - రోగము ఒక భోగము 
భోగము ఒక రూపము - రూపము ఒక పాశము 
పాశము ఒక కాలము - కాలము ఒక భావము 
భావము ఒక శాపము - శాపము ఒక దైవము   
  
అతని కుందే నాకులేదే అనే చిత్త వృత్తి 
పరస్త్రీ విషయకముగ కలిగెడి చిత్తవృత్తి 
పట్టు పట్టి వంచించి సుఖించే చిత్తవృత్తి 
వద్దన్నా కావాలి అనే పట్టే పట్టు చిత్తవృత్తి   

2 : : ద్వేషము : 
అపకారముచేసినవానికి మరల అపకారము చేయవలెననెడి చిత్తవృత్తి : : 
హిరణ్యకశిపుడు హరి చంపెనని హరిని ద్వేషించి నశించుట. 

ద్వేషము ఒక చిత్త వృత్తి
చిత్త వృత్తి ఒక అనుమాన ప్రవృత్తి
అనుమాన ప్రవృత్తి ఒక లక్షణ వృత్తి
లక్షణ వృత్తి ఒక జీవిత ప్రవృత్తి

3 : : కామము : : 
జరాసంధుడు , రావణుడు స్త్రీని చెరపట్టి నశించారు 

కామము మనిషిలో ఉండు 
ఇది వయసుతో వచ్చే మార్పు 
అతి కామము మనసుచెడు
మమత మానవత్త్వం కష్పెట్టు  

ఆశా పాశముగా వెంటాడే చిత్త వృత్తి 
వయసుకు ఉత్తేజము కల్గె చిత్త వృత్తి 
అహాన్ని పెంచి మతి పోగొట్టే చిత్త వృత్తి 
ప్రాతిఒక్కరు సద్వినియోగం చేసే చిత్త వృత్తి
  
4 : : క్రోధము : : 
ద్రౌపతి నవ్విందని దుర్యోధనుడు క్రోధంతో పతనమయ్యాడు
శిశుపాలుడు క్రోధముతో కృష్ణుని దూషించి పతనమయ్యాడు

విఘ్నం వస్తే తట్టుకోలేక చెప్పే చిత్త వృత్తి
చేస్తున్న పనికి అడ్డువస్తే పెర్గే  చిత్త వృత్తి
ఆరోగ్యం అనారోగ్యంగా మారి చిత్త వృత్తి
ఆశించినది వేరొకరుపొందారని చిత్త వృత్తి


5 : : లోభము : : 
దుర్యోధనుడు లోభము వలన నశించుట.   

లాభము తో లోభము పెరుగు 
లోభము తో జీవితమే కరుగు 
జీవితం లో  భాదలు  పెరుగు 
భాదల తో  బాధ్యత  నలుగు 

బాధ్యత తో బంధం జరుగు 
బంధం తో  మూర్ఖం వెలుగు 
మూర్ఖం తో పంతం  కలుగు 
పంతం తో  సర్వం  నాశనమగు 

ఉన్నదాన్ని పంచలేని చిత్త వృత్తి 
లేనిదాన్ని  ఆరాటపడే చిత్త  వృతి
ఉన్నది పొగపొందలేని చిత్త  వృతి
లోభము మనిషి పతనమే చిత్త  వృతి

6 : : మోహము : : 
దశరథుడు కైకమీది మోహముచేత నశించుట. 

ప్రేమించుటయే మనిషికి వేదము   
వేదము పంచుటయే  మనిషికి మోదము 
మోదము పెరుగుటయే  మనిషికి సంతోషము 
సంతోషము కల్గుటయే మనిషికి మోహము 

భార్య పై అతి ప్రేమ గల చితా వృత్తి 
పుత్రులపై అతి ప్రేమ గల సీత వృత్తి 
ధనము పై అతి ప్రేమ గల చిత్త వృత్తి
అదే మోహము డాలో చిక్కే చిత్త వృత్తి 

7 : : మదము : : 
కార్తవీర్యుని పుత్రుల మదము వలన నశించుట.

నేనే బలవంతుననే గర్వం 
గర్వం వలన సమస్తము నాశనం 
చలి చీమలకు పాము చిక్కినట్లుగా 
ముసలకి ఏనుగు చిక్కినట్లుగా 
భాధ కల్పించేదే మదము 

కలిమితో కలిగే చిత్త వృత్తి 
బలిమితో కలిగే చిత్త  వృతి 
చెలిమితో కలిగే చిత్త వృత్తి 
గర్వాంధునిగా మార్చే  మద చిత్త వృత్తి  



నేటి కవిత
ప్రాంజలి ప్రభ
కవి సమ్మెలనాలు
కవుల సన్మానాలు
కన్నెల ఆరాటాలు
ఉగాది వేడుకలు
కోయిల కంఠాలు
వసంత పద్యాలు
మామిడి మండలు
ఉగాది వేడుకలు
ఆడబడుచు ఆర్భాటాలు
కొత్త బట్టలతో కలకలలు
సరదా సరదా కబురులు
శ్రీ విళంబి సంవత్సర కలలు
కాలంలో కదలికలు
నడిచే ఋతువులు
ప్రకృతిలో మార్పులు
యుగాది వనములు
కొందరి కళల మార్పులు
కదిలే జీవిత సత్యాలు
కొత్త రాజకీయ లీలలు
ఉగాది షడ్ రుచులు

నేటి కవిత నూతనత్వం
ప్రాంజలి ప్రభ
ఆది లక్షణం అందించు వసంతం
వసంతం కల్పించు తుంది ఔచిత్యం
ప్రతి తిధి అత్యంత మహిమాన్వితం
సద్వినియోగం చేయుటే నిత్యతరుణం
ప్రకృతిలో కన్పించు నూతనత్వం
నూతనత్వ అభిలాషే జయకేతణం
సత్పురుషుల నిత్య బోధామ్రృతం
యవ్వన శోభఫలితం విశ్వవ్యాప్తం
పుష్టిని తుష్టిని హితాన్ని కల్పించడం
శ్రధ్ధ, శ్రమ, చిత్త శుద్ధిగా మార్చుకోవడం
సంకల్ప భావమే మనో విజ్ఞానమయం
శాస్త్ర సాంకేతిక రంగాల్లో చైతన్యం

రవి కాంచని చోట - కవి కాంచున్
మతి కాంచిన చోట - కవి కాంచున్
ప్రేమ పొందిన చోట - కవి కాంచున్
రాత్రి పండిన చోట - కవి కాంచున్

వెన్నెల కమ్మిన చోట - కవి కాంచున్
శోభలు వెల్గిన చోట - కవి కాంచున్
బాధలు వచ్చిన చోట - కవి కాంచున్
పాటలు పఠించు చోట - కవి కాంచున్
\
శక్తిని చూపిన చోట - కవి కాంచున్
ఆటల పందెము చోట - కవి కాంచున్
కాలము చెప్పిన చోట - కవి కాంచున్
వేషము వేసిన చోట - కవి కాంచున్

జనశక్తి ప్రజ్వలించిన చోట - కవి కాంచున్
యువశక్తి సహకరించిన చోట - కవి కాంచున్
స్త్రీల శక్తి పెల్లుబికిన చోట - కవి కాంచున్
గురువులు బోధించిన చోట - కవి కాంచున్.


నేటి కవిత - వద్దంటే వద్దురా
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

వాసన లేని పువ్వు
వాకిలి లేని ఇల్లు
వాదన చేయని భార్య
వద్దంటే వద్దురా

వర్గములేని పురము
నమ్మకం లేని సంసారం
చేయ లేని పని
వద్దంటే వద్దురా

శృంగారం లేని కావ్యం
స్వరాలు  లేని  గానం
నిజమే   లేని  మాట
వద్దంటే వద్దురా

భక్తివిశ్వాసములేని భార్య
ప్రేమ అనేది లేని భర్త
గుణము లేని కుమారుడు
వద్దంటే వద్దురా 

అభ్యాసము లేని విద్య
సహనం లేని  తల్లి
గ్రాసము లేని కొల్వు
వద్దంటే వద్దురా 

పరిహాసము లేని ప్రసంగం
అనుభవం లేని ఆరాటం
వాగ్దానము లేని రాజకీయం
వద్దంటే వద్దురా 

వైద్యము చేయలేని వైద్యుడు
రక్షణ చేయలేని రక్షకుడు
వాదన  చేయలేని వకీలుడు
వద్దంటే వద్దురా

--((*))--


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు