నేటి కీర్తన
ప్రాంజలి ప్రభ
రచయిత :మల్లా ప్రగడ రామకృష్ణ
III, IIU, IIII UU
శ్రీ రామనవమి సందర్భముగా అందరికి శుభాకాంక్షలు
ప్రాంజలి ప్రభ
రచయిత :మల్లా ప్రగడ రామకృష్ణ
సహజముగ భోధన ఒకటె రామా
పిలుపు పలుకే నవమి కడ రామా
మెరయును విషం కలలలొ రామా
ఎచటెచట యే మనసునొ రామా
యె విఁభవముగా తలచునొ రామా
విన గలిగి నిత్య వెతలు రామా
కన గలిగి దివ్య వెలుగు రామా
సమయముయె మంచి ఫలము రామా
తనువు తప మే సఫలము రామా
మనసు జప మే నిలకడ రామా
మమత కల యే అగుటయు రామా
మరులు గొలిపే మనసుయు రామా
పరమ పద శోభ తలపు రామా
తలవని తలంపు కదయు రామా
అణువణువు నీవె శుభము రామా
--((*))--
నేటి కీర్తన
ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
సహనము చూపిన దయాభి రామా
మనసును దోచిన ప్రెమాభి రామా
ఒక సతి కల్గిన సకాల రామా
ఆరాధించే కొద్ది అనుగ్రహించే రామా
ప్రేమానందం పొంది కరుణ చూపేరామా
దైవారాధ న్నే చెయుట తెల్పే రామా
తల్లీ, తండ్రీ లో గురువును చూసే రామా
అస్త్ర శాస్త్ర పారంగతుడైన రామా
ధర్మ రక్షా న్యాయా గతుడైన రామా
నిత్య సత్యా సేవా గతుడైన రామా
ప్రేమ భావా పత్నీ గతుడైన రామా
తండ్రి మాటను గౌరవించావు రామా
తల్లి మాటకు విల్వ ఇచ్చావు రామా
పత్ని మాటకు ఆశ చూపావు రామా
స్నేహ భావము పెంచి చూపావు రామా
బాణము తోడుగా వేడుకొందును రామా
నామము నీడగా కొల్చు చుందును రామా
కాలము తెల్పుటే తప్పు ఒప్పైన రామా
ప్రేమయు పంచుటే నిత్య సత్యము రామా
--((*))--
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
నేటి కీర్తన
శ్రీ రామ రామా........ రమా వల్లభా
నీమీద ప్రేమా ...... .. మనో లాభమే
ఏమన్న ఆశా ....... . విధీ తత్వమే
ఐస్వర్య భావం ...... మతీ లౌక్యమే
దుర్మార్గ భావం ...... . సిరీ కోసమే
శ్రీ రామ రామా........ రమా వల్లభా
సన్మార్గ లాభం ...... సుఖా భావమే
విశ్వాస లక్ష్యం ...... కళా రాదనే
సద్భావ ధేయం ...... దయా సౌఖ్యమే
శ్రేష్టాతి శ్రేష్టం ....... శిరో వందనం
శ్రీ రామ రామా........ రమా వల్లభా
శ్రీ దేవ రాగం ....... మరో సుస్థిరం
శ్రీ మాయ నిత్యం .... అదీ ఆత్మయే
శ్రీ శక్తి భాష్యం ......... సుధా మార్గమే
శ్రీ దీక్ష దాక్ష్యం ..... నయా జాడ్యమే
శ్రీ రామ రామా........ రమా వల్లభా
శ్రీదేవి సూక్తం ...... .... దయా హృద్యమే
శ్రీవిష్ణు మాయా ...... అభీ సంతసం
శ్రీకృష్ణ లీలా ...... ... మధూ మానసం
శ్రీరామనవమి సందార్భముగా ప్రతి ఒక్కరికీ ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు
నేటి కీర్తన (ఏ రాగమో నాకు తెలియదు )
ఇది నా ఆలోచనా పదాలు మాత్రమే
రామా రామ - రామచరితా
ఎంతా మంచి వాడవు గదా
తండ్రి మాట వేదమవగా
తల్లీ దీవెనే లతలు గా
చేసావే మనో భవముగా
సీతా చేయి పట్టితివి గా
లక్ష్మన్నే మనో భవుడు గా
ఆరాధ్యుండు మారుతి కదా
నిత్యా నందమే సుఖ నిధీ
రామా రామ - రామచరితా
కష్టాల్లో మనస్సును చెర్చి
ఓర్పుల్లో వయస్సును చెర్చి
నేర్పుల్తో ఉషస్సు పంచి
ఆరోగ్యా లయే నవ నిధీ
రామా రామ - రామచరితా
ప్రేమా రాగలాపములచే
సేవాతత్పరా లయముచే
శబ్దస్పర్శ రూపములచే
గ్రాహ్యామే శుభా మయముచే
సేవాతత్పరా లయముచే
శబ్దస్పర్శ రూపములచే
గ్రాహ్యామే శుభా మయముచే
రామా రామ - రామచరితా
ద్వేషం కోపమే నిను విడ్చె
ప్రేమా స్నేహమే నిను చేర్చె
కాలా మాయయే నిను మార్చె
భూమ్యా నందమే జల నిధీ
రామా రామ రామచరితా
--((*))--
--((**))--
నేటి కీర్తన
ప్రాంజలి ప్రభ
కలిమి కల్పించావు రామ
చెలిమి చేర్చావు రామ
బలిమి ఏర్పరిచావు రామ
దశమి శుభమంటావు రామ
పుట్టిన రోజు నీదే రామ
వివాహము రోజు నీదే రామ
నమ్మకం చూపించిన రోజు నీదే రామ
మన: శాంతి కల్పించిన రోజు నీదే రామ
సత్య, సద్గణ సాగర రామ
దయ, సౌహార్ద, హృదయ రామ
ధీరత్వ, వీరత్వ, గాంభీర్య రామ
మృధుత్వ, శస్త్రాస్త్ర జ్జాన రామ
పరాక్రమ, వినయ రామ
నిర్భయత్వ, నీతిజ్ణత రామ
తితీక్ష, శాంతి, సంయమ రామ
నిస్ప్రహత్వ, తేజోప్రీతి రామ
త్యాగ, మర్యాద రక్షణ రామ
ఏక పత్నీ వ్రత దక్షత రామ
ప్రజా రంజకత్వ, ప్రాణరక్షా రామ
శరణాగతవత్సలత్వం గల రామ
బ్రాంహ్మణ భక్తి గల రామ
మాతృ పితృ భక్తి గల రామ
గురు భక్తి, భ్రాత్రృప్రేమ గల రామ
వ్వవహార కుశలత్వం గల రామ
మైత్రీ భావము గల రామ
సరళత్వం గల రామ
ప్రతిజ్జా పాలన గల రామ
సాధు రక్షణ గల రామ
దుష్టదళనత్వం గల రామ
నిర్వైరత్వం గల రామ
లోక ప్రియత్వం గల రామ
బహూజ్ణత్వం గల రామ
ధర్మజ్ణత్వం గల రామ
ధర్మపరాయణత్వం గల రామ
పరదోషాన్వేషణరాహిత్యం గల రామ
విశ్వమోహిత హాసం గల రామ
--((*))--
--((***))--
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
అదియు నిదియు ననగా నేల రామా
కలదు వలదు ననగా నేల రామా
తెరచి విరుచు ననగా నేల రామా
మనసు సొగసు ననగా నేల రామా
ముదము మదము ననగా నేల రామా
తరులు గిరులు ననగా నేల రామా
నదులు కతలు ననగా నేల రామా
తపము జపము ననగా నేల రామా
పరము తరము ననగా నేల రామా
వరము కలియు ననగా నేల రామా
భయము నయము ననగా నేల రామా
తనువు గనుము ననగా నేల రామా
బాణము తోడుగా వేడుకొందును రామా
నామము నీడగా కొల్చు చుందును రామా
కాలము తెల్పుటే తప్పు ఒప్పైన రామా
ప్రేమయు పంచుటే నిత్య సత్యము రామా
Comments
Post a Comment