నేటి కవిత - వానా

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ.కం
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

పువ్వుల మెరుపులు వానా 
నవ్వుల తలపులు వానా 
జివ్వున మనసుని తాకే వానా 
కెవ్వు కెవ్వు మనిపించే వానా  

ఆశలు రేపే గగనపు వానా 
ఆశలు తీర్చుకొనే వానా 
ఆమని నీ మురిపించే వానా
ఆధరాల్ని తపింమ్ప చేసే వానా

ఆనందం పంచు కొనే వానా 
తోడు నీడగా కురిసే వానా   
వలపుని తెప్పించే వానా 
వయస్సును ఉడికించే వానా 

సొగసరి స్వరముల వానా
ప్రేమను చిగురింప చేసేవానా 
మైత్రికి అద్దంలా ఉండే వానా 
శ్వాసల సాక్షిగా కురిసే వానా 
   
వానా వానా వందనం, వానా వానా అభినందనం 
పుడమి తల్లిని పులకరించి నందుకు వందనం 
ఆమణిని ఆనంద పరిచి నందుకు వందనం 
ఆదమరిచిన మమ్ము మేల్కొల్పినందుకు వందనం 
-((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు