నేస్తమా ౨౬/04
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
నేను చెప్పిన మాట ఎపుడు ఒప్పినావు నేస్తమా
మన కబురులు ఆట ఎచట విప్పినావు నేస్తమా
మనసు మాట చెప్పుకొనగ నీవు గాక ఉందేవ్వరు
నీ తీయని పలుకు లన్నీ నాకు తెల్పినవే నేస్తమా
ఎంత ఓర్పు, ఎంత నేర్పు, కూర్పు కడలి హృదయమా
చెప్పరాని నా నేత్రం చెప్ప మంటున్నది మిత్రమా
మనసు విప్పు చెప్పు కొనుటకు నీకన్నా నాకెవ్వరు
చెప్పు కోలేనివి తెల్పినా ఫలితము లేదుగా నేస్తమా
స్వస్చమైన పాల వలే ఉన్నది నీ హృదయం
అసలు ప్రేమ అంటే ఏమిటో తెలియని స్నేహమా
చిత్తశుద్ధి మంత్రముంది, మాటనేర్పు ఉంది నీ దగ్గరా
గుండెను బట్టి ఆర్ధం చేసుకొనే తత్వం లేదు మిత్రమా
దివ్య ప్రేమ సందేశం, మనసుకు శాంతి తెల్పవా
నీ శ్వాస సాక్షిగా నా మాటలు గమనించవా నేస్తమా
--((*))--
Comments
Post a Comment