నేటి రాజకీయం (చలోక్తి )-1


నేటి రాజకీయం (ఛలోక్తి-3 )
ప్రాంజలి ప్రభ 

ఎవరికోసం ఈ  బందులు 
ఎవరి కోసం ఈ ధర్నాలు 
రాజకీయ స్వార్దమా 
ఎందుకు మామీద కక్ష సాధింపు 

పని లేకపోతె మాకు కూడు లేదు
కూడు లేకపోతే శక్తే  ఉండదు   
మమ్మల్ని బ్రతక నీయండి 
ఒకరోజులో తీరే సమస్యకాదు 
సంప్రదింపులతో తిర్చుకోనేది 
సామాన్య ప్రజలను
ఇబ్బంది పెట్టడం న్యాయమా 

చిల్లు కుండ నిచ్చి నిల్లు తెమ్మన్నారుట 
తెలివిగా ఒక ఇల్లాలు తెచ్చి ఇంట్లో పెట్టింది 
అలాగే పజల నొప్పించ కుండా 
సమస్య పరిష్కారం శాంతియుతంగా జరగాలి 

పక్షమైన - ప్రతిపక్షమైన కేంద్రాన్ని 
నిలదీసే విధాన మవలంబించాలి. 
శక్తి అయిన ఓర్పు అయిన కొంతవరకే 
పజల్లో ఉండేది, రాజకియం చేయకండి 
తిరుగుబాటుదారులకు, అవకాశ వాదులకు 
లొంగి పోకండి, స్వార్ధ రాజకీయంగా మార్చకండి 

ఆంద్రుల హక్కు అభివృద్ధి 
ప్రత్యెక హోదానా, ప్యాకేజా 
త్వరగా ఎదో తేల్చమని చెప్పండి 
అమ్మైన అడగందే పెట్టదు 
కేంద్రాన్ని అడిగి కావలసినవి 
పొందటమే మన తక్షణ కర్తవ్యం 

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి 
ఆంధ్రుల హక్కులను అనచకండి 
అధికారముందికదా  అని వట్టి ఇస్తారులో 
మట్టి పెట్టి, నీరు  అందిస్తే తినగలమా 
మీరే సమాధానము చెప్పండి 
--((*))--


  
   
నేటి రాజకీయం (చలోక్తి )
Mallapagaada ramakrishna
ప్రాంజలి ప్రభ 



కస్తూరి కర్పూర పరిమళాలు ఎలా అందించను 
నిండు కుండను ముక్క చేసి పంచారు కదా 
పరిచయాలు కాగితము వరకే మిగిలిపోయెను 
యాచించటం తప్ప వేరొక మార్గము లేదుకదా 

సుఘంధ లేపనాలను అందించుదామనుకున్నాను 
అక్రమాస్తులతో నాయకులకే సరిపోవుట లేదు కదా  
వలపు నిట్టూర్పులు లేకుండా చేద్దామనుకున్నాను 
మోసాలుచేసే నాయకులను ప్రస్నించ లేము కదా 

యాలకుల తైలాన్ని అందించు దామనుకున్నాను 
ధనికుల కిల్లిల్లో వాడుటతో ధరపెరుగుటయే కదా
గసగసాల గుసగుసలను తొలగిద్దమనుకున్నాను 
ఇప్పుడు మాతో ఆశ తీరక వేరొకరితో ఉందురు కదా 

దాల్చిం చెక్క ఘాటుతో బిరియాని ఇద్దామనుకున్నాను 
దినుసుల ధరలు అదుపులో లేక పెరిగి పోవుట కదా     
కూడు, గూడు, గుడ్డ అందిద్దామని నేను అనుకున్నాను 
కేంద్రం నీటి బుడగలందించి చెపుతున్నారు కదా  

--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు