joks
[Message clipped] View entire message
| అక్షరాల అనునయం...||
ప్రవహిస్తున్న దు:ఖాలలో ఈదులడుతూ
మల్లులై గుచ్చుకుంటున్న మౌనపోరాటాలు
తడబాటు నవ్వులకు నటనలద్దలేక
గుదిబండలై తగులుతున్న గాయాలగుర్తులు
అంతరంగ అంతర్వాహినులకు అడ్డుకట్ట వేయలేక
గతాల కన్నీటి చుక్కలని కలంలో నింపుకుంటున్నా
మూగదైన హృదయ ప్రపంచం
మనసు భాషను అక్షరాలతో అలంకరిస్తున్నా
నిశిధి నీడలను భావాలతో కప్పి పెడుతూ
నవ్వుతెమ్మెరలకై తారాడుకుంటున్నా
పరిచయం మరచిన సంతోషాలు
వెన్నెల హసితాలకై వెతుకుంటున్నా
మౌనం మోస్తున్నమసబారని జ్ఞాపకాలు
అక్షరాల అనునయాలతో
ఆత్మవిశ్వాసాలు అలంకరించుకుంటున్నా…….!!
సరదాగా తీసుకోవాలి, మరి!!
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....
చిత్రం : చక్రపాణి
సంగీతం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,
రచయత : రావూరి రంగయ్య
గానం : పాలువాయి భానుమతి రామక్రిష్ణ,
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే
మెల్ల మెల్లగా చల్ల చల్లగా...రావే నిదురా హాయిగా....
వెన్నెల డోలికాలా పున్నమి జాబిలి పాపవై
కన్నులనూగవే చల్లగా రావే నిదురా హాయిగా...
పిల్ల తెమ్మెరలా వూదిన పిల్లన గ్రోవివై
జోల పాడవే తీయగా రావే నిదురా హాయిగా....
కలువ కన్నియాలా వలచిన తుమ్మెద రేడువే
కన్నుల వ్రాలవే మెల్లగా రావే నిదురా హాయిగా..
https://www.youtube.com/watch?v=9CCm5m-ZSQ0
MELLA MELLA GA CHALLA CHALLAGA RAVE NIDHURA HAIGA ...CHITRAM:-CHAKRAPANI.mp4
మెల్లమెల్లగా చల్లచల్లగా రావే నిదురా హాయిగా...చిత్రం:- చక్రపాణి, పాటగురించి:- గాయకులూ :-డాక్టర్. పాలు...
సరదాగా తీసుకోవాలి, మరి!!
మన "మాలోకం" కి ....
ఒక అమ్మాయి....
"ఐ మిస్ యు" అని మెస్సేజ్ పెట్టింది!!!
మనవాడు ఒక అరగంట అలోచించి...ఆలోచించి...
"ఐ మిస్టర్ యు" అని పెట్టాడు!!
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
నీతి శాస్త్రము - పండిత పరిష్కృతము
శ్లో === అతిధి ర్చాలక శ్చైవ స్త్రిజనో నృపతి స్తదా
ఏతే విత్తం నా జానన్తి జామాతా చైవ పజ్జమః
భావము === అతిధి, బాలుడు, స్త్రీ , రాజు, అల్లుడు వీరు ఐదుగురు తమ స్వార్ధమునే చూచు కొమ్డురుగాని కలిమి లేములను జుదరు. అనగా విరైడుగురు ఎదుతువారి స్తితిగాతులను చూడక వారేమాయి పోయినాను పట్టించు కొనక తమ పబ్బంగడుపు కొనుటకే ప్రయత్నింతురు.
గజల్ 2342.
ముద్దిచ్చే పిల్లగాలి..పెదవులనే ఏలును కద..!
వెంటపడే పూలగాలి..గుండెలనే ఏలును కద..!
నేలవిడచి సాముచేయు..పనికన్నా తక్కువేది..
గోర్వెచ్చని కొండగాలి..మనసులనే ఏలును కద..!
నీలికురుల నీడలోన..పరుగులిడే సెలయేరులు..
పసిడియంచు పైరగాలి..కొమ్మలనే ఏలును కద..!
చిలిపిమబ్బు తెరలలోన..నాట్యమాడు మెరుపులెన్నొ..
ఊరించే తేమగాలి..ఊహలనే ఏలును కద..!
మౌనజలధి విహరించే..కలహంసల ఆశలెన్నొ..
పరిమళించు మరులగాలి..మల్లెలనే ఏలును కద..!
మాధవునకు నివేదనగ..గజలొక్కటి చాలుకదా..
చెలిమిపెంచు ప్రేమగాలి..చూపులనే ఏలును కద..!
కురులు పసిడి మోముపై కవ్వింపుతో - కనురెప్పల కదలికలు అమాయకంతో
ముద్దిచ్చేపెదవులు పలకరింపుతో - గోర్వెచ్చని గాలి గుండె తాకే అమాయకంతో
పరిమళించు మల్లెల గుభాలింపు తో - మౌన జలధిని ఊరడించు అమాయకంతో
చెలిమి పెంచు ప్రేమ గాలి చూపులతో - మనసు దోచి సుఖం పంచు అమాయకంతో
పగలే వెన్నలన్నట్లు,
సౌందర్యమే మనసైనట్లు
మదిలోని కోరిక మగువపట్ల
చక్రబ్రమణం ఆయనట్లే
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
బావగారు! ధాంపత్య జీవనము నిత్యమూ మధురిమలతో నిండి నిత్యనూతన శోభలతో పరిమళించాలంటే ఏమి చెయ్యాలో శెెలవివ్వరా!
ముఖ్యంగా రెండు ప్రణాళికలు అమలు చెయ్యాలి బావమరిది!
ప్రణాళిక -1
గొడవలకు మూల కారణమైన అర్ధిక స్థితి:-
సాస్వత, ధీర్గకాలిక, తాత్కాలిక ప్రణాళికలు అమలు పరచాలి!
అనగా:-
తాత్కాలిక ప్రణాళిక :
రాబోయే సంవత్సరం అంతా పిల్లల చదువులు, బట్టా- పాత , విందులు-వినోదాలు,
నోములు-వ్రతాలు,
మంచి-చెడులు-ఆరోగ్యసమస్యలు మొదలైనవాటికోసం నెల, నెలా నిల్వా చెయ్యాలి!
ధీర్ఘకాలిక ప్రణాళిక లో పిల్లల కాలేజీ చదువులు, పెళ్ళిళు, భూమీ-పుట్రా మొదలైనవాటి కోసం!
శాశ్వత ప్రణాళిక పదవీ విరమణ తరువాత గౌరవప్రదమైన, ఆనందమైన జీవతంకోసం!
ఆర్ధిక విషయాలు నెలకొక్క సారి మాత్రమే,
అదీ కూడా బ్రహ్మ ముహూర్తం లోనే ధంపతులు చర్చించుకోవాలి,
జీతం రాగానే అణా-పైసలతో సైతం ఇంటికి తీసుకొచ్చి పూజా మందిరంలో పెట్టే సాంప్రదాయము వలన అనవసర ఖర్చులూ గట్రా తగ్గుతాయి!
ప్రణాళిక -2
"ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక"
అన్న స్పూర్తితో అడపా-దడపా వ్రుత్తిపరంగా కేంపులకెళితే వుభయతారకంగా ఆర్ధిక పరిపుష్టి తో పాటు ఇనురాగాలూ-ఆప్యాయతలూ వ్రుద్ది చెందుతాయి!
వున్నంతలో వారానికో సారి సినిమాలూ-షికార్లూ, సంవత్సరానికి రెండు సార్లు
తీర్థయాత్రలు-విహార యాత్రలు!
ఎంత మంచి కధ అయినా శ్రుంగారానికి తోడుగా హాస్యపు జల్లులు కూడా సినిమాకెలా ముఖ్యమో మనకీ అంతే ముఖ్యమని మరువకు సుమీ!
ఇలా పోను పోను మరిన్ని సంగతులు నీ అనుభవం నేర్పుతుంది!
--((**))--
వందల కోట్లకు అధిపతిని, నాకు కట్నము రూపంలో కోటాను కోట్ల కట్నము ఇవ్వడానికి చాలా మంది కోటీశ్వరులు సిద్దంగానున్నారు, అయినా నయాపైసా ఆశించకుండా నిన్నే పెళ్ళి చేసుకున్నాను, ఎందుకనుకున్నావ్?
సినీ నటిని కాబట్టి!
కాదు!
మరీ?
సినిమాలలో నువ్వు చేసే వర్ణనాతీతమైన శ్రుంగార భంగిమల రసధారలకు మైమరచి నిన్ను చేసుకున్నాను!
సంతోషమండి!
కానీ మన పెళ్ళి అయి నెల్లాళ్ళైనా నా కోరిక తీరలేదు, నీ నాట్యము నాకే స్వంతమవాలని, రోజూ నీ నాట్యంతో నన్నలరిస్తావని ఆశించాను!
ఈ విషయమై నన్ను క్షమించండి!
ఏం? ఎందుకో?
నాయకుడు,విలన్ ,దర్శకుడు, న్రుత్య దర్శకుడు, మేకప్ కుర్రాడు, కాస్ట్యూమ్స్ నిపుణుడు, ఫ్లడ్ లైటింగ్, చుట్టూ షూటింగ్ వాతావరణమూ,జనాలు వుంటే గాని నేను నాట్యం చెయ్యలేనండి!
--((**))--
బార్ లో:-
తాగుబోతు-1
ఓరేయ్! రేపట్నుండి ఈ హోల్ సిటీ నాది,
నేను కోనేస్తా
తాగుబోతు-2
నేనమ్మన్రోయ్
తాగుబోతు-1
ఎందుకమ్మవ్. ఎంత డబ్బైనా ఇస్తాగా
తాగుబోతు-3
ఏహేయ్! ఆడెవడు?
ఈ సిటీ నాది
నేన్నీకిప్పుడే ఇచ్చేస్తా
ముందోక క్వార్టర్ తెప్పీయ్
ఒరేయ్ పితలాటకం! ఇంత తక్కువ కాలంలోనే ధనవంతుడివెలా అయ్యావ్?''
ధనవంతుడికి పార్టనర్‌గా చేరాను. అతని దగ్గర డబ్బుండేది. నా దగ్గర అనుభవముండేది. అందుకే రిచ్ మేన్ అయ్యాను!"
"అదెలా..? అర్థమయ్యేలా చెప్పు?"
"ఇప్పుడు నా దగ్గర డబ్బుంది...
అతని దగ్గర అనుభవం ఉంది..!"
--((**))--
ఒరేయ్ అబ్బీ!
జామ పళ్ళు ఎలా ఇస్తున్నావ్ ?
ఎన్ని కావాలండి?
వంద కావాలయ్యా!
వంద నూట ఏభై చేసుకు ఇస్తానండి !
అబ్బో నూటేభయ్యే? ఉహు! ఎనభైకి ఇస్తావా?
అమ్మొ ! తల్లి తల్లీ! అంత మాటనకండి!
వంద చేసుకోండి
ఎనభైకి ఇస్తే వంద ఇచ్చెయ్యి లేకపోతే వెళ్ళిపో!
సరే! పెద్ద బేరం ఎందుకు పోగొట్టుకోవాలండి. ఇదిగో లెఖ్ఖెట్తాను చూసుకోండి ఆ సంచీ ఇల్లా ఇవ్వండి అందులో వేస్తాను !
లాభం ..ఒకటి..రెండు..మూడు..
అబ్బాయిగారికి పిల్లలా?
ఒక కూతురయ్యా!
ఎన్నో ఏడండి?
ఎనిమిది
చిత్తం ఎనిమిది..తొమ్మిది..పది.అమ్మాయిగారికండి?
దానికోకొడుకు
ఎన్నేళ్ళండి
పదమూడు
సరిజోడేమోనండి పదమూడు..పద్నాలుగు పదిహేను, పదహారు, పదిహేడు తమకి అమ్మాయి తర్వాతండి …?
ఆ ఇంకో అమ్మాయి వుంది.
ఇరవై నాలుగేళ్ళు వచ్చాయి.
సంబంధాలు చూస్తున్నాం
అలాగాండి ఇరవై నాలుగు, ఇరవై ఎయిదు, ఇరవై ఆరు, ఇరవై ఏడు, ఇర్వై ఎనిమిది ,
కోడలుగారివయస్సు ముప్ఫై వుంటాయాండి?
మొన్ననే ముప్ఫై ఎనిమిది వచ్చాయి
ముప్ఫై ఎనిమిది,ముప్ఫై తొమ్మిది, నలభై.. పెద్దబ్బాయిగారికెన్నేళ్ళంది
నలభై ఐదు
నలభై అయిదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నల్భై తొమ్మిది, ఏభై
ఏంటోనండి సోతంత్రం వచ్చి ఏభై ఏళ్ళైనా మా బతుకులు ఇలాగేవున్నాయండి
అదేమిటయ్యా! మనకు స్వాతంత్రం వచ్చి అరవై ఏళ్ళైంది
అవునాండి. అయినా చూడండి లేనోడు అట్టానేవున్నాడు. వున్నోడు ఎదిగిపోతున్నాడు
అరవై, అరవై ఒకటి అరవై రెండు, అరవైమూడు అరవైనాలుగు , అయితే బాబుగారికి సొతంత్రం వచ్చిన్నాటికి పెళ్ళయిపోనాదాండి
అహా! ఇప్పుడాయన వయస్సు ఎంతనుకున్నావ్ ? ఎనభై ఒకటి.
అలాగా! ఎనభై ఒకటి, ఎనభై రెండు, ఎనభై మూడు, ఎనభై నాలుగు, తమ తల్లిగారు?
మూడేళ్ళైందయ్యా పోయి.
అయ్యో పాపం ఏం జబ్బండి?
జబ్బేంలేదు తిరుగుతూనేవుంది. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది
అలాగాండి. ఏం మాయదారి జబ్బులో! ఆరు పోయేనాటికి తొంభై వున్నాయాండి
తొంభై నాలుగయ్యా
అల్లాగా! తొంభై నాలుగు, తొంభై అయిదు, తొంభై ఆరు, తొంభై ఏదు, తొంభై ఎనిమిది, తొంభై తొమ్మిది, నూరు. ఇదిగో అమ్మగారు. లెఖ్ఖ చూసుకోండి
అదేమిటి వంద వేసి వూరుకుంటావా? కొసరు ఒక చెయ్యి వెయ్యి
ఏమిటో అమ్మగారూ! అక్కడకీ గిట్టకపోయినా ఎనభైకి ఒప్పుకున్నా. ఇంకా కొసరంటే ఎలాగండి!
కొసరు వెయ్యకపోతే నాకు అక్కర్లేదు. తీసుకుపో
కోపం పడకామండి.
ఇందండి అయిదు వేసా
వందకి చిల్లర వుందా?
ఇదిగో ఇరవై ..వస్తానండి అమ్మగారు..
ఇల్లాలి స్వగతం"-
"హు! వంద నూట ఏభైట!! నా దగ్గరా వీడి బేరాలు!!"
--((**))--
నమ్మకం.
ఏ మ్ ఎస్ నారయణ (కాషిఎర్) మేనేజర్ బ్రహ్మానందంతో
సారూ. ఇక్కడ ఒకడు బ్యాంకు దోచుకోనడికి ఒకడు వచ్చేడు ,గన్ మర్చిపోయ్డు ట
ఏమి చెయ్యాలి.
కొంచెం కస్టమర్ అంటే నమ్మకం ఉండాలి , తొక్కలో గన్ రేపు తెస్తాడు ...
ముందు డబ్బు అంతా ఇచ్చి వెయ్యి అన్నాడునమ్మకం.
ఏ మ్ ఎస్ నారయణ (కాషిఎర్) మేనేజర్ బ్రహ్మానందంతో
సారూ. ఇక్కడ ఒకడు బ్యాంకు దోచుకోనడికి ఒకడు వచ్చేడు ,గన్ మర్చిపోయ్డు ట
ఏమి చెయ్యాలి.
కొంచెం కస్టమర్ అంటే నమ్మకం ఉండాలి , తొక్కలో గన్ రేపు తెస్తాడు ...
ముందు డబ్బు అంతా ఇచ్చి వెయ్యి అన్నాడు బ్రహ్మానందం.
--((**))--
స్వాగతం కురసార్వభౌమా.. స్వాగతం.. సుస్వాగతం..
శతసోదర సంసేవిత సదనా.. అభిమాన ధన సుయోధనా..ఆ..ఆ..
చిత్రం : శ్రీకృష్ణ పాండవీయం (1966)
సంగీతం : టి.వి. రాజు
గీతరచయిత : సినారె
నేపధ్య గానం : పి. లీల, సుశీల
పల్లవి :
స్వాగతం..
స్వాగతం సుస్వాగతం..
స్వాగతం కురసార్వభౌమా.. స్వాగతం.. సుస్వాగతం..
శతసోదర సంసేవిత సదనా.. అభిమాన ధన సుయోధనా..ఆ..ఆ..
స్వాగతం.. సుస్వాగతం..
చరణం 1 :
మచ్చలేని నెల రాజువు నీవే.. మనసులోని వలరాజువు నీవే
మచ్చలేని నెల రాజువు నీవే.. మనసులోని వలరాజువు నీవే
రాగ భోగ సురరాజువు నీవే..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
అహా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
రాగ భోగ సురరాజువు నీవే.. రాజులకే రారాజువు నీవే..
ధరణి పాల శిరో మకుటమణి తరుణ కిరణ పరి రంజిత చరణా..
స్వాగతం.. సుస్వాగతం..
చరణం 2 :
తలపులన్ని పన్నీటి జల్లులై.. వలపులన్ని విరజాజి మల్లెలై..
ఆ..ఆ..ఆ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆఅ..ఆ..ఆ
తలపులన్ని పన్నీటి జల్లులై.. వలపులన్ని విరజాజి మల్లెలై
నిన్ను మేము సేవించుటన్నవీ.. ఎన్ని జన్మముల పుణ్యమో అది
కదన రంగ బాహు దండ సుధ గధా ప్రకట పటు శౌర్యాభరణ
స్వాగతం.. సుస్వాగతం..
https://www.youtube.com/watch?v=Ycsgs3XTb9c
Swagatham Suswagatham Full Video Song || Sri Krishna Pandaveeyam || N.T.R, K.R.Vijaya
► Subscribe us http://goo.gl/dM5GO7 ► Like us on Facebook https://facebook.com/shalimarcinema ► Foll...
--((**))--
వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ...
చిత్రం : శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ (1966)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : పింగళి నాగేంద్ర రావు
నేపధ్య గానం : జానకి, బాలమురళి కృష్ణ
పల్లవి :
వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
వసంత గాలికి వలపులు రేగ.. వరించు బాలిక మయూరి కాగ
తనువు మనసు ఊగి తూగి..
తనువు మనసు ఊగి తూగి.. ఒక మైకం కలిగేనులే
ఈ మహిమ నీదేనులే ప్రేమతీరు ఇంతేనులే
చరణం 1 :
రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా
రవంత సోకిన చల్లని గాలికి మరింత సోలిన వసంతుడనగా
తనువు మనసు ఊగి తూగి
తనువు మనసు ఊగి తూగి
ఈ లోకం మారేనులే
ఈ మహిమ నీదేనులే... ఆహా భలే హాయిలే
ఈ మహిమ నీదేనులే
చరణం 2 :
విలాస మాధురి వెన్నెల కాగా... విహార వీణలు విందులు కాగా
విలాస మాధురి వెన్నెల కాగా... విహార వీణలు విందులు కాగా
ఏకాంతంలో నీవూ నేనే
ఏకాంతంలో నీవూ నేనే
ఒక స్వర్గం కనుపించెనే
ఈ మహిమ నీదేనులే... ప్రేమ తీరు ఇంతేనులే
ఈ మహిమ నీదేనులే...
https://www.youtube.com/watch?v=GpascF_7gwM
VASANTHA GALIKI VALAPULU REGA VARINCHI BALIKA MAYURI..CHITRAM:- SRIKAKULA ANDRAMAHA VISHNU KATHA.mp4
వసంతగాలికి వలపులు రేగ వరించి బాలిక మయూరి కాదా.....చిత్రం :- శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ పాట గురించి...
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
"ఒరేయ్ ! పిడుగూ....."గంగ "ఎక్కడనుండి బయలు దేరి....
ఎక్కడికి చేరుతుందో చెప్పరా?!!" అడిగారు "సుధా టీచర్"
"నాకేటి భయం....కానీ..... నేన్జేప్పానని మీరు ఎవరితో అనొద్దు!..."అన్నాడు "పిడుగు"
"ఒరేయ్ ! తెలిస్తే చెప్పి ఏడూ,....
పిచ్చి పిచ్చి డైలాగులు ఎందుకు!!" అన్నాడు "సుధా టీచర్"
"అదే నండి....మరే..."గంగ" కాలేజి వంక తో బయలుదేరి ....
మన రాము లోరీ గుడి దగ్గర..."మూసి కుమార్" ని కలుస్తున్దండి...." అన్నాడు "పిడుగు"
--((**))--
సరదాగా తీసుకోవాలి, మరి!!
ఫేస్బుక్ బారసాల !!!
నల్ల గా వున అమ్మాయి..
"ఎంజల్ "
లావు పాటి అబ్బాయిలు....
"స్మార్ట్ బాబీ"
పిరికి అబ్బాయిలు....
"కిల్లర్"
45 సం.ల ఆంటి....
"కుశ్బూ"
55 సం.ల వాళ్లు....
హ(,,,,ఆయన సంగతి నాకెన్దుకులెండి!!!!
--((**))--
సరదాగా తీసుకొవాలండొయ్ !..మరి!
వెయ్యి వెర్రి తలలు వేస్తోంది....
Comments
Post a Comment