🌺 శ్రీయోగవాసిష్ట రామాయణము🌺


🌺 శ్రీయోగవాసిష్ట రామాయణము🌺

యచ్చేదం దృశ్యతే కించిత్ జ్జగత్ స్థావరం జంగమమ్ ।
తత్వర్వమస్థిరం బ్రహ్మన్ స్వప్న సంగమసన్నిభమ్॥ (1)

* శ్రీరాముడు-* బ్రహ్మజ్ఞుడా! ఈ కనబడు స్థావర జంగమాత్మగమగు జగత్తంతయూ
స్వప్న సంగమువలే నస్థిరము !

శుష్కసాగర సంకాశో నిఖాతో యో౽ ద్య దృశ్యతే।
స ప్రాతర భ్రసంవీతో నగః సంపద్యతే మునే ॥(2)

మునీంద్రా! నేడు ఎండిపోయిన సముద్రము వలే కన్పడు అఘాతము
రేపు -- మేఘములా పరివృతమగు పర్వతముగ మారవచ్చును.

యో వనవ్యూహ విస్తీర్ణో విలీఢ గగనో మహాన్ ।
దినై రేవ సమాయాతు వీర్య సమతాం కూపతాంచ వా॥ ( 3)

ఆకాశమును బుట్టు మహారణ్యము కొన్ని దినములలో నేలమట్టమై పోవచ్చను. లేక మాయగ మార వచ్చూను.

యదంగ మద్య సంవీతం కౌశేయ స్రగ్విలేననైః।
దిగంబరం తదేవశ్వో దూరే విశారితా ౽వటే ॥ (4)

నేడు ఏ శరీరమున పట్టు పుట్టములు చుట్టబడి యున్నవో, !? మాలల వేయబడినవో , ! ఆ శరీరము మాపు వస్త్రవిహీనమై దూరమునున్న గుంటలొ పారవేయబడి విశీర్ణమగును.

యత్రాద్య నగరం దృష్టం విచిత్రాచారచంచలమ్।
తత్రైవోదేతి దివసైః సంసూన్యారణ్యధర్మతా ॥( 5)

నేడు విచిత్రాచారములతో నిండి కనబడుచున్న - నగరమున్నచోట అల్ప దినములో శూన్యారణ్యమూ వెలయును.

యః పుమానద్య తేజస్వీ మండలాన్యధితిష్టతి।
స భస్మకూటతాం రాజన్ దివసై రధిగచ్ఛతి॥(6)

నేడు తేజమున మండ లాధిపతియై వెలయు నాతడు స్వల్ప కాలముననే భస్మ రాశిగా మారును.

అరణ్యాని మహాభీమా యానభోమండలోపమా ।
పతాకాచ్ఛాది కాశా సైవ సంపద్యతే పురీ॥( 7)

మహాభయంకరమునూ  గగనమువలే శూన్యమునూ ; విశాల్యమునగు అరణ్యము-
కాలవశమున ఆకాశమండలము నావరించు పతాకలతో కూడిన 'పురిగ' మారగలదు.

యా లతా వలితా భీమా భాత్య ద్య విపినావలీ।
దివసై రేవ సాయాతి .పునర్మరుమహీపదమ్ ॥ ( 8)

నేడు లతలచే నావరింప బడి మహా భయంకరమై కన్పట్టునదె కొన్ని రోజులలో మరు భూమిగా మారును.

సలిల స్థలతాం యాతి స్థలీ భవతి వారిభూః।
విపర్యస్యతి సర్వం హి సకాష్టాంబు తృణం జగత్ ॥( 9)

నీరు భూమి యగును .భూమి నీరగును.జగత్తంతయు పరివర్తనము నందునదే!

అనిత్యం యౌవనం బాల్యం శరీరం ద్రవ్య సంచయాః ।
భావాద్భావాంతరం యాంతి తరంగ వదనాతురం ॥(10)

బాల్యము ; యౌవనము; శరీరము ద్రవ్యములు -- ఇవన్నియు అనిత్యములే ! నిరంతరము తరంగములవలే స్థిత్యంతర ము నందుచుండును.

వాతాంతర్దీ పక శిఖాలోలం జగతి జీవితమ్।
తడిత్ స్ఫురణ సంకాశా పదార్ధ శ్రీర్జగత్రయే ॥ (11)

గాలిలోనున్న దీపమువలె, జీవితము చంచలము ముల్లోకములనున్న వస్తువుల శోభ మెఱుపు వంటిది.

విపర్యానమిమం యాతి భూరిభూత పరంపరా।
బీజరాశిరి వాజస్రం పూర్యమాణః పునః పునః ॥(12)

బీజములవలె భూతములన్నియు మాటిమాటికీ మార్పు నందుచుననవి.

మనః పవన పర్యన్త భూరి భూత రజః పటా ।
పాతోత్పాత పరావర్త పరాభినయ భూషితా ॥(13)

ఆలక్ష్యతే స్థితిరియం జాగతీ జనిత భ్రమా।
నృత్తావేశ వివృత్తేవ సంసారారభటీనటీ॥(14)

ఆడంబరముతో గూడిన ఈ సంసార రచన నేర్పుగల నర్తకి వలే కనిపించుచున్నది. ఇదిమాటిమాటికీ కౌశలముతోఅంగవిన్యసము
నొనర్చుచు , భ్రమింప చేయుచున్నది. మనస్సున గాలిచే లేవనెత్తబడు ధూళియను జీవులు ఈ నర్తకియొక్క వస్త్ర సురూపులు .
జీవుల స్వర్గ , నరక , భూలోక .పతనమే దాని అభినయము.

గంధర్వ నగరాకారా విపర్యాస విధాయినీ
అపాంగ భంగు రోదారా వ్యవహార మనోరమా-॥(15)

తడిత్తరల మాలోక మాతా న్వానా పునః పునః।
సంసార రచనా రాజన్ నృత్తసక్తేవ రాజతే॥(16)

లోక ప్రసిధ్ధములగు క్షణ భంగుర వ్యవహారములే దీని చంచల కటాక్షములు.
ఇది గంధర్వ నగరమును బోలు భ్రమను కల్గించును . ఇంద్రజాలిక వలే అవస్తువునందు వస్తు భ్రమను కల్గించు చున్నది.దీనిదృష్టి మెఱుపు కంటెను చంచలము.ఇది ఈ నృత్యము నకు తగియే యున్నది.

దివసాస్తే మహాంతస్తే సంపదస్తాః క్రియాశ్చ తాః ।
సర్వం స్మృతి పథం యాతం యామో వయమపి క్షణాత్॥(17)

ఆ రోజులు , ఆ సంపదలు, ఆ క్రియలు, ఆ మహా పరుషులు , దృష్టిపథమున దాటిపోయినారు. స్మృతికి దూరులైనారు. మనము కూడ క్షణములో ఇట్లే యగుదుము.

ప్రత్యహం క్షయమాయాయాతి ప్రత్యహం జాయతే పునః।
అద్యాపి హతరూపాయా నాన్తో౽స్యా దగ్ధ సంసృతే॥ ( 18)

ప్రతి దినము క్షర మందుచు మరల ఉత్పన్న మగుచున్నది. ఈ పాడూ సంసారమున కంతములేదు.

తిర్యక్త్వం పురుషాయాంతి తిర్యంచో నరతామపి ।
దేవాశ్చ దేవతాం యాంతి కిమివేహ విభో స్థిరమ్ ॥ ( 19)

ప్రభూ ! మనుష్యులు పశువులగుచున్నారు. పశువులు మనుష్య జన్మమెత్తుచున్నవి.
దేవతలు దేవతా భావము వీడుచున్నారు. ఈ జగత్తున స్థిరమైనదేమున్నది??

రచయన్ రశ్మిజాలేన రాత్ర్యహాని పునః పునః ।
అతివాహ్య రవిః కాలో వినాశావధి మీక్షతే ॥ (20)

కాలాత్ముడగు సూర్యడు ; తన కిరణముల , రాత్రి దివముల , మాటిమాటికీ గల్పించి గడుపుచు ప్రాణుల అవసాన సమయాంతము ను నిరీక్షించుచున్నాడు.

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ సర్వావా భూతజాతయః ।
నాశ మేవాను ధావంతి సలిలానీవ వాడవమ్ ॥(21)

నీ బడబాగ్నియందు పడునట్లు త్రిమూర్తులను తక్కుంగల జీవులును వినాశనమొందుచున్నారు.

ద్యౌక్షమా వాయు రాకాశం పర్వతాః సరితో దిశః ।
వినాశవాడ స్యైతత్ సర్వం సంశుష్కమింధనమ్ ॥(22)

దిఙ్మండలము , స్వర్గము, భూమి, ఆకాశము,
వాయువు, పర్వతములు , నదులు, --- ఇవన్నియు ధ్వంసమను బడబాగ్ని కి ఎండుకట్టెలు.

ధనాని బాంధవా భృత్యా మిత్రాణి విభవాశ్చ.యే ।
వినాశభయభీతస్య సర్వం నీరసతాం గతం॥(23)

మృత్యు భీతిగల మనుజునకు ; ధనధాన్యములు , బంధుమిత్రులు , భృత్యులు వైభవములు ప్రీతి కరములు కాజాలవు.

స్వదంతే తావదేవై తే భావా జగతి ధీమతే ।
యావత్ స్మృతి పథం యాతి న వినాకు రాక్షసః॥ (24)

మృత్యువును రాక్షసుడు గుర్తు తగలనంత వరకూ ఈ భోగములన్నియు రుచించును.

క్షణమైశ్వర్య మాయాతి క్షణమేతి దరిద్రతాం।
క్షణంషవిగతరోగత్వం క్షణమాగతరోగతామ్॥

నిమిషములో ధనికుడు దరిద్రుడగును. ; ఆరోగ్య వంతుడు రోగియగును.

ప్రతి క్షణం విపర్యా సదాయినా నిహతాత్మనా
జగద్భ్రమేణ కే నామ ధీమంతోహి న మోహితాః ॥.( 26)

అనుక్షణము భ్రాంతిని కల్పించునదియును ,అశాశ్వతము నగు జగత్తున విమోహితుడు కాని వివేకి ఎవడు?

తమః పంకసమూలబ్థం క్షణమాకాశ మండలమ్ ।
క్షణం కనక నిష్యంద కోమలాలోక సుందరమ్॥.( 27)

క్షణం జలద నీలాబ్జ మాలావలిత కోటరమ్।
క్షణముడ్డామరరవం క్షణమూక మివస్థితమ్॥( 28)

క్షణం తారావిరచితం క్షణమర్కేణ భూషితమ్
క్షణమిందు కృతా హ్లాదం క్షణ సర్వ బహిష్కృతం ॥ (29)

ఆగమాపాయ పరయా క్షణసంస్థిత నాశయా।
నబిభేతి హి సంసారే ధీరో౽పి క ఇవానయా ॥(30)

ఒకప్పుడాకాశము తమః పంక పిండమున బూయపడి యుండును. మరొకప్పుడు కనక కాంతుల శోభిల్లు చుండును. మరొకప్పుడు .మేఘములను నీల పద్మములతో నిండియుండును. అన్య సమయమున ధ్వనులతో నిండియుండును. మరొక నఈముషమున మూగయై నిశ్శబ్దముగా నూండును. ఇంకొక క్షణమున.సూర్యునితో ప్రకాశించుచుండును. మరోకప్పడు నక్షత్ర శోభితమై వెలయును.ఇంకొకప్పుడు చంద్రునితో .రాజిల్లుచుండును. మరొకప్పడు ఏవియు నుండవు.
క్షణము నుండీ క్షణములో పోవునట్టి ఈజగత్తనిన భీతిల్లనివారెవరు ?

ఆపదః క్షణమాయాంతి క్షణమాయాంతి సంపదః।
క్షణం జన్మ క్షణం మృత్యు ర్మునే కిమివ నక్షణం ॥(31)

మునీ! క్షణములో ఆపదలు అరుదెంచును. క్షణములో సంపదలు వచ్చును. క్షణములో జన్మ, క్షణములో మృత్యువు --- ఇక క్షణికము కానిదెయ్యది??

ప్రాగా సీదన్య ఏవేహ జాతః త్వన్యో నరో దినైః
సదైక రూపం భగవన్ కించదస్తి నసుస్థిరం॥( 32)

భగవంతుడా! ప్రపంచమునందున్న వస్తువు లన్నియు ( జన్మకు) పూర్వమొకట్లను తరూవాత మరొకట్లును నుండును. కొన్ని రోజులలో ఇంకొకట్లు మారును. స్థిరమును , ఏకమును నగు సద్రూపము కలిగిన వస్తూవోక్కటియులేదు.

ఘటస్య పటతా దృష్టా పటస్యాపి ఘటస్థితిః -।
నతదస్తి న య ద్దృష్టం. విపర్యస్యతి సంసృతౌ ॥ (33)

ఈ జగత్తున మార్పునందని వస్తు వొక్కటియు లేదు. ఘటము పటము అగును . పటము వస్త్రమగును.ఘటము( కుండ).పటము - వస్త్రము.

తనోత్యుత్పాద యత్య త్తి నిహంత్యాసృజతి క్రమాత్ ।
సతతం రాత్ర్య హనీవ నివర్తంతే నరం ప్రతి ॥(34)

వృధ్ధి, పరివర్తన, అప క్షయము , వినాశము , పునర్జన్మ - ఇవి దేహాభిమానియగు నరుని పట్ల రాత్రిందివములట్లు నిరంతరము మారుచున్నది.

అశూరేణ హతః శూర ఏకేనాపి హతం శతం।
ప్రాకృతాః ప్రభుతాం యాతాః సర్వమావర్త్య తే జగత్ ॥ ( 35)

బలహీనుడు బలవంతుని జంపుచున్నాడు. ఒకడు నూర్గురను మట్టు పెట్టుచున్నాడు.
నీచులూ ప్రభువులగుచున్నారు.ఇట్లు జగత్తంతయు పరివర్తనము చెందుచున్నది.

జనతేయం విపర్యాసమ జస్రమనుగచ్ఛతి।
జడస్పంద పరామర్శాత్ తరంగాణామివావలీ॥ (36)

జలసంస్పర్శవలన తరంగములు విపర్యమఅందునట్లు -- జనులు అచేతన పదార్ధముల సంస్పర్శ వలన మార్పులందూచున్నారు.

బాల్యమల్ప దినైరేవ యౌవన శ్రీస్తతో జరా
దేహే౽పి నైకరూపత్వం కాస్థా బాహ్యేషు వస్తుషు ॥( 37)

బాల్యము గతించును , యౌవనమరుదెంచును అది పోయి ముదిమి వచ్చును. - ఇది శరీరము యొక్క గతి. అగుచో - నిక బాహ్యవిషయముల మాట ఏమి?

క్షణమానందితామేతి క్షణమేతి విషాదితాం।
క్షణం సౌమ్యత్వమాయాతి సర్వస్మిన్నట వన్మనః.॥(38)

మనస్సు నటునివలె అన్ని విషయముల క్షణములో ఆనందము ; క్షణములో విషాదమును ; క్షణము లో విషాదమును క్షణములో సముఖతను నందును.

ఇతశ్చాన్యదితశ్చాన్య దితశ్చాన్యదయం విధిః ।
రచయన్ వస్తు నాయాతి ఖేదం లీలాస్వివార్భకః ॥ (39)

క్రీడించు బాలునివలే విధాథ విసుగులేక .ఎడతెగకుండా, హర్ష విషాద
మోహముల గల్పించు వస్తువుల నిటనట సృజించుచున్నాడు.

చినోత్యుత్పాద త్యత్తి నిహంత్యాసృజతిక్రమాత్।
సతతం రాత్ర్య హనీవ నివర్తంతే నరం ప్రతి॥(40)

స్రష్ట - జీవులను సృష్టించి , రక్షించి భక్షించు చున్నాడు. హర్షవిషాద మోహముల .అహోరాత్రములవలే వారి ముందర త్రిప్పు చూన్నాడు.

ఆవిర్భవతి రో భావతిరో భావ భాగినో భవభాగినః।
జనస్య స్తిరతాం యాంతి నాపదో నచ సంపదః ॥(41)

సంసార - భాగస్వాములగు జనులు పుట్టుచు చచ్చుచుందురు. వారికి శాశ్వతమైన దేదియులేదు. వారి సంపదలు ఆపదలు కూడ అస్థిరములే.

కాలః క్రీడత్యయం ప్రాయః సర్వమాపది పాతయన్ ।
హేలా విచలితా శేష చతురాచార చంచురః॥ (42)

అవలీలగా చతురులగువారిని గూడ విచలితుల నొనర్పగల కాలము అందరినీ ఆపదల ముంచి క్రీడించుచున్నది.

సమవిషమవిపాకతో విభిన్నా స్త్రిభువన భూత పరంపరా ఫలౌఘాః।
సమయపవన పాతితాః పతంతి ప్రతిదిన మాత త సంసృతి ద్రుమేభ్యః॥(43)

ఇత్యార్షే వాసిష్ఠమహా రామాయణే వాల్మీకీయే వైరాగ్య ప్రకరణే
సర్వభావా ౽ విరత విపర్యా స ప్రతి పాదనం నామ అష్టవింశః సర్గః ॥28॥

ఈ సంసార వృక్షమను వ్రేలు -- త్రిలోక జీవులను ఫలములు. -' వీటిలో కొన్ని మిగుల పండినవి. కొన్ని దోర పండినవి. -- కాలమను వాయువు వలన నిరంతరం రాల్చ బడుచున్నవి.

ఇది శ్రీ వాసిష్ట తాత్పర్య ప్రకాశిక యందు వైరాగ్య ప్రకరణమున
"సర్వభావా విరత విపర్యా స ప్రతి పాదనమను అష్ట వింశ సర్గము .

⚘స్వస్తి⚘
*ఓం తత్ సత్*
🌺సర్వం శ్రీరామ చంద్రార్పణమస్త🌺

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు