నేటి కవిత (ఒక టే శోభా)
- Get link
- X
- Other Apps
ప్రాంజలి ప్రభ - నేటి కవిత
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఏమండి ఈరోజు ఏ కవిత వ్రాసారు
ఏది రాద్దామా అని ఆలోచిస్తున్న
తేట తెలుగులో విలోమ కవిత వ్రాయండి
అట్లాగే భావ కవిత వ్రాస్తాను
ఉన్నావు నాలోనా - ఉన్నావు జలజ
ఉన్నావు కోరుకో - ఉన్నావు కులుకు
ఉన్నావు నిక్కచ్చి - ఉన్నావు మహిమ
ఉన్నావు చురుకు - ఉన్నావు యద లో
ఉన్నావు కిటికి - ఉన్నావు గడప
ఉన్నావు కునుకు - ఉన్నావు నటన
ఉన్నావు శభరి - ఉన్నావు వినిత
ఉన్నావు వికటకవి - ఉన్నావు యన్మాత
--((*))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ (వంతు - తంతు _
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
పుష్పమా పరిమళాలను
అందించటం నీ వంతు
ఆస్వాదించి నలిపి వేయడం
ఈ మానవుల తంతు
వృక్షమా నీడను, శ్వాసను
అందించటం నీ వంతు
నీడ చేరి, స్వాస పీల్చి,
నరకటం మానవుల తంతు
మేఘమా గాలికి కదిలి
నీటిని కుర్పించటం నీ వంతు
అదృష్టం కొద్దీ నిన్ను మానవులు
గుర్తించట లేని తంతు
ఆదిత్యా అలుపే లేకుండ
వేడి వేలుగు నివ్వటం నీ వంతు
వేకువ లేచి నిన్ను ప్రార్ధించక
పోవటం మానవుల తంతు
చంద్రమా చీకటిలో వెన్నెలను
గాలితో కలసి వియ్యటం నీ వంతు
మాయా మత్తులో మునిగి నిన్ను
గమనించక పోవటం మానవుల తంతు
ప్రేమా నీ వెక్కడుంటావో తెలియదు
మానవులను ఆవహించటం నీ వంతు
వయసు మార్పిడే ప్రేమ అనుకోని
మోసపోవుట మానవుల తంతు
--((*))--
నేటికవిత
ప్రాంజలి ప్రభ
రచయిత:మల్లాప్రగడ రామకృష్ణ
నటన చూపకురా నంగనాచి
నమ్ముకున్న వాన్ని నట్టేట ముంచకురా
తింటే ఏడ్వకురా చుప్పనాతి
అర్ధాకలితో తరిమి తరిమి కొట్టకురా
నమ్ముకున్న వాన్ని నట్టేట ముంచకురా
తింటే ఏడ్వకురా చుప్పనాతి
అర్ధాకలితో తరిమి తరిమి కొట్టకురా
ఉండి లేదనకురా పిసినారి
కూడపెట్టింది కట్టకట్టుకొని పోలేవురా
చెప్పింది వినవేమిరా శోంబేరి
ఆంబోతులా తిరిగితే బతక లేవురా
కూడపెట్టింది కట్టకట్టుకొని పోలేవురా
చెప్పింది వినవేమిరా శోంబేరి
ఆంబోతులా తిరిగితే బతక లేవురా
స్త్రీ లను ఏడిపించకురా పోకిరి
స్త్రీ లకు చులకనై గుర్తింపే ఉండదురా
ఉన్నా లేదంటావురా బికారి
కాలాను గుణంగా కలసి బతకలేవురా
స్త్రీ లకు చులకనై గుర్తింపే ఉండదురా
ఉన్నా లేదంటావురా బికారి
కాలాను గుణంగా కలసి బతకలేవురా
చెమ్మచెక్క లాడకురా చెమత్కారి
ఉన్నది ఉన్నట్లు చేయుట నేర్చు కోవాలిరా
యవ్వనం సాస్వితం కాదురా వయ్యారి
బలముందని బలహీనులను లొంగదీయకురా
ఉన్నది ఉన్నట్లు చేయుట నేర్చు కోవాలిరా
యవ్వనం సాస్వితం కాదురా వయ్యారి
బలముందని బలహీనులను లొంగదీయకురా
కాలాన్ని జయించ లేవురా సవ్యసాచి
పగలు రాత్రి అదేపనిగా శ్రృంగారంతో ఆడకురా
సత్యం, ధర్మం, న్యాయం నీదేరా ధన్యజీవి
బ్రతికి బ్రతికించాలనీ ఓర్పే నీ ఆయుధ మవ్వాలిరా
పగలు రాత్రి అదేపనిగా శ్రృంగారంతో ఆడకురా
సత్యం, ధర్మం, న్యాయం నీదేరా ధన్యజీవి
బ్రతికి బ్రతికించాలనీ ఓర్పే నీ ఆయుధ మవ్వాలిరా
ప్రాంజలి ప్రభ
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
కంది పోయెను అధరాలు కబురు లేక
చిందు లాయెను మధురాలు పొంద లేక
బిందు వాయెను మమతల బోధ లేక
వంత పలికి తోడుగా సహకరించేవారు లేక
అందు కోసమే ఉన్నానని చెప్ప లేక
చెప్పి తప్పుకొనేవాడ్ని ఒప్పించేవారు లేక
సర్ది చెప్పుకొని నమ్మించేవారు లేక
నమ్మి వప్పుకొని తోడు ఉండేవారు లేక
పిలుపు వినగానే పలికే వారు లేక
తలపు తీర్చుకొనే మార్గమనేది లేక
వలపు పంచుకొనే అవకాశం లేక
మలుపు తిప్పె మదిని పంచేదారిలేక
చేస్తున్న పని తప్పో ఒప్పో చెప్పేవారు లేక
వయసు ఉరవడిని అదుపుచేసేవారు లేక
నిదిరించిన మేల్కొన్న తాపాన్ని తట్టుకోలేక
చెప్తున్నా ప్రేమ చిగురిస్తే ఫలం విషమిస్తే గరళం
- Get link
- X
- Other Apps
Comments
Post a Comment