నేటి కవిత
నేటి కవిత (పెక్కు - ఒక్క )
ప్రాంజలి ప్రభ
పెక్కు సుగుణము లున్నా
ఒక్క క్రోధము గుణాలను మ్రింగు
పెక్కు పుష్పాలు ఉన్నా
ఒక్క వేడికి పరిమళాలు మ్రింగు
పెక్కు మోక్కల్లో కాయలున్నా
ఒక్క తుఫాన్ తాకిడి తో మ్రింగు
పెక్కు వేషాలు వేసియున్నా
ఒక్క వేషమే హ్రృదయాన్ని మ్రింగు
పెక్క భావాలు తెలిపి యున్నా
ఒక్క భావమూ ఆకర్షించలేక మ్రింగు
పెక్కు స్త్రీలతో కలసి యున్నా
ఒక్క స్త్రీ ప్రేమ పొందు చాలని మ్రింగు
పెక్కు బోధలు వినుచున్నా
ఒక్క గురువు బోధ మనసు మ్రింగు
పెక్కు సుఖాలు అనుభవించుతున్నా
ఒక్క సుఖము మాత్రమే జీవితాన్ని మ్రింగు
పెక్కు సినమాలు నిర్మించి యున్నా
ఒక్క బహుమతి తెచ్చేచిత్రం ధనం మ్రింగు
పెక్కు మంత్రులు మారుస్తూయున్నా
ఒక్క ప్రభుత్వం మోసంతో ప్రజాధనం మ్రింగు
--((*))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పెల్లామున్న మొండి చెయ్యి
మాటలు పల్క లేని పసి దాన్నేమో
చేతలు చూప లేని కళ దాన్నేమో
ప్రేమను పంచ లేని కల దాన్నేమో
శాంతిని ఇవ్వ లేని నస దాన్నేమో
స్వరం విన లేని చెవిటి దాన్నేమో
మౌనం కన లేని అవిటి దాన్నేమో
పాశం మడి లేని నటన దాన్నేమో
వేషం ఒప లేని మరపు దాన్నేమో
జాన తనము లేని జవ్వని నేమో
మాట తనము లేని అమ్మడు నేమో
ఆడ తనము లేని మంధర నేమో
ఆశ అనుట లేని సుందరి నేమో
మతి ఉన్న వెర్రి దాన్ని అయ్యా నేమో
పతి ఉన్న మొండి దాన్ని అయ్యా నేమో
కళ ఉన్న ముంచె దాన్ని అయ్యా నేమో
జత ఉన్న లేని దాన్ని అయ్యా నేమో
అక్షరము రాని అజ్ఞాని అయ్యా నేమో
కారణము లేని విజ్ఞాని అయ్యా నేమో
ప్రేరణము లేని సుజ్ఞాని అయ్యా నేమో
జాతకము లేని వేదాంతి అయ్యా నేమో
మనసుని అర్ధం ఇవ్వ లేని అభాగిని నేమో
వయసుని అర్ధం చూప లేని సుహాసిని నేమో
విలువకు అర్ధం చెప్ప లేని సునామిని నేమో
మనిషికి ప్రేమ పంచ లేని మహోన్నతి నేమో
స్త్రీ భావాన్ని అర్ధం చేసుకోవటం
ఆ బ్రహ్మకు కూడా చేత కాదేమో
పురష బావాన్ని అర్ధం చేసు కున్నాక
ఏ స్త్రీ మొండి చెయ్యి చూప దేమో
స్త్రీలు మన్నించాలి భావ ప్రకంపనేమో
" రేపు " శుభం జరుగునని బొర్దుచూస్తున్నాను
--((*))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ (ప్రతిజ్ఞ )
రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ
కళల సాహిత్యం ఎందరకు
వంటపట్టునేమో ఎవరికి ఎరుక
ఒక్క కళ అభ్యసించుటకు
సహకరిస్తాను రమ్యముగా
స్త్రీ హృదయం ఎందరకు
అర్ధం అవుతుందో ఎవరికి ఎరుక
హృదయవీణ కదిలించుటకు
సహకరిస్తాను రమ్యముగా
భావ భావ భవ భందాలకు
విలువ ఇచ్చేవారు ఎవరికి ఎరుక
సత్యభావాలను నిలుపుటకు
సహకరిస్తాను రమ్యముగా
గగన మేఘ కదలికలకు
వాయువు సహకారం ఎవరికి ఎరుక
వర్షాన్ని సద్వినియోగ పరుచుటకు
సహకరిస్తాను రమ్యముగా
శిల్పి చెక్కే శిల్పాలకు
పూజ జారుగునో లేదో ఎవరికి ఎరుక
మంత్రాకర్ష శక్తి వచ్చుటకు
సహకరిస్తాను రమ్యముగా
అక్షరం చెప్పే గురువులకు
ఎంత గౌరవం ఉందో ఎవరికి ఎరుక
గురువే దైవమని తెల్పుటకు
సహకరిస్తాను రమ్యముగా
వయసు మార్పు కోర్కలకు
ఎవరు కళ్ళెంవేస్తారో ఎవరికి ఎరుక
ప్రేరణప్రేమ అని తెల్పుటకు
సహకరిస్తాను రమ్యముగా
మనసు మాయకు చిక్కకు
ఎవరేవ్వరికి చిక్కుతారో ఎవరికి ఎరుక
ఆకర్షన గుణాన్ని తెల్పుటకు
సహకరిస్తాను రమ్యముగా
క్షణ నిరీక్షణ జీవితమనకు
దేశ సేవే జీవితమని ఎవరికి ఎరుక
ప్రేమపొంది ప్రేమందించుటకు
సహకరిస్తాను రమ్యముగా
--((*))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మంద గమనం - మది తలపుల మౌనం
మంద హాసం - మౌన విరుపులు వైనం
మంద వైనం - వైన మెరుపుల గానం
మంద గానం - మది విలువల గమనం
మంద వైరం - మది కలతల కావ్యం
మంద కావ్యం - కావ్య పరుగుల జాడ్యం
మంద జాడ్యం - జాడ్య విషయమె వ్యయం
మంద వ్యయం - వ్యయ ఉరవడి వైరం
మంద జ్వరం - ఆశ బతకని రోగం
మంద రోగం - రోగ మవుటకు ద్వేషం
మంద ద్వేషం - ద్వేష మనుగడ భావం
మంద భావం - భావ అలికిడి జ్వరం
మంద ధైర్యం - మది కలియక ప్రేమమ్
మంద ప్రేమమ్ - ప్రేమ తడిపొడి ఋణం
మంద ఋణం - ఋణ మనసుకు గళం
మంద గళం - మాట కలసిన ధైర్యం
--((*))--
ఈ కవిత భావం మీకర్ధం ఆయినదో లేదో తెలపగలరు
(ఇది ఒక గొలుసు లింకు )
నేటి కవిత (ప్రేమ )
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో .......
మొగాడు నచ్చితే ప్రేమిస్తాడు
ఆడది నమ్మితే ప్రేమిస్తుంది
మొగవాని ప్రేమ అనంతము
ఆడదాని ప్రేమ బిడ్డకు సొంతము
ప్రేమంటే తీసుకోవటం కాదు
జీవితాంతము ప్రేమను పంచటమే
ప్రేమున్న హృదయంలో మరుపుండదు
ప్రేమ లేనివారికి నిద్ర అసలుండదు
పెళ్ళైన కొత్తలో జన్మజన్మల బంధం
కొన్నాళ్ళకు పిల్లల పోషణతో బంధం
మరికొన్నాళ్ళకు ఒకరికి ఒకరైన బంధం
ఇంకొన్నాళ్ళకు ఆరోగ్యం సహకరించని బంధం
కాలం నీదైతే తప్పు ఒప్పవుతుంది
కాలం నీదికాకపొతే ఒప్పు తప్పవుతుంది
ఒకరికి తొమ్మిది సంఖ్య అదృష్ట మవుతుంది
మరొకరికి ఉల్టా ఆరు సంఖ్య అదృష్ట మవుతుంది
కాల గమనం అర్ధం చేసుకో మంటుంది
ఘడియ వ్యర్ధం చేయక బ్రతకమంటుంది
ప్రేమించి ప్రేమను పొందటం నేర్చుకోమంది
ప్రేమగుణమే జీవితానికి పునాది అయినది
ఓ మనిషి తెలుసుకో
తెలుసుకొని మసలుకో
--((*))--
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
ఇది నిజమని నమ్మలే కున్నాను
అబధ్ధమని చెప్ప లేకున్నాను
ఉల్లాస ఉత్సాహ నటనతో
న్రృత్య హవ భావ ఆకర్షణతో
దర్శకుల కధ కల్పన పదాలతో
పల్కి హ్రుదయాన్ని శాంతపర్చిన
శ్రీ దేవి ఇక లేదంటే నమ్మలేకున్నాను
బాల్యం లో బాలనటిగా
యవ్వనంలో దేవతగా
మధ్యస్తంలో ఇల్లాలుగా
పిల్లలకు మంచి తల్లిగా
మమతానురాగ వల్లిగా
మనస్సును మెప్పించినా
శ్రీ దేవి ఇకలేదంటే
నమ్మ లేకున్నాను
కార్తీక దీపంలా వెలిగావు
ప్రేమను అభిషేకించావు
భార్యగా అనురాగం పంచావు
అనురాగ దేవత వైనావు
అనంత వాయువులో కలిశావు
ఇదినిజమని నమ్మలేకున్నాను
అబధ్ధమని చెప్ప లేకున్నాను
శ్రీ దేవి ఆత్మ సాంతించాలని
అంజలిఘటిస్తూ శ్రద్ధాంజలి
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ

కందరి నగవులు
సమయస్ఫూర్తిని చిరునామాలు
కొందరి భాష్యాలు
చేతకాని తనానికి చిరునామాలు
కొందరి కోపాలు
సంతోషానికి దుఃఖానికి వంతెనలు
కొందరి శాపాలు
పట్టుదలకు బంధానికి వంతెనలు
కొందరి ఆశలు
ఎగసిపడే సముద్రపుకెరటాలు
కొందరి కోరికలు
ఎడారిలో అగుపడే తుఫానులు
కొందరి బ్రతుకులు
ఎన్నటికీ తీరణి ఋణానికి సాక్షాలు
కొందరి గుర్తులు
హృదయవేదనల కోపానికి సాక్షాలు
కొందరి జ్ఞాపకాలు
గత వైభవ కష్టాల అనుభవ పాఠాలు ,
కొందరి మౌనాలు
నిరాశ నిస్పృహను తెలిపే పాఠాలు
--((*))--
Comments
Post a Comment