నేటి నా పాట- ఏ కమై పో వాలి

నేటి నా పాట
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

అందమైన లోకం అనుకోవాలి
కమ్మనైన ఊహలను పండించుకోవాలి
అందుకే మనమిద్దరం జతకావాలి
ఒకరికి ఒకరం ఏ కమై పో వాలి

అయితే నాప్రశ్నలకు సమాధానాలే నీ ప్రేమ 

నక్షత్రాలను పగలు ఎవరైనా చూడగలరా
నేను నీ కల్లలో చూడకలుగుతున్ననుగా
అంతోద్దు లే 

వెన్నలను పగలు ఎవరైనా చూడగలరా
నేను నీ నవ్వుల్లో చూడ కలుగుతున్ననుగా
అంతోద్దులే 

అందమైన లోకం అనుకోవాలి
కమ్మనైన ఊహలను పండించుకోవాలి
అందుకే మనమిద్దరం జతకావాలి
ఒకరికి ఒకరం ఏ కమై పో వాలి

జాబిల్లిని ఎవరైనా తీసుకు రాగలుగుతారా
నీ ముఖంలో జాబిల్లిని చూడగలుగుతున్నానుగా 
అంతోద్దులే 

ముద్ద మందార పువ్వును ఎవరైనా మరుస్తారా
పూజకు పనికొచ్చే పువ్వుగా నీ వున్నావుగా
అంతోద్దులే 

అందమైన లోకం అనుకోవాలి
కమ్మనైన ఊహలను పండించుకోవాలి
అందుకే మనమిద్దరం జతకావాలి
ఒకరికి ఒకరం ఏ కమై పో వాలి

రెండు పట్టాలను కలిపి, రైలు నెవరైనా నడుపుతారా
నీ శక్తి నా శక్తి తోడైతే పట్టాతో పనియేమి, హాయిగా విహరించగలముగా 
అంతోద్దు లే 

సర్వ అవలక్షణాలున్న వాడిని ఎవరైనా ప్రేమిస్తారా
నీ కోసం సర్వం మరిచాను,  నామాట కనుమా, వినుమా
అంతొద్దు మాత్రం అణకు మా..... 

నవ్వు తూ అంతా ముద్దు ఇక నీసొత్తు
అవునా అంతా ముద్దు ఇక నా సొంతమే

అలాగే ....   అలాగే.......
అందమైన లోకం అనుకోవాలి
కమ్మనైన ఊహలను పండించుకోవాలి
అందుకే మనమిద్దరం జతకావాలి
ఒకరికి ఒకరం ఏకమై పోవాలి

--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు