(కలియుగ మాయ )

నేటి కవిత
ప్రాంజలి ప్రభ (కలియుగ మాయ )
రచయత: మల్లాపగడ శ్రీ దేవి రామకృష్ణ
సొమ్ములు లేని విటున్ని
వేశ్య దరి చేర నీయ్యదు
అధికారం లేని నాయకున్ని
ప్రజలు దరి చేర నియ్యరు
ధనం పోగొట్టుకున్న ధనికుడ్ని
లబ్ధి పొందిన దరి చేరనివ్వరు
ఎండి ఆకులు రాలిన వృక్షాన్ని
పక్షులు కూడ దరికి రావు
కష్టంలో దానం పొందిన అతిధి
వుద్ధిలోకి వచ్చాక మరిచే వాడు
అనురాగంతో పెంచుతుంది అమ్మ
బిడ్డ వయసు పెరిగాక మరిచేవాడు
అడిగిన వెంటనే డబ్బు ఇచ్చేవాడు నాన్న
బిడ్డను ఎందుకురా అంటే మరిచేవాడు
ఉద్యోగం కోసం చదివాడు చదువు
ఉపాధి పొందలేదని తిట్టే మానవుడు
అవసరంకోసం ప్రేమిస్తాడు స్నేహితుడ్ని
అవసరానికి ఆదుకోడని తెట్టెవాడు మానవుడు
కోరికలు తీర్చుకోటానికి చేసుకుంటాడు పెళ్లి
సర్వం అర్పించిన ఏదోలోపం అనే మానవుడు
అవసరాన్ని బట్టి ప్రేమించటం నేర్చుకున్నా
అవసరం తీరాక వదిలించుకోవటం నేర్చుకున్నా
కలియుగ కాలం మాటలతో బ్రతుకుతున్నా
ఏ ఎండకు ఆ గొడుగే పట్టడం నేర్చుకున్నా
--((*))--
Comments
Post a Comment