(కష్టమే )


నేటి కవిత  
ప్రాంజలి ప్రభ (కష్టమే )
రచయాత: మల్లపగా రామకృష్ణ 
  
మాటపై నిలబడుట కష్టమే 
విశ్వాసము చూపుట ఇంకా  కష్టమే
సత్యం పలికి బతుకుట కష్టమే 
సత్యాసత్యాల మధ్య మెలగటం ఇంకా కష్టమే

ధర్మాన్ని అర్ధం చేసుకోవటం కష్ట్డమే 
ధర్మంగా నడుచుకోవడం ఇంకా కష్టమే 
న్యాయాన్ని బతికించటం కష్టమే 
నమ్మి నడుచు కోవడం ఇంకా కష్టమే 

వేడికి మంచు కరుగాకుండా ఉండుట కష్టమే 
వేడికి నేయి ఆవిరికాకుండా ఉంచుట ఇంకా కష్టమే 
నదులు సముద్రాన్ని కలవకుండా ఆపుట కష్టమే 
ఎడారిలో తుఫాన్లు రాకుండా ఆపుతా ఇంకా కష్టమే

పుట్టిన జీవి పృధ్విలో బతికి ఉండుట కష్టమే 
గిట్టినా జివి ప్రుద్విలో కలవక ఉండుట ఇంకా కష్టమే 
వయసు మార్పులు ఆపుట ఎవ్వరికైనా కష్టమే
వయసు కోర్కలు తీర్చుకోవాలనుకోవటాం ఇంకా కష్టమే  

నీడను బట్టి వయసును గుర్తించటం కష్టమే
చెప్పులబట్టి ఆడా మొగో తెలుపుట ఇంకా కష్టమే 
మాటను బట్టి గుణాన్ని గుర్తించటం కష్టమే 
ధనాన్ని బట్టి మంచిని గుర్తించటం ఇంకా కష్టమే   

పురుషులందరూ మంచివారే ననుట కష్టమే
స్త్రీ లందరు పతివ్రతలు అనుట ఇంకా కష్టమే  
యవ్వన వంతులు బుద్ధిమంతులనుట కష్టమే
చదివినవారందరు విద్యాధికులనుట ఇంకా కష్టమే  

మనువాడిన మనస్సు అర్ధం చేసుకోవడం కష్టమే 
మనసు కల్సి మాట పెరగక ఉండుట ఇంకా కష్టమే 
వయస్సులో వచ్చే మర్మాన్ని గుర్తించడం కష్టమే 
మనోవ్యాధిని అర్ధం చేసుకొని బతికించటం ఇంకా కష్టమే  

కాల చక్రాన్ని, కాలాన్ని ఎదిరించి ఉండుట కష్టమే 
ప్రేమ వలయాన్ని జయించి ఉండుట ఇంకా కష్టమే  
గురువులను, పెద్దలను, విడిచి ఉండుట కష్టమే 
పెళ్ళాన్ని పిల్లలను విడిచి ఉండుస్థ ఇంకా కష్టమే 

ఆరిపోని వెలుగు, ఆగిపోని పరుగు లేదనుట కష్టమే
పిల్లలు కనుట తేలికే, బుద్ధులుమర్చటం ఇంకా కష్టమే 
తాపము వయస్సును వెంబడించిన చెప్పుట  కష్టమే  
ఎవ్వరినైన మన్మధుడు ప్రవేశిస్తే నిద్రపోవటం ఇంకా కష్టమే  

--((*))--

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు