Shreeman Narayan Narayan Hari Hari

నేటి కవిత 
ప్రాంజలి ప్రభ  
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

ఎంత భాధ ఉన్న ముఖంలో చూపక 
నవ్వి నవ్వించటం నేర్చుకో 
ప్రమాదాలు ఎదురైనా అధైర్య పడక 
ప్రశాంతత కల్పించటం నేర్చుకో 

పోరాటానికి వెనకడుగు వేయక 
జయించే వరకు సహనం నేర్చుకో 
శత్రువుని చూసి భయపడక 
స్థిమితముగా పోరాడటం నేర్చుకో  

చావును చూసి భయపడక 
బ్రతికి బ్రతికించటం నేర్చుకో 
మనసు గెల్వటం సాధ్యం కాక
పోయిన ప్రేమపంచటం  నేర్చుకో  

వయసు కోర్కెలకు వెంటపడక 
ఆరోగ్యాన్ని రక్షించటం నేర్చుకో 
ఒప్పు, తప్ప ఆని వాదించక   
ధర్మాన్ని బ్రతికించటం నేర్చుకో 

స్త్రీల నుండి అతిగా ఆశించక 
బంధాన్ని నిలబెట్టడం నేర్చుకో 
స్త్రీలను తక్కువచేసి మాట్లాడక 
ప్రవర్తనను గౌరవించటం నేర్చుకో 

ఏ స్థితిలో నిరుత్సాహ పడక 
కాలాన్ని బట్టి జీవించటం నేర్చుకో 
దైవాన్ని ప్రార్ధించటం మానక 
తల్లి, తండ్రులకు సేవ చేయటం నేర్చుకో

నేర్చుకున్నది కొంత - నేర్చుకోవాల్సినది అనంతం  
(నేడు అనంతపురం నుండి వ్రాసిన కవిత )


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు