నేటి కవిత - మాతృ దినోత్సవము

నేటి కవిత - మాతృ దినోత్సవము
ప్రాంజలి ప్ద్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

అమ్మ చూపుతుంది  దిక్కు
అమ్మ నేర్పుతుంది వాక్కు
అమ్మ ప్రేమకుంటుంది హక్కు
అమ్మ సర్వం నేర్పే బుక్కు

అమ్మ మనస్సు  ఘంధం
అమ్మ యశస్సు సుఘంధం
అమ్మ వయస్సు గ్ద్రంధం
అమ్మ తపస్సు  నిర్మళం

అమ్మ సహనం ప్రణయరాశి
అమ్మ  ధైర్యం  జీవరాశి
అమ్మ మాట ఆనందరాశి
అమ్మ తీర్పు సంసార రాశి

అమ్మ పిలుపు నాకు మేలుకొలుపు
అమ్మ అరుపు  నాకు మారోమలుపు
అమ్మ తెలివి నాకు  తెచ్చె కొలువు
అమ్మ తోడు నా జీవితానికి మెరుపు

అమ్మ స్పర్సలో కల్గు వాస్చల్యం
అమ్మ చూపులో కల్గు  ఆప్యాయం
అమ్మ తలపుల్లో కల్గు నైర్మల్యం 
అమ్మ పిలుపుల్లో కల్గు ప్రశాంతం

--((*))--

నేటి కవిత - జీవన జ్యోతి
ప్రాంజలి ప్ద్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

ఏ నాడు ఈ నాడు  మారదురా
ఏ మాట  ఈ మాట  తప్పదురా
ఏ తప్పు ఈ తప్పు  చెప్పుదురా 
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ అసత్యం ఏనాడు ఒప్పదురా
ఏ అన్యాయం ఏనాడు చేయదురా
ఏ అధర్మం  ఏనాడు తల్వదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ పాపం తెల్సి చేయదురా
ఏ శాపం తెల్సి పెట్టదురా
ఏ కోపం తెల్సి తిట్టదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ లక్ష్యం లేకుండా ఉండదురా
ఏ గమ్యం చూపకుండా ఉండదురా
ఏ సాక్ష్యం లేకుండా  అర్వదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా

ఏ మార్పు తేకుండా ఉండదురా
ఏ నేర్పు  చూపకుండా ఉండదురా
ఏ తీర్పు చెప్పకుండా  ఉండదురా
అది ఒక్కటి అమ్మ ప్రేమ ఏరా



 --((*))--

 గజల్ 2187.
గుండెగూటి దివ్వెమాట..మంత్రంలా ఉంది కదా..!
చెలిమిపూల వానపాట..వేదంలా ఉంది కదా..!
తరుముతున్న అలజడేదొ..మాటలకే అందదుగా..
పెదవిచాటు మౌనమేమొ..దీపంలా ఉంది కదా..!
ఆనందపు నిధులెన్నో..ఆ మువ్వల సవ్వడింట..
ఆగి వింటె పలకరింపు..శాస్త్రంలా ఉంది కదా..!
ప్రేమకెంత బలముందో..గాలికెలా తెలియగలదు..
పరవశాల మధువుపంచు..గీతంలా ఉంది కదా..!
చిరునవ్వుల వెన్నెలింటి..సోయగాల మోమేదో..
లోన ఉండి కానరాని..అద్దంలా ఉంది కదా..!
నాది-నేను వింతగొడవ..గొడుగేగా మాధవుడా..
ఏమైనా నీ గజలే..అమృతంలా ఉంది కదా..!

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు