నేటి ప్రాంజలి ప్రభ - సాహితీమిత్రులారా!

సాహితీమిత్రులారా!

కవితావినోదము (మొదటి సంపుటి)లో
విద్వాన్ కావ్యతీర్థ మద్దుపల్లి వేంకటసుబ్రమణ్యశాస్త్రిగారు
ఈ విధంగా రాసి ఉన్నారు.
1925నుండి 1934 వరకు నంద్యాల మునిసిపల్ హైస్కూల్ నందు ఉండేవారు. తరువాత కర్నూల్, సెంటుజోసఫ్స్ గరల్స్ హైస్కూలులో
చేరినపుడు వారికి ఈ విధమైన ఆలోచన వచ్చిందట.
ఇప్పుడు ఈ పాఠశాలలో ఉద్యోగం దొరకుటకు కారణమేమి?
అని ఆలోచించగా
ఈ విధమైన శ్లోకం వచ్చిందట.
27-02-1960లో రాయబడింది.

రూపేణ వేణ్యా నను రోమరాజ్యా
నాగాంగంనా ఏవ హి బాలికా స్స్యు:
విద్యాలయే తాభి రభూ దత స్సు
బ్రహ్మణ్యనామ్నో మమ సాన్నిహిత్యమ్!

(ఇక్కడ చదువుకునే బాలికలందరు
రూపముచేతను, జడలచేతను, నూఁగారుచేతను
నాగాంగనలే అవుతారు. రూపంలో నాగకన్యలను పోలినవారు.
జడలు, నూగారు(నాగ = ) సర్పములవలె ఉన్నవి.
నేను సుబ్రమణ్యుడను. సుబ్రమణ్యస్వామి సర్పస్వరూపుడు కదా! )

కనుకనే మాకు మాకింత సన్నిహిత సంబంధం ఏర్పడినది.
-------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

రావణుని మానసిక అవస్థ
సాహితీమిత్రులారా!
ప్రవరసేనుని సేతుబంధము పదకొండవ ఆశ్వాసములో సీతకు రావణుడు రామచంద్రుని మాయాశిరమును చూపుటను, దానిని చూసి సీత ఉద్వేగముతో మూర్ఛపోయి, అటుపై అనేకవిధములుగా విలపించటము, త్రిజట యనే రక్కసి సీతను ఊరడించి, ధైర్యము చెప్పుట చిత్రింపబడినాయి. ఈ ఆశ్వాసమున మొదటి ముప్పై అయిదు శ్లోకములలో రావణుని తీవ్ర ఉన్మత్తావస్థను కవి మహానైపుణ్యముతో చిత్రించినాడు. రాముడు కపిసేనతో కూడి యుద్ధమునకై లంకకు ఏతెంచిన వార్త విని రాక్షసరాజుకు నిద్రపట్టుట లేదు. సీతమీది మోహము వేధించుచున్నది.
తం పులఇఅమ్మి పేచ్ఛఇ ఉల్లవన్తో అ తీఅ గేహ్ణఇ గోత్తమ్|
ఠాఇ అ తస్స సమఅణే అణ్ణమ్మి వి చిన్తిఅమ్మి స చ్చిఅ హిఅఎ||
ఛాయ:
తాం ప్రలోకితే పశ్యత్యుల్లపంశ్చ తస్యా గృహ్ణాతి గోత్రమ్|
తిష్టతి చ తస్య సమదనేऽన్యస్మిన్నపి చిన్తితే సైవ హృదయే||
చూచిన ప్రతి చోటా సీతముఖమే కనిపిస్తోంది. మాటాడిన ప్రతి మాటలోనూ ఆమె నామము దొరలుతూంది. ఆమెను మర్చిపోవటానికి ప్రయత్నము చేసే కొద్దీ, ఆమెయే హృదయంలో నిలుస్తోంది.
ఈ ఘట్టములో దశకంఠుని అవస్థ మయసభలో పరాభవం చెందిన కురురాజు దుర్యోధనుని మనఃస్థితిని కొంత ప్రతిబింబిస్తుంది. ఆ యవస్థను నివారించటానికి దశవదనుని పత్నులు విఫలప్రయత్నము చేస్తారు. ఈ దురవస్థను అతను సైపలేక చివరకు ఈ విధముగా చింతించినాడు: జనులు తమ ఆశలు శిథిలమయినప్పుడు, తమకు రక్షణ కరవైనపుడు, మిత్రులు దొరకనపుడు భయము చేత లజ్జను విడనాడి తమ నియమముల నతిక్రమింతురు.
ఈ విధముగా క్రూరముగా ఆలోచించి, రాక్షసరాజు భటులకు రాముని ఖండిత మాయాశిరమును తయారు చేయమని ఆజ్ఞనిచ్చినాడు. ఆ శిరమును జూపి భీతావహురాలైన సీతను స్వాధీనము గావించుకొనవలెనన్న కర్కశమైన కాంక్ష యతనిది. దశవదనములతో దనుజరాజు భటులకు యాజ్ఞనిచ్చునప్పుడు రావణుని (అవస్థ) వర్ణన ఇది. ఉన్మత్తతకు పరాకాష్ట.
అణ్ణేణ సమారద్ధం వఅణం అణ్ణేణ హరిసగహి అప్ఫిడిఅమ్|
అణ్ణేణ అద్ధభణిఅం ముహేణ అణ్ణేణ సే కఇ వి ణిమ్మవిఅమ్||
ఛాయ:
అన్యేన సమారబ్ధం వచనం అన్యేన హర్షగృహీతస్ఫేటితమ్|
అన్యేనార్ధభణితం ముఖేన అన్యేనాస్య కథమపి నిర్మాపితమ్||
మొదటి ముఖముతో వచనమునారంభించినాడు. ఇంకొక ముఖము రాక్షసానందముతో ఆ మాటలనందుకొనినాడు. ఆపై మాటలు రాక మరొక ముఖముతో మాటలాడినాడు. చివరన యెటులో మరొక ముఖముతో ఆజ్ఞను ముగించినాడు.
రావణాసురుని మనమునందున్న తీవ్రమైన అరిషడ్వర్గవిన్యాసము ముప్పది ఐదు శ్లోకములలో చిత్రింపబడి, పై శ్లోకమందు శిఖరాగ్రము నందుకొనినది.
సేతుబంధకారుని సీతాదేవి అసహాయ. అయినప్పటికీ ధీర. పరమ ముగ్ధ కాదు. ఆమె మాటలలో రాచకన్య యొక్క ధీరత్వము, ప్రతీకారేచ్ఛ కానవస్తుంది. సీతయందు ప్రవరసేనుడు నిలిపిన ధీరత్త్వము ’కుందమాల’ అను దృశ్య కావ్యమున తిరిగి కానవచ్చును. జానకిని ఊరడించుట త్రిజట వంతయ్యింది. సేతుబంధకవి రాముడు సాక్షాత్తు నారాయణుడు. ఈ విషయమును త్రిజట ముఖమున కవి చెప్పించినాడు. చివరకు వానరుల యుద్ధసంరంభమును, భేరీ నినాదములను విని సీత ఊరడిల్లును.
ఈ ఆశ్వాసము నందు సేతుబంధకారుడు సీతయొక్క పాత్రచిత్రణమునూ, రావణుని ఉన్మత్త మానసిక అవస్థను అపూర్వముగా చిత్రించినాడు. పూర్వఘట్టములందు సుగ్రీవుని పాత్రచిత్రణమును, నాయకత్త్వప్రతిభను గురించిన ప్రస్తావన ఇదివరకు ఉటంకింపబడినది.
యుద్ధము మొదలైనది. వానరయోధుని బలమును, పరాక్రమమును కవి చిత్రించుచున్నాడు.
కఇవచ్ఛత్థలపరిణఅణిఅఅముహత్థమిఅదన్తిదన్తప్ఫలిహమ్|
ణిహఅ భడ మహిఅ ణివడిఅ సురవహుచల వలఅ ముహలపవ అవఇవగమ్||
ఛాయ:
కపివక్షఃస్థలపరిణత నిజముఖాస్తమిత దన్తిదన్తపరిఘమ్|
నిహత భట మహిత నిపతిత సురవధూచల వలయ ముఖరప్లవగ గతిపథమ్||
అసురసైన్యమందలి యుద్ధగజమొక్కటి ఒకానొక వానరయోధుని పాషాణసదృశమైన వక్షఃస్థలమును తన కొమ్ములతో కుమ్మింది. ఆ అదటుకు వానరశ్రేష్టునికి యేమీ నొప్పి కలుగలేదు కానీ, గజము యొక్క దంతము మాత్రము వెనుకకు వంగి దానిముఖములోనికే చొచ్చినది. ఇక్కడ వానరయూధుల దేహదారుఢ్యము వ్యంజితము. నిహతులైన వానరయోధుల కొనిపోవుటకు వచ్చిన స్వర్గలోకవాసులైన అప్సరల నూపురనాదములతో యుద్ధపథమతిశయించినది.
-----------------------------------------------------------
ప్రాకృతకవనము: సేతు బంధ కావ్యము - అనే వ్యాసం నుండి
దీని రచయిత రవి. ఈ మాట- జనవరి 2016
---------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

సరిగమల - పద్యం
సాహితీమిత్రులారా!
ఒకమారు పీఠాపురం రాజావారి దివాణంలో ప్రభు సమక్షంలో
తుమురాడ సంగమేశ్వరశాస్త్రిగారి వీణకచ్చేరి జరిగింది. వచ్చిన శ్రోతల్లో
పానుగంటివారు ఒకరట. వీణాగానం తర్వాత సంగమేశ్వర శాస్త్రిగారిని
అభినందస్తున్న మహారాజును ప్రశంసిస్తూ పానుగంటివారు చెప్పిన పద్యం ఇది.
స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు నాశ్రితు నెవ్వాని నాదరింతు
వాదాయమున నెంత యర్థుల కిచ్చెద వెదెటు చేసిన భృత్యు నెదగణింతు
నవని పాలన నేది యార్జించినాఁడవు కవితగానంబు నేపగిది విందు
వెట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటి వాత్మ సంస్తుతుల కేమందు వయ్య
సరిగ, ధని, సగమ పనిని సరిగ, గరిమ
మరిమరిగ, పాపనినిగని, సరిసర్ యను
వీణకాని "మా" వెన్క "నీ" వీణ వరుస
మీఁద "నీ" వెన్క "మా" సూర్యమేదినీశ
సీసపద్యంలోని ఎనిమిది ప్రశ్నలకు ఎత్తుగీతిలో వీణా స్వరవిన్యాసంతో జవాబులిచ్చారు.
1.ప్ర- స్వజనుల నేరీతిఁబరిపాలన మొనర్తు - సరిగ
2.ప్ర- నాశ్రితునెవ్వాని నాచరింతువు - ధని
3.ప్ర- ఆదాయమున నెంత యర్థుల కిచ్చెదవు - సగమ
4.ప్ర- ఎదెటు చేసిన భృత్యు నెదగణింతువా - పనిని సరిగ
5.ప్ర- అవని పాలన నేది యార్జించినాఁడవు - గరిమ
6.ప్ర- కవితగానంబు నేపగిది విందువు - మరిమరిగ
7.ప్ర- ఎట్లుగాఁబృథు సౌఖ్య మీక్షింపఁగా నుంటివి - పాపనినిగని
8.ప్ర- ఆత్మ సంస్తుతులకేమందు వయ్య - సరిసరి
అని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి.
ఇంకా చమత్కార మేమంటే "ఓ మహారాజా! ఈ వీణ వరుసమీద ఆరోహణావరోహణ క్రమంలో "మా వెన్కనీ" అంటున్నది. కాని "నీ వెన్క" "మా" అన్నది ఉంటుంది. "మా" అంటే లక్ష్మి. నీ వెనుక లక్ష్మిగాని, లక్ష్మి వెనుక నీవు ఉండవు అని భావం.
---------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు


ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
సాహితీమిత్రులారా!
ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
అనే పేరున ఒక వ్యాసం డా. ఏల్చూరి మురళీధరరావుగారు
ఈ మాట అంతర్జాల మాసపత్రికలో వ్రాసియున్నారు
అందుండి ఈ పద్యాన్ని ఇక్కడ వారి వివరణను
యథాతథంగా ఉంచుతున్నాను ఆస్వాదించండి-
వేయేండ్లుగా వెలసి విలసిల్లుతున్న ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం ఏది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటం సులభమేమీ కాదు. వేలకొద్దీ వెలసిన కావ్యాలలో అప్రతీతపదప్రయోగం వల్ల, అన్వయక్లేశం మూలాన, భావప్రౌఢి కారణవశాన అర్థనిర్ణయం దుష్కరమైన పద్యాలెన్నో ఉన్నాయి. ఇప్పుడా అలవాటు లేదు కాని, ఒకప్పుడైతే విద్యాగోష్ఠులలో —
కమలాకరకమలాకర
కమలాకర కమల కమల కమలాకరమై
కమలాకర కమలాకర
కమలాకరమైన కొలను గని రా సుదతుల్.
— వంటి పద్యాలనిచ్చి అర్థతాత్పర్యాలు చెప్పమనటం పరీక్షకులకూ, పరీక్ష్యులకూ ఒక కేళీవినోదంకరణగా ఉండేదట. మాడుగుల సంస్థానానికి వెళ్ళినపుడు అల్లమరాజు సుబ్రహ్మణ్యకవిగారిని ఈ పద్యానికి అర్థం చెప్పమని అడిగారట. తెనాలి రామకృష్ణకవి కందర్పకేతువిలాసములోని శబ్దచిత్రం ఇది.
ఆ సుదతుల్ – అందమైన పలువరుసతో అలరారుతున్న ఆ సుందరాంగులు; కమలా = లక్ష్మీదేవియొక్క, కరకమల = పద్మము వంటి చేయి, ఆకర = ఉనికిపట్టుగా కలిగిన, కమల = తామరపూవునకు, ఆకర = జన్మస్థానమై, కమల కమల కమలాకరమై – కమల = బెగ్గురు పక్షులకు, కమల = పరిశుద్ధజలములకు, కమల + అ = పద్మములయొక్క సమూహమునకు, ఆకరమై = నివేశనమైనది; కమలాకర – క = మన్మథునియొక్క, మ = సమ్మోహనకరమగు, లా = వశీకరణశక్తిని, కర = కూర్చునదై, కమలాకర – కమలా = పద్మినీజాతి స్త్రీలకు, క = శరీరములందు, ర = కామాగ్నిని ఉద్దీపింపజేయునదై, కమలాకరము + ఐన = సర్వసంపత్ప్రదమైన, కొలనున్ = సరోవరమును, కనిరి = నేత్రపర్వముగా వీక్షించిరి – అని అన్వయించుకోవాలి. సుబ్రహ్మణ్యకవిగారు ప్రవచించిన సంప్రదాయార్థం లభింపనందువల్ల నేను ఉన్నంతలో పద్యాన్ని మేనమామ పోలికగా అన్వయించాను.
అల్లంరాజు సుబ్రహ్మణ్యంగారి వివరణకంటే ఇందే బాగుందని
నా అభిప్రాయం ఎందుకంటే అది నేను ఒకసారి చూసి
ఉన్నాను. అందుకే ఇది ఇక్కడ ఉంచడం జరిగింది.
--------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

.వి.రమణరాజు
శ్రీనివాసమూర్తి గంజాం
23-5-18



స్వాగతం .. " కాలం మరణించింది " ఏడవ భాగం .
పెళ్ళయి చంటిబిడ్డ వున్న అందమైన యువతికి ఒక సమస్య వస్తుంది. వ్రోన్స్కీ అనే ఓ యువ మిలిటరీ అధికారి ఆమె సౌందర్యాన్ని చూసి పిచ్చివాడవుతాడు. మొదట్లో అతడి చూపులను మాటలను అసహ్యించు కుంటుందామె. ఆ తర్వాత వెంటబడి ఆమె ' లేకపోతే బతకలేనం'టాడు. 'ప్రాణం పోయినా !సరే నీతోనే నా బ్రతుకు' అంటాడు. మొదట్లో కోపగించుకున్న ఆ ఇల్లాలు అతడి మాటలకు చేష్టలకు లొంగిపోయి అతడి మనసులో బందీ అయిపోతుంది.

అయితే చాటుమాటు వ్యవహారాన్ని ఒప్పుకోక, పెద్ద మిలిటరీ అధికారి అయిన భర్త దగ్గరికి వచ్చి ఈ విధంగా పరిష్కరించుకుంటుంది.

''ఈ విడాకుల మీద సంతకం పెట్ట౦డి !'' -

గదిలో కూర్చుని రాసుకుంటున్న భర్త ఆమెను చూసి విడాకుల పత్రం చదివి ఆశ్చర్యపోతాడు. అతడా విషయాన్ని కలలో కూడా వూహించడు.

''ఎందుకు విడాకులు కోరుకుంటున్నావు?'' అడుగుతాడు.

''నేనింకొకడిని ప్రేమించాను'' అంటుంది.

''అయితే విడాకులెందుకు? నీ ప్రేమకు నేను అడ్డురాను గదా''

''నాకీ మలిన శృంగారం అసహ్యం. నచ్చినవాడితోనే నా జీవితాన్ని పంచుకో దలిచాను'' అంటుంది.

అదే ఓ సగటు మనిషి అయితే ఎదురుగా వున్న భార్యను ఆ మాట అన్నందుకు కత్తి తీసుకొని నిర్ధాక్షిణ్యంగా నరికేసేవాడు. కనీసం ఓ చెంపదెబ్బ వేసి ఓ వేయి బూతులు తిట్టి వుండేవాడు. కానీ మిలటరీ అధికారి అయివుండి కూడా అతడలా చెయ్యలేదు. చివరికి ''నీ సంతోషం కోసం నేను విడాకుల పత్రం మీద సంతకం పెడుతున్నాను'' అంటాడు.

ఆ భర్త పేరు 'కరెనినా'

ఆ భార్య పేరు 'అన్నా'

ఆ నవల పేరు 'అన్నా కరెనినా'

ఆ రచయిత లియో టాల్‌స్టాయి.

మనంకూడా ఎప్పుడన్నా పేపర్లలో చూస్తుంటాము. అమ్మాయికి అబ్బాయికి పెళ్ళవుతుంది. అమ్మాయి ముభావంగా వుంటే అబ్బాయికి విషయం అర్ధమవుతుంది. 'తన భార్య ఇంతకు ముందు ఎవడినో ప్రేమించింది. విధిలేని పరిస్థితుల్లో తనను పెళ్ళిచేసుకుంది '. అబ్బాయి ఎంతో గొప్ప మనసుతో అసలు విషయం గ్రహించి ఆమె ప్రేమించిన వాడితో పెళ్ళి చేస్తాడు. అతడిదెంత సంస్కారమో గమనించండి. అతడి ఆ గొప్ప భావన జీవితమంతా అతడిని విజేతగానే చూస్తుంది. ఆ ఉదాత్త హృదయంతో అతడు జీవితమంతా గర్వంగా బ్రతికేస్తాడు.
''అవును! నేను సోదరుడిలా భావించే తోటి రచయితతో నా మొగుడు నాకు రంకు అంట గట్టాడు'' ప్రఖ్యాత తమిళ రచయిత్రి కన్నీరు పెట్టుకుని తన స్నేహితురాలితో చెప్పింది.

''ఎందుకే? " అడిగింది స్నేహితురాలు ఆందోళనగా.

'' 'సంబంధం లేకపోతే అతడి దగ్గర డబ్బు వసూలు చెయ్యి' అన్నాడు'' అంది.

''అదేంటి? ఎందుకు?''

''ఇద్దరం కల్సి ఓ సినిమాకు కథ, మాటలు అందించాం. ఆ నిర్మాత డబ్బు ఎగ్గొట్టాడు. కోర్టులో కేసు వేసి గెలిస్తే మొత్తం అంతా తిరిగి వచ్చింది. 'నీకష్టం మీదనే వచ్చింది గదా! అతడికెందుకు భాగం ఇవ్వాల?' అంటాడు.
'అన్యాయం గాదా!' అన్నాను. చెంప పగిలింది.

'ఎప్పటి నుండీ సాగుతోంది రంకు?' అన్నాడు''.

ఆ సంఘటనను ప్రత్యక్షంగా విన్న ప్రఖ్యాత తమిళ రచయిత అఖిలన్‌ ఓ గొప్ప నవల రాశాడు ''చిత్తిరప్పావై'' (చిత్రసుందరి). ''పావైవిలక్కు'' కూడా ఆయన రాసిందే. అనురాగాను బంధాలున్నచోట అనుమానం అసూయ ద్వేషాలుండడం కూడా సహజమే.

1990 దశకంలో సినీ నటి, నర్తకి ''సిల్క్‌స్మిత'' ఆత్మహత్య వెనుక ఆమె భర్త సాధింపులు వేధింపులు.
ఈ సమస్య నుండి చాలామంది బయటకు రాలేక బలైపోయారు.

ఓ ప్రఖ్యాత రచయిత్రి ఆత్మ హత్య నుండి రక్షింప బడిన తర్వాత చెప్పింది చదవండి .

''అవును నిజమే ! అప్పుడు నాకు ప్రపంచమంతా చీకటిగానే అన్పించింది. ఇరవై రెండేండ్ల వయస్సులో ప్రేమించి పెళ్ళి చేసుకున్న మొగుడు రెండేండ్లు తిరగకముందే అకాలంగా మరణిస్తే, ఇల్లు వదలి ప్రియుడితో బయటకు వచ్చిన ఆడదానికి చీకటిగాక వెలుగెక్కడ నుండి వస్తుంది?'' 2000 సంవత్సరం 36వ జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత అస్సామీ రచయిత్రి ఇందిరా గోస్వామి తన గతాన్ని నెమరువేసుకుంటూ అన్నమాటలివి.

భర్త చనిపోయిన దుఃఖంలో దిక్కు తెలియక ఆత్మహత్యే శరణ్యమని మరణపు అంచులదాక వెళ్ళి తిరిగి వచ్చిందామె. ఆ తరువాతనే జ్ఞానోదయమై తనెంత పొరపాటు చెయ్యబోయానోనని గ్రహించి ఆత్మకథతో బాటు అనేక నవలలు, కథలు రాసి ప్రసిద్ధ రచయిత్రి అయింది. ఆమె ఆత్మకథ ''ఆదాలిఖా దస్తావేజ్‌'' (సగం రాసిన దస్తావేజ్‌), ''జిందగీ కోయీ సౌదానహీ'' (జీవితం వ్యాపారం కాదు), ''నీల్‌కంఠీబ్రోజ్‌'' (వితంతువుల మీద) ఆమె రాసినవే.

ఆత్మహత్య అనే ఆలోచనతోనే ఆ జబ్బు ప్రారంభమవుతుంది. బలహీన మనస్కులు, నిరాశాపరులు, అజ్ఞానులు, అంతర్లోకాల్లో విహరించేవాళ్ళు, సిగ్గరులు, ఇతరులతో సమస్య మాట్లాడితే అవమానంగా భావించే అహంకారులు, ఈ రోగానికి బలై అందమయిన, అద్భుతమైన జీవితాలను ఛిద్రం చేసుకొని అంతమైపోతుంటారు. ఇంతని చెప్పలేని ఎంతో విలువైన జీవితాన్ని మధ్యలో స్మశానానికి అంకితమిస్తున్నారు. దీనికి జవాబు ఎవరు చెప్పగలరు? పరిష్కారం కోసం ఆలోచించకుండా చావాలనే నిర్ణయించుకుంటారు .
''చనిపోయిన నా భర్తను నేను తిరిగి కలుసు కోవాలని వుంది ?'' చాలా సంవత్సరాలుగా చనిపోయిన భర్త జ్ఞాపకాలతో జీవిస్తూ అతడిని మరచిపోలేక, ఇతర వ్యాపకాల మీద మనస్సు పోక చిక్కి శల్యమైన బక్కపలుచని స్త్రీ జిడ్డు క్రిష్ణమూర్తిని వేసిన ప్రశ్న అది. 1948లో బాంబేలో విశాలమైన భవంతి అది. చాలా రోజుల తర్వాత జిడ్డు క్రిష్ణమూర్తిని చూడాలని అతడి మాటలతో సాంత్వన పొందాలని వచ్చిన ఆయన అనుయాయులు ఆమె ప్రశ్న విని ఆశ్చర్యపోయారు.

 
ముక్కుతో పనిలేని పద్యం

------------------------------------------------
- ఏ.వి.రమణరాజు

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు