గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-2
సాహితీమిత్రులారా!
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు రెండవభాగం ఆస్వాదించండి-
(డిన్నరును ముగించిన పిమ్మట ప్రమదామణియైన సతీదేవి ‘వేద వాఙ్మయంలో ఏ మాత్రమున కనిపించని గణేశుడు పురాణకాలం నాటికి దేవ గణంబుల నాయకుడిగా ప్రఖ్యాతి పొందిన తెఱంగు తేటపడ వినం గుతూహలంబై యున్నది, వినిపింపు’మని యడిగిన సుఖాసీనుడైన సురేశ్వరుండు, గజముఖుడైన వినాయకుండు విఘ్ననాయకుండై దేవగణంబున జేరి గణాధిపతియైన కథాక్రమంబును ఈ ప్రకారంబుగా చెప్పదొడంగెను!)
వేదసాహిత్యంలో గణపతి
వేదసాహిత్యం అంటే నాలుగు వేదాలే కాదు, ఈ నాలుగు వేదాలలోని శ్లోకాల అర్థాన్ని వివరించడానికి తరువాతి కాలంలో వివిధ వేదపాఠశాలల్లో చెప్పుకున్న వ్యాఖ్యానాలను కూడా వేదవాఙ్మయంలో భాగంగానే పరిగణిస్తారు. బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు ఇవి వేదాలకు అనుబంధాలుగా వచ్చిచేరాయి.
వేదపాఠానికి తొలినాళ్ళలో రాసిన వ్యాఖ్యానాలను బ్రాహ్మణాలు అంటారు. ప్రతి వేదశాఖకు (పాఠశాలకు) సొంత బ్రాహ్మణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఋగ్వేద సంహితకు 21 శాఖలు ఉన్నట్లుగా చెబుతారు కాని, మనకు ఆరు బ్రాహ్మణాలు మాత్రమే లభ్యమౌతున్నాయి. ఇందులో ఐతరేయ బ్రాహ్మణం అతి ప్రసిద్ధమైనది. అలాగే యజుర్వేద సంహితకు సంబంధించిన 12 బ్రాహ్మణాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో కృష్ణ యజుర్వేదశాఖకు చెందిన తైత్తిరీయ బ్రాహ్మణం దక్షిణ భారతంలో అతి ప్రసిద్ధి చెందింది.
వివిధ కర్మ, యజ్ఞ కార్యాల అంతరార్థాలను ఇంకా విపులంగా వివరించేవి ఆరణ్యకాలు. బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు మాత్రమే కాక పరబ్రహ్మ స్వరూపాన్ని లోతుగా చర్చించే ఉపనిషత్తులు తరువాతి కాలానికి చెందినవైనా వాటిని కూడా వేదసాహిత్యంలో భాగంగానే పరిగణిస్తారు. ఉపనిషత్తులు జ్ఞాన ప్రధానం. ఉపనిషత్తులు వేదానికి చివరివి కాబట్టి వాటిని వేదాంతం అని కూడా అంటారు.
వేదాలలో మరికొన్ని గణపతి స్తుతులు
క్రితం చెప్పినట్టు వేదాలలో అతి ప్రాచీనమైన ఋగ్వేదంలోని రెండవ మండలంలో కనిపించే ‘గణానాం త్వా గణపతిగ్ం’ (2.23.1) అన్న శ్లోకం బ్రహ్మణస్పతి సూక్తంలోనిది. ఈ శ్లోకంపై వ్యాఖ్యానం చేసిన బ్రాహ్మణాలన్నింటిలోనూ ఇది బ్రహ్మణస్పతి అయిన బృహస్పతి గురించిన శ్లోకం అనే వివరించారు. ఋగ్వేదంలోని ఇదే శ్లోకం యథాతథంగా కృష్ణయజుర్వేదానికి చెందిన తైత్తిరీయ సంహితలోనూ (2.3.14.3) కాఠక సంహితలోనూ (10.12.44) కనిపిస్తుంది. అయితే, శుక్లయజుర్వేద శాఖకు సంబంధించిన వాజసనేయి సంహితలో, కృష్ణయజుర్వేదానికి చెందిన మైత్రాయణీ సంహితలో (3.12.20) కొంత భేదంతో ఈ శ్లోకం కనిపిస్తుంది:
గణానాం త్వా గణపతిం హవామహే
ప్రియానాం త్వా ప్రియపతిం హవామహే
నిధినాం త్వా నిధిపతిం హవామహే వసో మమ
అహమజానీ గర్భధమా త్వమజాసి గర్భధం॥
గణములలో గణపతివి, ప్రియులలో ప్రియపతివి; నిధులకు నిధిపతివి; నాకు యజమానివి; హిరణ్య గర్భానివి; నాకు ఈ సృష్టి గర్భాన్ని అందజేయుము.
ఈ శ్లోకం అశ్వమేధయాగ సమయంలో ఉపయోగించే శ్లోకంగా మైత్రాయణీ సంహిత పేర్కొన్నది. స్పష్టంగా ఇది హిరణ్యగర్భుడిని (ప్రజాపతిని) ప్రార్థించే శ్లోకం, గజముఖుడైన గణపతి గురించి కాదు.
కృష్ణ యజుర్వేద సంహితాల్లో హస్తిముఖుని ప్రస్తావన
ఇదివరకు చెప్పినట్టుగా, ప్రధాన వేద మంత్రపాఠాలలో ఎక్కడా గజముఖుడైన గణపతి ప్రస్తావన కనిపించదు. అయితే, దీనికి ఒకే ఒక్క మినహాయింపుగా కృష్ణయజుర్వేద శాఖకు చెందిన మైత్రాయణీయ సంహితలో ఈ గాయత్రి శ్లోకం కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం:
తత్ కరాటాయ విద్మహే హస్తిముఖాయ ధీమహి।
తన్నో దంతీ ప్రచోదయాత్॥ (మైత్రాయణీయ-సంహిత)
ఇది కచ్చితంగా గజముఖుడైన గణేశుని వర్ణించే శ్లోకమే అని చెప్పక తప్పదు. కరటి అంటే ఏనుగు లేదా ఏనుగు చెక్కిళ్లు అన్న అర్థాలున్నాయి కదా. హస్తిముఖం అంటే మళ్ళీ ఏనుగు ముఖమనే అర్థం. దంతీ అంటే దంతము కలది అన్నది ఏనుగుకున్న పర్యాయపదాల్లో ఒకటి. హస్తి, దంతీ సంస్కృత పదాలైతే, కరాటి/కరటి అన్న పదం దేశ భాషలనుండి సంస్కృత భాషలోకి వచ్చి చేరిన పదమని కొంతమంది భాషావేత్తల అభిప్రాయం.
నిజానికి ఋగ్వేద సంహితలోని సూక్తాలు, మంత్రాలు ప్రాచీన దేవతలైన అగ్ని, ఇంద్ర, మిత్ర, వరుణ, సవితృ, ప్రజాపతి, బృహస్పతి, విష్ణు, ఆర్యమన్, వివస్వంత మొదలైన వారిని స్తుతించేవి. ఋగ్వేదంలో కనిపించే ఒకే ఒక్క గాయత్రి మంత్రం సవితృ దేవతను స్తుతించేది.
ఓం భూర్భువస్వః తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి। ధియోయోనః ప్రచోదయాత్॥
ఈ ప్రసిద్ధ గాయత్రి మంత్రాన్ని ఆధారం చేసుకొని తరువాత వచ్చిన వేదాలలో వివిధ దేవతలను స్తుతించే గాయత్రి మంత్రాలు సృష్టించబడ్డాయి. అనేక దేవతలను స్తుతిస్తూ ఈ గాయత్రి మంత్రాలలో విద్మహే, ధీమహి, ప్రచోదయాత్ అనే పదాలు ప్రతి మంత్రంలో వాడబడ్డాయి. ఉదాహరణకు విష్ణుగాయత్రి మంత్రం ఇలా సాగుతుంది:
ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
యజుర్వేద గాయత్రి మంత్రాల్లో బ్రహ్మ, విష్ణు, రుద్రులతో పాటు ఋగ్వేదంలో లేని దేవతలైన కాత్యాయని (దుర్గ), స్కంద, గౌరి, నారాయణ, భాస్కర మొదలైన కొత్త దేవతలను స్తుతించే గాయత్రి మంత్రాలు కూడా మనకు కనిపిస్తాయి.
మైత్రాయణీయ సంహిత మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరి వేదపాఠశాలకు సంబంధించిన కృష్ణ యజుర్వేదశాఖ. దీని సంహిత తొలిరూపం దాదాపు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నాటిదని ఒక అంచనా. ప్రస్తుతం లభ్యమౌతున్న కృష్ణయజుర్వేద సంహితాలలో దీన్ని ప్రాచీనమైనదిగా పరిగణిస్తారు.
అయితే, కృష్ణయజుర్వేద శాఖకే చెందిన ఇతర యజుర్వేద సంహితాల్లోను, శుక్ల యజుర్వేద సంహితాల్లోనూ ఈ హస్తిముఖ గాయత్రి శ్లోకం కనిపించదు. కాబట్టి చాలామంది పండితులు ఈ శ్లోకాన్ని ప్రక్షిప్తంగానే పరిగణిస్తారు. ఉదాహరణకు ఆంధ్రదేశంలో దొరికిన తైత్తిరీయ సంహితలో ఈ శ్లోకం లేదు. మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఆంధ్రదేశపు తైత్తిరీయ సంహితలోని గ్రాయత్రీ శ్లోకాల్లో మైత్రాయణీయ సంహితలో కనిపించని నరసింహ స్తుతి కనిపిస్తుంది. నరసింహుడిని స్తుతించే గాయత్రి మంత్రం ఇలా సాగుతుంది:
వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదంష్ట్రాయ ధీమహి।
తన్నో నృసింహః ప్రచోదయాత్॥ (తైత్తిరీయ సంహిత-ఆంధ్ర)
అంటే ఈ యజుర్వేద శాఖలు తమ స్తోత్రపాఠాలలో స్థానికంగా ఉన్న గ్రామదేవతలకు చోటు కల్పించే ప్రయత్నం ఆ రోజుల్లో జరిగిందని మనం ఊహించవచ్చు. గజముఖుడైన దేవునికి మహారాష్ట్రంలో ప్రాతినిధ్యం ఉంటే, ఆంధ్రదేశంలో సింహముఖుడైన నరసింహుడిని కొలిచేవారేమోనని ఊహించడం సత్యదూరం కాదేమో. స్కాంద పురాణంలో కనిపించే గుర్రం తలతో ఉన్న హయగ్రీవుడు, జంతువుల తలతో ఉన్న దైవరూపాలకు మరో ఉదాహరణ.
అయితే తైత్తిరీయ సంహిత మరో ప్రతి పూణె లోని ఆనందాశ్రమంలో దొరికింది. ఇందులో హస్తిముఖ గాయత్రి శ్లోకం లేదు కానీ, ఆంధ్ర తైత్తిరీయ సంహితలో నందీ గాయత్రి స్థానంలో వక్రతుండుడిని స్తుతించే శ్లోకం ఉంది:
తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి।
తన్నో దంతీ ప్రచోదయాత్॥ (తైత్తిరీయ సంహిత-ఆనందాశ్రమ)
అయితే వ్యాఖ్యానంతో సహా 19200 పద్య, గద్యాలున్న ఈ కృష్ణయజుర్వేద సంహితంలో ఒకే ఒక్క గాయత్రి శ్లోకం మాత్రమే గజముఖుడైన గణపతి గురించి ప్రస్తావిస్తుంది. అంతేకాక, యజుర్వేదంలోని శాంతి మంత్రాల్లో బ్రహ్మ, విష్ణు, రుద్రులతో పాటు మిగిలిన దేవతలకు సంబంధించిన శాంతి మంత్రాలు కనిపిస్తాయి కాని, గణేశుడిని శాంతింపజేసే శాంతి మంత్రం ఏ సంహిత పాఠాల్లోనూ కనిపించదు. ఈ కారణాలవల్ల మైత్రాయణీయ సంహితంలోనూ, తైత్తిరీయ సంహిత (ఆనందాశ్రమ)లోనూ కనిపించే ‘గణేశ’ స్తోత్రాలు ప్రక్షిప్తమని చెప్పకోవచ్చు.
యజుర్వేదం తరువాతి కాలం నాటిదయిన అథర్వవేదంలో కూడా ఎక్కడా గజముఖుడైన గణేశుని ప్రస్తావన కనిపిచకపోవడం వల్ల కూడా గణేశుడు వేదకాలంలో వైదిక దేవతల్లో ఒకడుగా పరిగణింపలేదని చెప్పడానికి వీలు కల్పిస్తుంది.
వేర్వేరు యజుర్వేద గాయత్రి మంత్ర పాఠాల్లో భేదాలుండడం, ఒక్క గాయత్రి మంత్రభాగంలో తప్ప మిగిలిన యజుర్వేద సంహితలో మరెక్కడా గణేశుడు కనిపించకపోవడం, శాంతిమంత్రాల్లో గణేశున్ని శాంతింపజేసే మంత్రం లేకపోవడం; అథర్వవేదంలో గణేశుని ప్రస్తావన లేకపోవడం వంటి ఆధారాలను బట్టి గణేశుడు యజుర్వేదకాలం నాటికి కూడా వేద సాహిత్యంలో భాగం కాదని, ‘హస్తిముఖ’, ‘వక్రతుండ’ గాయత్రి మంత్రం తరువాతి కాలంలో ప్రక్షిప్తంగా జతచేయబడిందని పండితుల వాదన.
ఇతిహాసాల్లో గణపతి
రామాయణంలో లేని గణేశుడు
ఆది కావ్యంగా కీర్తించబడ్డ వాల్మీకి రామాయణంలో ఎక్కడా గజముఖుడైన గణేశుని ప్రస్తావన కనిపించదు. అయితే, ప్రస్తుతం మనం వినాయకుని సోదరునిగా పరిగణించే కుమారస్వామి ప్రస్తావన మాత్రం బాలకాండలో కనిపిస్తుంది. అయితే, ఇక్కడ స్కందుడైన కుమారస్వామిని అగ్నికి కుమారునిగా వర్ణించడం విశేషం:
అనుయాతౌ శ్రియా దీప్తౌ శోభయేతామ్ అనిన్దితౌ।
స్థాణుమ్ దేవమ్ ఇవ అచిన్త్యమ్ కుమారౌ ఇవ పావకీ॥ (బాల 1-22-8)
విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు నడచి వెళ్తూవుంటే వారిద్దరూ అగ్ని కుమారులైన స్కందుడు, విశాఖుడు స్థాణువు (శివుడు) వెంట నడిచి వెళ్తున్నట్టు అనిపిస్తున్నది.
అంటే రామాయణ కాలం నాటికి స్కందుడు వినాయకుని సోదరుడన్న ఊహ లేదు. అంతేకాక స్కందుడు శివుని కుమారుడిగా కాక అగ్నిపుత్రునిగా ఇక్కడ వర్ణింపబడటం గమనార్హం. ఇతిహాస పురాణ కథల ఆధారంగా చూస్తే స్కందుడు గణేశుని కంటే ప్రాచీనమైన దేవుడు. స్కందుని పుట్టుపూర్వోత్తరాల గురించి రాయాలంటే మరో పెద్ద వ్యాసమే అవుతుంది కానీ, వాల్మీకి రామాయణంలో మాత్రం గజముఖుడైన వినాయకుని ప్రస్తావన లేదని కచ్చితంగా చెప్పవచ్చు.
మహాభారతంలో గణపతి
మహాభారత రచన అనగానే చాలామందికి వ్యాసుడు మౌఖికంగా చెబుతూ ఉంటే గణపతి లేఖకుడిగా రాసే దృశ్యం తలపుకు వస్తుంది. మనకు తెలిసిన కథ ప్రకారం, వ్యాసుడు భారతం రాయాలనుకున్నాడు. లేఖకుడిగా ఉండమంటూ వినాయకుడి సాయం కోరతాడు. ఓ మానవ ఋషి చెప్పేది రాయడమేంటి అని మొదట ఆలోచిస్తాడు వినాయకుడు. చివరకు ‘నా ఘంటం ఆగిపోని వేగంతో చెబితేనే రాస్తాను’ అంటూ చిన్న షరతు పెడతాడు. వ్యాసుడు కూడా ‘నేను చెప్పేది సంపూర్ణంగా అర్థం చేసుకుని మాత్రమే రాయాలి’ అంటాడు. అలా వ్యాసుడు భారతం చెప్పడం మొదలుపెడితే వినాయకుడు తన దంతాన్ని పెకిలించి ఘంటంగా మార్చుకుని రాయడం మొదలుపెడతాడు. ఫలితంగా ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాల మేళవింపుతో మహాభారతం రూపుదిద్దుకుంది.
అయితే, గణపతి లేఖకుడిగా ఉండే కథ అన్ని మహాభారత ప్రతుల్లో కనిపించదు. నిజానికి మన భారతదేశంలో సంస్కృత మహాభారతానికి వేలకొలది ప్రతులు దేశమంతటా దొరుకుతాయి. అయితే, ఉత్తరభారతంలో నాగరి లిపిలో దొరికే మహాభారత ప్రతికీ దక్షిణభారతంలో దొరికే భారతప్రతికీ శ్లోకాల సంఖ్యలోనూ అమరికలోనూ విభేదాలు కనిపిస్తాయి. అలాగే శారదా, నేపాలీ, మైథిలి, బెంగాలీ అంటూ దేశమంతటా దొరికే ప్రతులను ఒకదానితో ఒకటి పోలిస్తే ఎన్నో విభేదాలు, ప్రక్షిప్తాలు కనిపిస్తాయి. విష్ణు సీతారామ్ సుక్తాన్కర్ అనే సంస్కృత పండితుని నాయకత్వంలో భండార్కర్ ప్రాచ్య పరిశోధనా సంస్థ (The Bhandarkar Oriental Research Institute) ఆధ్వర్యంలో భారతదేశంలో పలుచోట్ల లభించే మహాభారత ప్రతులను సేకరించి, ఒక్కో శ్లోకాన్ని అనేక ప్రతులలో తులనాత్మకంగా విశ్లేషించి, వాటి ద్వారా శుద్ధి చేయబడిన ఒక మహాభారత ‘మార్జిత’ ప్రతిని (critical edition) తయారుచేశారు. అయిదు దశాబ్దాల దాకా సాగిన ఈ మహాయజ్ఞంలో ఎంతోమంది సంస్కృత పండితులు పాల్గొని దాదాపు 1300 దాకా ప్రతులను విశ్లేషించారు.
అలా ఆ భండార్కర్ సంస్థ వారు ప్రచురించిన ‘మార్జిత’ ప్రతిలోని ఆదిపర్వంలో వ్యాసుడు గణపతిని లేఖకుడిగా ఉండమని అర్థించే కథ లేదు. ఎందుకంటే నాగరి లిపిలో ఉండే ఒక భారత ప్రతిలో కావ్యస్య లేఖనార్థాయ గణేశః స్మర్యతాం మునే (1-1-109) అంటూ మొదలుపెట్టి ఎనిమిది శ్లోకాలుగా సాగే కథ ఇతర ప్రతుల్లో కనిపించదు. ఉదాహరణకు ఆంధ్రదేశంలో తెలుగు లిపిలో దొరికిన మహాభారత ప్రతులలో ఈ కథ లేదు. (నన్నయ్య రాసిన తెలుగు భారతంలో కూడా ఆదిపర్వంలో లేఖకుడైన గణపతి కథ కనిపించదు.) అంతేకాక, ఉత్తరభారతంలోనే దొరికిన సంస్కృత మహాభారత ప్రతులలో ముఖ్యమైన శారదా, నేపాలీ, మైథిలి, బెంగాలీ ప్రతులలో ఎక్కడా ఈ వ్యాస గణేశుల కథ కనిపించదు. అయితే, తమిళనాడులోని కుంభకోణంలో దొరికిన మహాభారత ప్రతుల్లో ఈ కథ ఉంది. ఎక్కువ ప్రతుల్లో ఈ కథ లేకపోవడం వల్ల ఈ కథ తరువాతి కాలంలో జతచేసిన ప్రక్షిప్తమేనని ఈ పండితులు నిర్ణయించారు.
ఈ కథను వదిలేస్తే, మహాభారతంలో గణపతిగా, గణేశునిగా చాలా చోట్ల శివుడిని వర్ణించే శ్లోకాలు కనిపిస్తాయి. అంతేకాక మహాభారతంలో దక్షప్రోక్తశివ-సహస్రనామ స్తవంలో శివునికి ఉన్న సహస్రనామాలలో గణాధిప, గణేశ్వర, గణాధ్యక్ష, గణకార, గణకర్తృ, గణపతి మొదలైన పేర్లన్ని కనిపిస్తాయి. ఒకే ఒక్క చోట మాత్రం విష్ణువును గణేశ్వర అని స్తుతించడం కనిపిస్తుంది (13.135.79).
కొన్ని ప్రతుల్లో వినాయక అన్న పదం బహువచనంలో (వినాయకులు) అన్న అర్థంలో వాడడం కనిపిస్తుంది. మచ్చుకు శాంతిపర్వంలోని ఈ శ్లోకం చూద్దాం:
అనేనైవ తు దేహేన గణానాం సమతామ్ వ్రజేత్
తేజసా యశసా చైవ యుక్తో భవతి నిర్మలః
నా రాక్షసాః పిశాచాః వా న భూతాః న వినాయకాః
విఘ్నం కుర్యుగృహే తస్య యాత్రాయమ్ పఠ్యతే స్తవః
ఇక్కడ వినాయకులను రాక్షసులు, పిశాచాలు, భూతాలతో పాటు పేర్కొంటూ ఈ భూత, పిశాచ, వినాయక, రాక్షస గణాలు సృష్టించే విఘ్నాలను ఈ స్తవం పఠించడం ద్వారా నివారించవచ్చు అని ఈ శ్లోకం చెబుతుంది.
వినాయకులు అని బహువచన రూపంలో కనిపించే ఇంకో శ్లోకం అనుశాసనపర్వంలోనిది:
నందీశ్వరో మహాకాయో గ్రామిణీ వృషభధ్వజః
ఈశ్వరాః సర్వలోకానాం గణేశ్వర వినాయకాః
సర్వలోకాలకు ఈశ్వరుడు అయిన శివుడు నంది, మహాకాయ, గ్రామిణీ, వృషభధ్వజుడు, వినాయకులు మొదలైన గణాలకు అధిపతి.
అంటే ఇక్కడ గణేశ్వరుడు శివుడు. వినాయకులు అనేవారు ఆయన అనుచరులైన పెక్కుమంది గణాలలో కొంతమంది. (భవస్య అనుచరః అని తరువాతి శ్లోకంలో ఉంది.) అయితే, ఈ రెండు శ్లోకాలను కూడా ప్రక్షిప్తాలుగానే పరిగణించి మహాభారత శుద్ధప్రతిలో చేర్చలేదు.
మహాభారత శుద్ధప్రతిలో గజముఖుడైన గణేశుడు కానీ వినాయకుడు కానీ కనిపించరు. ప్రక్షిప్త శ్లోకాలలో కూడా వినాయకులు అనే వారు శివుడిని అనుసరించి ఉండే పెక్కు గణాలలో కొందరు అని మాత్రమే మనకు తెలుస్తుంది. మరోచోట వినాయకులను రాక్షస, పిశాచ, భూత గణాలతో పాటు పేర్కోవడం గమనార్హం. ఏది ఏమైనా మహాభారత రచనాకాలం నాటికి గజముఖుడైన వినాయకుడు దేవుడిగా, శివుని పెద్దకొడుకుగా స్థానం సంపాదించుకోలేదనే చెప్పాలి.
వినాయకుడు: విఘ్నకర్తా? విఘ్నహర్తా?
పైన చెప్పిన భారతంలోని ప్రక్షిప్తాల కాలం మనకు తెలియదు కానీ, వినాయకుల గ
...

నివేదిక: సంస్కృత సంగోష్ఠి
సాహితీమిత్రులారా!
ఈ నివేదికను ప్రతి భారతీయుడు చదవాలనే దానితో
మన పాఠకులకు అందుబాటులో ఉంచడం జరిగింది
తప్పక చదవగలరని ఆశ............
భవన్స్ వివేకానంద కళాశాల భాషావిభాగ ప్రాంగణంలో జనవరి 2018, 24-25 తేదీలలో సంస్కృత సంగోష్ఠి నిర్వహించబడింది. సంగోష్ఠి విషయాంశం: ఆధునిక కాలంలో సంస్కృత సాహిత్యం యొక్క ఆవశ్యకత, ఆచరణీయత.
విస్తారమైన సంస్కృత సాహిత్యంలో లభిస్తున్న అనేక శాస్త్ర, సామాజిక గ్రంథాలలోని వివిధ అంశాల మీద దృష్టి సారిస్తూ, వాటి ద్వారా ప్రస్తుత కాలంలోని మేధోస్థాయిని పెంచుకోడం మానవాళికి ఎలా ఉపయోగకరమనే విషయం మీద అనేక శోధపత్రాలు, విశేషజ్ఞుల అభిప్రాయాల మేళవింపుతో ఈ సంగోష్ఠి ఆసక్తికరంగా సాగింది. బెంగళూరు, చెన్నై, కాకినాడ, విశాఖపట్టణము, తిరుపతి, కొవ్వూరు, రాజమహేంద్రవరము మొదలైన విభిన్న ప్రాంతాల నుంచి మరియు జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి అధ్యాపకులు, పరిశోధకులు విభిన్న అంశాలకు సంబంధించిన 47 పరిశోధనా పత్రాలను సమర్పించారు.
మొదటిరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయ సంస్కృతవిభాగాధ్యక్షులు ప్రొ. ఎ. రాములు అధ్యక్షులుగా, ఆంధ్రప్రదేశ విశ్రాంత డిజిపి డా. కె. అరవిందరావు విశిష్ట అతిథిగా వ్యవహరించారు. జీయర్ ఇంటెగ్రేటెడ్ వైదిక అకాడమీకి చెందిన వైదిక సంశోధన ప్రచురణ విభాగాధ్యక్షులు ఎస్. వి. రంగరామానుజాచార్యులు కీలకోపన్యాసం చేశారు. కళాశాల ఉపాధ్యక్షులు ఎయిర్ కమోడోర్ జె. ఎల్. ఎన్. శాస్త్రి, ప్రధానోపాధ్యాయులు ప్రొ. వై. అశోక్ పాల్గొన్నారు.
రెండవరోజు అంతిమ సమావేశానికి శ్రీరాజరాజేశ్వర సంస్కృత కళాశాల విశ్రాంత న్యాయోపన్యాసకులు మహామహోపాధ్యాయ నల్లగొండ పురుషోత్తమ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంస్కృతభారతి నుంచి శ్రీ ఎ. ఆర్. ఎస్. ఎస్. బాలాజీ ఆతిథ్య ఉపన్యాసం ఇచ్చారు. ఉస్మానియా బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు చెందిన సంస్కృతభాషావిభాగాధ్యక్షులు డా. విద్యానంద్ ఆర్య నిర్ణేతగా వ్యవహరించారు. ఈ ద్విదిన సంగోష్ఠిని కళాశాల భాషావిభాగ్యాధ్యక్షులు శ్రీమతి సి. కామేశ్వరి, సంస్కృతోపన్యాసకులు శ్రీమతి మీనారాణి, వారి విద్యార్థి బృందం ప్రశంసార్హమైన నిబద్ధతతో అంకితభావంతో సమయపాలనతో నిర్వహించారు. ఈ రెండు రోజుల సంగోష్ఠి లోని కీలకోపన్యాసములు, పత్రసమర్పణలు, సమర్పించిన పత్రములపై వక్తల అభిప్రాయములు సంస్కృతభాషలోనే జరగడం అత్యంత ఆనందదాయకమైన విషయం.
సమర్పించిన పత్రాల వివరాలు
వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన పరిశోధకులు మొత్తం 47 పత్రాలను సమర్పించారు. రెండు వేదికల మీద ప్రసంగాలు, చర్చలు ఆసక్తికరంగా సాగినాయి.
1. సంస్కృత విజ్ఞానము
చిన్మయవిద్యాలయ నుంచి వచ్చిన దత్తసాయి భౌగోళిక విషయాల్లో భాగంగా భాస్కరాచార్య విరచిత సిద్ధాంతశిరోమణి గ్రంథంలోని గురుత్వాకర్షణ శక్తి గురించిన విషయాలను వివరించారు.
ఆకృష్టి శక్తిస్తు మహీ యత్ స్వస్థమ్ గురు స్వాభిముఖమ్ స్వ శక్త్యా।
ఆకృష్యతే తత్ పతతీవ భాతి సమే సమంతాత్క్వ పతత్వియం ఖే॥ (సి.శి.-1114 AD)
భూమి యందు ఆకర్షణశక్తి గలదు. తన ఆకర్షణశక్తితో భూమి పదార్థాలను తనవైపు లాగుతుంది. ఆ పదార్థాలు ఆ ఆకర్షణశక్తివల్లనే భూమి మీద పడతాయి. ఆకాశంలోని వివిధ గ్రహాల ఆకర్షణ శక్తుల వల్ల సమతుల్యత నిలిచియుంటుంది.
ఆర్యభట్టు యొక్క సూర్యకేంద్రిత సిద్ధాంత విషయంలో గ్రహాలు స్వంత కక్ష్యలో వర్తులాకారంలో పరిక్రమించడాన్ని గురించి ప్రస్తావించారు.
కక్ష్యా ప్రతిమండలగా భ్రమంతి సర్వే గ్రహాః స్వచారేణ।
మందోచ్చాదనులోమం ప్రతిలోమశ్చైవ శీఘ్రోచ్ఛాత్॥(ఆర్యభటీయం –కలాక్రియాపాదః -3.17) 499AD.
ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో బృహద్ సంహితా అనే గ్రంథంలో ఉన్నదని చూపించారు.
సూర్యస్య వివిధవర్ణాః పవనేన విఘట్టితాః కరాః సాభ్రే।
వియతి ధనుః సంస్థానాః యే దృశ్యంతే తదింద్రధనుః॥ (బృహద్ సంహితా – 35 అధ్యాయః)
భ్రుగు సంహితలో రవాణా ముఖ్యంగా మూడు విధాలని, నౌకాయానం, భూయానం, ఆకాశయానమని వివరిస్తూ, 16 భిన్న రకాలైన విమానాల నిర్మాణం, ఉపయోగాల గురించి వివరించారు. వాటి పేర్లు – ఉష్మంభార ఉష్మపా ఉష్మహనో రాజామ్లతృంగవీరహా పంచాఘ్నో అగ్నితృంగభారహనశీతాహ్నో విషంభర విశల్యకృత్ విజమిత్రో వాతామిత్రశ్చేతి।
రక్తప్రసరణం గురించి –
హృదో రసో నిస్సరతి తస్మాదేతి చ సర్వశః ।
సిరాభిహ్రుదయం వైతి తస్మాత్తత్ప్రభావాః సిరాః ॥ (భేలా సంహితా-20-3)
కృత్రిమ గర్భధారణ గురించి (టెస్ట్ ట్యూబ్ బేబీ) –
సత్రే హ జాదావిషితా నమోభిః కుంభే రేతః సిషిచతుః సమానమ్।
తతో హ మాన ఉదీయా మధ్యాత్ తతో జాతమృషీ మాహుర్వశిష్ఠమ్॥(ఋగ్వేదః – 7.33.13) (4)
గణితానికి సంబంధించిన పింగళసూత్రం- గాయత్రే షడ్సంఖ్యాంమర్ధే పనీతే ద్వయంకే అవశిష్ఠస్త్రయస్తేషు రూపమపానీయ ద్వయాంకాధః శూన్యం స్థాప్యమ్” (పింగళాచార్యాః , చంద్రశాస్త్ర – 200 బిసి.)- తదితర విషయాలను వివరించారు.
2. ఆరోగ్యవృద్ధికి తోడ్పడే భారతీయభోజనవిధి
సంస్కృత అకాడమీ నుంచి డా. సంతోష్ కుమార్ జోషి గారు ఆహారస్వీకరణ గురించి సంస్కృతగ్రంథాల్లోని ప్రముఖ చర్చలను ప్రస్తావించారు. వాగ్భటుని అష్టాంగహృదయంలోని ఎనిమిదవ అధ్యాయంలో జఠరాగ్ని గురించిన చర్చను, తొమ్మిదవ అధ్యాయంలోని ఆహారసమయంలో నీరు త్రాగే పద్ధతులను వివరించారు.
భోజనాదౌ పిబేత్తోయమగ్నిసాదం కృశాంగతామ్।
మధ్యేచాగ్నిం వివర్ధేత అంతే శ్రేష్ఠం రసాయనమ్॥
(భోజనం ముందు, మధ్యలో కాకుండా చివరలో ద్రవ్యాలు తీసుకోవాలి.)
అత్యంబుపానాన్నవిపచ్యతేన్నమ్। (నీరు ఎక్కువ త్రాగడం జీర్ణానికి ఉపయోగపడదు.)
అనంబుపానాచ్చ స ఏవ దోషః। (నీరు తక్కువ త్రాగడం కూడ సరికాదు.)
నాదేయం కౌపం చ జలం మేళయిత్వా న పిబేత్ ఏకమేవ నద్యా వా కూపస్య. (నదీ, బావుల జలాన్ని కలిపి త్రాగడానికి వాడకూడదు. ఏదో ఒకదాన్నే వాడడం మంచి పద్ధతి.)
అశ్వచాలనాది వ్యాయామోత్తరకాలం న పిబేత్ జలమ్। (గుఱ్ఱపుస్వారీ వంటి వ్యాయామాలనంతరం వెంటనే నీరు త్రాగరాదు.)
అతి తృషితోఽపి న బహు పిబేత్ । ముహుర్ముహుః వారి పిబేత్। (అతిగా దాహం వేస్తున్నప్పుడు ఒక్కసారే అధిక జలం తీసుకోరాదు. కొద్దికొద్దిగా త్రాగవలెను.)
విరుద్ధ ఆహార పదార్థాల కూడని మేళవింపులను గురించి వివరిస్తూ-
రంభాఫలం త్యజేత్ తక్రదధిబిల్వఫలాన్వితమ్. (పెరుగు, మజ్జిగలతో అరటిపండును కలిపి తినరాదు.)
కృతాన్నం చ కషాయం చ పునరుష్ణీకృతం త్యజేత్ ( వండిన పదార్థాలను, కషాయాలను తిరిగి వేడిచేయరాదు.)
ఏకత్ర బహుమాంసాని విరుధ్యంతే పరస్పరమ్ (ఒకేసారి విభిన్న మాంసాలను తినరాదు)
మత్స్యానూపమాంసం చ దగ్ధయుక్తం వివర్జయేత్. (చేపలను పాలతో కలిపి తినరాదు.)
చారుచర్య అను గ్రంథంలోని భోజన వేళలను, విధులను, భోజన పాత్రలను గురించిన శ్లోకాలను, స్వర్ణమయపత్రాణి(పైత్యక్షోభనివారకం) రౌప్యపాత్రాణి (పైత్యప్రకోపం, శ్లేష్మహారకం) కాంస్యపత్రాణి(రక్తపైత్య హారకం) రమ్భాపత్రమ్ (కఫవాతహరః) పలాశపత్రమ్ (పైత్య శ్లేషవికారహరం ) – ఈ ఆకులలో తినడం వలన కలిగే లాభాలను వివరించారు. బ్రహ్మపురాణం లోని పంక్తి భోజన నియమాలను(టేబుల్ మానర్స్ వంటిది) వివరించారు.
గ్రసనావసరే తస్మాత్ కణో నావకిరేత్।
(మెతుకులు వెదజల్లబడకుండా ఆహారం తీసుకోవాలి)
విశేషాన్ముఖవ్యాదానపపి న స్యాత్।
కరాగ్రం ముఖే చాధికం న ప్రవిశేత్।
(ఆవలింతలు కూడదు, వేళ్ళు మరీ నోటిలోనికి జొనిపి తినరాదు.)
ఇతస్తతో న పశ్యేత్ శనైః శనైః భుంజీత।
(అటూ ఇటూ చూడకుండా నెమ్మదిగా భుజించాలి.)
ఆరోగ్యసంరక్షణార్థం కూడా జీవితంలో పాటించవలసిన నియమాలననేకం చెప్పారు.
అత్యాహారాద్భవేద్వ్యాధిరనాహారాద్బలక్షయః।
(ఆహారం అధికం ఐతే వ్యాధి, అల్పం ఐతే బలక్షయము కలుగుతుంది.)
సమాహారాద్బలం సమ్యగాయుర్వర్ధనముత్తమమ్।।
(సమతుల్య ఆహారం వలన ఉత్తమ బలము, ఆయుష్షు పెరుగుతుంది.)
ఏకశాయీ ద్విభోజీ చ షణ్మూత్రీ ద్విపురీషకః।
స్వల్పసంగమకారీ చ శతవర్షాణి జీవతి॥
3. ఉపనిషత్తుల్లోని విద్యావిధానాలు
ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధకులు కృష్ణచైతన్య పది ఉపనిషత్తుల్లోని విషయాలను క్లుప్తంగా వివరిస్తూ, వేదాంత విషయాలు మాత్రమే కాక వీటిలో సత్యాన్వేషణ, మానవసౌభ్రాతృత్వం గురించిన అంశాలను విస్తారంగా చర్చించబడినాయని తెలిపినారు.
ఈశావాస్యోపనిషత్ లో శ్లోకం గమనిస్తే
యస్తు సర్వాణి భూతాన్యాత్మన్యేవానుపశ్యతి|
సర్వభూతేషు చాత్మానాం తతో న విజుగుప్సతే॥ (ఈ. 6)
మానవజాతి జరుపుతున్న మారణహోమాలన్నిటికీ కారణమైనవి ఇతరులది తనకు కావాలన్న లోభము, ఇతరులపై ద్వేషము. అన్ని భూతాలలో (కేవలం మానవులలోనేకాదు) ఉన్నది ఒక్క ఆత్మనే , తనకు కలిగే నొప్పిని ఇంకొకరికి ఇవ్వకుండా ఉండగలగాలనే సూత్రం విస్తరించి బాల్యంనుంచీ వివరించగలిగితే శాంతి కోసం ప్రత్యేక ప్రయత్నాలవసరం రాదు. మనిషి మానవత్వం ఎదగడమే విద్య యొక్క పరమార్థం అనే అంశంలో ఏ విభేదాలకూ ఆస్కారం లేదు కదా.
కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాః।
ఏవం త్వయి నాన్యతోఽస్తి న కర్మ లిప్యతే నరే॥ (ఈ.2)
ఏ కర్మ(పని) అయినా చేసేటపుడు అనుకూల, ప్రతికూల ఫలితాలకు సిద్ధంగా ఉండాలి అని బోధించే ఈ సూత్రం చక్కగా తెలుసుకోగలిగిన ఏ విద్యార్థీ చిరువయసులో ఆత్మహత్యల గురించి ఆలోచించడు.
కుతో వా ఇమాః ప్రజాః ప్రజాయంత ఇతి (ప్ర.1-3)
ఈ మొత్తం విశ్వం ఎలా ఆవిర్భావించింది వంటి శాస్త్రీయమైన ప్రశ్న, చర్చలను లోకానికి పరిచయం చేయవలసిన అవసరం ఉంది.
తమసోమా జ్యోతిర్గమయ (బృ.1.3.28)
చీకటి నుంచి వెలుగులోకి ప్రయాణించవలసి ఉందనే ఇటువంటి సత్యం సర్వకాలాలకూ అత్యావశ్యకమైన బృహద్విద్య.
అన్ని రకాల పాఠ్యపుస్తకాలలో వివరించి చెప్పవలసిన జీవనసూత్రాలివి.
4. బీజోత్పత్తి–భూమి నిరూపణం
చెన్నె రాణీ మేరీ కళాశాల సంస్కృతవిభాగ్యాధక్షురాలు డా. ఉమా మహేశ్వరి శార్ఙ్గధరుడు సేకరించిన శార్ఙ్గధరపద్ధతి అనే గ్రంథంలో రాజనీతి, ధనుర్వేదము, రసాయన, అర్థశాస్త్రము, ఔషధవిద్యలతో పాటు ప్రముఖంగా వృక్షాయుర్వేదమనే విభాగంలోని ఉపవన వినోదం అనే అధ్యాయంలో చెప్పబడిన బీజోత్పత్తి, భూమినిరూపణం, మొక్కల్లోని వైవిధ్యత, నాటు పద్ధతులు, బావులు త్రవ్వడం, బావులకై భూపరీక్ష, తరుచికిత్సలు మొదలైన అనేకవిషయాలను గురించి వివరించారు.
అడవులు, అనూపాలు, సామాన్యాలు అని భూమి మూడు వర్గాలుగా విభజింపబడినది. అందులో సారాన్ని, రంగును బట్టి తిరిగి ఆరురకాలుగా చెప్పబడింది. నాటు కాలము, నీరు పెట్టు పద్ధతులు, వృక్షరక్షణ మొదలైన విషయాలు వివరింపబడినవి.
దశపుత్రసమో ద్రుమః (ఉ.వి.5) – పునరుత్పత్తి అత్యంత ముఖ్యమైన అంశమైన ప్రాణికోటిలో ఈ విధంగా ఒక చెట్టును పెంచడం పదిమంది పుత్రులతో సమానం అన్న భావన బహుగొప్పది. ఏ చెట్లు నాటడం వల్ల నరకబాధలుండవో చెప్తూ కూడా పర్యావరణ పరిరక్షణ కు దోహదం చేస్తున్న ఈ క్రింది శ్లోకాలు గమనించదగ్గవి.
అశ్వత్థమేకం పిచుమందమేకం న్యగ్రోధమేకం దశచించిణీకాః।
కపిత్థబిల్వామలకత్రయం చ పంచామ్రవాపీ నరకం న పశ్యేత్॥
ఒకరావిచెట్టును, ఒక వేపచెట్టును, ఒక మర్రిచెట్టును, ఒక చించిణీక(?) వ్రుక్షాన్ని, ఒక వెలగచెట్టును, ఒక మారేడు చెట్టును, మూడు ఉసిరిక చెట్లను, ఐదు మామిడిచెట్లను నాటి బావి ఏర్పాటుచేసి రక్షించేవాడికి నరకబాధ ఉండదు.
యస్తు సంరోపయేద్బిల్వం శంకరం ప్రీతి కారకమ్।
తత్కులేపి సదా లక్ష్మీః సంతిష్ఠేత్పుత్రపౌత్రికీ॥ (ఉ.వి.9)
శంకరునికి ప్రీతిపాత్రమైన బిల్వ వృక్షాన్ని నాటి సంరక్షించడం వలన ఆ వంశంలో ధనము, పుత్రపౌత్రాదులు ఎప్పటికీ ఉండడం జరుగుతుంది.
సమ్యక్కృష్టే సమే క్షేత్రే మాషానుప్త్వా తిలాంస్తథా।
సునిష్పన్నానపనయేత్తత్ర బీజోప్తిరిష్యతే॥ (ఉ.వి.50)
పాలను, తిలాభస్మాన్ని గోమయాన్ని బీజరక్షణకు ఉపయోగించే విధానం చెప్పబడింది.
హేమంతే శిశిరే దేయం జలం చైకాంతరే దినే।
వసంతే ప్రత్యహం గ్రీష్మే సాయం ప్రాతర్నిషేచనమ్॥ (ఉ.వి.72)
వర్షాసు చ శరత్కాలే యదా వృష్టిర్న దృశ్యతే।
తదా దేయం జలం తజ్ఝైరాలబాలే మహీరుహమ్॥ (ఉ.వి.73)
హేమంత శిశిరాలలో రోజు విడిచి రోజు, వసంతం లో రోజూ, గ్రీష్మంలో రోజుకు రెండు సార్లు పొద్దున, సాయంత్రం, వర్ష, శరత్ ఋతువులలో వర్షం లేదనుకున్నపుడు మాత్రం నీళ్ళు పట్టాలి.
ఇంకా పిడుగులు పడినపుడు చెట్లరక్షణ, చెట్లు పెద్దగా పెరగడానికి వలసిన పద్ధతులన్నీ చర్చించబడినాయి.
5. పాండులిపిలో (మాన్యుస్క్రిప్ట్) లభ్యమౌతున్న ప్రాచీన రచనలు.
తిరుపతి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠానికి చెందిన పరిశోధకులు రాహుల్ దేబ్ హల్దార్ పాండులిపిలో ఉన్న రచనల సంరక్షణ, శాస్త్రపరిశోధనలో వాటి ప్రాముఖ్యతలు, వినియోగాల ఆవశ్యకతను గురించి వివరించారు.
హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపిహితం ముఖమ్
తత్త్వం పూషన్నపావృణు సత్యధర్మాయ దృష్టయే ॥ (ఈ.15)
ఆవరించిన భ్రమలను తొలగించి సత్యావిష్కరణ చేయడానికి శోధన అవసరం.
ఇదివరకు లేని నూతనతథ్యాల ఆవిష్కరణలకు, ఇప్పటికే ఉన్నసిద్ధాంతాల పునర్మూల్యాంకనకు పరిశోధన అనేది నిరంతరం జరుగవలసి ఉంటుంది. పునర్మూల్యాంకనకు లభ్యమౌతున్న ప్రాచీన గ్రంథాల మూల ప్రతులను వాటి పాండులిపి (మాన్యుస్క్రిప్ట్-చేతివ్రాత)లను సాకల్యంగా, లోతుగా పరిశీలించడం ఈ ప్రక్రియలో ముఖ్యమైన అంశం.
పాండులిపిలో రచనలు రాతిపలకలు, మట్టిపలకలు,చర్మపత్రాలు, తాటియాకులు, భూర్జపత్రాలు, చెక్కపలకలు మొదలైన వాటిలో లభ్యమౌతున్నవి. ఆకారాన్ని బట్టి గండీ, కచ్ఛపీ, ముష్టీ, సమ్ముటఫలకమ్, ఛేదపాటీ అనే రకాలు, లేఖనశైలిని బట్టి త్రిపాఠః, పంచపాఠః, శుండాకారః, సచిత్రపుస్తకం, స్వర్ణాక్షరలిపి, రజతాక్షరలిపి, సూక్ష్మాక్షరలిపి, స్థూలాక్షరలిపి అనే వర్గాలున్నాయి.
పాండులిపిలో ఉన్న వాఙ్మయపరిశోధన క్రింది విషయాలలో జరుగవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
వైదిక లౌకిక దర్శనవాఙ్మయము
గ్రంథాల సమీక్షాత్మకాధ్యయనము
మాతృకాసంపాదనము
సంస్కృతవిద్వాంసుల వ్యక్తిత్వము
పరిశోధనకు అవకాశమున్న నూతన క్షేత్ర ఆవిష్కరణ.
బ్రాహ్మీలిపిలో ఉన్న ఉత్తర, దక్షిణ బ్రాహ్మీలిపి, వాటిలోని ఉపవర్గాల గురించి కూడా వివరంగా చర్చించబడింది.
సత్యనిర్ధారణకు మూలగ్రంథాల పరిశోధన, అందుకు మూలగ్రంథాల పరిరక్షణ చాలా అవసరమని నిర్ధారించిన పత్రమిది.
6. కాకతీయకాలంనాటి నృత్తరత్నావళి
వరంగల్ ఎస్. వి. ఎస్. ఎ. పీజీ కళాశాలనుంచి ప్రకాష్ పేరిణి నృత్యం గురించి జాయపసేనాని విరచిత నృత్తరత్నావళి అను సంస్కృతగ్రంథం నుంచి ప్రస్తావిస్తూ, యుద్ధకాలాలలో సైన్యం యొక్క ఉత్సాహ వర్ధనానికై శాస్త్రీయంగా రూపొందించిన పద్ధతులను గురించి వివరించారు.
కాకతీయుల కాలంలో సంస్కృత సాహిత్యం కూడా ఇతోధికంగా ప్రజాదరణ పొందింది. విద్యానాథుని ప్రతాపరుద్రయశోభూషణం, రెండవ ప్రతాపరుద్రుని యయాతి చరితం, ఉషారాగోదయం, వీరభల్లట దేశికుని నాట్యశేఖరమ్, గంగాధర కవి యొక్క రాఘవాభ్యుదయః, చంద్రవిలాసః, మహాభారతనాటకమ్, నరసింహ కవి యొక్క కాదంబరీ నాటకమ్, వేదాంతదేశికుని యాదవాభ్యుదయః, అగస్త్యుని బాల భారతమ్, గంగాదేవి యొక్క మధురావిజయమ్ మొదలైనవి రచింపబడినాయి. ప్రతాపరుద్రీయంలో చెప్పబడినట్లు విద్యానాథుని కాలంలో 200 మంది సంస్కృతకవులుండేవారని, లలితకళల ప్రయోజనం గురించి వివరిస్తూ భరతముని ప్రణీత నాట్యశాస్త్రంలో ఉన్న నాట్యం యొక్క ఉద్దేశ్యాన్ని చెప్పే శ్లోకాన్ని ఉటంకించారు.
దుఃఖార్తానాం శ్రమార్తానాం శోకార్తానాం తపస్వినామ్
విశ్రాంతిజనం కాలే నాట్యమేతద్భవిష్యతి॥
దుఃఖితులకు, శ్రామికులకు, శోకార్తులకు, తపస్విజనులకు, నాట్యం విశ్రాంతి నిస్తుంది.
ప్రస్తుతాంశం జాయసేనాపతి విరచిత నృత్తరత్నావళి మొత్తం ఎనిమిది అధ్యాయాలు కలది. మొదటి నాలుగధ్యాయాలు మార్గ వృత్తి, చివరి నాలుగధ్యాయాలు దేశివృత్తి నాట్యలక్షణాలను వర్ణిస్తాయి.
రంగభూమి (వేదిక) పై ప్రవేశం గురించి-
సమపాదేన వా తిష్టన్ భుజంగత్రాసితేన వా।
కృతే యవనికాక్షేపే సతి రంగభువం విశేత్॥
రాసకనృత్తమ్ లో నాయికల నృత్యం గురించి-
బంధం పిండ్యాదిమాశ్రిత్య యస్మిన్ షోడశనాయికాః।
నృత్యంతి ద్వాదశాష్టౌ వా రాసకం తత్ ప్రకీర్తితమ్॥ (12)
రాసకనృత్త వస్త్రధారణ-
చేలమధోరుక్తం యద్వా కూర్పాసం కంచుకం తథా।
ధార్మిల్లం వేణికాం వాపి తత్తద్దేశానుసారతః॥ (13)
కందుకనృత్తమ్ గురించి-
దత్వాఽన్యాసాం నిజాన్ గృహ్ణత్యః పరతః పరాన్।
మిథో వినిమయేనైతాన్ స్వీకుర్యత్యః కదాచన॥
నృత్యంతి వనితా యత్ర తత్ స్యాత్ కందుక నర్తనమ్ । (17)
పత్రసమర్పణల అనంతరం ప్రసంగించిన వక్తలు ఇప్పటికే సంస్కృతంలో ప్రామాణ్యంగా భావించి వివిధ భాషల్లోకి అనువదింపబడి, దేశవిదేశాలకు చెందిన ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పరిశోధనకు ఆధారంగా తీసుకోబడిన/బడుతున్న విషయాంశాలు మాత్రమే కాకుండా, భారతీయసమాజానికే విశిష్టత అయినటువంటి ఆత్మానాత్మ వివేకానికి సంబంధించిన అంశాలను పరిశోధకులు స్వీకరించి, నేటి కాలపు వైచారికతలో వాటిని ప్రతిక్షేపించవలసి ఉంటుందని సూచించారు. ఇంకా సంస్కృతగ్రంథాల్లోని ధర్మచర్చ, నైతికబోధ, భాషరమ్యత, స్వచ్ఛభారత కల్పన, ఆధునిక పరికరాలతో చేరువవుతున్న సంస్కృతం, నాటి కాలపు స్త్రీ సాధికారత, గురుపరంపర, గరుడ-భాగవత-మార్కండేయ పురాణాల్లో వర్ణింపబడిన గర్భస్థపిండాభివృద్ధి శిష్యలక్షణాలు వంటి అనేక విషయాంశాలతో పత్ర సమర్పణలు సరళసంస్కృతంలో సాగినవి. అంశాన్ని పరిచయం చేయడంలోనే కొందరు పత్రసమర్పకులకు ఇచ్చిన సమయం ముగిసిపోవడం విచారకరం. పత్రసమర్పకులు ఇచ్చిన సమయంలో ప్రముఖ అంశాలను తమ ప్రసంగంలో తెలిపేందుకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే బాగుండేదనిపించింది.
భౌతిక విషయ పరిశోధనలోని ప్రాథమిక ఆధారజ్ఞానం ఇతర సమాజాలలోని అదే జ్ఞానానికి ప్రత్యామ్నాయంగా సంస్కృత గ్రంథాలలో బలంగా నిలబడుతూ వైజ్ఞానిక రంగం యొక్క ఆమోదాన్ని పొందింది. అయితే ఇతర భాషా గ్రంథాలలో చర్చింపబడని ఉపవాస విధి, ప్రదక్షిణ వంటి కొన్ని విశేషాంశాలు ఆధ్యాత్మిక ఔన్నత్యానికి, విశ్వమానవశ్రేయస్సుకు సంబంధించినవి సాధికారకంగా నిరూపించడం సంస్కృత పండితుల, పరిశోధకుల తక్షణ కర్తవ్యమని దిశానిర్దేశం చేశారు. సమర్పించిన అన్ని పత్రాలతో సచిత్రకంగా శోధపత్రసంకలనం విడుదల జరిగింది.
సమర్పించిన పత్రాల విషయాంశాల వైవిధ్యత, భాషాశుద్ధి మరి ఇతర విషయాలను దృష్టిలో పెట్టుకొని తొమ్మిదింటిని ఎన్నికచేసి, ఆయా పత్రసమర్పకులను తమ పరిశోధనలోని కీలకాంశాలను తిరిగి క్లుప్తంగా సమర్పించమని కోరినారు. ఆ కార్యక్రమమంతా వీడియోరికార్డ్ చేసి వాటిలో అధ్యాపక రంగ పత్రసమర్పకులకు ఒకరికి, పరిశోధక రంగ పత్రసమర్పకులకు ఒకరికి ఉత్తమపత్ర బహుమతి ప్రదానం చేసినారు.
భవిష్యత్తులో మరింత పరిశోధన, జరుగవలసిన అధ్యయనం గురించి సంస్కృతపండితుల దృష్టిని ఆకర్షించి ఈ సంగోష్ఠి విజయవంతమైనదని చెప్పవచ్చు.
-------------------------------------------------------
రచన: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి, ఈమాట సౌజన్యంతో...
--------------------------------------------------------
- ఏ.వి.రమణరాజు
సేకరించి ప్రాంజలి ప్రభకు పంపిన ప్రతివక్కరికి అభినందనలు శుభాభినందనలు
ప్రాంజలిప్రభ
సేకరణ : రామకృష్ణ
తెనాలి రామకృష్ణ కధలు
తాతాచార్యులవారికీ, తెనాలి రామకృషునికీ పడేది కాదుట ఎప్పుడూ నేను చెప్పింది సరైనదంటే నేను చెప్పినదే సరైనదని వాదులాడుకునే వారట.
ఒకసారి ఆ వాదనలో ఒక పందెం వేసుకున్నారట. నేను చెప్పినది సరైనదైతే మీరు నన్ను భుజాల మీదికెక్కించుకొని రాజవీధిలో తిరగాలి, నేను ఓడినట్లైతే, నేను మిమ్మల్ని భుజాలమీదికెక్కించుకొని రాజవీధిలో తిరుగుతాను. అదీ పందెం. ఆ పందెం లో
తాతాచార్యులవారు ఓడిపోయారట. ఇంకేముంది నన్ను భుజాలమీదెక్కించుకొని రాజవీధిలో తిరగాలి రండి అని రామకృష్ణుడు పట్టుబట్టాడాట. రాహ్మకృష్ణా! అలా చేయకురా! నా పరువు పోతుందని ఆయన బ్రతిమలాడినా రామకృష్ణుడు వినకయేసరికి . తాతాచార్యులవారు విధి లేక రామకృష్ణుడిని భుజాలమీదెక్కించుకొని,రాజవీధిలో నడుస్తున్నాడట.
ఈ దృశ్యాన్ని రాయలవారు తనగది కిటికీలోనుంచి చూశారట. భటులను పిలిపించి
ఆ పైనున్నవాడిని కొరడాలతో కొట్టుకుంటూ నా దగ్గరికి తీసుకొని రండని ఆజ్ఞాపించాడు.
రాయలవారు చూడడం గ్రహించిన రామకృష్ణుడు తాతాచార్యులవారి భుజం మీదినుంచి
దిగి ఆయన కాళ్ళు పట్టుకొని క్షమించండి గురువర్యా! నా వల్ల అపరాధం జరిగిపోయింది.
దానికి శిక్షగా నేను మిమ్మల్ని భుజాలపై ఎక్కించుకొని తిరుగుతానని చెప్పి ఆయన్ని ఒప్పించి ఆయన్ను తన భుజాల మీదికి ఎక్కించుకొని నడవసాగేడు. భటులు వచ్చి రాజుగారు పైనున్నవాడిని కొరడాలతో కొట్టి తీసుకొని రమ్మన్నారు కదా! రామకృష్ణుని భుజాలపైన వున్న తాతాచార్యుల వారిని కొరడాలతో కొట్టుకుంటూ ఆయన నేను రాయలవారి గురువుగారినని చెప్తున్నా వినిపించుకోకుండా యిది రాజుగారి ఆజ్ఞ అంటూ తీసుకెళ్లారట. రాయలవారు చూసి ఇదేమిటి నేను పైనఉన్నవాడిని కదా తీసుకొని రమ్మనింది. మాగురువుగారిని తీసికోచ్చారేమిటని గద్దించి అడిగేసరికి భటులు వణికి పోతూ ఈయనగారే పైనున్నదని చెప్పారట. రాయలవారు గురువుగారి కాళ్ళమీద పడి
క్షమించమని వేడుకొని సంగతేమని అడిగితే, జరింగింది చెప్పి తాతాచార్యులవారు
కళ్ళనీళ్ళ పర్యంత మయ్యారట. రామకృష్ణుని పిలిపించి బాగా తిట్టి కొరడా దెబ్బలతో సత్కరించి, ఇలాంటివి యికమీద జరిగితే పెద్ద శిక్షే పడుతుందని హెచ్చరించారట.
మేము తెగ నవ్వేవాళ్ళం
---------------శుభసాయంత్రం ---------------------
తెనాలి రాంకిష్ణ కధలు
----------------సుప్రభాతం---------------------
తాతాచార్యులవారు కృష్ణదేవరాయల ఆస్థాన గురువులు.రాయలవారికి ఆయనంటే చాలా గౌరవం.ఆయనకు మంచి భవనము,సేవకులు,అన్ని సౌకర్యాలూ యిచ్చారు.కానీ తాతాచార్యులవారికి అత్యాశ. రాయలకంటే తనకే అందరూ గౌరవ మివ్వాలి అని అనుకునే వారు.
.ఆస్థానములో చేరడానికి వచ్చే కవులందరూ తనదగ్గరకు వచ్చి తనను సంతోష పెడితేనే రాజ సభలో ప్రవేశము లభిస్తుంది అని శిష్యులతో నగర
శివార్లలోనే చెప్పించేవారు.పాపం వచ్చిన వారందరూ ముందు ఆయన దర్శనం చేసుకొని
ఆయనకు ముడుపులు సమర్పించుకొనేవారు."రాజ దర్శనాత్పూర్వం తాతః పూజ్యో న సంశయః"అని నిబంధన.రాజ దర్శ నానికి ముందు తాతాచార్యులవారిని పూజించాలి.
ఇదంతా రాయల వారికి తెలియదు.కొత్తగా వచ్చే కవులందరూ రామకృష్ణుడికి ఇదంతా చెప్పి తమను .ఎలాగైనా కాపాడమని వేడు కున్నారట .రామకృష్ణుడు ఆయనకు బుద్ధి
చెప్పాలని ఆయన శిష్యుల దగ్గర,యింకా కొంత మంది ముఖ్యులదగ్గర యిదేదో "ముఖ ప్రక్షాళనాత్పూర్వం గుద ప్రక్షాళనం యధా"లాగ వుందే అనేవాడట . అంటే పళ్ళు
తోముకునే ముందు కాలకృత్యాలు తీర్చుకుంటారు కదా అలాగ వుంది(ముఖం అంటే సంస్కృతం లో నోరు)ఈ సంగతి ఆ నోటా ఈనోటా రాయల వారికి తెలిసింది.ఆయన
అవినీతిని యెంత మాత్రం సహించరు.ఎంతయినా ఆయన తన గురువు.అందుకని ఆయననురహస్యంగా తన మందిరానికి పిలిపించి మెత్తగా మందలించారట.ఇక మీదట
యిలాగే కొనసాగితే క్షమించేది లేదని మెత్తగా చెప్పారట.అంతే అప్పటినుండీ ఆయన అలా చేయడం
మానుకున్నారట.కొత్తగా వచ్చే కవులందరూ రామకృష్ణుడికి కృతజ్ఞతలు చెప్పారట.
(చాటుపద్య మణిమంజరి.నుండి )
భువన విజయము లో ఒకసారి కృష్ణదేవరాయలు దోషరహితముగా పద్యము చెప్పవలెనని ఆదేశిస్తాడు.
అప్పుడు పెద్దన కృష్ణదేవరాయలను ప్రశంసిస్తూ ఒక పద్యం చెప్పాడు.
శరసంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులుం గలిగి దు
ర్భర షండత్వ బిల ప్రవేశ చలన బ్రహ్మఘ్నతల్ మానినన్
నర,సింహ, క్షితిమండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీసాటిగా
నరసింహ క్షితి మండలేశ్వరుల కృష్ణా రాజ కంఠీ రవా!
అర్థము:--శరసంధానము లో అర్జునిని తోనూ, బలములో సింహముతోనూ, ఓర్పు లో భూమితోనూ
నిన్ను పోల్చడానికి వీలు లేదు. ఎందుకంటే అర్జునునికి షండత్వ (నపుంసక)దోషముంది,సింహానికి బిల ప్రవేశ (గుహ)దోషముంది,భూమి కి చలించే దోషముంది (భ్రమణదోషం)ఇంక ఈశ్వరుడితో పోలుద్దామంటే ఆయనకు బ్రహ్మహత్యా దోషముంది (బ్రాహ్మణుడైన దక్షుడిని చంపాడు కదా!)
కనుక నీకు నేవే సాటి కృష్ణా రాజ సింహమా!
రామకృష్ణుడు ఫక్కుమని నవ్వాడు. రాయలు కోపంగా ఎందుకా నవ్వు? అని అడిగాడు. అప్పుడు రామకృష్ణుడు క్షమించండి మహా రాజా! సింహానికి బిల ప్రవేశ దోషముంది నిన్ను పోల్చడానికి వీలు లేదు అని అంటూనే తాతగారు "రాజకంఠీ రవా!" అని సంభోదిస్తుంటే నవ్వొచ్చింది. (కంఠీరవము అంటే సింహము). అప్పుడు పెద్దన నాలిక్కరుచుకొని చిన్న వాడవైనా పెద్దతప్పే కనిపెట్టావు మనవడా!ఏదీ నీవొక పద్యము చెప్పు అన్నాడు. అప్పుడు రామకృష్ణుడు
కలనం దావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మాభర్త మార్తాండ మం
డల భేదం బొనరించి యేగునెడ దన్మధ్యంబునన్ హార కుం
డల కేయూర కిరీట భూషితుని శ్రీమన్నారాయణుం గాంచి లో
కలగంబారుచు నేగె నీవ యను శంకన్ గృష్ణరాయాధిపా!
అర్థము:--యుద్ధములో నీ ఖడ్గము చేత చంపబడిన శత్రు రాజులు వీర స్వర్గానికి సూర్యమండలము దాటి పోతూ అక్కడ సింహాసనము పై హారాలూ,కుండలాలూ,కేయూరాలూ, కిరీటమూ ధరించి కూర్చొని వున్న నారాయణుని చూచి నీవే నేమో నని భ్రమించి ఇక్కడికి కూడాఈయన వచ్చాడే అని భయము తో కంగారు పడుతూ గబగబా వెళ్ళిపోయారు.
పెద్దన గారు చిన్నవాడవైనా గొప్ప పద్యం చెప్పావు మనవడా! అని మెచ్చుకున్నారు. .
---------------శుభసాయంత్రం -------------------------
ముక్కు తిమ్మన గారి ముద్దు పలుకులు
-----------------------------------------------------------
ఉ: " ఈసున బుట్టి, డెందమున హెచ్చిన కోపదవానలంబుచేఁ
గాసిలి, యేడ్చె, ప్రాణవిభు కట్టెదుటన్ లలితాంగి! పంకజ
శ్రీ సఖమైన మోముపయి చేలచెఱంగిడి, బాలపల్లవ
గ్రాస కషాయ కంఠ కలకంఠవధూ కల కాకలీధ్వనిన్ ;
పారిజాతాపహరణము- ప్రథమాశ్వాసము- ముక్కు తిమ్మన;
రాయల కొలువులో నున్నకవులలో నరణపు కవి ముక్కుతిమ్మనగారు. "ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు" వీరి కవితా ప్రశస్తికి నాటి సమకాలీన కవిలొసంగిన ప్రశంస! ఇది వీరిపట్ల యన్వర్ధమే! చక్కని మధుర పదములతో నాతి కఠినముగా రస సింధురముగా ,భావ బంధురముగా , కైత లల్లుట వీరికి దెలిసి నట్లు మరెవ్వరికిఁ దెలియదు. పాత్రల మనోభావముల కనుకూలమైన రచన గావించుట వీరి ప్రత్యేకత!
రాయల వారి యంతఃపుర జగడ ముల నాధారముగా పారిజాతాప హరణమును వీరు రచించినట్లు లోక ప్రవాదము.
నిజమెంతో తెలియదు. ఏది యేమైనను వీరిప్రబంధము రాయలకు మనోముదంబై పాఠకులకు మనోరంజకమై యలరారు చున్నదనుట యదార్ధము.
ఈప్రబంధమున జగన్నాటక సూత్రధారి కృష్ణుడు నాయకుడు, కాగా సాత్రాజితి సత్యభామ నాయిక. నారదుని రాకతో పారిజాత పుష్పము కారణముగా నీమె యలిగినది. యెవరిపై? కృష్ణుని పై, ఆయలకలో పతాక స్థాయి దృశ్యమున నున్నదీ పద్యము. ఇందేమున్నది? సత్యభామ యేడుపు! ఏమిది? యేడుపునకుగూడ పద్యమా? అవును, ప్రబంధ కవులు ఆవిషయమును గూడ విడువలేదు. లౌకికముగా నాడుదియేడ్చుట వేరు. ఈమె యేడ్చుట వేరు.కారణము ? ఆమెకలవారి బిడ్డ! అందాల బంగరుబొమ్మ! కృష్ణుని హృదయ రాణి! అందుకే ప్రత్యేకముగా నింత సీను కవిసృజింప వలసివచ్చినది.సరి , ఆవిషయమేదో చూతము.
కఠిన పదములకు అర్ధము:- ఈసు- అసూయ; కోప దవానలము-కారుచిచ్చును బోలిన కోపము; గాసిలి-గాయపడి; పంకజశ్రీ-పద్మశోభ; గ్రాసము- తిండి; కషాయకంఠము-వగరుగొంతు;కలకంఠవధూ- ఆడుకోయిల; కాకలీధ్వని- చెప్పరాని మాధుర్యమునుజిందు సవ్వడి;
సత్య భామ యేడ్చుచున్నది? యేల? ఈర్ష్యచే, ఆఈర్ష్య సామాన్యమైనదికాదు. కారు చిచ్చువంటిది. కారుచిచ్చు అడవులలోబుట్టును.పరిణామము అడవి యంతయు భస్మ మగుట! ఇపుడీ సత్య కోపమువలన శ్రీ కృష్ణుని యంతఃపుర పరివారము అందరకూ విపత్తు కలుగ నున్నది. ఆఈర్ష్యాగ్ని దావానల సదృశమై ఆమెహృదయమును కలత నొందింప,
కృష్ణుని సముఖమ్మున ముఖారవిందముపై చీరచెంగు గప్పుకొని బిగ్గరగా యేడ్చినదట! ఆయేడుపు గూడా విన సొంపుగానే
యున్నదట! లేచిగురులను మేసి వగరుదిగిన గొంతుతో కోయిలమ్మ కూయుచున్నట్లున్నదట! కవి యా యేడుపు ను
కలస్వనమనుచున్నాడు; అవ్యక్త మధుర ధ్వనిని కలస్వనమంటారు; ఇలాయేడిస్తే పెళ్ళాం యెవరు కాదంటారు? అబ్బ ! యెంత ముద్దుగా ఉంటుందో?
ఇంతకీ యేడుపు తప్ప వేరు మార్గము లేదా? యని ప్రశ్న? ఆడువారికి బ్రహ్మ గారు సహజ మైన నాలుగు అస్త్రాలను ప్రసాదించాడు. యెందుకు? మగవారిని గుప్పిట బట్టటానికి. మొదటిది నవ్వు . అది సమ్మోహనాస్త్రము. రెండవది కొంటెచూపు,
అది సమాకర్షణమంత్రము.మూడవది కోపము ,అది ఆగ్నేయాస్త్రము.నాలుగవది ఏడుపు ఇది బ్రహ్మాస్త్రము.దీనికిక తిరుగులేదు.
కృష్ణుడు బ్రహ్మాండ నాయకుడాయె ఆయనమీద వేరు అస్త్రములు పనిచేయవు.
అందుచేతనే
బ్రహ్మాస్త్ర ప్రయోగము. ఆఏడ్చు సమయమున నెంతజాగ్రత్తలు చేసెనోకవి గమనింపుడు. మొగమా యందమైనది. దుఃఖసమయమున నది వికృతముగా గనిపించినచో మొగవారికి యేహ్యభావము కలుగ గలదుగదా అందువలన చేలచెఱగును ముసుగిడి ఆమె నేడ్పించెను.ఇది గమనింప వలసిన కవితా శిల్పము.
సరే తరువాతి పరిణామ మనమ౦దరెరిగినదే! కావ్యమున ననియేమి నిజ జీవితమునగూడ నిట్టి ఘటనలు గృహస్థజీవనమున స్వాభావికములే!
ప్రబంధ నాయికలు మువ్వురూ వంతుల వారిగా నేడ్చుట నీయుగ సాహిత్యమునందలి వింత!
మనుచరిత్ర నాయిక వరూధిని; పారిజాతాపహరణము నాయిక సత్యభామ ; వసుచరిత్ర నాయిక గిరిక ; యీమువ్వురూ విరహ కారణముగానే యేడ్చినారు. ఆహా! విప్రలంభ శృంగారము ప్రబంధకవులచే నెంతగా నారాధింప బడినది! యేది యేమైనను సత్యఏడుపు కవులకు ,కవితా పిపాసులకు చక్కని కానుకే ననుట తధ్యము!
-(శ్రీ సత్యనారాయణ చొప్పకట్ల గారి సౌజన్యముతో)
--((**))--
ు మరీ అదేమాట అన్నాడు ఏది జరిగినా మన మంచికే అని. రాజుకు కోపం వచ్చి అతన్ని చెరసాలలో పెట్టమని ఆజ్ఞాపించాడు.అతన్ని చెరసాలలో పెట్టేటప్పుడు కూడా అతను యిదీ మన మంచికే అంటూ లోపలి వెళ్ళాడు.కొన్నాళ్ళ తర్వాత రాజు వేటకి వెళ్ళాడు..అక్కడ దారి తప్పి అడవిలో చాల దూరం వెళ్ళిపోయాడు.అతని సైనికులూ,అంగ రక్షకుడూ
యేవరూలేరు.అక్కడికి కొంత మంది ఆటవికులు వచ్చి అతన్ని బంధించి తీసుకొని వెళ్ళారు.వారి నాయకుడి ముందు నిలబెట్టారు.అతడు ఇతన్ని మన దేవతకు బలి యిచ్చేద్దాం అని అన్నాడు. సరే అతనికి స్నానం అదే చేయించి దేవత దగ్గరికి తీసుకని రండి అని ఆజ్ఞాపించాడు.వారు అతనికి స్నానం చేయించేటప్పుడు అతని కాలికి బొటనవేలు లేక పోవడం గమనించారు.నాయకుడి దగ్గరకు వెళ్లి యితనికి అంగ వైకల్యం వుంది ఇతను బలి యివ్వటానికి పనికి రాడు. అన్నారు. సరే అయితే అతన్ని వదిలి వేయండి అని ఆజ్ఞాపించాడు. రాజు బ్రతికి జీవుడా నాయి తన గుర్రం యెక్కితిరిగి తిరిగి ఎలాగో ఒకలాగా తన రాజ్యానికి
చేరుకున్నాడు.అప్పుడు అతనికి తన కాలికి బొటనవేలు లేకుండా వుండడం వల్ల తను బ్రతికి బయట పడ్డాడు కదా! మరి భీముడు చెప్పింది నిజమే కదా!తనకు వేలు లేక పోవడ వల్ల తనకు మంచే జరిగింది అని అతన్ని చేరసాలనుంచి విడిపించి అతన్ని క్షమాపణ కోరాడు.భీముడు క్షమాపణ యెందుకు మహారాజా యిది కూడా నామంచికే గదా జరిగింది.అన్నాడు.అదెలా? అని రాజు అడిగాడు.నేను చెరసాల లో వుండకుడా వుంటే నేను మీ వెంట వేట కు వచ్చేవాడిని.
. అడవిలో మీ అంగ రక్షకుడిగా నా ధర్మం నిర్వర్తించేందుకు మీ వెంటే వుండేవాడిని.
అప్పుడు ఆ ఆటవికులు మిమ్మల్ని వదిలేసి బాగున్న నన్ను బలి యిచ్చేవారు కదా! మీరు నన్ను చెరసాలలో పెట్టి నందున నాకు మేలే జరిగింది.మీరు నా ప్రాణం కాపాడినట్టే కదా! నాకు మేలే జరిగింది.
మీరేమీ బాధపడకండి. ఏది జరిగినా మన మంచికే అని నేనందుకే చెప్తూ వుంటాను.అన్నాడు.రాజు అతనికి
మంచి బహుమానం యిచ్చి జీతం ఎక్కువచేసి గౌరవించాడు.దీని వల్ల నీతి యేమంటే. మనం అందరం ఏది జరిగినా దేవుడి ప్రసాదమని స్వీకరించగలిగే ప్రవర్తన కలిగి వుండాలి(positive attitude).
----------------శుభసాయంత్రం----------------------------
-------------------శుభసాయంత్రం----------------
Comments
Post a Comment