శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ: - శ్రీ కృష్ణాయనమ:

ఆనందం - ఆరోగ్యం - అఆథ్యాత్మికం

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
ఓం హ్రీమ్ శ్రీ౦ శ్రీమాత్రే నమ:


శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ

చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా .... 1


శ్రీమాతా :"శ్రీ శబ్దము వాక్పరము " కావున వాక్కులను కలుగ చేయుటకు ఈమెతోసమానమైన ఏదేవతలు లేరు కనుక శ్రీ మాతా అని పిలుస్తారు.

సృష్టికి మూలం స్త్రీ
శ్రీ మాత - లక్ష్మీదేవి కే తల్లి
మా - కొలుచుట
త్రేయం : తెలుసుకొనుట

పెదాలు కలిపి పిలిచేది "అమ్మా "
పుడమి పై జన్మించిన వారు ఎవరైనా ముందు పలికెడిది " అమ్మా "

అమ్మని మించిన దైవం లేదు - ఆరాధించని బిడ్డ లేదు
ఆదుకోని తల్లి లేదు - సమస్తం త్యాగం చేసేది అమ్మే
అందుకే మాతృ దేవో భావ అన్నారు ముందుగా

శ్రీ మహారాజ్ఞి : సకల ప్రపంచ పాలనా సామర్ధ్యము కలది కావునా "శ్రీ మహారాజ్ఞి" అని పిలుస్తారు.

పరిపాలించింది: మహారాజ్ఞి ( ప్రకృతిని సాశిస్తు, సమస్త దేవతాగణాలను అజమాయిస్తూ సమస్త కష్టాలను తొలగించే మహారాణులకు రాణి)

హా అనగా ఒక గాలి తరంగం ( ఆకర్షణ, వికర్షణ తో కదిలేది )

మహా అనగా ఎవ్వరూ ఊహించనటువంటి, తరంగ రూపములో మనసులో ప్రవేశించి అంగాంగ వెలుగును అందించే రాజులకు రాణి మహారాణి
సమస్త సృష్టికి స్త్రీ యే మూలం," సృష్టి, స్థితి, లయ" కారులకు అధికారి స్త్రీ
అందుకే స్త్రీని గౌరవించే దేశం సస్యశ్యామలంగా ఉంటుంది అక్కడ అమ్మవారు స్థిరంగా ఉండి సమస్త క్షోభలను తొలగిస్తారు.


శ్రీమత్సింహాసనేశ్వరీ :బంధమోక్ష స్వరూపాది సకాలమును చూపింప నారభించు" సింహవాహనముగా గల ఈశ్వరీ "

చంద్రునిలో 16 కళలు ఉంటాయి, స్త్రీ మనస్సులో 16 కళలు ఉన్నాయి, సింహంలా జీవించాలనేది అమ్మవారి ధ్యేయం. సింహంలా బ్రతకండి అనగా సింహం 20 గంటలు నిద్ర పోతుంది 4 గంటలు మేలుకొని ఆహరం సంపాదిస్తుంది. అది ఆహారాన్ని కూడా ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి మరి సంపాయిస్తుంది తాను తినగలిగినది తిని వదిలే స్తుంది. స్త్రీ కూడా 20 గంటలు కష్టపడి జ్ఞానమనే కళలను తనకు తెలిసినవి బిడ్డలకు అందిస్తుంది అందుకే స్త్రీలు సింహం పై సవారి చేసే స్త్రీ లా ఉండాలనేదే భావం .

--((**))--


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం-2
ఓం హ్రీమ్ శ్రీ౦ శ్రీమాత్రే నమ:

4. చిదగ్ని కుండసంభూతా: అగ్నిగుండములో పుట్టి, పూర్తి బ్రహ్మతేజస్సుతో, ఇచ్ఛా తేజస్సుతో శక్తి  రూపముగా ప్రత్యక్షమైన తల్లి. 

"ద్రౌపతి "అగ్నిగుండం నుండి ఉద్భవించిందని మనకు భారతం భోధిస్తున్నది . 
ఈమె "నిత్య కన్య" పతివ్రతా అని తెలియపరిచారు. 
స్త్రీ అనగా ఒక అగ్ని స్వరూపం, ఇది బ్రహ్మాండమంతా వెలుగును చిమ్మి వేడిని కల్గించి కరుణ రసం ద్వారా శాంత పడి ఉండేది .

కోరిక తీర్చుటకు నిత్యమూ వెలుగును మన: శాంతిని అందించేది,  సమస్త శక్తిని ధారపోసేది స్త్రీ అని తెలుపుతుంది శాస్త్రం, ఇది అక్షరాలా నిజం. 
            
5. దేవకార్యసముద్యతా   : దేవకార్యార్థము కొరకు ఆవిర్భవించిన తల్లి, శ్రీ చక్రాకారముగా ఆవిర్భవించి  ప్రత్యక్షమైన తల్లి. నేను నాది అనే భావాన్ని తొలగించి కరుణా సముద్రాన్ని అందించే తల్లి. 
   
తమో గుణం విజృంభించినప్పుడు (రక్కస గుణం) రక్షణ  సద్భావ, ఆరాధ్య పరులకు చేదోడుగా  (దేవ) శక్తి నందించి సమస్త కృషికి సహకరించే మ్మా అమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు   

--((**))--

 శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం-౩
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

ఉద్యద్భానుసహస్రాభా : అనేక సూర్యకిరణములు గల రక్తకాంతితో ప్రకాశమంతముగా పరాశక్తిగా మారిన  తల్లి. 

ఒక వెలుగు కిరణం చొరబడి చీకటిని తరుముతుంది. తెల్లటి కిరణం క్రమేపి ఎర్రగా మారి నల్లని నిడ ఏర్పరచి తనలో తనే మాయ మౌతుంది. అనగా ' కట్టే ' దహించి వేలుగును పంచి, ఆనేక ఉపయోగాలకు ఉపయోగపడి చివరికి బూడిదగా మారి ఇంకా ఉపయోగ పడుతుంది. ఒక కిరణం 'లక్ష ' కిరణాలకు దారి చూపుతుంది. అనగా జీవంలో ఒక శక్తి పుంజాన్ని ప్రవేశపెట్టి సమస్త కల్ముష భుద్దిని తొలగించే తల్లి.            

చతుర్బాహు సమన్వితా : నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తాలు క్రిందగా రెండు హస్తములు గల దేవతగా ప్రత్యక్షంగా కనబడుతున్న తల్లి.
మానవులకు రెండు చేతులు ఏర్పరిచింది అమ్మ , ఏ చేతితో ఏమి చేయాలో నిర్ధారించి మరి తెలియపరిచింది కాని ఆ మహాతల్లి నాలుగు చేతులతో నలుగు దిక్కులా ఉండి సమస్త లోకాలను సమన్వయపరచి, నాలుగు వేదాలను మార్చి మార్చి అందరూ  ఒకే విధముగా ఉండేందుకు,   ఒకేవిధముగా చూచుటకు శక్తి నంతా ధారపోసే తల్లి.     

--((**))--

 శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం-4
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ 

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా


రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

రాగస్వరూపపాశాడ్యా  : సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లి.  

నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలను ధరించి లోకరక్షనచేస్తున్నది.  పాశము, అంకుశం, చెరుకుగడ, 5 తామరపువ్వులు ధరించింది.

రాగము అనగా ఇష్టం, స్వరూప అనగా రూపాలంకారం, పాసాడ్యం అతి ప్రేమ - ఇష్టం వేరు ప్రేమ వేరు, తినేపదార్ధాలలో ఇష్ట మైనవి ముందుగ తినటం, ప్రేమ అనగా కుటుంబానికి సహాయపడి అందరూ మంచిమార్గంలో నడిపించటానికి ఉపయోగపడేది.             
దుతరాష్టుడు 100 మంది కొడుకులుపై అతి ప్రేమ పెంచుకొని ఏమైనాడో తెలుసుకోగలరు. అట్లాగే శుక్రాచార్యుడు కూతురు దేవయాని పై ప్రేమ ఎంతవరకు వెళ్లిందో తెలుసుకోగలరు. పాశం వెంబడిన్చినప్పుడు ఎంతటివారైన మారక తప్పదు.   
  
క్రోథాకారాంకుశోజ్జ్వలా : అమ్మవారి క్రోధమే అంకుసాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు  చున్న హస్తముగల తల్లి

క్రోధం మదం నుండి ఉద్బవిస్తుంది, మదం మనస్సును వేధిస్తుంది, మనస్సును అదుపులో చేయటానికి ఏదైనా ఆయుధము కావాలి. మదగజాన్ని అదుపు పెట్టుటకు అంకుశం వాడుతాడు. మనలో పెరిగే క్రోధమనే జ్వాల నలుదిక్కులా వ్యాపించకుండా అదుపులో పెట్టుటకు "అమ్మే దిక్కని వేడుకోవాలి" అమ్మ శాంత వచనాలు క్రోధజ్వాలపై కరణ రసాన్ని చల్లి చల్లార్చగలదు. 


--((**))--    

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం-5
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా

నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా .... 3

మనోరూపేక్షు కోదండా : శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి.

మనస్సు అనేది పరుగెత్తే గుఱ్ఱము లాంటిది, గుర్రానికి కళ్లెం వేసి ఆపినట్లుగా, మనసుకు బంధం అనే, భక్తి అనే కళ్లెం వేసి ఆపాలి. చెరకు గడ పిప్పి ఎక్కువా, రసం తక్కువా కానీ రుచి తెలుసు కోలేనివారు జీవితమే గడపలేరు, అట్లాగే మన మనస్సులో అనేక సమస్యలు చెరుకు గడ చెత్త లాంటివి, చెత్తను ఇంకా పిండితే రసం వస్తుందని ఆసిస్తాం. అట్లాగే మన మనస్సులో తెగని సమస్యలు వెంబడిస్తూ కల్లోపరుస్తాయి. అవి మనస్సును ఆఆకర్షించే బాణాలు, అవి మనస్సును కలవరపరిచే నేత్రాలు. వాటిని తొలగించి మనస్సు శాంత పర్చమని ప్రాధేయపడుతూ వేడుకుంటున్నాము తల్లి.

పంచతన్మాత్రసాయకా : శ్రీదేవి కుడిభాగము బాహువు యందు పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.

చిన్న శబ్దానికి కలవరపడే మనసు మాది, దానికి తోడు స్పర్శ సుఖం కోసం వెంపర్లాడే గుణం మాది, రూపాన్ని చూసి ఆకర్షించే లక్షణం మాది, వాసనకె మనసు మెచ్చుకొని బుద్దిని మార్చుకొనే స్నేహం మాది, జిహ్వచాపల్యానికి తట్టుకొని జీవించటమే కష్టాముగా ఉన్నది మాకు. అమ్మ మీ పంచ బాణాలను మాపై ప్రయోగించమ్మా మాలోఉన్న దుర్గుణాలను తిలగించమ్మా అందుకో మేము నిత్యం మిమ్ము వేడుకుంటున్నాము తల్లి .

--((**))--

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం-6
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా 
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా  ....  3 

నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా : శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా 

       శ్రీదేవి క్రింది వామహస్తమునందు ఎఱ్ఱ చెఱకు విల్లు దనస్సుగా కలది  "మనస్సే చెఱకు విల్లుగా ఉండి సంకల్పమునకే మనస్సు సంజ్ఞ అందించే తల్లివి, శ్రీదేవి కుడిభాగము బాహువు యందు  పంచభూతాలనే (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధములు) అనే బాణములు ధరించి ప్రపంచ ప్రజలకు అందించిన తల్లివి.శ్రీదేవి శరీరమునుండి ఎర్రని కాంతి పుంజముల సమూహము వెలుబడి ఆకాంతిలో బ్రహ్మాన్డ మండలాలు కాంతి వంతముగా మార్చిన తల్లివమ్మా, 

ప్రపంచమంతా మంతా ఒక విధమైనటువంటి కాంతికి ఆకర్షించి మనస్సును కల్లోల పరచి ఆనందాన్ని  కల్గించి, కొత్త విషయాలను తెలియపరిచి నేత్రద్వయం నుండి ఎర్రని కాంతి కిరణాలను ప్రసరింపచేసి సమస్త జీవకోటిని రక్షించే తల్లివమ్మా. 

సకల ప్రాణులు స్పర్శ ఆకర్షణకు లోనై పతన మౌతున్నారు . శ్రీ శంకరాచార్యులు చప్పినట్లు " లేడి వేణుగానమునకు లోనై  వేటగాడి పని అని తెలిసినా శబ్దా కర్షణకు లోనై వలలో చిక్కి విలవిల లాడిపోతుంది. గజములను పట్టుటకు పెద్ద గుంటలు తవ్వి వెనుకనుండి గంట వాయించి కొంత దూరములో ఆడ ఏనుగును ఉంచుతారు.   ఆడ ఏనుగును చూసి మోగ ఏనుగులు దారిపట్టి గుంటలోపడి బాధపడుతాయి. కమలం విచ్చుకోగానే సుఘంద పరిమళాలను వెదజల్లుతుంది.  ఆసువాసనకు తుమ్మెద చేరి మకరందాన్ని త్రాగాలని చేరి కమలం ముడుచుకోకనే లోపాల యిరుక్కుపోయి బాధ  పడుతుంది. మిడత వెలుగును చూసి భ్రమించి దానిలో పడి చనిపోతుంది అట్లాగే చేప గాలానికి ఏర ఆహారము అని భ్రమించి గాలానికి చిక్కి ఆహారమౌతుంది. ఈ మానవులందరు  (శబ్ద,స్పర్శ,రూప రస ఘాంధముల కు చిక్కి ఉన్నారు ) అమ్మా నీ  ఎర్రని కాంతితో మాలో ఉన్న దోషభూయిష్టమైన గుణాన్ని మార్చ గలవని ప్రార్ధించు తున్నామమ్మా . 
          
 ఈ రూపములో అమ్మను ధ్యానించినవారికి సర్వజనావశ్యము, సర్వజగద్వశ్యము తప్పక జరుగునని ఋషులు తెలియ పరిచారు. పంచ భూతములతో ఎర్రని కాంతి వంతముగా వెలిగిపోతున్న అమ్మకు శత కోటి దండాలు          

--((**))--

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

 చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా : చంపకము అశోకము పున్నాగము మొదలగువృక్షముల పుష్పములను కొప్పుగా ధరించి వాటియొక్క పరిమళాలు స్వత సిద్ధముగా అంతటా వ్యాపింప చేసిన తల్లివమ్మా, 

చంపకము అనే పుష్పం జీవరాశులకు ఉత్తేజం కల్పించి, సమస్త చరాచర జీవకోటి ఉత్పత్తి ఆలింగనం సౌష్టవ ప్రక్రియకు దొహదపడే మనస్సును పేరేపించి  , వీణా నాదంతో మనస్సులో ఉన్న శోకమును తొలగించేది అశోకం అందుకే అమ్మకు అశోకమంటే ఇష్టం. పున్నాగము అనగా ఇంద్రుని ఐరావతం అందుకే తెల్ల కలువపూలు ధరించి ఏనుగుమీద విహరించాలని కోరిక ఎక్కువ, శుఘంధ పూల పరిమళాలతో  మాణిక్యమాలలతో సమస్త లోకాలను పరిమళింప చేస్తున్న తల్లికి శతకోటి వందనములు. 
--((**))--          

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

నిత్య శోభాయమానంగా పూల పరిమళాలతో ఆకర్షించటం సహజలక్షణం, అందులో స్త్రీల కేశాలలో పూలు అలంకారానికి తుమ్మెద జుంకారములు పెరుగుతాయాని పెద్దలు తెలియ పరిచారు. ఇది స్త్రీ పురుషుల ఏకం కావటానికి దోహత పడతాయని తెలియపరిచారు. ముఖ్యముగా అమ్మవారు చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక పుష్పాలతో కేశాలలో అలంకరించుకొని సమస్తలోకాలను పరిబ్రమిస్తూ మనస్సును రంజింపచేయుచున్నది. చంపకపుష్పాలను ధరించుటవల్ల శిరోబాధ తగ్గి చెంపలవెంబడి చెమట త్తగ్గిపోతుంది, అశోక పువ్వు ధరిస్తే సమస్త బాధలు తగ్గిపోతాయని నమ్మకము, పున్నాగపువ్వు ధరించుట వళ్ళ ప్రతినెల వచ్చే ఋతుశ్రావ భాదలు తొలుగుతాయి, సౌగంధిక పుష్పాలు ధరించుటవల్ల కొత్త అందాలు వెల్లువవుతాయి. 

               కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా: కురువింద శిలలా గర్భమునందు పుట్టిన పద్మరాగమణిగణఖచితమయి వెలుగుచున్నకిరీటముచేత ప్రకాశింప బడుచున్న తల్లివమ్మా       

ఎఱ్ఱని వడ్లగింజవలె ఉన్న కురువింద మణి ఉన్న, పద్మరాగమువలె వెలుగుతున్న,పసిడి వెలుగులు ప్రపంచమంతా ప్రకాశింపచేయుచున్న తల్లివమ్మా. 

--((**))--

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం- 9 
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా    ........ 5

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా :  అర్ధచంద్రాకారమైన ఫాలప్రదేశము కల శ్రీ దేవివమ్మా,  స్త్రీల ముఖానికి బొట్టే అందం, మహాశివునికి ముడో కన్ను ఫా ల ప్రదేశ మునందే కలదు. అర్ధ చంద్రున్ని సిరోజాలమధ్య భరిస్తున్నాడు.   

ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేష కా : ముఖమనే చంద్ర బింబమునందు కళంకము వంటి కస్తూరీ   తిలకము గల శ్రీదేవివమ్మా . 

అర్ధచంద్రాకారమైన ఫాల ప్రదేశము కల శ్రీ దేవివమ్మా, ముఖమనే చంద్ర బింబమునందు కలంకము వంటి కస్తూరీ తిలకము గల శ్రీదేవివమ్మా, ఫాలప్రదేశము అర్ధచంద్రాకారము, ముఖము చంద్రబింబము వలె వెలిగి పోచున్న అమ్మలు గన్న అమ్మకు మా శతకోటి దండములు. 

--((**))--


వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా     .........6 

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా : అమ్మవారి ముఖమనే మన్మధుని మాంగళ్య గృహము యో క్క మొదటి ద్వారమున కనుబొమలు తోరణములుగా ఉన్న తల్లివమ్మా .

స్త్రీకి మాంగళ్యం ఆభరణమే కాదు, మనోనిగ్రహశక్తి కల్గిస్తుంది, ఒక విదమైనటు వంటి స్వాతంత్రభావం కల్గిస్తుంది, కనురెప్పలతో పిలిచినట్లు, గృహ యజమాని  పూర్తీ సహకారం అందించేవిధముగా  తల్లికి  వందనములు      

వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా  :ముఖ కాంతి యను ప్రవాహము నందు సంచలించు చున్న  మత్యముల వంటి నేత్రములు గలతల్లివమ్మా  
కను చూపు కదలికలతో  మా ప్రవహింపచేసి ముత్యమువంటి వెలుగు అందించిన   తల్లికి వందనములు 
 --((**))--
నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా 
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా     ........ 7 

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా : అప్పుడే వికసించిన సంపెంగ మొగ్గతో సమానమైన నాసికా దండము చేత ప్రకాశింప బడుచున్న తల్లివమ్మా 


అమ్మవారి ముక్కును సంపెంగతో పోల్చారు.  తుమ్మెదలు న్ని పుష్పాలపై వాలుతుంది కాని సంపెంగ పువ్వుపై వాల లేదు, అందుకే తుమ్మెద బ్రహ్మను తపసుతో మెప్పించింది అప్పడు బ్రహ్మ వరం ఇచ్చాడు కనుపాపలపై ముక్కుకు ఇరువైపుల ఉండే వరం ఇచ్చారు అప్పటి నుండి కనుద్రేప్పల వెండ్రుకలే తుమ్మెదలు అన్నరు కవులు.   

   తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా : నక్షత్ర కాంతులను తిరస్కరించే మాణిక్య మౌక్తికముల చేత పొదగబడిన నాసాభరణము తరించిన తల్లివమ్మా,

అమ్మవారి ముక్కున ఉన్న ముక్కెర గురించి కవులు వర్ణించారు. కాళిదాసు మహాకవి స్వేద బిందువు జారిజారి నుదుట బొట్టుతో కలసి ముక్కు దూలము దాకా వచ్చి ఆగిన  బిందువు ఎర్రగా కనిపిస్తూ ముత్యమువలె వెలుగి సౌందర్యానికి వన్నెతెచ్చిందమ్మ. నింగిన ఉన్న నక్షత్రాన్ని చూస్తే మన మనస్సు ఎంత ఉల్లాసం కలిగిస్తుందో దానికన్నా మీ ముక్కు పుడకను చూస్తేనే  మా మనస్సు శాంతిని పొందుతుందమ్మా . విశ్వమంతా వెలసి ఉన్నావమ్మా. అమ్మ వారి ముక్కు వెదురుబొంగు చివర ముత్యము కన్నా వెలుగుగా ఉంటుంది. అమ్మవారికి అడ్డబాసు ఉన్నది. దానికి పైన మాణిక్యం (ఎరుపు) , క్రింద ముత్యం (తెలుపు),  కాళి రూపం (నలుపు) అందుకే అమ్మవారు త్రిగుణాత్మకం కలిగి వెలుగు చూపు తల్లికి వందనములు.      

--((**))--
శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర - భాష్యం-12
రచయత : మల్లాప్రగడ రామ కృష్ణ


కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా     
తాటంక యుగళీ భూత తపనోడుపమండలా   ...... 8 

కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా  : కర్ణోపరిభాగమునందు చిన్న కడిమి పూగుత్తి చేత ప్రకాశించు చున్న తల్లివమ్మా . 

చెవుల పైభాగమున  నవరత్నాలతో పొదగబడిన పువ్వుల గుత్తిలా మెరుస్తూ సర్వం 
వెలుగును పంచుతూ ప్రకాశిస్తున్న తల్లికి వందనములు.  
  తాటంక యుగళీ భూత తపనోడుపమండలా : చెవి కమ్ములు యందు ఒకవైపు సూర్యుడ్ని, మరోవైపు  చంద్రడ్ని ఆభరణములుగా ధరించి న తల్లివమ్మా మరి ఏదేవతకు ఈవిధమైన సౌకర్యము లేదమ్మా. 
ఒక చెవియందు  వేడి తాపము కల్గించు సూర్యుని రూపములో, మారోవైపు చలాల్గా ఉండే చెంద్రుని రూపములో కమ్ములు కలిగి ఉన్న తల్లికి వందనములు. 
     
--((**))--

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం
పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ :    
నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా  .....  9 


పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ : శ్రీదేవి చెక్కిళ్ళు అద్దము కన్నా నునుపుగాను, పద్మరాగము కన్నా ఎరుపును కలిగి ప్రజలందరికి  ప్రకాశిస్తూ కనబడుతున్నావమ్మా.

నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా: పెదవులు ఉన్నతముగాను, అధికమైన ఎర్రనిరంగు కలిగి ఉన్నందువలన అప్పుడే పుట్టిన పగడపు తీగయొక్క శోభను, బాగుగా పండిన దొండపండు రంగును గల పెదవులు గల తల్లివమ్మా. 

చెక్కిళ్ళు పద్మరాగము కన్నా ఎరుపుగాను, పెదవులు పగడపు తీగ కన్నా ఎరుపుగాను కనబడుతూ ప్రజలందరికి దర్శనమిస్తున్న అమ్మలగన్న అమ్మకు మా శతకోటి దండములు.  

శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా !
కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా !!  ..... 10


శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా :  "ప్రాధమిక విద్య, షోడషా క్షరీవిద్య,శుద్ధవిద్య అను మూడింటిలో ఉన్న 16 బీజములు అంకురములు. శ్రీదేవి ఈ బీజములయందు శివభక్తి నిండి యున్నది ఇవి రేడుదశలుగా పైన క్రింద దంత  పంక్తులుగా ఏర్పడినవివీరితో నిత్యము మంత్రవర్ణములు గల తల్లివి.     

కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా : శ్రీదేవియొక్క ముఖమునందు కరుపురాది సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లివి. 

"ప్రాధమిక విద్య, షోడషాక్షరీవిద్య, శుద్ధవిద్య అను మూడింటిలో ఉన్న 16 బీజములు అంకురములు. శ్రీదేవి ఈ బీజములయందు శివభక్తి నిండి యున్నది ఇవి రెండు దశలుగా పైన క్రింద దంత  పంక్తులుగా ఏర్పడినవి వీటితో నిత్యము మంత్రవర్ణములు గల తల్లివి. ముఖము నందు కర్పూర రాది సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లివి. 
నిత్యమూ శివభక్తి బీజాక్షరములతో జపిస్తూ సుఘంధ ద్రవ్య సంయుతమగు కర్పూర వీటిక గల తల్లికి మా శతకోటి దండములు 

నిజస్సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ !
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా!! ... 11

నిజస్సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ: అమ్మ వాక్యములందు వర్ణ విభాగము స్పష్టముగా నున్నందున మాధుర్యము అధికముగా నున్నాదనియు, దేవి వాక్కులు వీణానాదమును తిరస్కరించుచున్నమనసును హత్తుకొనేవి.     
 
 మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా: శ్రీదేవి యొక్క ముఖము సర్వదా చిరునవ్వుతో గూడి యున్నందున ఆ మందహాసము యొక్క కాంతి ప్రవాహమునందు శ్రీదేవి భర్త ఆయిన కామేశ్వరుని మనస్సు మునుగుచూ తేలుచు అస్వాధీనముగా నున్నది

అమ్మ వాక్యములందు వర్ణ విభాగము స్పష్టముగా నున్నందున మాధుర్యము అధికముగా, ముఖము సర్వదా చిరునవ్వుతో గూడి యున్నందున ఆ మందహాసము యొక్క కాంతి ప్రవాహమునందు శ్రీదేవి భర్త ఆయిన కామేశ్వరుని మనస్సు మునుగుచూ తేలుచు అస్వాధీనముగా నున్నదిగా ఉన్న తల్లికి శతకోటి దండములు
   
అనాకాలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా !
కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధరా !! ...... 12

అనాకాలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా : శ్రీ దేవి చుబుకమునకు సమానమైన వస్తువులే దొరకనందున అద్దమునందు సౌమ్యముగా ఉన్నది ప్రకాశించు చున్న గడ్డము కలది.     

కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధరా :   పరమశివునిచే కట్టబడిన మంగళసూత్రము చే ప్రకాశించు చున్న ఖంఠము కలది. 
శ్రీ దేవి అందమైన చుబుకం కలిగి మంగళ సూత్రంతో ఖంఠం ప్రకాశించు చున్న తల్లికి శత కోటి  దండాలు.  

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా !
రత్న గ్రై వేయచింతా కల్లోల ముక్తా ఫలాన్వితా !! -13 

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా: బంగారముతో నిర్మించబడిన నాలుగు భుజకీ ర్తులచే అలంకరించ బడిన బాహువులు గల అమ్మలుగన్న అమ్మ.  రత్న గ్రై వేయచింతా కల్లోల ముక్తా ఫలాన్వితా : నవరత్నములచే కూర్చబడిన మూడు ముత్యాల కంఠాభరణములు ధరించిన అమలుకన్నమ్మకు వందనములు 

బంగారముతో నిర్మించబడిన నాలుగు భుజ కీర్తులచే అలంకరించబడిన బాహువులు గల అమ్మలుగన్న అమ్మ, నవరత్నములచే కూర్చబడిన మూడు ముత్యాల కంఠాభరణములు ధరించిన అమ్మలుగన్న అ కు వందనములు.  

   

కామేశ్వరప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ !

నాభ్యాలవాలరోమాలిలతా ఫాలకుచధ్వ ఈ !!  ...... 14  

కామేశ్వరప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ : జగన్మాత తనభర్త అయిన కామేశ్వరుని ప్రేమ అనే రత్నమును పొందుటకు తన స్తనద్వయములనే ప్రతిపనముగా ఇచ్చునది. ఒక ప్రేమ రత్నమునకు రెండు స్దాన రత్నములను అందించుటయే స్త్రీ ఔదార్యాము చూపిం తల్లివి.   

నాభ్యాలవాలరోమాలిలతా ఫాలకుచధ్వ ఈ: నాభి పాదుగా తుమ్మెదలవంటి రోమరాజి  అనే లతకు ఆలవాలమై యున్న అమ్మకు శతకోటి వందనములు 
  
జగన్మాత తనభర్త అయిన కామేశ్వరుని ప్రేమ అనే రత్నమును పొందుటకు తన స్తనద్వయములనే ప్రతిపనముగా ఇచ్చునది. ఒక ప్రేమ రత్నమునకు రెండు స్దాన రత్నములను అందించుటయే శ్రీ ఔదార్యాము చూపించిన తల్లివి. నాభి పాదుగా తుమ్మెదలవంటి రోమరాజి  అనే లతకు ఆలవాలమై యున్న అమ్మకు శతకోటి వందనములు 

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

లక్ష్యరోమలతా థారతాసమున్నే యమధ్యమా ! 
స్తనభార దళన్మధ్య పట్టబంధువళిత్రయా !!..... 15

లక్ష్యరోమలతా థారతాసమున్నే యమధ్యమా: శ్రీదేవికి మధ్య ప్రదేశము ఉన్నదా లేదా అనే సందేహము వచ్చినది, మధ్య అనేది ఉండటం వల్ల, మరియు స్త్రీలకు సన్నని నడుము ఉండుట శుభలక్షణమ్. 
స్తనభార దళన్మధ్య పట్టబంధువళిత్రయా :  శ్రీదేవి మధ్యభాగమునందు వళిత్రయము ఉన్నది.  ఈ వళిత్రయము మీది  శరీరమందున్న స్థన  భారము చేత, మధ్యప్రదేశము అల్ప  మైనందున వంగి పోవు నేమోనని సువర్ణ వస్త్రముచేత మధ్యప్రదేశము ముమ్మారు తిప్పి కట్టినట్లుగా తోచు చున్నది.   

స్త్రీలకు సన్నని నడుము ఉండుట శుభలక్షణమ్, సువర్ణ వస్త్రముచేత మధ్యప్రదేశము ముమ్మారు తిప్పి కట్టుకున్న అమ్మకు  వందనములు.  


అరుణారుణ కౌసుంభవస్త్ర  భాస్వత్కటీతటీ !
రత్నకింకిణికారమ్యరశనా ధామ భూషితా !!..... 16

అరుణారుణ కౌసుంభవస్త్ర  భాస్వత్కటీతటీ : శ్రీ దేవి అత్యంతము ఎర్రనైన కుసుంబారంగు చీరచే ప్రకాశించు చున్న కటిప్రదేశము గలది.   
  
రత్నకింకిణికారమ్యరశనా ధామ భూషితా:  శ్రీదేవి రత్నమయములైన చిరుగంటలు గల బంగారు మొలనూలు చే అలంకరించి బడియున్నది. .

 శ్రీ దేవి అత్యంతము ఎర్రనైన కుసుంబారంగు చీరచే ప్రకాశించు చున్న కటిప్రదేశము గలది.   శ్రీదేవి రత్నమయములైన చిరుగంటలు గల బంగారు మొలనూలుచే అలంకరించి బడియున్నది. కామేశ్వరునికి ప్రీతి కల్గించే విధముగా చీరధరించి, బంగారు మొలనూలుచే  ఉన్న అమ్మకు వందనాలు.   

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వాయాన్వితా  
మాణిక్య మకుటాకారా జానుద్వయ విరాజితా  .... 17   

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వాయాన్వితా:   కామేశ్వరుని చేత మాత్రమే తెలియపడుచున్న సౌభాగ్యమూర్ధవగుణములు గల ఊరుద్వయములు గల అమ్మకు వందనమ్ములు.  

మాణిక్య మకుటాకారా జానుద్వయ విరాజితా: మాణిక్యములచే నిర్మించబడిన కవచములు మోకాల్లపై ప్రకాశించుతున్నతల్లికి ప్రేమ  వందనమ్ములు. 

   కామేశ్వరుని చేత మాత్రమే తెలియపడుచున్న సౌభాగ్యమూర్ధవగుణములు గల ఊరుద్వయములు గల అమ్మకు వందనమ్ములు.  
 మాణిక్యములచే నిర్మించబడిన కవచములు మోకాల్లపై ప్రకాశించు తున్న తల్లికి ప్రేమ  వందనమ్ములు. 
     


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ
చిదగ్ని కుండసంభూతా దేవకార్యసముద్యతా    .... 1

ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహు సమన్వితా
రాగస్వరూపపాశాడ్యా  క్రోథాకారాంకుశోజ్జ్వలా        .... 2

మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్రసాయకా 
నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్ర హ్మాణ్డ మండలా  ....  3 

చంపకా శోక పున్నాగ సౌగంధికల సత్కచా    
కురువింద మణిశ్రేణి కనత్కోటీరమండితా        ....  4 

అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితా
ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషకా    ........ 5

ఓం శ్రీ రామ్ प्रांजलि प्रभ 


శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రం - భాష్యం

వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా
వక్త్రలక్ష్మీ పరీవాహ చలంన్మినాభాలోచనా     .........6 

నవచంపక పుష్పాభనాసాదండవిరాజితా 
తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా     ........ 7 

కదంబమంజరీకప్తకర్ణపూరమనోహరా     ...... 8  
తాటంక యుగళీ భూత తపనోడుపమండలా 

పద్మరాగ శిలా దర్శ పరిభావికపోలభూ :   .....  9  
నవవిద్రుమబింబ శ్రీ న్యక్కారి దశ నచ్చ దా  .....  9 

శుద్ధవిద్యా0కురా ద్విజ పంక్తి ద్వయోజ్జ్వలా !
కర్పూర వీటి కామోద సమాకర్ష ద్దిగంతరా !!  ..... 10 

నిజస్సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్ఛపీ !
మందస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసా!! ... 11

అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితా !
కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కంధరా !! ...... 12
 

కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా !
రత్న గ్రై వేయచింతా కల్లోల ముక్తా ఫలాన్వితా !!..... 13
   
కామేశ్వరప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ !
నాభ్యాలవాలరోమాలిలతా ఫాలకుచధ్వ ఈ !!  ...... 14  


లక్ష్యరోమలతా థారతాసమున్నే యమధ్యమా ! 
స్తనభార దళన్మధ్య పట్టబంధువళిత్రయా !!..... 15

అరుణారుణ కాసుంభవస్త్ర  భాస్వత్కటీతటీ !
రత్నకింకిణికారమ్యరశనా ధామ భూషితా !!..... 16

కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వాయాన్వితా  
మాణిక్య మకుటాకారా జానుద్వయ విరాజితా  .... 17   

ఇంద్రగోపపరిక్షిప్తస్మరతూణా భజంఘికా 
ఘాఢగుల్ఫా  కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా ... 18

నఖధీధితిసంఛన్న నమజ్జనతా మోగుణా 
పదద్వయప్రభాజ్వాలపరాకృతసరోరుహా  .... 19 

శింజానమణిమంజీరమండితశ్రీ పదాంబుజా 
మరాళీ మందగమనా  మహాలావణ్య శేవధీ ..... 20 

సార్వారుణా నవద్యాంగీ సర్వాభరణభూషితా
శివకామేశ్వరాంకస్థా శివా స్వాధీన వల్లభా ......... 21  

సుమేరు శృంగ మధ్య స్థా శ్రీ మన్న గరనాయికా 
చింతామణి గృహాంతస్థా పంచ బ్రహ్మ సన స్థితా .... 22

మహా పద్మాటవీసంస్థా కదంబ వనవాసినీ 
సుధాసాగరమధ్యస్థా కామాక్షి కామదాయినీ ..... 23

దేవర్షి ఘనసంఘాతస్తూయ మానాత్మవైభవ 
భండాసుర వధోద్యుక్త శక్తి సేన సమన్వితా ..... 24. 

సంపత్కరీ సమారూఢా సింధుర వజ్రసేవితా 
అశ్వారూడాధిష్టి తాశ్వకోటి కోటిభిరావృతా .... 25            

  



   

అనేక సూర్య కిరణముల వెలుగులతో, రక్తకాంతి వర్ణముతో,  ప్రకాశమంతముగా, పరాశక్తిగా మారిన తల్లివమ్మా, నాలుగు హస్తములు కలిగి ఉన్న "మీదుగా రెండు హస్తములు, క్రిందగా రెండు హస్తములు గల బడదేవతగా ప్రత్యక్షంగా  కనబడుతున్న తల్లివమ్మా, సత్యగుణ త్రయము కలిగి బ్రహ్మతేజస్సుతో పాశమున్న తల్లివమ్మా,  అమ్మవారి క్రోధమే అంకుశాకారము పొందినది, అంకుశముచేత ప్రకాశించు చున్న హస్తముగల తల్లివమ్మా, అమ్మా అమ్మాఅమ్మా,  అమ్మలగన్న మాయమ్మకు మా శతకోటి దండములు   


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు