(రాజకీయ వ్యంగ్య రచన) stories




నేటి రాజకీయం (ఛలోక్తి-2 )
ప్రాంజలి ప్రభ 




చేయి చేయి కలిపాం 
- చేతులు కాల్చుకున్నాం
బ్రమలునుండి తొలిగాం 
- ఇక మాయామాటలు నమ్మం 

ఆత్మగౌరవం మా ఆయుధం 
- ఆంధ్రుల ఉన్నతియే మాధ్యేయం 
ఆంధ్రుల ఔనత్యమే మాలక్ష్యం 
- అమరావతి నిర్మాణం ఆపం 

ప్రభుతాన్ని నిలదీస్తాం 
నిరాహారదీక్షలు చేస్తాం 
అనుకున్నది సాధించే వరకు నిద్రపోమ్ 
పౌరుషానికి ముందుండే బిడ్డలం 
మాట తప్పినవారికి అధికారం నుండి దింపుతాం   
ఎన్నారై ల సహకారామ్ తీసుకుంటాం 
స్వపక్షం - ప్రతిపక్షం అని ఆలోచించం 
మాట తప్పిన కేంద్రాన్ని నిలదీస్తాం 

నిను వీడక మేమంటే    
మట్టి నీరు పంచి సరిపెట్టుకోమన్నావ్ 
మీ మాటలు నమ్మి ఉంటే 
కొందరి మనసులను నొప్పించటం రాజకీయమన్నావ్ 

స్వశ్చమైన గుండె ఆంద్ర అన్నావ్ 
గుండె కోత పెట్టి మాటతప్పటం రాజకీయమన్నవ్ 
ఊహలలో మెరుపును చూపిస్తానన్నావ్ 
అసలుకే ఎగనామం పెట్టి ఇది రాజకీయమన్నవ్ 

మాటల్లో సత్యాన్ని గమనించలేదన్నవ్ 
అభిమానాన్ని దోచుకొనే ఇది ఒక రాజకీయమన్నవ్ 
ప్రపంచదేశాలలో భారత ప్రగతిఁ చాటావ్
దక్షిణాదిలో ఉన్న ఆంధ్రులాదుకోవటం మరిచావ్

ఏది ఎమన్నా కేంద్రానికి సలాం 
రాష్రాభివృద్ధికి  తోడ్పడే ప్రతిఒక్కరికి సలాం 
   
ఇది ప్రజల వాక్కు 
ఆత్మగౌరవం మా ఆయుధం - ఆంధ్రుల ఉన్నతియే మాధ్యేయం 
ఆంధ్రుల ఔనత్యమే మాలక్ష్యం - అమరావతి నిర్మాణం ఆపం 
-
-((*))--

మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 1 

సాహితీమిత్రులారా! 
పాలకుడు భ్రష్టుపట్టిపోయిన వేళ, భరించరాని మనోవేదన చవిచూసిన మంత్రి ఏం చేస్తాడు? రెండు పనులు చేస్తాడు. ఒకటి. పాలకుడికి నచ్చచెప్పి, ప్రజలకు మేలు చేయించాలని చూస్తాడు. రెండు. అది అసాధ్యమయితే, పదవి వదలిపెట్టుకొని దూరంగా పోయి ఏ వ్యవసాయమో చేసుకుంటాడు. 

వాంఛేశ్వర మంత్రి సరిగ్గా ఇదే చేశాడు. అంతటితో ఆగక ఆ పాలకుడి అలసత్వాన్ని, ఆయన్ని ఆశ్రయించుకు బతుకుతూ ప్రజల్ని కాల్చుకుతినే మోతుబరుల ఆగడాలనీ చీల్చి చెండాడుతూ, సంస్కృతంలో, నూరు శ్లోకాలతో ” మహిష శతకం” అనే వ్యంగ్య రచన చేశాడు. తన రచన చదివి, పాలకుడు సిగ్గుపడి చెంపలు వేసుకునేలాగా చేశాడు. 

మహిషం అంటే దున్న పోతు. పల్లెటూళ్ళల్లో ప్రజలకు దగ్గిరగా దీనికి విశేషించి ఏ గౌరవం లేదని గమనించాలి. ఇటువంటి జంతువుని “సంకేతం” గా తీసుకుని దానిని స్తుతిస్తున్నట్టు నటిస్తూ సమాజంలో చెడుని చెండాడేడు. ఇదంతా ఎలాజరిగిందంటే — 

తంజావూరు రాజ్యాన్ని క్రీ.శ. 1674 నుండి 1885 వరకూ మహారాష్ట్ర రాజులు పరిపాలించారు.వారిలో పదకొండవ పాలకుడు, రెండవ ఏకోజీ కొడుకు ప్రతాప సింగు 1739 నుంచి 1763 వరకూ పరిపాలించాడు. ఈతని తండ్రి కాలం నుంచి వాంఛేశ్వర మంత్రి వీరి కొలువులో తెలివైన వ్యక్తిగా మన్ననలు పొందుతూ, సమర్థంగా మంత్రిత్వం నిర్వహిస్తుండేవాడు. రెండవ ఏకోజి మరణించాక, రాజ్యపరిపాలన అరాచకం లో పడింది. దానికి తోడు ప్రతాపసింగు, చాలా కుర్రవాడు సింహాసనమెక్కాడు. యౌవనం, ధనసంపత్తిః ప్రభుత్వమవివేకతా ఏకైకమప్యనర్థాయ కిము యత్ర చతుష్టయం. యౌవనం, బాగాడబ్బుండడం, పాలకపదవిలో వుండడం, అజ్ఞాని కావడం, వీటిలో ఒక్కొక్కటి ఉంటేనే మనిషికనర్థం. ఇంక ఈ నాలుగూ ఒక మనిషికే ప్రాప్తిస్తే, ఇంక చెప్పేందుకేముంది? అని సూక్తి చెప్పినట్టే అయింది ప్రతాపసింగు పని. చుట్టూ ఇచ్చకాలు చెప్పేవాళ్ళు చేరి తమపబ్బం గడుపుకొన్నారు. రాజు పేరు చెప్పి సుబేదారులు ప్రజలను పడరాని పాట్లకు గురి చేయ సాగారు. పరిపాలన నిరంకుశంగా తయారయింది. మంచితనంతో, నెమ్మదితనంతో, చదువుసంధ్యలతో, మెత్తగా పనిచేసే అధికారులని పదవులనుంచి తొలగించి, నిరంకుశులని దేశం మీదికి వదిలారు. బలవంతంగా ప్రజలనుంచి ధనధాన్యాలను దోపిడి చేయ సాగారు. మానాభి మానాలను కోరుకునే చాలామంది రాజ్యం వదిలి వెళ్ళిపోయారు. అమాత్యుడుగా వున్న వాంఛేశ్వరుడు ఈ దుర్భర పరిస్థితిని సరిచేసే ప్రయత్నాలు చేశాడు. ఫలితం దక్కలేదు. ఒక దశలో వాంచేశ్వర మంత్రి, ప్రతాపసింగుని కలుసుకొనే మాట్లాడే అవకాలు సైతం దూరమయ్యాయి. వ్యక్తిగతంగా అవమానాలకు పాలయ్యాడు. దీనితో ఒళ్ళు మండిపోయి, కడుపులో కసి వెళ్ళగ్రక్కడానికి మహిష శతకం వ్రాసి ప్రచారం చేయించాడు. ఈ శతకం ప్రతాపసింగు చదివి, తప్పు తెలుసుకొని, మళ్ళీ వాంఛేశ్వర మంత్రిని దగ్గరకు తీసుకొని, ఆయన సలహా పాటించి మంచి రాజనిపించుకున్నాడు. 

దుష్టపాలనను ఖండించడం, దుర్మార్గుల ఆగడాలను చీల్చి చెండాడడం ప్రధాన లక్ష్యాలుగా గల ఈ శతకానికి చారిత్రకంగానే కాదు, నైతికంగా, సామాజికంగా కూడా ఎంతో విలువ వుంది. వాంఛేశ్వర మంత్రి గొప్ప పండిత వంశంలో పుట్టాడు. అతి చిన్నతనంలోనే శాహాజీ మహరాజు మెప్పుపొంది, తకుట్టికవిత (బాలకవి) అనే బిరుదం పొందాడు. పెద్దవాడయ్యాక రెండవ ఏకోజీ కొలువులో అమాత్యపదవినే కాదు, ఆస్థాన విద్వాంసుడి పదవికూడా నిర్వహించాడు. శహాజీ మహరాజు తిరువిశనల్లూరు గ్రామాన్ని శహాజీ పుర అగ్రహారం చేసి 47 మంది ఉద్దండ పండితులకు దానం చేశాడు. ఆ 47 గురిలో వాంఛేశ్వర మంత్రి తండ్రి కూడా ఒకరు. వాంఛేశ్వర మంత్రి జన్మస్థలం ఈ తిరువిశనల్లూరే. 

వాంఛేశ్వర మంత్రి ఈ మహిష శతకమే కాక, ధాటీ శతకమనీ, ఆశీర్వాద శతకమనీ మరో రెండు పుస్తకాలు వ్రాశాడట. ఈ మహిష శతకానికి వాంఛేశ్వర మంత్రి ముని మనుమడు ( అతని పేరూ వాంఛేశ్వరుడే) “శ్లేషార్థ చంద్రిక” అనే పేరుతో సంస్కృతంలో వ్యాఖ్యానం వ్రాశాడు. ఈయన మహా పండితుడు. తర్కశాస్త్ర నిధి. 80 ఏళ్ళవరకు జీవించి, 1849 ప్రాంతంలో మరణించాడు. తెలుగులో 1952 లో కావ్యతీర్థ మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి తేటగా తాత్పర్య రచన చేశారు. ఇక ఒక్కొక్క శ్లోకం పరిశీలిద్దాం. 

మంత్రి మహిషం 1 
వాంఛేశ్వర మంత్రి తన రచన ప్రారంభాన్ని కావ్య సాంప్రదాయ ప్రకారం, ఆశీర్వాదంతో ేస్తున్నాడు. 

స్వస్తస్య్తు ప్రథమం సమస్త జగతే 
శస్తా గుణస్తోమత 
స్సంతో యే నివసంతి సంతు మఖిన 
స్తే మీ శివానుగ్రహాత్‌ 
ధర్మిష్ఠేపధి సంచర న్వ్తవనిపా 
ధర్మోపదేశాదృతా 
స్తేషాం యే భువి మంత్రిణ స్సుమనస 
స్తే సంతు దీర్ఘాయుషః 

మొట్టమొదట, పరమశివుడి దయవల్ల మొత్తం ప్రపంచానికి మేలు జరగాలి. దయ, ఓర్పు, అసూయారహితం, పరిశుద్ధత, శ్రమలేమి, మంగళం, కార్పణ్యరాహిత్యం, ఆశలేమి వంటి గుణాలున్న మంచివాళ్ళకు సుఖం కలగాలి. పాలకులు ధర్మబద్ధంగా నడవాలి. వాళ్ళదగ్గిర పనిచేసే మంత్రులు మంచిమనస్సుతో పాలకులకు ధర్మం బోధించగలిగి మసలాలి. అటువంటివారు ఆయుర్దాయం కలిగి సుఖంగా జీవించాలి. తను మంత్రిగా కొలువు సాగిస్తున్నది, భోసలరాజవంశం వారికి. తరతరాల పాటు వాళ్ళకు మేలు జరగాలని కూడా తను అవమానపడినప్పటికీ కూడా కవి కోరుకుంటున్నాడు. 

యే జాతా విమలేత్ర భోసలకులే 
సూర్యేందు వంశోపమే 
రాజానశ్చిర జీవిన శ్చ సుఖిన 
స్తే సంతు సంతానినః 
యే తద్వంశ పరంపరాక్రమవశా 
త్సభ్యా స్సమాభ్యాగతా 
స్తే సంతు ప్రథమాన మాన విభవా 
రాజ్యాం కటాక్షోర్మిభిః 

సూర్య, చంద్రవంశాలతో సమానంగా , మచ్చలేని విధంగా భోసల రాజవంశంలో పుట్టిన వాళ్ళందరూ, దేవుడి దయవల్ల చిరంజీవులు, సుఖసంపన్నులు, సంతానవంతులు కావాలి. అంతే కాదు. ఈ రాజవంశం వాళ్ళకు వంశపారంపర్యంగా మంత్రిపదవులు నిర్వహించేవారికి కూడా, శుభాలు జరగాలి. వాళ్ళు తమపాలకులకు అనుగ్రహ పాత్రులై గౌరవాలు, వైభవాలు పొందుతూ అభివృద్ధి చెందాలి. పాలకుల కడగంటిచూపుల తరగలతో మంత్రులు సుఖవంతులు కావాలని వాంఛేశ్వర మంత్రి వాంఛ. 
------------------------------------------------------ 
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఈమాట సౌజన్యంతో 
------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

సాహితీమిత్రులారా! 
నిన్నటి తరువాయి.............. 
మంత్రి మహిషం 4 
చదువు వ్యాపార వస్తువై పోయింది. మర్యాదగా విద్యా జీవనం సాగించడం నానాటికీ కష్టమై పోతోందని ఉదాహరణలద్వారా మంత్రి విశదం చేస్తున్నాడు. 
విద్యాపణ్య విశేష విక్రయవణిగ్జాత స్సుధీ శ్శ్రీధర 
స్స్వన్నం స్వర్ణ మభూ ద్బతాంబు మఖినో ధిక్తస్య షడ్దర్శినీం 
ఖ్యాతః కుట్టికవిస్తు దుర్ధని గృహద్వారేషు నిద్రాయతే 
త త్సర్వం మహిషేశ్వరాననుసృతే ర్దౌర్భాగ్య ధామ్నః ఫలం. 
శ్రీధర పండితుడు డబ్బు తీసుకొని చదువు చెప్పి బతుకు వెళ్ళదీయవలసి వస్తోంది. పోనీ చేస్తే చేశాడయ్యా, ఇచ్చే డబ్బుని బట్టి, చెప్పే చదువులో వ్యాపార పద్ధతిలో హెచ్చు తగ్గులు చూపిస్తూ మరీ పూర్తి వ్యాపారి అయిపోయాడు. ఇక అంబుదీక్షితుడి విషయానికి వస్తే, తినడానికి వరి అన్నం బంగారమై పోయింది. పూట గడవడం లేదు. ఇంక ఆయన చదివిన కపిల, కాణాద, గౌతమ, పాతంజల, వ్యాస, జైమిని ఋషులు వ్రాసిన షడ్దర్శనాలు ఎందుకు? తగలబెట్టడానికా? ఈ అంబుదీక్షితులుతో కలిసి చదువుకున్న కుట్టికవి ఉన్నాడు (తనే, వాంఛేశ్వర మంత్రి) పొగరు బలిసిన ధనవంతుల వాకిళ్ళముందు నిద్రపోతున్నాడు. ఇదంతా ఎందుకిలా జరిగిందో తెలుసా? దారిద్య్రాన్ని నిర్మూలించగల శ్రీ దున్నపోతు గారిని ఆశ్రయించకపోవడం వల్లనే. సరే, ఈ దేశంలో విద్యవల్ల ప్రయోజనం ఏమీ లేదనుకోవవయ్యా. దేశంలో ఇతర ప్రాంతాలు గొడ్డుపోలేదు కద. అక్కడ ఆదరం ఉంటుంది గనక, సుఖంగా బతక వచ్చునే. అన్నిటా దైన్యమేల? అని శ్రీధర పండితుడనగా దానికి సమాధానం చెపుతున్నాడు. 
విద్యన్మాకురు సాహసం శ్రుణువచో వక్ష్యామి య త్తేహితం 
త్యక్వ్తా కామద మత్ర సైరిభ పతిం నిర్వ్యాజ బంధుం నృణాం 
శ్రీరంగా భిద పత్తనం ప్రతిసఖే మా గా జ్వర స్యా లయం 
దూరే శ్రీర్నికటే కృతాంత మహిష గ్రైవేయ ఘంటారవః. 
మిత్రమా, శ్రీధరా, సాహసం వద్దు. ఒక మంచి మాట చెపుతున్నాను విను. కోరిన కోరికలు తీర్చేమహారాజశ్రీ దున్నపోతువారిని విడిచి, ఎక్కడికో వెళ్ళాలంటావు. శ్రీరంగపట్టణానికి వెళ్ళేవు సుమా. ఆ వూరు జ్వరాలకు పుట్టిల్లు. అక్కడి వెళ్ళి సంపాదించగలిగేదిజబ్బు తప్ప డబ్బు కాదు. ధన సంపాదన లక్ష్యం దూరం గా వుండిపోయి, యమధర్మరాజు వాహనమైన మహిషం మెడలోని గంట, గణగణ దగ్గరగా వినిపిస్తుంది. శ్రీరంగపట్టణంలో విద్యకు గౌరవం వుండవచ్చు. అక్కడ ప్రభువు ధనం కూడా ఇవ్వవచ్చు. అనారోగ్యపు పుట్ట ధనం ఇచ్చినా వద్దు. ఆయువు మూడుతుంది. 
మంత్రిమహిషం 5 
విద్యాజీవనం ఏమీ లాభం లేదు. సేద్యమే శ్రేష్ఠమంటూ, శ్రుతి, స్మృతి, ప్రత్యక్షప్రమాణాల ద్వారా నిరూపించి ఆ సేద్యానికి ప్రధాన సాధనమైన దున్నపోతును వర్ణించదలిచాడు మంత్రి. డానికి రాచరికాన్ని ఆపాదిస్తూ, అరాచకాలను ఖండిస్తూ, మంచిని ఉపదేసిస్తూ కావ్యరంగంలోకి కాలు 
మోపుతున్నాడు. 
యం యో ర క్షతి తస్యస ప్రభురితి స్పష్టం హి, మ ద్రక్షిణో 
రజ శ్రీమహిషాన్‌ వినుత్య సఫలం కుర్వేద్య వాగ్వైభవం 
మత్పీడా నిరతాన్‌ మదీయ మహిమాభి జ్ఞాన శూన్యాన్‌ ప్రభూన్ 
య న్నిందామి నిమశ్య తద్గుణ విద స్తుష్యంతు సంతో నృపా. 
ఏవరెవరిని రక్షిస్తారో, వారే వారికి ప్రభువనేది లోక ప్రసిద్ధం. అందుకని నన్ను రక్షించేది, మహారాజశ్రీ దున్నపోతువారే కనుక, ఆ ప్రభుస్తుతి చేసి న మాట నేర్పరితనాన్ని సఫలం చేసుకుంటాను. నన్ను పీడించడానికి సిద్ధపడేవారిని, నా శక్తినెరుగని అజ్ఞానులైన వారిని, ప్రభువులను, నిందిస్తాను. ఈ నిందను విని గుణం గ్రహించగల, మంచి రాజులు సంతోషిస్తారు.దున్నపోతు వ్యవసాయానికి ముఖ్య సాధనమని, నీకు ప్రభువుగా కనిపించవచ్చు. దానిని స్తుతిస్తున్నట్టుగా శతకం కూర్చి, మూర్ఖులకు జ్ఞానోపదేశం చేయాలని ప్రయత్నించడంకంటె, నేరుగా ఉపదేశించవచ్చు కదా, అని ఎవరైనా అడుగుతారేమో. ఆలాగ కాదు, ద్రోహబుద్ధిగల మూర్ఖులకు నేరుగా ఏమి చెప్పినా, బుర్రకెక్కదు. ఈలాగ చెప్పక తప్పదు అంటాడు మంత్రి. 
కంచి త్పశ్వధమం లు లాయ విగుణం కర్తుం ప్రబమ్ధాన్‌ శతం 
త్వా మాలంబ్య సముత్సహే , న ఖలు తద్వర్ణస్య మహాత్మ్యత 
మ ద్రోహ ప్రవణాధికారి హతక క్రోధేన త న్నిన్దన 
వ్యాజా త్త త్ప్రభు త్ప్రభు ష్వపిచ వా గ్గండో మయా పాత్యతే. 
మహిషరాజా, నీ గురించి ఒక శతకం చెప్పదలచు కున్నాను. నీ సాటి జంతువ్ల్లో నీవు అధముడివి. ఏ మంచి గుణాల్లూ చెప్పదగినవి లేవు. అయినా, చెపుతున్నాను కదా, అని “నా వంటి మహిమాత్వం ఎవరికీ లేద” ని గర్వపడేవు సుమా. అదేమీ కాదు. నాకు ద్రోహం చేయదలచుకొన్న ఒక అధికారి వెధవని చీకొట్టదలచి, ఈ వంకతో, వాడికి అధికారం కట్టబెట్టిన, వాడి పైవాడికి, ఆ పైవాడికి, తగిలే విధంగా నా వాక్కునే కర్రను చేసి విసురుతున్నాను. 
--------------------------------------------------------- 
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఈమాట సౌజన్యంతో 
--------------------------------------------------------- 

- ఏ.వి.రమణరాజు
 మంత్రి – మహిషం (రాజకీయ వ్యంగ్య రచన) - 5 

సాహితీమిత్రులారా! 
నిన్నటి తరువాయి............... 
మంత్రి మహిషం 8 
వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకున్నప్పటికీ, సుఖం లేదు శాంతి లేదు రక్షణ లేదు అని మంత్రి వాపోతున్నాడు. 
విద్యాజీవన కుంఠనేన చ కృషా వాలంబితా యాం చిరా 
దాపక్వే కణిశే కుతోऽపి పిశునాః కేదార మావృణ్వతే 
హా కిం వచ్మి? సుభాహ వాలుమణియం మేజుష్ఠ హస్తాంతరం 
హర్కారస్థల సంప్రతీ ముజుముదాది త్యాదయో నిర్దయాః 
శాస్త్రబద్ధమైన విద్యాజీవనం లేకపోవడం వల్ల ఇంకేదారీ లేక వ్యవసాయాన్ని నమ్ముకొంటే తీరా పంట కంకిపట్టి పండే సమయానికి, పిసినిగొట్లు తయారు! ఇంక చెప్పేదేముంది? సుభాహులు, వాలు మణియాలు, మేజుష్ఠులు, హస్తాంతరులు, హర్కార స్థలులు, సంప్రతీ ముజుముదాత్తులు వంటి ప్రభుత్వ పదవుల్లో వున్న అధికారులు దయా దాక్షిణ్యాలు లేకుండా, నాలుగు వైపుల నుంచి పంటపొలాల మీదకు క్రమ్ముకొస్తారు. పంటను ఏదో ఒక నెపం పెట్టి ఒడుచుకొని పోవడమే వారి పని! డబ్బు మదం నెత్తికెక్కిన, కన్నుమిన్ను కానకుండా రెపరెపలాడిపోయే స్వభావం కలిగిన, పొగరుబోతుల కంటె దున్నపోతే మేలైనది. ఎందువల్లనో చెపుతున్నాడు. 
ముగ్ధాన్‌ ధిగ్ధనికాన్‌ రమామదమషీ దిగ్ధాన్‌ విదగ్ధా నహో! 
జగ్ధౌ యబ్ధిషు దగ్ధబుద్ధి విభవాన్‌ స్నిగ్ధైః ఖలై రన్వహయ్ 
ధన్యం సైరిభ మేక మేవ భువనే మన్యే కి మ్తౖన్యెర్నృపై 
ర్యో ధాన్యై శ్చ ధనై శ్చ రక్షతి జనాన్‌ సర్వోపకార క్షమః 
ధనమదం తలకెక్కి తిండికీ, మైథునానికీ గొప్ప పండితులై, చెడుసావాసాలతో మసలుతూ, ఉన్న జ్ఞానం కూడా పోగొట్టుకొన్న ధనవంతుల్ని ఎల్లప్పుడూ తీవ్రంగా నిరసిస్తాను. వాళ్ళకు డబ్బుంది ఏం లాభం? ఈ ప్రపంచంలో దున్నపోతును మించిన అదృష్టవంతు లుండరు. ఎందుకంటే, అది కష్టం ఓర్చి ప్రజలకు ధనం, ధాన్యం రెండూ సమకూరుస్తుంది. ఆ విధంగా రక్షిస్తుంది. అంతటి ఉపకారం చేసే దున్నపోతును కాదని ఇతర పాలకుల నెందుకు ఆశ్రయించాలి? డబ్బు పొగరు మనుషుల్లో వివేకాన్ని మింగేసి పశుప్రాయుల్ని చేస్తూంటే జన్మకి పశువైనా, దున్నపోతు పజలకు రక్షణ ఇస్తున్నది కనుక ఆశ్రయించాలని కవి హృదయం! 
మంత్రి మహిషం 9 
డబ్బుపొగరు తలకెక్కిపోయిన వారికి నన్ను మించిన వాడెవడు? అనే దురభిమానం పట్టరానిదిగా వుంటుంది. పోనీ ఆ సంపాదించిన డబ్బు న్యాయసమ్మతంగా వచ్చిందా? అబ్బే! అన్యాయాలు చేసి మూటకట్టినది! డబ్బంటే సంపాదిస్తారు గాని, సంస్కారహీనంగా “దుర్‌ ధనికులు” ప్రవర్తిస్తారంటూ మంత్రి కర్కశంగా నిందకు సిద్ధపడుతున్నాడు. 
మత్తా విత్తమదై ర్దురాగ్రహ భృత శ్చండాల రండాసుతా 
యే ऽమీ దుర్ధనికా నితాంత పరుష వ్యాహారకౌలేయకాః 
తేషాం వక్త్ర విలోకనా త్తవ వరం స్థూలాండకోశే క్షణం 
యేన శ్రీమహిషేంద్ర లోస్యత ఇహ ప్రాయోణ మృష్టాసనమ్ 
అన్యాయార్జనంతో అహంకరించే ధనికులు వట్టి నీచపు ముండాకొడుకులు. కుక్కల్లాగా కర్ణకఠోరమైన మాటలు మొరుగుతుంటారు. శ్రీశ్రీశ్రీ హిషరాజా! అటువంటి వాళ్ళ ముఖాలు చూడడం కంటె బరువైన నీ వృషణ దర్శనం మేలు! ఈ దర్శనం వల్ల (అంటే పొలం దున్నే వేళ నీ వెనుక భాగాన నిలిచి వుండడం వల్ల) తరుచుగా మహామంచి భోజనం దొరుకుతుంది. అరక దున్ని, పంట పండించే వారికి మంచి తిండి లభించడం ఖాయం!! ఆ ధనవంతులు నాకే కాదయ్యా, నీకూ అపకారులే … అంటూ మంత్రి, దున్నపోతుకీ, దుర్‌ ధనికులకీ, తండ్రీ కొడుకుల సంబంధాన్ని అంటగట్టి ఎద్దేవా చేస్తున్నాడు. 
దేహం స్వం పరిదగ్ధ యద్ధి భవతా ధాన్యం ధనం వా ర్జితమ్ 
తత్సర్వ ప్రసభం హరంతి హి సుచే దారా స్స్వకీయం యథా 
హేతు స్తక్త కిలాయమేవ మహిష జ్ఞాతో మయా శ్రూయతాః 
పుత్రా ఏవ పిత ు ర్హరంతి హి ధనుప్రేమ్ణా బలా ద్వాऽఖిలమ్ 
మహిషరాజా! నువ్వు నీ శరీరాన్ని ఎంతో కష్టపెట్టుకుని, ధనమో, ధాన్యమో సంపాదించుకుంటే… పన్నులు వసూలు పేరిట సుబేదారులు వచ్చి, ఆ మొత్తమంతా, తమ సొంత సొమ్మైనట్టుగా ఒడుచుకు పోతారు. ఇదెలా సాధ్యమని నేనాలోచిస్తే నాకీ కారణం కనిపిస్తోంది. విను.. ప్రేమతో 
కానియ్యి, బలవంతంగా కానియ్యి, తండ్రి ఆస్తిని పట్టుకు పోయే వాళ్ళు కొడుకులే కదా! వీళ్ళని “దున్నపోతు కొడుకు” లని అంటే తప్పేముంది? కనకనే నీ సొమ్ము దోచుకుపోతున్నారని మంత్రి విస్తరించి చెప్పాడు. పాలకుడు, పంట పండించుకొనే రైతుకి ఉపకారమేదీ చేయక పోగా, బలిమిని 
దోచుకుపోవడానికి మాత్రం ముందుంటాడని వ్యంగ్యం! 
-------------------------------------------------------- 
రచన: ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, ఈమాట సౌజన్యంతో 
----------------------------------------------------- 
- ఏ.వి.రమణరాజు

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు