ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రే నమ:

జ్ఞాన బోధ (జీవం)  

దేవదత్త - ర/న/న/జ/ర/లగ UI UI III III - UI UI UIU 


పూర్వ కర్మ మనమనసుకు - పూర్ణతస్థి తేవలే
భావ మార్గ మన వయసుకు - ఉన్న శక్తి నీవలే 
ఆత్మ శక్తి  మన సొగసుకు  - మర్మ భావ గాలులే          
ప్రభోధాన్ని అనుకరణకు -  ప్రేమ పంచె వేళయే    

జీవ గ్రంథ మన కదలిక - ప్రేమ బంధ వేగమే 
సాద్య సాద్య మన విషయము - మౌన నేత్ర అంత్యమే 
నేత వల్ల కల మలుపులు - దేహ శుద్ధి సంభవం 
తల్లి తండ్రి మన జననము - మోహ భంధ వేషమే 

విద్య బోధ అవసరములె - పార మార్ధి సేవలే 
తత్వ భోద మన నడకకు - మార్గ సేవ విద్యలే 
బ్రహ్మ విద్య  పఠనములను - సేవ తృప్తి విధ్యలే
మాట మంచి మన మనుగడ - ప్రేమ భాష విద్యలే  

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


బాలకౌముది - స/జ/భ/భ/స IIUI UIU - IIUI IIIU 
15 అతిశక్వరి 15788 

మనమేగా ఉన్నది - నయనాల కల కలా
మనలోని  మాటలే - మధురం గమనములో 
కలలోను అర్ద మే - గనులా ర గణగణా 
కమనీయ భావమే - కనువిందు చెయుటయే

కమనీయ రాత్రిలో - రసగంగ కదలికా 
కనువిందు చేయుటే - తలవంచి పరుగులే 
మనమెల్ల నీవిగా - మదురంపు రాత్రిలో      
సుఖ మెల్ల నీదిగా - ముణగంగ ప్రేమలో 

నడురాత్రి యయ్యె నో - నరనాథ రమ్మురా 
కడు డస్సి యుంటివా - కమలాక్ష నీవు నా 
యొడిలోన పండుకొ - మ్మొగి లాలిపాట నే 
సడిలేక పాడెదన్ - శరదిందు కాంతిలో 
  
కమనీయ సొంపులన్ - కనులార తడుమురా 
పవళింపు వేలరా -   సుఖమండు కలలురా 
మదిలోని మాధురీ - కనువిందు చెయునురా  
సడిలేక ఉండెదన్ -  శరదించు సమయమే 
--((*))--
  


నేటి కవిత్వం - కాంత  -7 
 మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జ్ఞానేచ్ఛ కళా నిజ వైభవమే  
మానాన్కి మదీయ మరో మలుపే 
విజ్ఞానపు కాలువ శోభలుగా 
అజ్ఞానపు ఆశలు తొల్గుటయే 

విన్న వినకా సవినంగ సహా  
యాన్నీ తెలిపేను వయస్సు సదా 
మొనంగ మనస్సు ను ఉంచెనులే 
నేనేది వచించిన రాగములే 

విద్యా వినయం సహనంతొ  సహా
యం దాన గుణం కదలల్లెదులే 
వేదార్ధ మనో వచనం తరుణం 
పాదాంకితమం తలపే సకలం    

భేదానికి చింతను  చూపలేదు
మోదానికి పొంగియు   ఉండలేదు 
క్రోధానికి లొంగియు యుండలేదు 
కాలానికి ఒగ్గియు ఉండెనులే 

ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ


అరవిరిసిన...
----------------- 

ఓం శ్రీరామ్ - శ్రీ మాత్రేనమ:

మహిళా దినోత్ససందర్భముగా
మహిళా లందరికి శుభాకాంక్షలు
 మచ్చుతునక పద్యాలు

నేటి కవిత్వం
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


ప్రహ్లాదానందదాతారం, సూషోదయసుకర్మదమ్
నిర్యూహానందదాతారం, ప్రాభావయసొకర్మదమ్
సమ్మోహానందదాతారం, ఉషోదయసుకర్మదమ్
విశ్వాసానందదాతారం, ప్రేమోదయసుకర్మదం

వైశేషిక పరజ్ణేయం, వందే తత్వవిదం ప్రేమించు
దైవేక్షిత వర జ్ణేయం, వందే విశ్వవిదం ప్రేమించు
మోక్షేజ్ణత జప జ్ణేయం, వందే భవ్యవిదం ప్రేమించు
సౌభాగ్యత నిజ జ్ణేయం, వందే సవ్య విదం ప్రేమించు

 సర్వలక్షణ శోభితా సహకరీ సర్వామనోనేత్ర వై
ధర్మరక్షణ సేవ భావపు కళా విశ్వాస శోభాత్రి వై
నిర్వాదక్ష సుఖాలయ లతా కారుణ్య భవ్యాత్రి వై
చర్యాచర్య విధీ తిధి మదీ మాలిణ్య తొల్గించుమా


వృధ్ధ తత్వము సిధ్ధి బోధయు ఆజ్ణ పాఠము అద్భుతం
మోద్దు కైనను యోగి కైనను వృధ్ధ తంత్రము తప్పదూ
హద్దు లేనిది స్వేచ్ఛ ఉన్నది మొనసం సుమ భాష్యమే
సిద్ధి బుద్ధులు ఏక మవ్వుట వృధ్ధ తత్వపు జీవితం


సత్పురుష్యుని కాల క్షేపము పుణ్య తీర్ధపు దర్శనం
మత్ప్రభావము మాట యందును శ్రధ్ధగా మది దర్శనం
నిత్య సత్యము సంత సమ్ముగ మానవత్వపు దర్శనం
తత్వ సంపద వృధ్ధి చేసియు జ్ఞాన బోధయు దర్శనం


--(())--





పొగిడినా - నమ్మను 
విమర్శించినా -  ఇష్టపడను 
నిర్లక్ష్యం చేసినా - క్షమించను 
ప్రోత్సహించినా - మరువను 

ప్రేమించినా - వదలను 
ద్వేషించినా -  కదలను
ఈర్ష్యచెందినా - ఏమనను
ఉరితీసినా  - ఊరు కుంటాను  

ఉబలాటపడినా - ఏమి అనను 
ఉమ్మి వేసినా  - పట్టించుకోను 
నన్ను దంచినా - దండం పెడతాను 
నన్ను కామించినా - గమ్ముగ ఉంటాను 

దిగులొచ్చినా -  సర్దు కుంటాను 
దుఃఖమొచ్చినా - బంధమనుకుంటాను 
కోపమొచ్చినా -  నిలదొక్కుకుంటాను 
భయమొచ్చినా - తరమిస్తాను  

ఆవేశం వచ్చినా - ఆలోచిస్తాను 
కసిపెరిగినా - అర్ధం చేసుకుంటాను 
కామం పెరిగినా  - దేవుడ్ని ప్రార్ధిస్తాను 
కాంత కోరినా - ప్రసాద మనుకోను 
  
  --((*))--

నేటి కవిత - ప్రాంజలి ప్రభ 
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ 

నువ్వు నాకు ఎందుకు నచ్చావో 
నా సంతోషాల వెళ్లు  వయ్యావో
నా సౌభాగ్యానికి తోడు వయ్యావో  
నా అంత రంగాలలో నిలిచావు 

అల్లకల్లోలం మదిలో రెపావో 
గువ్వల రాగం మనలో నింపావో 
రాగ, శృతి, తాళం, అయి ఉన్నావో 
జన్మ జన్మల సాక్షిగా నాలో ఉన్నావు 

అడుగులో అడుగువై నడిచావో  
ఇసుకలో గాలి తుఫానై ఉన్నవో 
కంటికి కనురెప్పవై  కాపాడావో
ప్రేమ నందించి నాలో ఉన్నావు

ఆశయాల ఆరాట మయ్యావో
నాలో ఆలోచన శ్రుతి వయ్యావో 
సుడి గుండం నుండి రక్షించావో  
ఆశలు తీర్చి ఆనంద పరిచినావు 

--((*))--






Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు