****








ఈ రోజు నా పాట ఆలాపనా

నిన్ను ఎంతో వెదికాను 
నీకై వేచి వేచి ఉన్నాను
నీకోసం  ఎదురు చూస్తున్నాను
నీ జ్ఞాపకాలు మరువలేకున్నాను

కనులు తెరిచినా, కనులు మూసినా
వెన్నెల విసిరినా, పువ్వులు పూసినా
కోయిలలు కూసినా, జల్లులు పడినా

ఈ నిరీక్షణ మారునా
మనసు కలత మారునా
మది తలపులు తీరునా  
మధురభావాలు వచ్చునా

నిన్ను ఎంతో వెదికాను 
నీకై వేచి వేచి ఉన్నాను

నీ వెటువుందువో, నీ వెళా వుందువో
నీ కళలుఎమైనాయో, నీ తలపులు ఎమైనాయో 
నీ కలలు మరువనోయో, నీ చూపులు గుర్తున్నాయో  

నీ భావాలు మరువలేకున్నా ,
నీతోనే లోకాలు తిరగాలనుకున్నా
నీతో కలసి కదలి రావాలనుకున్నా
నీ మనసు తెలిసి నీకోసం వేచిఉన్నా

తరువుకు కాంతి ఎంత అవసరమో 
మన ప్రేమకు నీవు తప్పక అవసరమూ

నిన్ను ఎంతో వెదికాను 
నీకై వేచి వేచి ఉన్నాను
--((*))--   
నేటి కవిత: కక్కు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

నొక్కి నొక్కి వక్క ముక్క మక్కలుగా
పెక్కు.పెక్కు టెక్కు చుక్క చుక్కలుగా
దక్కు దక్కు చెక్క నొక్కు లెక్క లెక్కలుగా
దక్కె దక్కె ఒక్క ముక్క చెక్క సక్కలుగా

ఎక్కం వక్కానించి లెక్క పక్కా పక్కగా
కొక్కం నొక్కిఉంచి ఉక్కు ముక్క చక్కగా
బొక్కి బిక్కుమంటు బక్క చిక్కి చిక్కగా
నొక్కి నొక్కనంటు నక్కి నక్కి నక్కగా

నక్క తోక తొక్కి ఎక్కి ఎక్కి కక్కగా
కుక్క తోక తొక్కి పక్క పక్క కక్కగా
తొక్క తోక తొక్కి తిక్క తిక్క యెక్కగా
ఉక్క బోసి డొక్క బొక్క పీక్కు పోయేగా

లక్కు, లుక్కు, బుక్కు, కుక్కు ఆంగ్లంగా
చెక్కు, క్కేకు, డక్కు, సిక్కు ఆంగ్లంగా
నెక్కు, బ్రిక్కు, హుక్కు ఇంకు ఆంగ్లంగా
పింకు, క్విక్కు, జింకు, రాన్కు ఆగ్లంగా

--(())--

https://i.pinimg.com/originals/b4/c2/d6/b4c2d6b7f8fce836c42b025dce7e4677.jpg

నేటి కవిత : పతివ్రత ఆలాపన
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

గాలిలో గాలినై, గాయానికి మందునై ,
గారాబానికి నీడనై, గాలంగా పనికొచ్చే దాన్ని 

మదిలో ప్రేమగా, మౌనవత్వానికి ముందుగా,
మచ్చికలో చెలిగా, మన్నన కోసం ఉండేదాన్ని             
          
రెపరెప లాడుతున్నా, రేయింబగలు ఆడుతున్నా,
రేపనేది లేకుండా ఉన్నా, రెప్పలా మాటువేసి ఉండేదాన్ని
    
హృదయానికి విలువేదీ,  హృద్రోగం పొయ్యేదారి ఏదీ,
హృద్య తాపం దీరె దారి ఏదీ, హృదయంలో శబ్దంలా ఉండేదాన్ని

విరహం విరజాజి పూలలా, విన్నపం విధి కలయికలా,
విపరీతం విధి వైపరీత్యంలా, విస్తుపోయి చూస్తూ ఉండేదాన్ని

నిట్టూర్పులు వెంబడించినా, నిజం నిలకడగా తెలిసినా,
నిండు మనస్సు చలించినా, నిగ్రహంతో ఆశతో ఉండేదాన్ని
          
ఏదోనన్ను వదలిపెట్టలేకుందో, ఏమో ఏది జరగబోతున్నదో,
ఏ సమయం ఏమగునో, ఏవిషయాన్నైనా తట్టుకొని ఉండేదాన్ని
  
వెలితిని పూరించే వారెవరో, వేకువనే గుర్తించేవారెవరో,
వేదనను తగ్గించేవారెవరో, వేర్పాటువాదులున్నా భారించేదాన్ని

నువ్వు ఎదురుగా ఉన్నా , నువ్వు నన్ను గుర్తించలేకున్నా,
నువ్వు నువ్వుగా బతకలేకున్నా, నువ్వు నన్ను హింసించినా ఉండేదాన్ని

ఏదో తెలియని దూరం మనమధ్య,  ఏమాయ చేయాలనో చేరింది సంధ్య,
ఎందుకో నన్ను చేరలేని ఎత్తులో ఉంది విధ్య, ఏంచేసినా పడిఉండేదాన్ని

మొహమాటపు మాటలు దొర్లినా, మొహం నాలో కమ్మి ఉండినా.
మోజు తీర్చలేక నలిగి ఉన్నా, మోమునందించి ఊరడించేదాన్ని
          
దగ్గరలో సత్యాన్ని తెలుసుకోలేక, దండగమారి ఖర్చు లనుకోక,
దరిద్రాన్ని తలచుకోక,  దండంతో సరిపెట్టుకొని ఉండేదాన్ని 

కాలానికి అనుగుణంగా లేని దాన్నా, కాలమాయా తెలియని దాన్నా,
కాలాన్ని వ్యర్ధపరిచేదాన్నా, కాలంతో సర్దుకుపోయి ఉండేదాన్ని

మనసు నీపై నాలో ఉన్నంతవరకూ, మమత నాలో పొంగి ఉన్నంతవరకూ, 
మచ్చతెచ్చే మాట రానంతవరకూ,  మన్నన కోసం మౌనంగా ఉండేదాన్ని
  
నీ జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నా, నీ దుర్వ్యసనాలను భరించి ఉన్నా,
నీ సంకల్పం చెడ్డడైయున్నా, నీ మానాన్ని వదలక అంటిపెట్టుకొనేదాన్ని
   
గతం గుర్తు చేసినా, గమ్యం అగమ్యగోచరంగా మారినా,
గంటల సమయం వ్యర్ధమైన, గమ్ముగా సర్దుకు పొయ్యేదాన్ని

శాసిస్తూ శపిస్తూ బాధపెడుతున్నా, శని పట్టి పీడిస్తున్నా, 
శపధం చేసి చెపుతున్నా,  శాంతిని కోరి బాతుకుతున్నదాన్ని   
 
బలవంతంగా మరవాలనుకున్నా, బలప్రయోగానికి లొంగి ఉన్నా,
బంతులతో ఆడుతూ ఉన్నా, బలమున్న వేదించక ఉన్నదాన్ని 

స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం
ఓర్పు ఓదార్పు తోడు ఇంకా ఇంకా
     
రామునికి       —       సీత
కృష్ణునికి        —       రుక్మిణి 
ఈశునకు      —    ఈశ్వరి
మంత్రపఠనంలో —   గాయత్రి

గ్రంధ పఠనంలో    —      గీత
ఉదయానికే—ఉష, అరుణ
సాయింత్రం     —   సంధ్య
చీకటైతే           —   జ్యోతి, దీప
     
పడుకున్నాక    —   స్వప్న
చూచేటప్పుడు— నయన
వినేటప్పుడు  —   శ్రావణి
మాట్లాడునప్పుడు—వాణి

ఓరిమిలో        -వసుధ
వడ్డించేటప్పుడు-అన్నపూర్ణ
నడుస్తున్నప్పుడు—  హంస
నవ్వుచున్నప్పుడు  —  హాసిని, ప్రసన్న

అద్దంలో చూస్తే—  సుందరి
చేసేపనికి  -స్పూర్తి
పని చేయడానికి    —  స్పందన
మంచి పనికి —  పవిత్ర

ఇష్టంగాచేసే పనికి  —  ప్రీతి
నీరు త్రాగునపుడు —  గంగ
అబద్ధ మాడునపుడు —  కల్పన
నిజం చెప్పేటపుడు —సత్యవతి, నిర్మల

ఆలోచనలప్పుడు  —  ఊహా,
భావన చదువుచున్నప్పుడు  —  సరస్వతి
వ్యాపారంలో      —   ప్రతిభ , ప్రగతి
సంతోషంలో—   సంతోషి

కోపంలో       —   భైరవి
ఆటలాడునప్పుడు—  ఆనంది
గెలుపు కోసం— జయ, విజయ
గెలిచిన తర్వాత  —   కీర్తి
     
సరిగమలు నేర్చునపుడు  —  సంగీత
పాటలు పాడునపుడు  —  శృతి, కోకిల
తాళం వేయునపుడు  —   లయ
నాట్యమాడునపుడు   —   మయూరి
     
సాహిత్య గోష్టిలో    —   కవిత
నగరాన్ని కాపాడుతూ  —   ప్రకృతి
విద్యాభ్యాసంలో  —   విద్య
సంపాదనప్పుడు —   లక్ష్మి

చేసేవృత్తిలో        —   ప్రేరణ
చేసి వచ్చాక —  శాంతి
చిన్నతనంలో — లాలన
మధ్యవయస్సులో -మాధురి
     
ముసలితనంలో- కరుణ, మమత
ప్రేముకునకు - ప్రియ
వేచియుండుటకు  - నిరీక్షణ
కాముకునికి - రంభ

శ్రీ వారికి  - శ్రీమతి 


"శార్దూలము(పంచపాది).
----
శ్రీలక్ష్మీ కమలాయతాక్షి వరహస్తీంద్రార్చితా పద్మజా !
శ్రీలక్ష్మీ కనకాంచిత ప్రవరదాత్రీ ! విష్ణుపత్నీ!రమా!
శ్రీలక్ష్మీ యుతలక్షణాంచిత మురారీరూప పాండ్రంగ ,హే,
శ్రీలక్ష్మీ విభవాస్పదంబగుసురశ్రీరాఘవేంద్రున్ మదిన్
శ్రీలక్ష్మ్యాదుల దైవతమ్ములనుముదా రీతిన్ భజింతున్ సదా !!!"
       
🌸🌸🌸🧘‍♀️🧘‍♀️🧘‍♀️🌸🌸🌸


6-06-2016 గజిల్

అర్దార్ది అభిష్టాలను తీర్చి, సంతోషం పంచి సాగిపో
ఆర్తుల ఆలాపననుండి రక్షించి ముందుకు సాగిపో  

వయసును బట్టి శక్తిని పెంచుకొని శక్తి హీనులకు
శక్తినిపెంచుకొనే మార్గాలు చూపి, ఆదుకొని సాగిపో

శరణు శరణు అన్న వానిలోని తప్పులు ఎంచకు
పశ్చాతాపముతో ఉన్నవానికి సహకరించి సాగిపో

అర్ధాని అపేక్షించి ఆరాదించే నమ్మి ఉన్నవారకు
దుర్మార్గులైన అర్ధాన్ని అర్ధిస్తే ఆదుకొని సాగిపో

ధర్మాన్ని వదలక నిత్యమూ భరించే భాదలకు
ఓర్పుతోజీవించే వారికి ఆర్ధికసహాయం చేసి సాగిపో  
            
మాయ, మోహ, పాశాలకు చిక్కి ఉన్న మానవులకు
భగవత్ గీత జ్ఞాన మార్గాన్ని భోధించి ముందుకు సాగిపో
 
 


విపినతిలక -

ఇది స్రగ్విణి వర్గమునకు చెందినది. ప్రతి పాదములో నాలుగు పంచమాత్రలు ఉండును. ఇది గంగాదాసుని "ఛందోమంజరి"లో పేర్కొనబడినది. క్రింద నా ఉదాహరణములు -

విపినతిలకము - న/స/న/ర/ర IIIII UIII - UIU UIU
15 అతిశక్వరి 9696

విపినతిలకమ్ము గద - వేయి సింహమ్ములున్
విపినతిలకమ్ము గద - వృక్ష సందోహముల్
విపినతిలకమ్ము గద - పెక్కు కాసారముల్
విపినతిలకమ్ము గద - వింత వర్ణమ్ములున్

అలలవలె సంద్రమున - నందమై తేలుచున్
గలలవలె నీ బ్రదుకు - కమ్మఁగా సాఁగునా
చిలువవలె నా యలలు - శీఘ్రముగ మ్రింగునా
తెలియదుగ తెల్లముగ - దేవుఁడే సెప్పునా

ఉదయమగు నాశ లిట - నూఁగెఁగా నూయలన్
హృదయ మొక మందిరము - హృద్యమై యుండ రా
వదనమును నే మృదుల - వాంఛలన్ నిల్పితిన్
సదయుఁడని నిన్ దలఁచి - స్వామి నేఁ గొల్తురా



ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నప్పుడు మనసు దుర్భలం గా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకం తో పఠించి స్వామి కి ఒక్క కొబ్బరి కాయ పంచదార ను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్క సారిగా మీ మనసు తేలిక పడి యధార్థమైన త్రోవ భోధ పడుతుంది... మీ మనసు తేలిక పడిన తరువాత చిన్న పిల్లల కు పానకం వడపప్పు పంచండి చాలు ఉప్పొంగిపోతారు మారుతి.. ఇది సుందరకాండ లో స్వామి హనుమ ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్య నూ లక్ష్మణుడు ని సుగ్రీవుడు ని కీర్తుస్తూ సీతమ్మ కి నమ్మకాన్ని కలిగించి లంకాదహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుత మంత్రం...

జయత్యతి బలో రామః లక్ష్మణస్య మహా బలః !
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః !!

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
తథా పితుర్మే జనకస్య రాజ్ఞా:

దాసోహం కౌసలేంద్రస్య రామస్యా క్లిష్ఠ కర్మణః !
హనుమాన్ శత్రు సైన్యానాం నిహంతా మరుతాత్మజః !!

నరావణ సహస్రం మే యుధ్ధే ప్రతిబలం భవేత్ !
శిలాభిస్తు ప్రహారతః పాదపైశ్చ సహస్రశః !!

అర్ధయిత్వాం పురీం లంకాం మభివాద్యచ మైథిలీం !
సమృధ్ధార్థ్యో గమిష్యామి మిషతాం సర్వ రాక్షసాం !!

అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణస్య మహాబల:
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభి పాలితః

హనుమానాంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ ఫల్గుణః స్సఖా పింగాక్షోమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవః సీతా శోక వినాశకః
లక్ష్మణః ప్రాణదాతాశ్చ దశగ్రీవశ్చ దర్పః
ద్వాదశాత్మాని నామాణి కపీంద్రశ్చ మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయన్నాస్తి సర్వత్ర విజయీ భవేత్

అర్థం : మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము. మిక్కిలి పరాక్రమశాలియైన లక్ష్మణస్వామికి జయము. శ్రీరామునకు విధేయుడై, కిష్కింధకు ప్రభువైన సుగ్రీవునకు జయము. అసహాయ శూరుడు, కోసలదేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను, వాయుపుత్రుడను. నా పేరు హనుమంతుడు.

శత్రుసైన్యములను రూపుమాపువాడను. వేయిమంది రావణులైనను యుద్దరంగమున నన్నెదిరించి నిలువ జాలరు. వేలకొలది శిలలతోను, వృక్షములతోను, సకల రాక్షసులను, లంకాపురిని నాశనమొనర్చెదను. రాక్షసులందరును ఏమియూ చేయలేక చూచుచుందురుగాక. నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళెదను.

ఇది పఠించిన వారికి జయం తధ్యం !!




నేటి శీర్షిక - గురుశిష్యుల్
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   


నలుగురిలో కోపము చూప వలదున్
కలుషిత మే బ్రత్కులొ చేరి చెరచున్
మలినముయే మంచి లొ చెడ్డ కదులున్
కలియుగ మే మున్షి లొ మార్పు తలపున్

పోరులో నిజా నిజాలు తెల్సి పాల్గొను మున్
దూరియే విధాన మాట తెల్పి చేరుటయున్
మారు పల్కకే నిదానమే సమస్య విడున్
నోరు పెంచినా మనో మయం మరో తలపున్

గాయము తెలిసి తెలిసి చేయకుమున్
కాయము  మరచి మనసు మార్చకమున్
నీ యునికిని మర చుట  ఎందుకుయున్   
మాయయు తరిమియు  కళలు చేయుమున్   

మనవారని  ఇష్టమొచ్చినట్లు  ఉండకున్ 
 అనువారని కోపమొచ్చినట్లు  చూడకున్             
 తినువారిని  ఎక్కువ తక్కువ  చెప్పఁకున్
 కనువారని బొత్తిగ విప్పియు చూపకున్      




తల్లియు తండ్రియు గురువుల కున్
గుల్లలు  తెల్పిన  చెడు తలచిన్  
జెల్లును  కీర్తియు  మదిచిలుకున్ 
జిల్లర  బత్కుతొ నలుపు చెఱున్ 

అపకారికి ఉపకారము చేయుమున్ 
ఉపకారికి అపకారము చేయకున్
సహకారము తలపెట్టియు బత్కుచున్ 
మమకారము కలబోసియు ఉండుమున్
                     
ఉల్లమునందు కృతజ్ఞతా భావమున్
పిల్లలయందు  సురక్షితా  వాదమున్ 
యల్లరిఁ పాలు  దరి యందూ  చేరకన్
యల్లరియందు సమోన్నతా ప్రేమయున్

చెడు వినక మంచి తలపులతోన్ 
చెడు గనక  శోభ వలపులతోన్ 
చెడు ననక  హృద్య మలపులతోన్

చెడు మరక  జిత్త  చెఱపు లతోన్  

    

Buy Pink flamingo 60x80cm, oil painting, surrealistic artwork, Oil painting by Artush Voskanyan on Artfinder. Discover thousands of other original paintings, prints, sculptures and photography from independent artists.


శ్రీ రామ చంద్రుని ఆరాధిస్తుయున్   
పోరాట మేమియు చెలించకున్
నోరార  నిందలు భరించుచున్        
నూరైన మార్గంబు జీవించుచున్ 

గురువే దైవమ్ము గా భావింపవలెన్
పరమాదరంబు గా కల్పించవలెన్
గురుశిష్యులంద రి  ప్రేమించవలెన్ 
పొరపాటు నందరి  తిట్ట బోకుమున్

గురువులతో వైరమ్ము  సల్పబోకుమున్
పరమాదరమ్ము  తో నీవు భావింపవలెన్ 
గురుదూషణమ్ము ఎప్పుడు చేయవలదున్
గురువేదన బ్రతుకునెల్ల  మార్పుచేయుమున్

నేరములు చేసి బొంకఁబోకుమున్
నేరములు నేర్చి తే మనః శాంతియున్
బేరములవలె మారు చుండుటయున్ 
కారము పడ్డ వానిగా విల విల లాడున్    ..... 4    




*2.శ్రీమహారాజ్ఞీ*
తన రక్షణ బాధ్యతను పోషిస్తూ , ప్రపంచానికి మహారాణిగా వెలుగొందే తల్లికి నమస్కారము.

She who is the empress who takes care of the cosmos - indicates the mother role of guarding. Salutations to the mother.
మానవులలో శ్రేష్టుడు, మానవులను రక్షించేవాడు, భూమిని పాలించేవాడు, నరులకు
అధిపతి, రాజు, పృథ్వీపతి. రాజులలో కెల్లా శ్రేష్టుడు మహారాజు. అలాగే లోకాలను
పాలించునది మహారాణి. మహారాజ్జి, ఇక్కడ మహారాజ్ఞి అనే పదానికి శ్రీ అనే విశేషణం
కూడా వాడటం జరిగింది. శ్రీ అంటే - శ్రేష్టమైనది. రాజులలోకి శ్రేష్టమైనవాడు మహారాజు.
మహారాజులలోకి శ్రేష్టమైన వాడు లేదా మహారాణులలోకి శ్రేష్టమైనది అంటే అంతకన్న
ఎక్కువైన వారుగాని, అధికులుగాని లేనటువంటిది. ఉత్తమమైన పాలకురాలు.
పాలకులందరిలోకీ ఉత్తమోత్తమమైనది.
దేవీభాగవతంలో పరమేశ్వరి ఉండే మణిద్వీపాన్ని వివరిస్తూ “చింతామణి గృహంలో
వేయిస్తంభాలు కలిగిన మంటపాలు నాలుగు ఉంటాయి.
సహస్రస్తంభసంయుక్తా శ్చత్వార ప్తే ఘమంటపాః ॥
శృంగారమంటప శ్రైకో । ముక్తిమంటప ఏవ చ
జ్ఞానమంటపసంజ్ఞ స్తు ! తృతీయః పరికీర్తితః ॥
ఏకాంతమంటప శ్చైవ ! చతుర్ధః పరికీర్తితః
1. శృంగారమండపము 2. జ్ఞానమండపము
3. ముక్తిమండపము 4. ఏకాంతమండపము
ఇవన్నీ కూడా పరిమళాలతోను, ధూపాలతోను విరాజిల్లుతుంటాయి.
శృంగారమంటపే దేవ్యో గాయంతీ వివిధైస్వరైః !
సభాసదో దేవవరా మధ్యే శ్రీ జగదంచికా ॥
శృంగార మంటపంలో దేవతలు మధురస్వరాలతో గానం చేస్తుంటారు. అక్కడ
సభాసదులైన దేవతల మధ్యన సింహాసనం మీద ఆ జగదంబ ఉంటుంది.
ముక్తిమంటప ? మధ్యే తు యోచయత్య నిశం శివా
జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృపమంటపే |
చతుర్థే మంటపే చైవ జగడ్రక్షా వివించనమ్‌ ।
మంత్రిణీసహితా నిత్యం కరోతి జగదంబికా ॥
ముక్తిమంటపం నుంచి ఆ దేవి జగత్తులోని భక్తులందరికీ ముక్తిని ప్రసాదిస్తుంది.
జ్ఞానమంటపంలో భక్తులకు జ్ఞానోపదేశం చేస్తుంది. నాల్గవ మంటపంలో ఆ పరమేశ్వరి
తన మంత్రులతో కొలువుదీరి లోకాల యొక్క రక్షణను గూర్చి ఆలోచిస్తుంటుంది.
ఈ రకంగా అన్నిరకాల పనులను చేస్తూ ఎల్లప్పుడూ లోకాలను రక్షించాలి అనే
కోరిక గల పాలకురాలు శ్రీ మహారాజ్ఞి అనిగాక ఇంకేమని పిలువబడుతుంది ?
శ్రీ అనే బీజం షోడశీ కళను సూచిస్తుంది.
కామరాజ ? మంత్రాంతే శ్రీబీజేన సమన్వితా
షోడశాక్షరీవి ద్యేయం శ్రీ విడ్యేతి ప్రకీర్తితా |
పంచదశి మహామంత్రము అంటే పదిహేను అక్షరాలు గలది. ఆ మంత్రాన్ని
భూలోకానికి తెచ్చినవాడు మన్మథుడు. అందుచేత అది కామరాజమంత్రము
అనబడుతుంది. షోడశి అంటే పదహారు అక్షరాలు గల మంత్రం. ఈ రెండూ కూడా
శ్రీవిద్యలోని మంత్రాలే. ఐతే కామరాజమంత్రమయిన పంచదశి మహామంత్రానికి
షోడశీకళను సూచించే శ్రీ అనే బీజాన్ని గనక కలిపినటైతే అది షోడశి మహామంత్రం
అవుతుంది.

శ్రీ మహారాజ్జీ అనే పదాన్ని,
శ్రీం, అహారాజ్జీ ,అని గనక విడదీసినట్లైతే, శ్రీం అనేది
షోడశీకళ అవుతుంది. ఇక్కడ అకారము ప్రకాశాంశ పరమేశ్వరస్వరూపము.
హ కారము
విమర్భాంశ పరమేశ్వరి స్వరూపము.
కాగా రాజ్జీ అనేది మహారాజ్జీ మంత్రమైన పంచాక్షరిగా
చెప్పబడుతోంది.
యాని జాతాని జీవంతి.
ప్రభవించిన వానిని పాలించునది. లోకాలు సజావుగా
నడవటానికి ఉన్నవి మూడు శక్తులు. లేదా మూడు కార్యాలు. అవే సృష్టి స్థితి లయాలు.
వీటిలో రెండవది లోకాలను పాలించేటటువంటి స్థితిశక్తి.
సర్వజగాలను పరిపాలిచేటటు
వంటి విష్ణుశక్తి. మహాసామ్రాజ్యలక్ష్మి. భువనేశ్వరీ స్వరూపిణి. మహత్తులలో మహత్తు
అయిన ఆత్మ స్వయంప్రకాశము గలది.
అంటే ఏ విధమైన సాయము లేకుండానే
ప్రకాశించేది. తాను ప్రకాశిస్తూ ఇతరులను ప్రకాశింపచేసేది. అంతరంగంలో బుద్ధిని
ప్రకాశింపచేసేది. అటువంటి పప్రకాశశక్తియే మహారాజ్ఞి అనబడుతున్నది.
ఈ ప్రపంచంలో నవగ్రహాలు పంచభూతాలు, తన్మాత్రలు, దిక్పాలకులు, గతులు
తప్పకుండా, ఎవరి ధర్మాలు వారు నెరవేరుస్తున్నారు అంటే, ఆ రకంగా వాళ్ళని పాలించటం
సామాన్యమైన విషయం కాదు. ఈ బాధ్యతను నిర్వర్తిస్తున్నది కాబట్టే, ఆ పరమేశ్వరి శ్రీ
మహారాజ్ఞి అనబడుతున్నది.
ఉపనిషత్తులలో చెప్పినట్లుగా పరబ్రహ్మ ఉన్నాడు కాబట్టే
గాలి సక్రమంగా వీస్తోంది. ఎండలు సరిగా కాస్తున్నాయి. పంచభూతాలు వాటి పనులను
సక్రమంగా నిర్వర్తిస్తున్నాయి. దిక్పాలకులు దిక్కులను సరిగా పాలిస్తున్నారు. అటువంటి
పరబ్రహ్మ స్వరూపమే ఆ పరమేశ్వరి. కేనోపనిషత్తులో ఈ విధంగా ఉంది.
ఒకసారి దేవదానవ సంగ్రామం మహాభీకరంగా జరిగింది. అందులో దేవతలు
విజయం సాధించారు. ఆ విజయం తమవల్లనే సాధించబడింది అని, ఆ విజయానికి
కారణం తామేననీ దేవతలలో ప్రతివారూ గర్వంతో విర్రవీగి పోసాగారు. దీనికంతటికీ
కారణమైన పరబ్రహ్మను మరిచిపోయారు. విజయోత్సాహంతో దేవతలంతా సభ తీర్చారు.
అందులో ఎవరి ప్రతాపాన్ని వాళ్ళు చెప్పుకోవటం మొదలుపెట్టారు. ముందుగా అగ్నిదేవుడు
తాను అగ్నిజ్వాలలను ప్రజ్వలింపచేస్తుంటే, రాక్షసులందరూ ఆ అగ్నికీలలలోపడి
మలమలమాడి భస్మమైపోయారు.
అందుచేతనే రాక్షసుల మీద విజయం సాధించటం
తేలిక అయింది అన్నాడు,అగ్నిదేవుడు.
వాయుదేవుడు లేచి, తాను చండప్రచండంగా గాలులు వీస్తుంటే
వాటికి తట్టుకోలేక రాక్షసులు ఎండుటాకుల్లాగా ఎగిరిపోయారు. అందుచేతనే విజయం
తేలిక అయింది అన్నాడు.
ఈ రకంగా దేవతలంతా తమపరాక్రమాన్ని గురించి
వివరిస్తున్నారు.
బ్రహ్మతత్త్వం ఇదంతా గమనిస్తోంది.
జ్ఞానులైన దేవతలు కూడా అజ్ఞానంలో
పడిపోతున్నారు. వారి అహంకారాన్ని పోగొట్టాలి. అనుకున్నది. అనుకున్నదే తడవుగా
వారి ఎదురుగా, భయంకరమైన యక్షరూపంలో ప్రత్యక్షమైంది.
చూశారు దేవతలు. ఆ
రూపం ఏమిటో వారికి అర్ధంకాలేదు. ఆ రూపాన్ని చూసి భయపడ్డారు. ఏంచెయ్యాలో
పాలుపోలేదు వారికి.
భయంకరమైన యుద్ధంలో రాక్షసులను తన అగ్నిజ్వాలలతో కాల్చివేశానని
చెప్పినవాడు అగ్నిదేవుడు. అందుకని దేవతలంతా అగ్నిని సమీపించి “ఓ అగ్నిదేవా !
నువ్వు వెళ్ళి ఆ భయంకరమైన తత్త్వం ఏమిటో తెలుసుకుని రా” అన్నారు. సరే అని
బయలుదేరాడు అగ్నిదేవుడు. ఆ తత్వాన్ని సమీపించాడు. భూతం లాంటి ఆ తత్త్వం
అగ్చిదేవుణ్ణి చూసి అడిగింది “ఎవరు నువ్వు ?”
“నేను అగ్నిదేవుడను. లోకంలో అందరూ నన్ను జాతవేదుడు అంటారు” అన్నాడు
అగ్ని
“అయితే నీ శక్తి ఏమిటి ?”
“లోకంలో ఏ వస్తువునైనా సరే క్షణంలో కాల్చి బూడిద చేస్తాను”.
“అంత గొప్పవాడివా ? అయితే ఈ గడ్డిపోచను దగ్ధం చెయ్యి”. అంటూ ఒక
గడ్డిపరకను అక్కడ ఉంచింది ఆ తత్త్వం.
ఆ గడ్డిపరకను చూసి చాలా తేలిక భావంతో మంటలు సృష్టించాడు అగ్నిదేవుడు.
గడ్డిపరక కాలలేదు. భయంకరమైన అగ్నిశిఖలు సృష్టించాడు. లాభం లేకపోయింది.
అగ్బిదేవుడు వెనక్కి తిరిగి దేవతలవద్దకు వెళ్ళి “ఆ తత్త్వం ఏమిటో నాకూపాలుపోలేదు”
అన్చాడు.
అప్పుడు దేవతలంతా వాయువును సమీపించి “దేవా ! నువ్వు చాలా గొప్పవాడివి
కదా ! ఆ తత్త్వము ఏమిటో తెలుసుకునిరా” అన్నారు. సరే అని బయలుదేరాడు వాయువు,
ఆ తత్వాన్ని సమీపించాడు. పూర్వంలాగానే ఆ తత్త్వం అడిగింది.
“ఎవరు నువ్వు”
“నేను వాయుదేవుడను. ఆకాశంలో సంచరిస్తుంటాను. కాబట్టి నన్ను 'మాతరిశ్వుడు”
అంటారు”.
“నీ శక్తి ఏమిటి ?”
“లోకంలో ఏ వస్తువునైనా సరేనా యొక్క గాలులతో ఎగరగొట్టగలను”.
“అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు” అంటూ ఇదివరకటి గడ్డిపరకనే చూపించింది
ఆ తత్త్వం. వాయుదేవుడు తన బలాన్నంతా కూడదీసుకుని భయంకరమైన గాలులు
వీచాడు. గడ్డిపోచకదలలేదు. వచ్చినదారినే వెనక్కువెళ్ళి దేవతలతో” ఆ తత్త్వం ఏమిటో
నాకు అర్ధంకాలేదు” అన్నాడు.
అప్పుడు దేవతలందరూ తమ ప్రభువైన ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి, అతనికి జరిగిన
సంగతంతా వివరించి “దేవేంద్రా ! ఆ విచిత్రమైన తత్త్వం ఏమిటో నువ్వైనా
కనుక్కోవలసింది” అన్నారు. సరే అంటూ బయలుదేరాడు ఇంద్రుడు. ఆ తత్వాన్ని
సమీపించాడు.
అప్పుడు అక్కడున్న తత్త్వం మాయమైపోయింది. దానిస్థానంలో మహాసౌందర్యరాశి
అయిన ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె హిమవంతుని కుమార్తె హైమవతి. ఆమెను
ఉమాదేవి అని కూడా అంటారు.
ఆశ్చర్యంగా చూశాడు ఇంద్రుడు. “అమ్మా ! దేవతలనందరినీ భయభ్రాంతులను
చేసిన ఆ తత్త్వం ఏమిటి ?” అన్నాడు.
“ ఆ శక్తియే బ్రహ్మము. నాకు బ్రహ్మకూ తేడా లేదు. ఇద్దరమూ ఒక్కటే” అని
ఉమాదేవి సమాధానం చెప్పింది. ఆ తరువాత “ఓ దేవేంద్రా ! పరబ్రహ్మ వల్లనే మీరు
అసురుల మీద విజయం పొందారు. మీ గొప్పతనానికి కారణము బ్రహ్మము. మీ అల్పబుద్ధి
వల్ల, మీకు కనిపించిన బ్రహ్మాన్ని గుర్తించలేకపోయారు.” అని చెప్పింది.
నిరాకారుడు నిర్లుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ, ఒక ఆకారం పొందితే, అదే పరమేశ్వరి.
బిందురూపుడైన పరబ్రహ్మ నుంచి కొంత శక్తి బయటకు వచ్చింది. ఆ శక్తే
పరమేశ్వరి. శక్తి త్రికోణాకారంగా ఉంటుంది. అదే యోని. దాని నుంచే జగత్తంతా
ఆవిర్భవించింది. అదే శ్రీచక్రంలోని త్రికోణము.
పరమేశ్వరుని వల్లనే ఈ జగత్తు
పప్రవర్తిల్లుతున్నది. పరమేశ్వరునికి ప్రతిరూపం పరమేశ్వరి. అందుచేతనే ఆమె శ్రీమహారాజ్జీ.
చరాచరజగత్తులోని ప్రాణికోటికంతటికీ యుక్తాయుక్తవిచక్షణా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
వారి కర్మలననుసరించి భవిష్యజ్ఞన్మలు ప్రసాదిస్తుంది. మానవులు చేసే పాపపుణ్యాలు
విచారించటానికి లౌకికన్యాయస్థానాలు చాలవు. వీటిని విచారించటం ఆ పరమేశ్వరునికే
సాధ్యపడుతుంది.
ఈ రకంగా వారి పాపపుణ్యాలను విచారించి వారికి మరుజన్మ ప్రసాదించి,
ధర్మాన్ని లోకాలను రక్షిస్తుంది కాబట్టే ఆవిడ శ్రీమహారాజ్జీ అని పిలువబడుతుంది.
1


*3 .శ్రీమత్సింహాసనేశ్వరీ*
-----------------------------------
సింహాసనముపై కూర్చున్న లేక సింహము వాహనముగా కలిగిన తల్లికి నమస్కారము
Sri math simasaneshwari She who sits on the lion seat . salutations to the mother.
ఇక్కడ పరమేశ్వరి లయకారిణి ఈ రకంగా మొదటి మూడు నామాలలోను, సృష్టి
స్థితి లయాలు, చెప్పబడ్డాయి. రాజులు సభలలో కూర్చునే ఆసనాన్ని సింహాసనము
అంటారు. మృగాలలో శ్రేష్టమైనది సింహము. అడవికి రాజు. పరాక్రమానికి కూడా
చిహ్నము. అందుచేతనే, రాజుగారు, తన వీరత్వానికి, పరాక్రమానికి గుర్తుగా, సింహాసనం మీద
కూర్చుంటాడు. ఈ ఆసనానికి రెండువైపులా సింహాలుంటాయి. రాజు భయంకరమైన
క్రూరమృగమైన సింహాన్ని తాను ఓడించి ఆసనంగా చేసుకున్నాడు అని ఇక్కడ అర్ధం.
అటువంటి సింహాసనం ఆసనంగా కలది ఆ పరమేశ్వరి.
దేవీపురాణంలో, మహిష్మతి
అనే గంధర్వకాంత, శాపవశాన మహిషిగా జన్మించింది.
ఆ మహిషికీ, రంభుడు అనే
రాక్షసుడికి జన్మించినవాడు మహిషాసురుడు.
అతడు ముల్లోకాలను జయించాడు.
దేవతలందరూ విష్ణువును శరణుజొచ్చారు. అప్పుడు అందరి దేవతల యొక్క అంశలతో, తేజోరాశి అయిన
స్త్రీమూర్తి ఉద్భవించింది. ఆవిడే పరమేశ్వరి.
ఆవిడకు దేవతలందరూ
తమ తమ శక్తులను ఇచ్చారు. ఆసమయంలో
హిమవాన్‌ వాహనం సింహం రత్నాని వివిధాని చ
హిమవంతుడు ఆ దేవికి వాహనంగా, ఒక సింహాన్ని, వివిధరకాలయిన రత్నలను
ఇచ్చాడు. ఆ సింహం మీద ఎక్కి, దేవి మహిషాసుర సంహారం చేసింది. అందుచేతనే,
ఆమె సింహాసనేశ్వరీ, అని చెప్పబడింది.
సింహాసనము అనే పేరుగల ఎనిమిది మంత్రాలు, చైతన్యభైరవి దగ్గరనుండి,
సంపత్ర్రదాభైరవి దాకా, ఉన్నాయి.
వీటిలో మొదటి ఆరుమంత్రాలు మూడు జతలుగాను,
తరువాత ఒక్కొక్కటిగాను, మొత్తం ఐదు దిక్కులందు, ఐదు సింహాసనములు గలది ఆ పరమేశ్వరి అని,
జ్ఞానార్దవ తంత్రంలో చెప్పబడింది.
పరమేశ్వరి ఐదు సింహాసనాలు ఏవిధంగా ఎక్కిందో శివుడు పార్వతికి వివరిస్తున్నాడు.
ఓ దేవి! సృష్టి కర్త అయిన బ్రహ్మ నిశ్చేతనుడుగా ఉన్నప్పుడు, పరమేశ్వరిని ధ్యానించి, సృష్టి
కర్త అయినాడు.
ఆ తరువాత ఇంద్రుడు బ్రహ్మను గురించి తపస్సుచేసి, పూర్వదిక్పాలకు
డైనాడు.
అప్పుడు ఆ త్రిపురసుందరి పూర్వసింహాసనమధిష్టించింది.
యముడు బ్రహ్మను
గురించి తపస్సుచేసి దక్షిణదిక్కుకు అధిపతి అయినాడు.
అప్పుడు ఆ దేవి దక్షిణ
సింహాసనమలంకరించింది.
వరుణుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి పశ్చిమదిక్కుకు
అధిపతి అయినాడు.
అప్పుడు ఆ దేవి పశ్చిమ సింహాసనమలంకరించింది.
కుబేరుడు బ్రహ్మను మెప్పించి, ఉత్తరదిక్కుకు అధిపతి అయినాడు. అప్పుడు ఆ దేవి, ఉత్తర సింహాసనమధిష్టించింది.
బ్రహ్మ సృష్టికర్తకాగానే, ఆ దేవి ఊర్ధ్వదిక్కున ఉన్న సింహాసనం
అధిష్టించింది.
ఈ రకంగా ఐదు దిక్కులయందున్న సింహాసనాలను ఆ దేవి అధిష్టించింది.
అందుకే ఆమె సింహాసనేశ్వరి అనబడుతోంది.
ఆ దేవి అధిష్టించినది ఒట్టి సింహాసనం కాదు. మహాసింహాసనం. శ్రీమత్‌ అంటే
గొప్పదైనటువంటి అని అర్ధం. మామూలుగా సింహాసనానికి నాలుగుకాళ్ళుంటాయి.
కాని దేవతలు కూర్చునే సింహాసనానికి మధ్యన ఇంకొక కాలు ఉంటుంది. ఈ రకంగా
ఐదు కాళ్ళుంటాయి. అందుకే దాన్ని శ్రీమత్సింహాసనము అంటారు.
త్రిపురసుందరి పంచాసనాసీన. పంచాసనాలంటే
1. పంచప్రణవాసనము : శ్రీం, హ్రీం, క్తీం, ఐం, సౌః, అనేవి పంచప్రణవాలు.
వాటినే శక్తి ప్రణవాలు అంటారు. షోడశి మహామంత్రంలో ఈ ప్రణవాలను చెప్పటం
జరుగుతుంది. ఈ ప్రణవాల మీద, మంత్రరూపంలో, ఆ దేవి ఉంటుంది.
2. పంచకళాసనము :
నివృత్తి, ప్రతిష్టా, విద్యా, శాంతి, శాంత్యతీతములు
పంచకళలు. వీటికి పైన చిత్కళగా ఉన్నది.
౩. పంచదిగాసనము :
పూర్వ, దక్షిణ, పశ్చిమ, ఉత్తర, మధ్యదిక్కులు ఎల్లలుగా
గల బ్రహ్మాండమును పాలించునది.
4. పంచభూతాసనము: పృథివి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే పంచభూతాలకు
పైన ఉండునది.
5. పంచముఖాసనము: సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానములు
పరమేశ్వరుని ముఖములు. ఈ ముఖములు గల ఆసనము నధిరోహించినది.

ఈ రకంగా దేవి ఐదురకాలయిన సింహాసనాలనధిష్టిస్తున్నది. కాబట్టి
శ్రీమత్సింహాసనేశ్వరీ అనబడుతోంది.
షట్బక్రాలలోను భక్తులు, సాధకులు, పరమేశ్వరిని అర్చిస్తారు. అలా అర్చించేటప్పుడు,
ఒక్కొక్క చక్రంలో అర్చించే వారికి, ఒక్కొక్కరకమైన ముక్తి కలుగుతుంది.
ఆధారస్వాధిష్టానాలు అంధకారబంధురాలు. వాటిలో ముక్తిలేదు. ఇక
1. మణిపురంలో దేవిని పూజించే వారికి సార్పిరూపముక్తి కలుగుతుంది. అంటే
దేవి పురానికి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు.
2. అనాహతంలో దేవిని అర్చించే వారికి సాలోక్యముక్తి కలుగుతుంది. వీరు దేవి
పట్టణంలోనే నివసించగలుగుతారు.
3. విశుద్ధి చక్రంలో దేవిని అర్చించేవారికి సామీప్యముక్తి కలుగుతుంది. వీరు
దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు.
4. ఆజ్ఞా చక్రంలో దేవిని అర్చించే వారికి సారూప్యముక్తి కలుగుతుంది. వీరు వేరే
దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు.
5. సహస్రారంలో దేవిని అర్చించే వారికి సాయుజ్యం కలుగుతుంది. వీరికి మరుజన్మ
ఉండదు.
దేవతలలో ప్రసిద్ధులైన
త్రిమూర్త్యాదులు ఆ పరమేశ్వరికి అతి దగ్గరగా ఉండి సేవించాలి
అనే కోరిక కలవారై, సామీప్యముక్తిని పొందారు. దీన్నే శంకర భగవత్సాదులవారు,
తమ సౌందర్య లహరి లోని 92వ శ్లోకంలో వివరిస్తూ
గతా ప్తే మంచత్వం ద్రుహిణహరిరు ద్రేశ్వరభృతః
శివ స్వచ్చచాయా కపట ఘటిత ప్రచృదపటః
త్వదీయానాం భాసాం ప్రతిఫలనరాగారుణతయా
శరీరీ శృంగారో రస ఇవ దృశాం దోగ్ధి కుతుకమ్‌ ॥
ఓ తల్లీ ! బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, మహేశ్వరుడు, సదాశివుడు అనువారు నీకు
అతి సమీపంగా ఉండి, నిన్ను సేవించుకోవాలి అనే తలంపుతో మొదటి నలుగురు నీ సింహాసనానికి, నాలుగుకోళ్ళు కాగా, సదాశివుడు, నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు.
అటువంటి పంచబ్రహ్మలు, పరమేశ్వరి సింహసనానికి కోళ్ళుగా ఉన్నారు కాబట్టి,
ఆ దేవి శ్రీమత్సింహాసనేశ్వరీ అనబడుతుంది.
మహాసింహాసనము అనేది ఒక మంత్రరాజం. ఆ మంత్రానుష్థానం చేసిన వారికి,
ప్రపంచంలోని అన్ని మంత్రాలమీదా, అధికారం వస్తుంది. ఇది ఉత్తరదేశంలో బహుళ ప్రచారంలో ఉంది.
ఆ మంత్రానికి అధిదేవత త్రిపురసుందరి. కాబట్టి దేవి,

శ్రీమత్సింహాసనేశ్వరి, అని పిలువబడుతున్నది. ఈ రకంగా, మొదటి మూడు నామాలు,త్రిగుణస్వరూపమును, అనగా ,
సృష్టి స్థితి లయాలను, సూచిస్తున్నాయి.


 *4 చిదగ్నికుండ సంభూతా*
--------------------------------------
బ్రహ్మ తేజస్సుకు ఒక ఆకారమైన చిత్ అను అగ్నికుండం నుండి పుట్టిన తల్లికి నమస్కారము.
Chidagni Kunda Sambootha
She who rose from the chit means fire of brahma knowledge. salutations to the mother
చిత్’’ అంటే జ్ఞానం. ప్రతిపదార్ధం వెనుక ఆ పదార్ధానికి సంబంధించిన తత్త్వాన్ని జ్ఞానమంటారు. తత్త్వం లేకుండా పదార్ధం వుండదు. వృక్షం లోని వృక్షత్వమే దానియొక్క జ్ఞానము. ఇదే చిత్ అని పిలువబడుతుంది.
చిత్‌ అంటే జ్ఞానము. అదే అగ్నికుండము. అజ్ఞానానికి చిహ్నమైన తమోగుణానికి
విరోధి. అవిద్య, అజ్ఞానాలను తొలగించేది పరబ్రహ్మ. చిత్‌ అంటే జ్ఞానాగ్ని శరీరం
లోపలకట్టెలు లేకుండానే నిరంతరము మండే జ్ఞానాగ్ని మోహము అనే అంధకారాన్ని
తొలగిస్తుంది. శక్తిసూత్రాలలో చెప్పినట్లుగా
చిద్వహ్ని రవరోధపదే ఛన్నోల పి చిన్మాత్రయామేయేంధనం పుష్య తీతి
చిత్తు విశ్వమును తన స్వభావము చేతనే దహిస్తుంది. కాబట్టి అగ్ని అనబడుతుంది.
అక్కడ చిత్తుకు అగ్నికి తేడా లేదు. చిచ్చక్తి పరమేశ్వరుని పరిశుద్ధ చైతన్యమని, ప్రసిద్ధమైన
అగ్నికుండము వంటిది అని చెప్పబడింది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడుఅర్జునునితో
జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసా త్క్మురుతే ఆర్జున
అర్జునా ! జ్ఞానాగ్ని అన్నింటినీ భస్మం చేసి వేస్తుంది అంటాడు. రేణుకాపురాణంలో
ఇక్ష్వాకువంశంలో రేణుకుడు అనేవాడు జన్మించాడు. అతడు గొప్ప పరమేశ్వరి భక్తుడు.
ఆ దేవిని గురించి అనేక వేలసంవత్సరాలు తపస్సుచేశాడు. అతని తపస్సుకు మెచ్చి
అతనికి అనేకవరాలిచ్చింది పరమేశ్వరి. ఆ తరువాత
ఏతస్మి నృన్తరే యజ్లే వహ్నికుండా చృనై ర్ద్విజ
దివ్యరూపాన్వితా నారీ దివ్యాభరణభూషితా
అగ్నికుండములో నుండి మెల్లగా దివ్యరూపంతో, దివ్యాభరణాలతో, చంద్రబింబము
వంటి మోముతో బయటకు వచ్చింది అని చెప్పబడింది. అందుచేతనే పరమేశ్వరి
అగ్నికుండము నుంచి పుట్టినది అనబడుతోంది.
బ్రహ్మాండపురాణంలో భండాసురునిచే పీడించబడిన దేవతలు పదిమైళ్ళ విస్తారము
గల అగ్నికుండము నిర్మించి తమ శరీరాన్ని కోసి హోమం చెయ్యసాగారు. అప్పుడు హోమకుండంలో నుంచి కోటిసూర్యుల కాంతులతో, అనేకకోట్ల చంద్రుల చల్లదనంతో
వెలుగొందుచూ బాలభానుని కాంతులతో ఆ దేవి ఉద్భవించింది. అప్పుడా దేవిని గాంచిన
దేవతలు సంతసించారు. అని చెప్పబడింది. అంటే పరమేశ్వరి అగ్నికుండం నుండే
ఆవిర్భవించింది.
పరమేశ్వరి నిరాకారుడు, నిర్గుణస్వరూపుడు అయిన పరబ్రహ్మ స్వరూపిణి. కాని
లోకంలోని భక్తులను రక్షించటం కోసం అగ్నికుండం నుంచి ఉద్భవించి సగుణ పరబ్రహ్మ
స్వరూపిణి అయింది.
ఆ జగజ్జనని పరబ్రహ్మ అనబడే అగ్నికుండము నుండి ఆవిర్భవించింది. వ్యష్టిగా
చూస్తే ఇది ఆత్మకుండలి. సమిష్టిగా చిదగ్నికుండము. చిదగ్నికుండము అంటే అఖండమైన
జ్ఞానము యొక్క మాయాశబలిత రూపము. అసలు దేవతలే తేజ స్వరూపులు, అనంతమైన
తేజస్సు గల పరమేశ్వరి చిదగ్ని చిదగ్నికుండ సంభూత. దేవతలంతా అలసత్వము,
మొండితనము, చేతగానితనము మొదలైన దుర్లక్షణాలను తమ శరీరం నుండి తీసి
అగ్నికుండంలో ఆహుతి చేశారు. అలాగే మానవులు కూడా తమ అజ్ఞానాన్ని, ఇంద్రియాల
అలసత్వాన్ని ఇంద్రియ చపలత్వాన్ని తమ జ్ఞానాగ్నిలో భస్మం చెయ్యగలిగితే అప్పుడు
వారియందు ఆ పరమేశ్వరి సంభూత అని చెప్పబడుతుంది.
సృష్టికి పూర్వము అఖండమైన బ్రహ్మతేజస్సు మాత్రమే ఉన్నది. తేజస్సుకు ఒక
పరిధి ఉన్నది కాబట్టి కుండము అంటున్నాము. చిత్‌ అనేదే అగ్నికుండము. అదే
చిదగ్నికుండము. జ్ఞానస్వరూపమైన పరమేశ్వరి, అజ్ఞానాన్ని నాశనం చేసే జ్ఞానాగ్ని నుంచి
సంభవించింది.
ప్రపంచంలో విషయాలు అనేకముంటాయి. వాటిని బుద్ధికి నివేదించేది ఇంద్రియాలు.
ఇంద్రియాలు జడాలు. విషయాలను నాశనం చెయ్యటం మన వల్లకాదు. ఇంద్రియాలు
దేని పని అది చేస్తుంటాయి. ఒకదాని పని ఇంకొకటి చెయ్యలేదు. అంటే వినే చెవులు
ఆశక్తితో చూడలేవు. కాబట్టి ఏయింద్రియానికి ఆయింద్రియానికి చిదగ్ని వేరుగా ఉంటుంది.
పిండాండములాగానే చిదగ్నులు కూడా చాలారకాలున్నాయి. ఈ రకంగా
ప్రపంచంలో ఉన్న అనంతజ్ఞానాగ్ని సముదాయమే చిదగ్చికుండము.
ఈ రకంగా పరమేశ్వరి చిదగ్నికుండ సంభుతా అని పిలవబడుతోంది.


*శ్రీ లలితా సహస్ర నామ భాష్యం* 🕉🕉🕉🕉🕉🕉
*12.నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండలా*
---------------------------------------
తన ఎర్రనైన శరీర కాంతులద్వార బ్రహ్మాండాన్ని ప్రకాశింపచేసే తల్లికి నమస్కారము
Nijaruna prabha poora majjath brahmanda mandala
She who makes all the universe immerse in the red colour with her body’s colour which is like the sun in the dawn. Salutations to the mother

అరుణ కాంతులలో మునిగినటువంటి బ్రహ్మాండములు గలది. అంటే ప్రాతః
కాలములో ఏ రకమైన కాంతులు ఉంటాయో అటువంటి కాంతులు గలది. వేదాలలో
తామగ్ని వర్ణాం తపసాజ్వలంతీం అని చెప్పబడింది. ఆ దేవి అగ్నివర్ణములో ప్రకాశిస్తుం
టుంది. అలాగే ఆదిత్యవర్ణే తపోసోదిజాతో అన్నారు. ఆదిత్యుడు అంటే బాలభానుడు.
ఆరవనామంలో ఆమె “ఉద్యద్భానుసహ్రాభా” అని చెప్పబడింది. అంటే ఉదయిస్తున్న
కొన్నివేల సూర్యులకాంతి గలది. ఎరుపు తెలుపు కలిసిన పాటల వర్ణము గలది. ధ్యాన
శ్లోకంలో అరుణాంకరుణా తరంగితాక్షీం. అని సింధూరారుణ విగ్రహాం అని చెప్పబడింది.
 
ఆ పరమేశ్వరి మంకెన్నపూవ్వులాగా ఎర్రని కాంతులు విరజిమ్ముతుంటుంది. అందుకే
సకుంకు విలేపనా........... జపాకుసుమభాసురాం... అని చెప్పబడుతోంది. అలాగే
జపాకుసుమసంకౌసౌ మధుఘూర్జితలోచనౌ అని శివశక్తులను ధ్యానంచేస్తున్నారు.
వీటన్నింటివల్ల దేవి అరుణారుణచ్చాయతో ప్రకాశిస్తున్నదని తెలుస్తోంది. పరమేశ్వరి
తన దేహకాంతులతో బ్రంహ్మాండాలన్నీ ముంచివేస్తోంది. “దేవి చిదగ్నికుండ సంభూత”
కాబట్టి ఆమె దేహము నుండి కాంతులు ప్రసరిస్తున్నాయి. 

ఆమె “నిజారుణప్రభాపూర” అంటే ఆమె దేహానికి ఉన్న కాంతికిరణాలు స్వతహాగా ఉన్నవే కాని సూర్యకాంతివల్లగాని, అగ్ని తేజమువల్లగాని, ఇతర కారణాలవల్లగాని వచ్చినవికావు. ఈ జగత్తులో కాంతులను ప్రసరించే పదార్థాలన్నీ ఆ దేవి శరీరం నుంచి గ్రహించినవే. ఈ విషయాన్ని గతంలో వివరించటం జరిగింది. దేవి శరీరం నుంచి అనేకకోట్ల కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి.

వాటిలో అగ్ని 108, సూర్యుడు 116, చంద్రుడు 186 కిరణాలను తీసుకున్నారు. ఈ
జగత్తు పగటిపూట సూర్యుని వెలుగులచేత, రాత్రులందు చంద్రకిరణములచేత, సంధ్యవేళల యందు అగ్నివల్ల ప్రవర్తిల్లుతున్నది. ఈరకంగా పబ్రహ్మాండమంతా ఆమెవల్లనే (ప్రకాశిస్తున్నది.
 
అంతేకాని ఆమెకు కాంతిని, ప్రకాశాన్ని ఇచ్చే శక్తి మరి దేనికీ లేదు. ఆమె స్వయంప్రకాశ
రూపిణి. పరమేశ్వరి కాంతిమండలము చాలాపెద్దది. ఈ బ్రహ్మాండం కన్న విశాలమైనది.
పబ్రహ్మాండముకన్న విస్తృతమైన కాంతి మండలముతో అరుణారుణకాంతులతో ఆ దేవి
వెలుగొందుచున్నది.
*** 

*10 మనోరూపేక్షు కోదండా*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
మనోహరమైన చెరకు విల్లును ఎడమ చేతి క్రింద ధరించిన తల్లికి నమస్కారము.
*Mano Rupeshu Kodanda*
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
She who has the bow of sugar cane in the lower left hand. salutations to the mother
జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేవి ప్రతిజీవికి ఉంటాయి. అందుచేతనే ఆహార
నిద్రామైథునాలు జీవులన్నింటికీ సమానంగానే ఉంటాయి. కాని సంకల్పవికల్పాలకు
కారణమైనది మనస్సు. ఇది పదకొండవ ఇంద్రియము. మానవుడికి మాత్రమే ఉంటుంది.
దీనివల్లనే మానవుడికి యుక్తాయుక్త విచక్షణ అనేది ఉంటుంది. ఏది ధర్మం. ఏది అధర్మం
అనే విషయాలు నిర్ణయించుకోగలుగుతాడు.
మనోరూపమైన చెరకువిల్లును ఎడమవైపు క్రిందిచేతితో ధరించి ఉంటుంది. బాణం
వెయ్యాలి అంటే ఎడమచేత్తో ధనుస్సును పట్టుకుని కుడిచేతితో నారిసారించి బాణం
వదలాలి. అందకని పరమేశ్వరి ఎడమచేతిలో ధనుస్సు ఉంటుంది. ఇది క్రియాశక్తి.
మన్మథుడి ఆయుధం చెరకు విల్లు. అందుచేతనే కాళిదాసు ఆ దేవిని స్తుతిస్తూ
పుండ్రేషుపాశాంకుళ పుష్పబాణ హస్తే
అంటాడు. అంటే చేతిలో చెరకు విల్లు, పాశము అంకుశము, ధరించినది. మన్మధుడు
అంటే మనసును మధించేవాడు. అతడి యొక్క విల్లు తీయనైన చెరకుతో చేయబడింది.
అదేవిధంగా పరమేశ్వరి చేతిలోని విల్లుకూడా చెరుకువిల్లే. ఆవిడ మనసు కూడా
మధురమైనదే. కోదండము శతృభయంకరము. మనసు చంచలమైనది. దానికి స్థిరత్వం
ఉండదు. అందుకే మనసు కోతిలాంటిది. కోతి ఒక కొమ్మ మీదనుంచి ఇంకొక
కొమ్మమీదకు ఏవిధంగా గెంతుతుందో, అదేవిధంగా మనసు కూడా ఒక విషయం
నుంచి ఇంకొక విషయం మీదకు వెడుతూ ఉంటుంది. మనసును నిశ్చలం చెయ్యగలిగితే
సమాధిస్థితి వచ్చినట్లే. ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళగలిగాడో, అప్పుడు అతడికి
ఆత్మసాక్షాత్కారమైందన్న మాటే. అటువంటివ్యక్తికి విశాలమైన ఈ విశ్వమంతా రజ్జు
సర్పబ్రాంతి అనిపిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనసును ఏకాగ్రం చెయ్యగలిగిన వాడికి
ఆత్మసాక్షాత్కారం త్వరగా జరుగుతుంది.
విషయమే ఆకారంగా గలది మనసు. జీవుల యొక్క మనోవృత్తియే దేవి చేతిలో
ఉన్న కోదండము. మనసు అనేది కామనాశక్తి
సంకల్పవికల్పాలనబడే పదకొండు మనోవృత్తులచేత ప్రభవించే కర్మాగారమే మనస్సు.
అవి :
1. కామము 4. శ్రద్ధ 7. అధృతి 10. భీః
2. సంకల్పము 5. సత్యము 8. శ్రీః 11. ధీః
3. వికల్పము 6. ధృతి 9. హ్రీం
ప్రతిజీవికి తన మనసులో ఉండే ప్రీతి విశ్వాసాలు ఇక్షుభావసూచితాలు. ఈ
పదకొండు మానసిక అవాంతర భేదములు. మనసులోని ఈ అవాంతరము ప్రాణి యొక్క
జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. ఇవి సామాన్యుడి యందు ఒక రకంగా ఉంటే ఉత్తముడియందు
ఇంకొక రకంగా ఉంటాయి. పామరుడికి నిత్యము సత్యము అనిపించే ఈ జగత్తు
జ్ఞానికి అనిత్యము అనిపిస్తుంది. అస్థిరము అనిపిస్తుంది.
జీవియొక్క స్థూలదేహము నశిస్తుంది. కాని సూక్ష్మదేహము నశించదు. అది
గతజన్మలో చేసిన పాపపుణ్యాలవల్ల లభించే స్వర్గనరకాలనుభవించి కర్మఫలశేషాన్ని
అనుభవించటానికి ఇంకొక జన్మ ఎత్తుతుంది. గత జన్మ చివరలో ఏ కోరికలుంటాయో,
దేన్ని గురించైతే మరణకాలంలో తీవ్రంగా ఆలోచిస్తుంటాడో వాటియొక్క వాసనలు ఈ
జన్మలో కూడా ఉంటాయి. వాటికి తోడుగా క్రొత్తవి కూడా వస్తాయి. వీటన్నింటినీ
ప్రవర్తింపచేసేవాడు పరమేశ్వరుడు. మనస్సు అనేది క్రియాశక్తి. అందుచేతనే క్రియాశక్తి
రూపమయిన ధనుస్సు మనస్సుగా చెప్పబడుతోంది. నవావరణ పూజలో ఎనిమిదవ
ఆవరణలో దేవి ఆయుధమయిన ధనుస్సును పూజిస్తారు.
ఓం ఐం హ్రీం శ్రీం థంధం సర్వసమ్మోహనాభ్యాం
కామేశ్వరీ రమేశ్వధనుర్భ్యాం నమః ధనుః శ్యక్తి
శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాస మహర్షి శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 41వ శ్లోకంలో దేవి ఆయుధమైన
ధనుస్సును ధ్యానిస్తూ
అథ తవ ధనుః పుండ్రేక్షూకృత్‌ ప్రసిద్ధ మతిద్యుతి
త్రిభువన వధూ ముద్య జ్యోత్స్నా కలానిధి మండలం
సకలజనని ! స్మారం స్మారం గతః స్మరతాం నరః
త్రిభువన వధూ మోహామ్మోధేః ప్రపూర్ణవిధు ర్భవేత్‌ |
తల్లీ నీ చేతిలో ఉన్న పుండ్రేక్షుచాపము లోకాలలోని సుందరీమణుల
విరహ బాధ కలిగిస్తుంది. అటువంటి నీ దుఃఖబీజాన్ని ఉపాసించే వాడు స్త్రీలను వశం
చేసుకోగలుగుతాడు.

*9 క్రోధాకారాంకుశోజ్వలా*
-------------------------------------
క్రోధ రూప అంకుశాన్ని కుడిచేతిలో ధరించిన తల్లికి నమస్కారము
*Krodhakarankusojwala*
------------------------------------
She who has anger in the form of Ankusam(an elephant-goad) –in her right hand. salutations to the mother (అంకుశము =ఏనుగు కుంభస్థలమునందు పొడిచెడి యాయుధము;)
క్రోధము అంటే ద్వేషము అనే పేరుకల మనోవ్యాపారము. మనకు ఇచ్చగనక
బాగా కలిగినట్లైతే, అంటే ఒక మనిషియందు మనకు అత్యంతమైన ప్రేమ, అనురాగము
ఉన్నాయి. ప్రతి విషయంలోనూ వారే ఉన్నతులుగా ఉండాలి అనుకుంటాం. అలాంటప్పుడు
ఒకవేళ మనం అనుకున్నట్లుగా గనకవారు రాలేకపోయినప్పటికీ దాన్ని మనం భరించలేం.
ఎదుటివారి గొప్పదనాన్ని ఒప్పుకోలేం. వారిమీద ఏదో కారణంగా కోపం పెంచుకుని
వారిని అసహ్యించుకుంటాం. దీనికి కారణము మనవారి పట్ల మనకున్న రాగము.
దీనివల్లనే మన వారు చేసిన తప్పులు కూడా ఒప్పులుగాను, ఎదుటి వారు చేసిన
ఒప్పులు కూడా తప్పులుగాను కనిపిస్తాయి. అంటే మితిమీరిన అనురాగమే క్రోధము
క్రింద మారుతుంది. మనమీద మనకు నమ్మకముంటుంది. ఆత్మాభిమానం ఉంటుంది.
అంతవరకు మంచిదే. కాని అది బాగా పెరిగిపోతే దురభిమానమవుతుంది. అదే
ఆవేశకావేశాలకు కారణం. అదే క్రోధం అందుకే
క్రోధో ద్వేషాఖ్యా చిత్త వృత్తిః
క్రోధము అనేది ద్వేషము అనే పేరుగల చిత్తవృత్తి. పరమేశ్వరికి కుడివైపున్నటువంటి
పైచేతిలో అంకుశమున్నది. అంకుశము బాధించేది. క్రోధము వల్ల ఇతరులకు
బాధకలుగుతుంది. ఇతరులను బాధించటమే క్రోధము యొక్క ముఖ్యలక్షణము. అంకుశము
అంటే ఏనుగును పొడిచి నడిపించే ఆయుధము. అనగా బాధించేది. కాబట్టే క్రోధానికి
గుర్తుగా దేవి కుడి చేతిలో అంకుశమున్నది.
ఇది భక్తులకు జ్ఞానరూపము. దుష్టుల ఎడ అంకుశము. క్రోధమనేది రజోగుణము.
అట్టి క్రోధాకారమైన అంకుశము చేతియందు గలది ఆ పరమేశ్వరి. చతుశ్శతిలో
చెప్పినట్లుగా
పాశాంకుశౌ తదీయౌ తు రాగద్వేషాత్మకే స్మృతౌ
దేవి పాశము అంకుశము ధరించి ఉంటుంది. అవి రాగద్వేషాలకు ప్రతీకలు.
యోగినీహృదయంలో
ఇచ్చాశక్తిమయం పాశం అంకుశం జ్ఞానరూపిణం
క్రియాశక్తిమయే బాణధనుషీ దధ దుజ్జ్వలమ్‌ ॥
పాశము - ఇచ్చాశక్తి. అంకుశము - జ్ఞానరూపము. ధనుర్బాణములు
క్రియాశక్తిమయాలు.
ఏదైనా జీవి హింసించబడేటప్పుడు, అది ఆ బాధ భరిస్తూ, ఎదిరించలేక “ఓ దేవీ!
నన్ను హింసిస్తున్నారు. వారిని ఎదిరించే సామర్ధ్యము నాకులేదు. ముందు జన్మలోనైనా
ఇటువంటి వారిని ఎదిరించే సాహసము నాకు కలుగజెయ్యవలసినది” అని ఏడుస్తూ
ప్రార్థిస్తుంది. ఈ జన్మలో దాని శరీరము నశించినప్పుటికీ ప్రతీకారజ్వాల మాత్రం దాని
మనసును అంటిపెట్టుకుని ఉంటుంది. అప్పుడు మరుజన్మలో ఆ జీవికి అది క్రోధము
అవుతుంది. ఈ విధంగా ప్రపంచంలో జరిగే ప్రతి హింసా ప్రవృత్తికీ గతజన్మలోని
అనుభవాలే కారణము. అదే పరమేశ్వరి చేతిలోని అంకుశశక్తి. పాపం చేసినటువంటి
వారికి ఇది అంకుశము. మిగిలినటువంటివారికి ఇది ఆభరణము. శ్రీచక్రంలోని ఎనిమిదవ
ఆవరణ అయిన త్రికోణంలో దీన్ని పూజిస్తారు.
ఓంఐంహ్రీంక్రోంక్రోం సర్వస్తంభనాభ్యాం
కామేశ్వరీ కామేశ్వరాంకుశాభ్యాం నమః అంకుశశక్తి
శ్రీపాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాసుడు శ్రీ దేవీ మహిమ స్తుతిలోని 44వ శ్లోకంలో అంకుశాన్ని ధ్యానిస్తూ
యః స్వాన్తే కలయతి కోవిద స్త్రీ లోకీ
స్తంభారంభణచణ మత్యుదారవీర్యం ।
మాత స్తే విజయమహాంకుశం స యోషా
న్దేవా స్పృమృయతి చ భూభుజోల న్యసైన్యమ్‌ |
తల్లీ ! ముల్లోకములను స్తంభింపచేయకల నీ అంకుశబీజమును ఉపాసన చేసేవాడు
సకల స్త్రీలను, దేవతలను, రాజులను, శత్రువులసైన్యాలను కూడా స్తంభింపచేయగలుగుతాడు.

*8 రాగ స్వరూప పాశాఢ్యా*
-------------------------------------
రాగరూపమైన పాశాన్ని ఎడమ చేతిలో ధరించిన తల్లికి నమస్కారము
Ragha Swaroopa pasadya
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
She who has loves rope in her left hand. salutations to the mother
పరమేశ్వరి చతుర్చాహు సమన్విత. అంటే ఆమెకు నాలుగుబాహువులుంటాయి
అని చెప్పటం జరిగింది. ఇప్పుడు ఆ బాహువులలో ఉండే ఆయుధాలను వివరిస్తున్నారు.
మొట్టమొదటగా పాశము.
రాగోల౭ నురక్తిః చిత్త వృత్తి విశేషః
రాగము అంటే అనురాగము. ఇది మనోవ్యాపారవిశేషము లేదా కోరిక. ఒకరి
మీద లేదా ఒక వస్తువు మీద ఉండేటటువంటి ఇష్టత. అదే ఆప్యాయత, అనురాగము,
ఇష్టము, ప్రేమ ఈ రకంగా అనేక పేర్లతో పిలువబడుతుంది. అనురాగము అనేది
పాశం వంటిది. కట్టిపడేస్తుంది. ఎవరిమీదనైనా ఇష్టత పెంచుకున్నట్ల ఐతే అది వారియందు
బద్ధులను చేస్తుంది. దానివల్ల వారిని విడిచి ఉండలేము. వారిని చూడందే ఉండలేము.
ఆ వస్తువు లేదా ఆ మనిషి లేకుండా మనం జీవించలేము అనిపిస్తుంది. దానికోసం
మనం ఏపనైనా చేస్తాం. ఎంతకైనా తెగిస్తాం. ఈ రకంగా అనురాగం పెంచుకున్నవాడికి
మనస్సు ఇతర విషయాలమీదకిపోదు. దైవచింతన గుర్తుకురాదు. అంతగా మోహంలో
పడిపోతాడు. జడభరతుడి కథ ఇందుకు చక్కని ఉదాహరణ.
పూర్వకాలంలో భరతుడు అని ఒకరాజుండేవాడు. చాలాకాలం రాజ్యం చేసిన
తరువాత, రాజ్యాన్ని కుమారులకప్పగించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. అతడు
చాలాగొప్పవాడు. వేదవేదాంగవిదుడు. తపోనిష్టాగరిష్టుడు. ఒకరోజున స్నానం చెయ్యటానికి
నదీతీరానికి వెళ్ళాడు. అక్కడ నిండుగర్భిణి అయిన లేడి ఒక పిల్లనుకని ప్రాణాలు విడిచింది.
ఈ రాజర్షి ఆ లేడిపిల్లను తెచ్చి చాలా జాగ్రత్తగా పెంచసాగాడు. దానికి ప్రతిరోజూ
క్రమం తప్పకుండా పాలుపట్టేవాడు. అది కూడా అతణ్ణి వదిలి ఎక్కడికీ వెళ్ళేదికాదు. ఈ
రకంగా ఆ లేడిపిల్ల పెరిగి పెద్దదవుతున్నది. రాజుకు వయసు మీరుతున్నది. రాజుకు
అవసానకాలం సమీపించింది. ఆఖరుస్థితిలో కూడా దైవచింతనలేదు. తను లేకపోతే ఈ
లేడిపిల్ల ఏవిధంగా బ్రతుకుతుంది అన్న ఆలోచనే. ఎప్పుడూ అదే ఆలోచన. ఆ లేడిపిల్లను
చూడకుండా క్షణం కూడా గడవని స్థితి. అలాగే కళ్ళు ముశాడు రాజు. పర్యవసానం ?
మరుజన్మలో లేడిఅయిపుట్టాడు. ఆ లేడిమీద ఉన్న ప్రేమతో, వానప్రస్థానికి పోయినవాడు
కూడా మళ్ళీ లేడిగా జన్మించవలసిన దుర్గతి పట్టింది. ఇదే రాగము.
పరమేశ్వరి ఎడమచేతి వైపున గల పైచేతిలో ఈ పాశము ఉంటుంది. ఈ పాశము ప్రేమస్వరూపమయిన ఆయుధము. జీవిని కట్టపడేస్తుంది.
మనోవృత్తులు బాధాకరమైనవి. అందుకే ఆయుధాలుగా చెప్పబడ్డాయి. రాగము అనేది అరిషడ్వర్గాలకు మూలమైనది. అనురాగాన్ని గనక జయించినటైతే ముక్తి లభిస్తుంది.సుషుప్తిలో రాగము ప్రాణమునందు లయం చెందుతుంది. జాగ్రదవస్థలో బుద్ది
జాగ్రదమవుతుంది. అందుచేత అది మనసులోఉంటుంది. గాఢమైన సుపుప్తిలోను,
లేదా తురీయావస్థలోను తప్ప అనురాగానికి అంతమనేది లేదు. ఇది అనంతమైనది.
పూర్వజన్మలో తెలిసిన విషయాలను మాత్రమే జీవికోరతాడు. అంతేగాని తెలియని పదార్థాల
జోలికిపోడు. ఎవరైనా కొత్తవ్యక్తులను చూసినప్పుడు వారిని ఎక్కడో చూసినట్లు, వారితో
మనకు బాగా పరిచయం ఉన్నట్లు అనిపిస్తుంది. నిజానికి వారితో మనకి ఏరకమైన
పరిచయం లేదు. కాని గతజన్మలలో ఎప్పుడో వారితో బాగా పరిచయం ఉందన్నమాట.
అందుకే మనకు అలా అనిపిస్తుంది. అందుచేతనే రాగోనురక్తిః చిత్త వృత్తి విశేషతః
రాగము అనేది బుద్ధికి సంబంధించిన విషయము. చిత్తవృత్తి విశేషము. మాయలేదా
అజ్ఞానము అనేవి ఇచ్చాజ్లాన క్రియాశక్తుల సమాహారము. ఈ మూడింటినీ విడదీయలేము.
ప్రాపంచికమైన ఈ అనురాగాలను అరికట్టే పరమేశ్వరి శక్తియే పాశము. పైన
చెప్పినటువంటి ఇచ్చాజ్డానక్రియాశక్తులలో
జ్ఞానశక్తి ఎక్కువపాలుంటే - ఉత్తమజన్మ ఇచ్చా, క్రియాశక్తులపాలు ఎక్కువ ఉంటే
- పశుపక్ష్యాదుల జన్మ కలుగుతుంది. జ్ఞానశక్తి ఎక్కువగా ఉన్నటువంటి వారు బుషులు,
గంధర్వులు, సిద్ధులుగ జన్మిస్తారు. సాధకుడు పరమేశ్వరిని అర్చించేటప్పుడు ఈ రాగము
అనే దాన్ని పూర్తిగా వదిలివేసి, అంటే రాగాన్ని పరమేశ్వరికి అర్చించి, ఆవిడచేతిలో
పాశరూపంలో ఉంచి అర్చించాలి. అప్పుడే అతడికి ముక్తి లభిస్తుంది.
పరమేశ్వరి చేతిలో ఉన్నటువంటి పాశము వశీకరణము అని చెప్పబడుతోంది.
ఈ పాశాన్ని అర్చించినవారు ముల్లోకాలను వశం చేసుకోగలుగుతారు. అందుకే నవావరణ పూజ చేసేటప్పుడు ఎనిమిదవ ఆవరణ అనగా త్రికోణంలో ముందుగా దేవి యొక్క
ఆయుధాలను అర్చించటం జరుగుతుంది.
ఓంఐంహ్రీం శ్రీం హ్రీం ఆం సర్వవశీకరణా భ్యాం
కామేశ్వరీ కామేశ్వర పాశాభ్యాం నమః పాశశక్తి
శ్రీ పాదుకాం పూజయామి తర్పయామి నమః
దుర్వాసుడు తన శ్రీదేవీ మహిమ్మః స్తుతి”లోని 43వ శ్లోకంలో
పాశం ప్రపూరిత మహా సుమతి ప్రకాశో
యో వా తవ త్రిపురసుందరి ! సున్దరీణాం ॥
ఆకర్షణేల ఖిలవశీకరణే ప్రవీణం
చిత్తే దధాతి స జగత్రయవశ్యకృత్స్వాత్‌ ॥
ఓ తల్లీ ! సౌందర్యవంతులైన సుందరీమణులను ఆకర్షించగల, సకలదుష్టశక్తులను

వశీకరించగల నీ పాశాయుధమును, పాశబీజమును ఉపాసించు వాడు ముల్లోకాలను
వశం చేసుకోగలుగుతాడు.


    

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు