నమస్కారం గురువుగారు ఇప్పుడే వ్రాస్తున్న పద్యాలు పెడుతున్నను, తప్పులు నాకు తెలవవు 

సహృదయులు సరిచేసి మరలా పెట్టగలరు ఇది ఆ అమ్మ దయతో 


మందారదామము ర/ర – ర/గగ UIU UIU – UIU UU

శ్రీధరా చిన్మయా – సిద్ధ సంకల్పా

మాధవా కేశవా – మాకు సర్వమ్మై

రాధికాలోల చే-రంగ రా రంగా

సాధుసంపూజితా – స్వాక్షి శ్రీదేవీ 

 

 స్వాగతము ర/న – భ/గగ UIUIII – UII UU

రాగరంజితము – రాసపు లీలల్

భోగరంజితము – మోహన గీతుల్

త్యాగరంజితము – ధన్యుల చేఁతల్

యోగరంజితము – యోగ్యులు దేవీ 


ఇంద్రవజ్ర త/త/జ/గగ UUI UU – IIUI UU

ఆనంద రూపా – అవినాశ తేజా

గానస్వరూపా – కరుణాంతరంగా

నీనామమేగా – నిఖిలమ్ము మాకున్

శ్రీఘ్రమ్ము రావా – చిఱునవ్వు దేవీ 


స్రగ్ధరా – మ/ర/భ/న/య/య/య UUU UIUU – IIII IIU – UIU UIUU

సేవాభాగ్యమ్ము గానే .. సమయపు సహనం -సాధుతత్త్వమ్ముగానే 

ప్రావీన్యమ్మోను ధర్మం - పలుకుల విదిత౦ - ప్రాసమార్గమ్ముగానే 

నైవేద్యమ్మోను కర్మం - నటనల చరితం - నైమిశారణ్యమౌనే            

నీవేదిక్కౌ ను మాకే - నిజమగు సమయం - నిర్మలంమౌను దేవీ 



సర్వాలంకారయుక్తాం సరలపదయుతాం సాధువృత్తాం సువర్ణాం

సద్భిఃసంస్తూయమానాం సరసగుణయుతాం లక్షితాం లక్షణాఢ్యాం

ఉద్యద్భూషావిశేషాముపగతవినయాం ద్యోతమానార్థరేఖాం

కల్యాణీం దేవ గౌరీప్రియ మమ కవితాకన్యకాం త్వం గృహాణ – (శివానందలహరి 98)


 



శరమాల.. భ భ భ భ స గ .. యతి .. 7 

చాచితి హస్తము జ్ఞానపు బిక్షగ దయ జూపూ

వేచితి నీకృప విద్యల మాటున కల జూపూ 

చూచితి తృప్తిగ సూత్రపు మాయలగుట తల్లీ

గాచెద నిత్యము గ్రాహ్యపు బట్టియు మాది దేవీ


మాయావలయం .. మ భ స భ స గ.. యతి ..10  

మాయాలో కంబుయు కదిలే మార్గము గనలేమో

సాయంబున్ యన్నది మెదిలే సాక్షిని గనలేమో 

ధ్యేయంబున్ నిత్యము జరిగే దీక్షలు గనలేమో 

మాయాతీతాశరణమునిమ్మా స్థిరమున దేవీ  

                    

సృతశిఖ ..త య స భ స గ .. యతి ..10 

సేవాభవమాయల్ చరితం శీఘ్రము మనసౌనే 

భావమ్మగు సేవాభరితం భాద్యత విధిగానే 

నీవేసహకారమ్ముగనే నిత్యము వచియింతున్ 

భావించితి నీపూజలుగా బంధము గనెదేవీ                  


అర్కశేషా   .. ర జ ర జ గ గ .. యతి .. 8 

కానిదేదియన్ననో కళా ప్రభావమేలే 

రానిదన్నదేది యోరణమ్ముగాను యేలే

మానుకున్నతీరు ప్రేమజూపుటేను సేవే              

సానుకూలమౌనులే సమమ్ముగాను దేవీ      


గోవృషస్థలితగతీ .. మ త య న గ గ ..యతి ..5 

అజ్ఞానమ్మున్ యాస యనంతమ్ముమనసౌనే   

విజ్ఞానంబున్ విద్య  వివాదమ్ము వయ సౌనే      

ప్రజ్ఞానంబున్ పాఠ్య  ప్రవేశంబు దయ గానే     

రాజ్ణీ నీపై రాగము చెప్పా గవిత దేవీ 

    

పవనః .. భ  స  స  జ  గ గ .. యతి .. 8 

లోకమునకు ప్రేమతొ  శీఘ్రమున్ సహాయమ్ 

ఏకమగుటగాను దయే సమర్దగానున్ 

మోకరిలుచునే గతిమొక్కులన్ని తీర్చే 

స్వీకరణముగన్ వసియించు శీఘ్ర దేవీ 


పృద్వి తిలక .. జ స జ న స య .. యతి .. 13                 

ప్రధానసమయమ్ముగాను కదిలె పదనేత్ర మేలే        

విధానపరమౌనిజాయితిగాను వినయమ్ము విద్యా 

మదీ కలకలే తరించు విధము మలుపుళ్లు తీరే

కథాబలముగా జయమ్ముగనుట కళగాను దేవీ  

            




తెల్లారగానే నూనె రాసి, నలుగు పెట్టి కాకరపంద…

            


నమ్మకం తో నటన సంసారం 

నిజాయితీ తో నిర్మల సంగీతం   


సంసార యజ్ఞంలో సుఖమయం 

ఆలుమగల పాత్ర ఆనందదాయకం


దంపతుల గా కలసి ఆశీర్వాదం 

సతిపతుల గ జగతికి మార్గదర్శం 

 

ఈ పరుగుల కాలం లోనే జీవితం

ఒకరితో ఒకరు ఏకంతో విశ్వమయం 

   

సంసార సాగుబడి తో దాంపత్యం   

సంతాన తో రాబడి సంతోషం


 సువర్ణ - .. స/భ/భ/భ/భ/గగ యతి .. 10   

కలయేమో బ్రతుకన్నది - కల్లలె యా నిజమేమో 

శిలయేమో చెలి యన్నది - చిత్తములోఁ గలదేమో 

వలయేమో వలపన్నది - వారిధిలో ఝషమేనా 

అలయేమో నను ముంచఁగ - నంతము నాకదిదేవీ 


హరి నిన్నే మనమందున - హర్షముతోఁ దలువంగా 

మఱి రావే నను జూడఁగ - మాపటికిం గలువంగా 

వరవీణా మృదుపాణిని - వాంఛలతోఁ గులుకంగా  

కరమీయంగను రమ్మిట+ - కానుకలం జిలుకంగా  

*

 యేనా 

*

ఉదయ మ్మానభమందున - నుప్పెన యా వెలుఁగేనా 

మృదులమ్మైన సువర్ణపు - వృత్తములో నరుణుండే 

అదియేనా భువి జీవపు - టాకర మీయుగమందే 

మదిలో నానుతు లిత్తును - మంగళమై మెఱయంగా 

*

IIUU IIUII - UIIU IIUU  

17 అత్యష్టి 28084 




శ్రీమద్ భగవద్గీత వృత్త పద్యాలుగా (700 ) పుస్తకంగా ముద్రించాను కావలసినవారు చిరునామా ఫోన్ తెలపగలరు ఒక పుస్తకం 250 /-42 రూ 6281190539  స్క్రీన్ షాట్ పెట్టండి ( గూగుల్ ఓర ఫోన్ పేయ్ ) ఎన్ని పుస్తాకాలో తెలపండి         

ఉదయా ప్రాక్తనీ సంధ్యా ఘటికా త్రయ ముచ్యతే ౹


సాయం సంధ్యా త్రిఘటికా అస్తాదుపరి భాస్వతః ౹౹


సూర్యోదయానికి ముందు దాదాపు 70 నిమిషాల కాలం ప్రాతః సంధ్యకు ముఖ్యకాలం. సూర్యుడస్తమించడానికి ముందు ఇరవై నిమిషాలు మొదలుకొని, సూర్యుడస్తమించిన తరువాత 30 నిమిషాల కాలం సాయంసంధ్యకు ముఖ్య కాలం. ఇందులోనూ ఉత్తమ, మధ్యమ, అధమ భేదాలున్నాయి. 







 


*ఎవరు సకల దేవతలకు ఆదికారణుడో,సర్వప్రపంచమునకు పరిపాలకుడగుచున్నాడో, మహర్షిగా సర్వజ్ఞుడగు చున్నాడు. అద్వితీయుడగు ఆ పరమాత్మయే మాయా విశుష్టుడై తన శక్తితో సర్వమును నియమించుచున్నాడు.ఆ పరమాత్మయే యీ సమస్త ప్రపంచమును మాయాశక్తితో పుట్టించుచు,పోషించుచు,సంహరించుచున్నాడు.ఈ విషయము నెవ్వరెరుంగుదురో వారు మరణరహితులై ముక్తులగుదురు.


Comments

Popular posts from this blog

లలిత శృంగారం

శార్దూల పద్యాలు

kavitalu అముద్రిత కవితలు