ప్రాంజలి ప్రభ సమస్యను పరిష్కరించిన వారు .....*మల్లాప్రగడ రామకృష్ణ*(01-11-2024 to 15-11-2024)
ప్రాంజలి ప్రభ సమస్యను పరిష్కరించిన వారు .....*మల్లాప్రగడ రామకృష్ణ*(01-11-2024 to 15-11-2024)
01.కట్ట బట్టనిచ్చి కళలను తీర్చేటి
కట్టు బాటు లన్ని కాల రీతి
ముట్ట నిచ్చి మనసు ముందు పంచగలుగు
*"ముట్టఁడనుచు మెచ్చె ముదిత మగని”*
*******
02.కలిమి యున్న బతక లేని కలలు తీర్చ
చెలిమి చీకున్న ను సహాయ చేష్ట లుడికె
బలిమి తో ప్రేమ పంచెడి బలుపు కాదు
*ఎలమి నాతని కంటెను నితడు ఘనుడు*
****-
03.వాణి పలుకుగా కదలగా వరుస యదియు
రాణి ప్రేమను పొందేది రమ్య తయది
ఖాని ఖర్చు లేని బతుకు కాల మాయ
ఆణి ముత్యంబు మీసమం దమరి యుండె
*******
04.అడ్డము నున్నను యరుపే
మడ్డిమొహమ్ముయు మనేను మమకారమ్మున్
వడ్డన వల్లే విధిగా
గడ్డము వాడెప్పు డైన గ్రామము జెరచున్
*******-
05.ఆ.వర్తమానమేను వరుస విద్య కళలు
రేపుయన్న దేది రీతి మారు
ప్రస్తుత బ్రతుకౌను ప్రభల తీరు కళలు
నేడు నిజము పలుకు నేర్పు కళలు
********
06.మూలమ్ము ననేజీవ మహావృక్షముగన్
జ్వాలౌను సహాయమ్ముగనే దక్షతగన్
మేలౌను మహామాయగనే రక్షత గన్
కాలమ్ము నీదైన కళ లై పండగ యున్
******
O7.అందపు కోడిగమహిళా
పందెము పొందా వరుసలు పాశము కొరకే
చిందేసే కోడిగనుము
కుందేటిని కోడిపిల్ల గుటకున తినియెన్
*****
08.కళలు తీర్చక త్రాగుడు కాపు కాసి
బిడ్డలను పట్టు కొనకయే బీరు త్రాగి
భార్యను బడిత పూజగా బలుపు జూపి
జలధి యందున దాగెను జనకు డపుడు
******
09.కామ వాసన చిక్కియు కాల మందు
కరుణ లేని కసాయిగా కాంక్ష జూపి
కాని దన్నదే జేయుచు కాంత వలపు
రామ రాజ్యమ్ము పోగొట్టె రంకులాడి
******
10.ధ్యానమే పెరిగియునిత్య ధ్యాస తప్ప
జ్ఞానమన్నది వేదము జ్ఞప్తి మారి
దానమిచ్చుట పాపంబు ధరణి లోన
వాదమే జేయ లోకపు వాక్కు లవియు
****---
11.చక్కని దైనను కోరిక
దక్కక యేలబ్రతుకేన దారులు మారే
మొక్కులు తీర్చియు కదిలే
చుక్కలలో నొక్క నక్క సుడివడి తిరిగిన్
********
12.కాల మాయ కదలికయే కళలు తీరు
సలపరింత మకులితగా సమయ తీరు
పాప పుణ్యము తెలియకే పాపి యగుట
పాపి చిరకాల ముండునా పండితుండ
********
13.కరువు మొదలగుట కదిలే
తరువులు కలకళలు తప్పె తాపము పెరిగే
బరువే మోసెడి పలుకే
తిరుమల దేవుండు కాదు తెచ్చిన రాయే
********
14.మనసు విప్పి తెల్పగలేని మనిషి చేష్ట
గుణము మార్చలేకయు బాధ గుప్త చేష్ట
మనిషి కంటెను దేవుడు మంకు వాడు
మంచి చెడు చూడ వోర్పుయే మనకు యిచ్చె
********
15.వాళ్ళను కలవగ సంతస
రాళ్లు కరగించు రాగంబు రమ్యముగను
ముల్లులు యున్నభరించియు
వెల్లువ సంగమ సుఖమగు వేళన వెన్నెల్
*********
Comments
Post a Comment