
శ్రీ శ్రీ శ్రీవేంకటేశ్వర ప్రభ (1)
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నమో శ్రీవేంకటేశాయ
నమో నమో శ్రీ తిరుమల తిరుపతిశ్రీవేంకటేశాయ
నమోనమ:
శ్రీ రమణీ మనో రమణ
శ్రీకరమౌని హృదబ్జ భృంగ
శృంగార గుణాన్వితా
విమలకాంచన రత్న విభూషణా .....
లసద్వారిద మంజులాంగ
సురవందిత కోటి మనోజ్ఞరూప
లాక్షారుణ పాదపంకజ
వృషాచలమందిర వేంకటేశ్వరా! .....
శ్రీ కరుణా మనో రమణ
శ్రీపదలక్ష్య మనోజ్ఞ బృంగ
శృంగార దళాన్వితా
వినయపోషణ రత్న విభూషణా ......
హిమప్రేరిత మంజులాంగ
నవపూజిత కోటి మనోజ్ఞ రూప
శ్రావ్యాశృతి పాదపంకజా
కృపాకర వందిత వేంకటేశ్వరా ......
శ్రీ వినయా మనో రమణ
శ్రీమతిలక్ష్య మనోజ్ఞ బృంగ
శృంగార బలాన్వితా
మదిని దోచిన రత్న విభూషణా ......
గుణజ్యోతియు మంజులాంగ
సమభావిత కోటి మనోజ్ఞ రూప
ప్రేమాన్విత పాదపంకజా
వృకోదర సమ్మతి వేంకటేశ్వరా .....
శ్రీ పతిగా మనో రమణ
శ్రీ గుణభాష్య పదాబ్జ బృంగ
శృంగార రమాన్వితా
మమత పంచిన రత్న విభూషణా .....
కలాన్వేషిత మంజులాంగ
తులసీదళకోటి మనోజ్ఞ రూప
సత్యాన్విత పాదపంకజా
గృహాలయ పూజిత వేంకటేశ్వరా ....
నమో శ్రీవేంకటేశాయ
నమో నమో శ్రీ తిరుమల తిరుపతిశ్రీవేంకటేశాయ
నమోనమ:
--(())--

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
శ్రీ వేంకటేశ్వర ప్రభ (2 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మక్కువ తో ఏడుకొండలపై
భక్త కష్టాలను తీర్చుటకై
సాగగలేని భక్తులన్ రక్షణకై
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
మొక్కులు తీర్చు వారికై
అందరి నష్టాలను మాన్పుటకై
ఆగగలేక ఉన్న శక్తుల కై
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
ముడుపులు కట్టే భక్తులకై
ఇష్టాలను అందరికి పంచుటకై
వేగగలేక ఉన్న ఏడ్పులకై
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
దావాలనంబు అరికట్టుటకై
వాంఛలను నెఱవేర్చుటకై
విజ్ఞులను ఆదుకొనుటకై
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
పక్కగ ఆకల్ని తీర్చుటకై
దుష్టులను శిక్షించుటకై
ఇష్టుల్ని రక్షించుటకై
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
మది ఇంద్రియాలకై
చిత్తము పదిలముకై
రహస్య కామవాసంబుకై
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
కర్మలు విహితమునకై
భక్తులసమత్వమునకై
జ్ఞాని విజ్ఞాని సృషించుటకై
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
జలమునందు రసము గా
శశిసూర్యులందు వెలుగు గా
శృతులందు ప్రణవము గా
ఉండి కష్టాలు తీర్చే వేంకటేశ్వరా!
-(())--

Comments
Post a Comment