ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఓం నమశివాయ
కాలాన్ ద్వైత ప్రభొక్తారం,
ధర్మ కాంతి ప్రభోజనమ్
ప్రేమ జగద్గురుం సదా,
ప్రేమరం లోక ప్రేమరమ్
సంఘాన్ ద్వైత ప్రశొక్తారం
సత్య వాక్కు ప్రభామయమ్
యుక్తి జగద్గురుం సదా,
నాయకం లోక నాయకం
విశ్వాన్ ద్వైత ప్రమోక్తారం
ముక్తి జగద్గురుం సదా,
నీతి సూక్తి ప్రయుక్తయుమ్
నాటకం లోక నాటకం
"ఆర్షాऽऽద్వైత ప్రవక్తారం ,
విశ్వశాంతి ప్రబోధినీమ్ !
నౌమి జగద్గురుం సదా ,
శంకరం లోకశంకరమ్!!!"
ప్రాంజలి ప్రభ (1)
త్రిగుణ ప్రకృతి నెవ్వరు
సగుణ సకర్మలకు బానిసలగు వారిన్
తగదను భ్రమింప జేయగ
జమందీ గుణమునొందు జ్ఞానుడుమెలున్
నేటి ప్రాంజలి ప్రభ పద్యము -2
శ్రీవేంకటేశ్వరునితో తెలిపే అమ్మవారు
ఎంతో మంచిగ పలికితి
అంతంబే లేని నాదు ఐశ్వర్యములన్
కొంత ప్రధాన్యత గలిగిన
వింతగఁ ఉన్నది తెలిపెద వినుమా నాధా
--(())--
----
"శ్రీ సత్యదేవ మూర్తీ !
నీసన్నిధియే యెదురుగ నెమ్మది నమ్మితి..
మాసత్కామ్యములనెఱిఁగి
గాసఁటఁ బడుభక్తులఁబ్రోవు గమ్యమునిడుచున్!!!"
ప్రాంజలి ప్రభ పద్యము
చూడు నాయనా
నేనే చేసిన వాడను
నానా గుణకర్మలగని నాలుగుభాగాల్
ఈ నా కర్మల కర్తను
నేనే అయినా యెఱుంగు నేను అకర్తన్
అన్నాడు ఆ పరమాత్ముడు

III III III III III UU
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
నేటి కవిత్వం -పాళాశదళ
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చిరు నగవుల పలుకులు మనసునకు ఉల్లా
స రుస రుసలు పకపకలు సుమ లత సల్లా
ప రమ వలపుల తలపుల మమతలు ఉల్లం
పరి పరి విధముల నలిగి మరుగుట కాదా
కరములు కలయిక గుబులు గుబులుగ కాదా
అర మరికలు కధల సెగ ఉరవడి కాదా
మురిపములు మది తెరచి మరచుటకు కదా
తరుణము ఇదియు పలుకు కులుకులకె కాదా
ఇరువురు కలసి కలియుగ వినిమయ ధర్మం
పరువపు మెరుపు కలియుగ వినయపు సత్యం
తరువుల వలె ను కలియుగ కరుణను నిత్యం
కఱువుల తొలగె కలియుగ పలుకుల యుద్ధం
--(())--
నేటి కవిత :
రచన : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నేను చెప్పే కధలన్నీ నీకు అర్ధము కావో
ఏది మైన నీవు నాకు నచ్చావు
నన్నును నమ్మినట్లు నీవు ఉన్నావనుకోనా
ఎదో మనసుకు నచ్చిన పిచ్చిదను కోనా
పువ్వు విరిసింది నాకోసమే ననుంకుంటా
నవ్వును చూపి ఆహ్వానిస్తావని అనుకుంటా
కెవ్వు మని కేక వేసింది భయమను కుంటా
లవ్వు అంటూ నీవు ప్రేమనందిస్తా వనుకుంటా
కోడి పిల్లలతో పరిగెడుతూ
కోడి గుడ్లు విసిరి సంబర పడుతూ
కోడి ఈకలను తలలో గుచ్చుకొని ఎగురుతూ
కోడిలా కూస్తూ రైలు లా కదులు తూ
గడియారంలా నా వెనుక తిరుగుతూ
రేడియో లా ఏవో పాటలు పాడుతూ
కరంటు తీగపై గబ్బిలంలా వ్రేలాడతూ
బకెట్టులొ కూర్చొని బావిలో దిగుతూ
ఆడిన ఆటలు మరిచావు
ఈనాటి పుణ్యమో నీవు నాకు దక్కావు
దుర్మాగాన్ని అంతం చేసి నన్ను చేరదీసావు
అనీ ఒకటే ఏడుస్తావు,
ఏమని చెప్పేది, ఎలాచెప్పేది
నీ ప్రేమకోసం తపిస్తున్నా
ఓర్పుతో ఓదార్పుతో నీ తోనే ఉన్నా
నిన్ను కాపాడి చదివిన చదువు
గుర్తు చేయాలని తపిస్తూ ఉన్నా
నేను చెప్పే కధలన్నీ నీకు అర్ధము కావో
ఏది మైన నీవు నాకు నచ్చావు
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
om sri raam
ర స స త జ జ గ చంద్రకళ -10
UIU IIU IIU UUI iUI IUI U
నేటి కవిత్వం - చంద్రకళ
రచయత:మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తల్లడిల్లుట మానవ సంతానం సహనమ్మును చూపదే
అల్ల రల్లరి ఆటలతో కాలాన్ని వినోదమ్ము గా అనే
రళ్ల కోసము తల్లియు తండ్రిన్నే విదిల్చియు తాపమే
యుల్లమే లలితా సుమమాధుర్యమ్ము తరించుయు పల్కులే
కల్లరీడుతొ చెప్పెడి ఒక్కోమాట సహాయపు భావమే
కల్ల మాటలతో సమయోచమ్ముగ సుహాసిని మార్గమే
నెల్ల చూపియు బాధను పెట్టే రోగము అంతయు చూపుటే
యెల్లఁరూ తెలిపే తరుణం ప్రేమమ్ము సుఖాలను పంచుటే
కళ్లచూపుకు గుల్లలగా మారేటి విషాదము చెప్పెడి
యుల్లమే జలమై వినువారందర్కి సుతారముగా మనో
జల్లులే విధిరాతలుగా సంతోషముగా సమరాగమే
వెల్లువిర్శి యు శోధనయే వేదమ్ము మనస్సును చూపుటే

IIUI UII UII UI UII (కొత్తది )
నేటి కవిత్వం - నడిరేయి
రచయత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నడిరేయి చక్కని పున్నమి నాటి వెన్నెల
హృదయాన కోర్కలు తీరుగ ఆశ కమ్మిన
మృదుభాష పల్కులు తో పొదరింటి శోభతొ
శృతి చెప్పి పొంతన చూపియు సంత సమ్ముగ
జడివాన మబ్బుల కమ్మిన రాత్రి వెన్నెల
తెలికోక రైకయు ముస్గులొ అందచంబన
మధురమ్ము సోయగ మోహము శృతి చేసియు
తొలిమేలి చూపుల ఘర్షణ కల్ప వృక్షమె
మదిదోచి మాయను పెంచిన శోభ వెన్నెల
రవళింప గీతపు నాట్యము సేవ సన్నిధి
మనువాంఛ తెల్పియు హాసము చూపు పెన్నిధి
చిరుహాస మోములు కల్సియు ఒక్కటౌవుట
విధిఆట చూపియు సంతస మిచ్చు వెన్నెల
రసకేళి మువ్వల జంటల శబ్ద భేదియు
సడిఆకు గాలుల సవ్వడి ఇంకఇంకని
నభిసారిక ప్రియ వేల్పుల మేలు కొల్పులు
--(())--
Comments
Post a Comment