ప్రాంజలి ప్రభ (జనవరి రెండవ వారం ) సుభాషితాలు



1035

1038..న స్నానమాచరేద్భుత్త్వా నాతురోన మహానిశి ౹

     న వాసోభిః సహాజస్రం నా విజ్ఞాతే జలాశయే ౹౹

        భోజనం తరువాత స్నానం చెయ్యరాదు.రోగి అయినవాడు స్నానం చెయ్యరాదు.అర్ధరాత్రి వేళ స్నానం చెయ్యరాదు.కట్టిన బట్టలపైన స్నానం చెయ్యరాదు.అలాగే,ఎలా ఉందో చూడకుండా కళ్యాణికట్టలో,బావిలో కూడా స్నానం చెయ్యరాదు.

1039..షడ్దోషాః పురుషణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా ౹

నిద్రా తంద్రా భయం క్రోధః ఆలస్యం దీర్గసూత్రతా ౹౹

యశస్సు,అభివృద్ధిని ఇష్టం పడే పురుషుడు నిద్ర, మగతతో తూగేది, భయం, కోపం, సోమారితనం, ఆలస్యం ఈ ఆరు దోషాలను విడిచిపెట్టాలి.

1040..మూలచ్చేదం రిపో:, కుర్యాదథవాన ప్రకోపయేత్ ౹

అన్యథాసౌ వినాశాయ పాడస్ప్రుష్ట ఇవోరగః ౹౹

   

      శత్రువుని వేళ్ళతో సహా నాశనం చెయ్యాలి.లేకపోతే అతన్ని రెచ్చకొట్టరాదు. అలాగేదైనా అయితే కాలితో త్రొక్కి పాములా మన వినాశనమునకు కారణం అవుతాడు.

1041..అనిత్యాని దేహాణి విభవో నైవ శాశ్వతః ౹  

 నిత్యం సన్నిహితో మృత్యు : కర్తవ్యో ధర్మ సంగ్రహః ౹౹ 

    

      మన దేహాలు నాశనము అవుతాయి.సంపత్తు శాశ్వతం కాదు మరియు చావు ఎల్లప్పుడు దగ్గరగా ఉంటుంది.అందువల్ల మనం తక్షణం పుణ్య కార్యలలో పాల్గొనాలి.

1042..మూర్ఖం వ్యాసానినం లుబ్ధమప్రగల్బం భయాకూలం 

క్రూరమాన్యాయకర్తారం నాధిపత్యే నియోజయేత్ ౹౹

           మూర్ఖుడ్ని,చెడ్డ పనులలో ములిగినవాడ్ని,అతి ఆశలున్నవాడ్ని,ప్రతిభలు లేనివాడ్ని,భయడుతున్నవాడ్ని,కౄరుడిని,అవినీతి పరుడుని,ఎప్పుడూ ఉన్నతి స్థానములో కూర్చో పెట్టరాదు.

1043..గుణగ్రామాభిసంవాది నామాపి హి  మహాత్మానాం ౹  

యథా సువర్ణశ్రీఖండ రత్నాకర  సుధాకరాః ౹౹

           మహాత్ముల పేరుతో వాళ్ళ ఉన్నత గుణాలను కూడా తెలుసుకోవచ్చు.ఎలా అంటే ,బంగారం పేరు సువర్ణము,ఆకర్షించే గంధానికి శ్రీఖండం అంటే సుగంధాలతో కూడిన వృక్షము,సముద్రానికి రత్నాకరము అమూల్యమైన వస్తువులు పొందడం,చంద్రుడికి సుధాకరుడు,అంటే అమృతంలాంటి సంతోషం ఇచ్చేవాడు.

        

1043“”అజ్ఞానిని  మయా దోషాన శేశాన్వి హితాన్ హరే,

క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణీ"


ఓ వృషభశైలనివాసా, అజ్ఞానములో నేను చేసిన అనేకరకములైన పాపములను నేరములను దూషణముల నుండి  నన్ను క్షమించి నాకు మోక్షమును ప్రసాదించవయ్యా!  శ్రీ వేంకటేశ్వర స్తోత్రములో మనకి ఈ అపరాధ శ్లోకము  గోచరమవుతుంది.

 1044..ఆరభేతైవ శర్మాణి శ్రాంతః శ్రాంతఃపునః పునః ౹

 కర్మాణ్యారభమాణం హి పురుషంశ్రిర్నిషేవతే ౹౹

   

       విశ్రాంతి తీసుకున్న తరువాత మళ్ళీ మళ్ళీ మహత్యమైన కార్యాలు ప్రారంభించాలి.మంచి పనులు చేసే పురుషుడికి శ్రీ అంటే లక్ష్మిదేవి కరుణిస్తుంది.

1046..యథా కాష్ఠమయో హస్తి యథా చర్మమయో మృగః ౹

     పుమాన్యశ్చానాధీయానః త్రయస్తే నామ బిభ్రతి ౹౹

     చెట్టు నుంచి చేసిన ఏనుగు,చర్మంతో చేసిన మృగం, అధ్యాయనం చెయ్యని మనిషి వీళ్లంతా పేరుకు మాత్రమే.

1047..ఆనందం.. ఆరోగ్యం.. అధ్యాత్మికం మా ధ్యేయం

మిత్రే నివేదితే దుఃఖే దుఃఖినో జాయతే లఘు ౹ 

భారం భారవహస్యేవ స్కందయోః పరివర్తతే ౹౹

        మిత్రుడిలో దుఃఖాన్ని చెప్పుకున్నపుడు మనస్సు భారం,ఉద్వేగం తక్కువ అవుతుంది.భారాన్ని మోసేవారు ఒకరినుంచి ఒకరు భుజాలు మార్చినపుడు బరువు తగ్గుతుంది కదా ?

- 1048

యాదృశం ఫలమాప్నోతి కుప్లవై : సంతరన్ జలమ్ ౹

     తాదృశం ఫలమాప్నోతి కుపుత్రై : సంతరంస్తమః ౹ 

     సరిలేని నావతో నీళ్లు దాటడానికి ప్రయత్నం చేసినపుడు ఎలాంటి ఫలితం దొరుకుతుందో అలాగే,చెడ్డ పిల్లలవల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టుకోవడం వ్యర్ధ ప్రయత్నమే

Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు