ప్రాంజలి ప్రభ.. శ్లోక.. తాత్పర్య.. పద్యాలు 


001..గచ్చన్ శరీర విచ్చే దావపి భస్మావ శేషా తామ్1

కర్పూర: సౌరభేణేవ జంతు: ఖ్యాతాను మీయతే11


భావం: కర్పూరం వెలిగి ఆరిపోయినా.. సువాసనలు ఇంకా మిగిలి ఉన్నట్లుగా.. సజ్జనుల శరీరం నాశనమైనా.. వాళ్ళ కీర్తి అన్ని కాలాల్లో అలాగే మిగిలిపోతుంది.


కం..

ఒప్పు కల లగుట కధలగు 

కప్పురము వెల్గియు యారియు వాసనలే

ముప్పను మార్చ గలవిధే 

చెప్పు పలుకులౌను మంచి తలపే కళగన్ 


తేటగీతి:

కప్పురము వెల్గి యారినా గాని మనకు

తత్ సువాసనల్ యింకను తనరునట్లు

మంచి వారి యొడలు నాశనమైనగాని

వారి కీర్తి సదా నిల్చు వసుధపైన.

***

002..మూర్ఖేణ సహ సంయోగో విషాదపి సుదుర్జరః ౹    

విజ్ఞేన సహ సంయోగః సుధారససమః స్మృతః ౹౹ 

     

       మూర్ఖుడుతో సంబంధాలు విషకన్నా ఎక్కువ విషం. సజ్జనులతో సహవాసం సుధ అంటే అమృతంతో సమానం.


ఆ.. మూర్ఖ బంధ మున్న ముప్పు తోడగుటయే

విషము కన్న ఎక్కువే యగుటయు

సజ్జన చెలిమి గతి చలువ సుధ లగుటే

అమృత మేను త్రాగ ఆత్మ సుఖము 


తే.. మూర్ఖ సంపద సంబంధ ముఖ్య మేళ

చెలిమియె విషమ్ము యవ్వుటే చేరు గతియు

సజ్జనులతో సహన వాస సమయ తృప్తి

అమృత మేయగు సహనమ్ము ఆత్మ తృప్తి

***

003..అధర్మేణైధతే తావత్-తతో భద్రాణి పశ్యతి1

తత: సపత్నాన్ జయతి-సమూలస్తు వినశ్యతి11


భావం: అధర్మంతో వృద్ధి చెందువాడు కొన్నిసార్లు మంచి సుఖములను చవిచూచును. తన శత్రువులనూ గెలుచును. కానీ, చివరకు సమూలంగా నాశనం కావడం తథ్యం.


ఆ.. వృద్ధియే యధర్మ వృక్షమై యున్నాను

పలుసుఖములు పొందు బడయ వచ్చు

గెల్వ వచ్చు కాని స్వేచ్ఛ శత్రువు తోడు 

తాధ్యము మది చెడుట తనకు తుదకు 


తేటగీతి:

ముందుగ నధర్మముగ వృద్ధి చెందువాడు

పలు సుఖములను తానుగ బడయవచ్చు

పలు శత్రువులన్ గెల్వ వచ్చు కాని

తథ్యము సమూల నాశము తనకు తుదకు.

***

004..ప్రజ్ఞా నవనవో ల్లేఖశాలినీ ప్రతిభా మతా ౹

     తదనుప్రాణనాజీవద్ వర్ణనానిపుణః కవి: ౹౹


       నవ్య నవీనముగా చెప్పేంత అర్హత ఉన్న ప్రజ్ఞా శక్తికి ప్రతిభ అని పేరు.అలాగే ఆ ప్రతిభను అనుసరించి జీవం ఉన్నట్టు విషయాలను వర్ణించడములో నైపుణ్యం ఉన్నవాడు కవి


తే..నవ్య భావాలు తెలిపేటి నమ్మ బలుకు

కవి హృదయము ప్రజ్ఞా శక్తి కలము తెల్పు

ప్రతిభ విషయాలు వర్ణించ ప్రగతి జూప

జీవ సంఘటనలు తెల్ప జేష్ట కవియె 


005..సర్వథా సుకరం మిత్రం దుష్కరం పరిపాలనం ౹

      అనిత్యాత్వాత్తు చిత్తనాం మతిరల్పేsపి భిద్యతే ౹౹


     మిత్రుడుని పొందడం సులభం.అయితే అది నిలుపు కోవడం చాలా కష్టం.మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉండటం వల్ల కేవలం చిన్న కారణమునకు స్నేహ భావం చెడిపోతుంది.


చెలిమి జేరుత సులభము చెరిత తెలప

నిలకడ కనరాదు చెలిమి కలలు మల్లె

మనసు తీర్పు బట్టి పలుకు మారు చుండు

చిన్న మాటకు చెలిమియే చెడుట యేల


006.. నాభ్యుత్థానక్రియా యత్ర నాలాపా మధురాక్షరా: ౹

     గునదోషకథా నైవ తత్ర హరమ్యే న గమ్యతే ౹౹


      ఏ స్థలంలో ఎదురుకొనే పని ఉండదో ఎక్కడ మధురంగా అనిపంచే మాటలు ఉండవో ఏ స్థలంలో గుణ దోషాల విచారణ ఉండదో అటువంటి ఇంటికి వెళ్లకూడదు.


తెలపలేని స్థితియనినా, తేరు కొనక

మధుర పలుకులు లేకనో మనసు కొరత

గుణము గుర్తింపు నుండదో గురువు కొరత

స్థలప్రభావాలు జూపిన స్థిరము లేదు 



Comments

Popular posts from this blog

లలిత శృంగారం

kavitalu అముద్రిత కవితలు

శార్దూల పద్యాలు