శ్లో|| ఆపదర్థే ధనం రక్షేద్దారాన్ రక్షేద్ధనైరపి* *ఆత్మానం సతతం రక్షేద్దారైరపి ధనైరపి* . . . . . 19 *--పంచతంత్రం. కా.కీ.2-87.* అపద వస్తే ఉపయోగపడడానికి ధనం సంపాదించాలి. అటువంటి ధనం ద్వారా భార్యను రక్షించుకోవాలి. అలాగే, భార్య వలన, ధనం వలన తనను తాను నిత్యం రక్షించుకోవాలి. శ్లో === వైరిణం నోపసేవేత సహాయం చైవ వైరిణః | ఆధార్మికం తస్కరం చ పరస్యైవ చ యోషితమ్ || . . . . . . 20 భావము === శత్రువును, వారికి సహాయపడువానిని, ధర్మము చేయని వారిని, దొంగలను, పరస్త్రిలను, సేవింప రాదు. శ్లో === లోష్టమర్ధీ తృణ చ్చెదీ నఖఖాదీ చ యోనరః | సవినాశం వ్రాజత్యాషు సూచకో శుచిరేవ చ || . . . . . . . . . . 21 భావము === మట్టి గడ్డలు నలిపెవాడు , గడ్డి పరకలు తెంపేవాడు, గోళ్ళు కోరికే వాడు, నిందలు చెప్పువాడు, శుభ్రత, పరిశుద్దత లేనివాడు శీఘ్రమ్గా నశించి పోవుదురు. --((**))-- యోఽన్య ముఖే పరివాదః ,స ప్రియ ముఖే పరిహాసః ఇతరేంధనజో ధూమః , సోఽగరు జాతో భవేద్దూపః. . . . . . . 22 ఇ...
Posts
Showing posts from April, 2025
- Get link
- X
- Other Apps
శ్లోకములు శూన్య ఏవ కుసూలే తు ప్రేక్ష్య సింహో న లభ్యతే తథా సంసారబన్ధార్థః ప్రేక్షితోఽసౌ న లభ్యతే. బాగుగ పరికించి చూచినచో గరిసెయందు సింహము లభింపనట్లు, విచారించి చూచిన ఆత్మకు సంసారబంధమున్ను తొలగుచున్నది. (ఆత్మకు అసలు ఏ కాలమందును సంసారబంధమే లేదని తెలియగలదు.) కాన్తైవ మాతృభావేన గృహీతా కణ్ఠలమ్బినీ నూనం విస్మారయత్యేవ మన్మథం మాతృభావనాత్. కంఠమును కౌగలించుకొనిన పత్నియు, మాతృభావనచే కామవికారమును మఱచునట్లు చేయుచున్నది. (కల్పనానుసారమే పదార్థములు అర్థక్రియాసమర్థములగునని భావము.) తస్మాత్సంకల్పమేవ త్వం సర్వభావమయాత్మకమ్ త్యజ రామ సుషుప్తస్థః స్వాత్మనైవ భవాత్మనః. కాబట్టి ఓ రామచంద్రా! సర్వదృశ్య పదార్థములను గూర్చిన సంకల్పమును నీవు త్యజించి, సుషుప్తియందువలె ఏ సంకల్పమున్ను లేనివాడవై నీయొక్క పరమార్థ అత్మరూపముతో స్థితుఁడవై యుండుము. అరావప్యుచితంకార్యం ఆతిథ్యం గృహమాగతే ఛేత్తుం పార్శ్వగతాం ఛాయాం నోపసంహరతే ద్రుమః. ఇంటికి శత్రువు వచ్చినా ఆతిథ్యం ఇవ్వాలి.తనను నరకటానికి వచ్చిన వానికి కూడా చెట్టు తన నీడను ఉపసంహరించుకోవటంలేదు కదా. ...