Posts

Showing posts from May, 2019
ఫాదర్సు  డే సందర్బముగా ప్రాంజలి ప్రభ రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ మాతృశ్రీ మమతానురాగంతో పుడమితల్లి కానుకగా తల్లితండ్రుల కోరికలు తీర్చే విధంగా బుడి బుడి నడకలతో అందర్నీ నవ్వించి ఏడ్పిస్తుండగా నవనాడులు ఏకం చేసే జీవిగా కష్టాలన్నీ ఇష్టంగా మార్చుకొని మైనపుముద్దలా మనస్సుని మార్చుకొని కొవ్వొత్తి వెల్గులా కరిగి పోతున్నావు నాన్నా నీ ఆశా ప్రతిరూపాలకొరకు తరువుగా సమస్తము ధారపోస్తున్నావు ఓర్పుతో, ఓదార్పుగా, త్యాగజీవిగా మా శ్రేయోభిలాషిగా సాక్ష్యం నీవే నాన్నా స్నేహంతొ ఆటలాడించి ప్రేమతో నన్ను ఎత్తుకొని మోసి మా ఏడుపుకి జోలపాట పాడి మా గమ్యం దిశగా ఉన్నావు నాన్నా దారితప్పి అడుగులు వేస్తె దండ నాయకుడివై దర్యాన్ని ప్రోత్సహించి  ధర్మాన్ని తెలిపినావు నాన్న స్వార్ధం ఎరుగని సముద్రంలా ఏది దాచుకోని నిస్వార్ధపు జీవిలా నిరంతరం నడిపే నౌకా నాయకునిలా జీవితాన్ని మాకొరకు ధారపోశావు నాన్నా మా చదువుల, పెళ్లి కొరకై బంధువుల బాగు, కొరకై స్నేహితుల సహాయము, కొరకై ప్రేమను సమతుల్యముగా అందించి సూర్యుని వలే వెలుగు నందించి చంద్రునివలే చల్లని వాతావరణం కల్పించి ప్రకృతితో సమానంగా మాకోసం ని