Posts

Showing posts from June, 2020
Image
పాహిమాం....  పాహిమాం లోకాలు ఏలు మహాలక్ష్మి పాదమే కద్లి దే శాల్కే ప్రమాదము యెర్పూటు కాలమే తీర్పుగా మాకేన కష్టములే వచ్చు వాదనే నేర్పుగా దైవాన్ని కోరుటయే నిత్య సత్యమే ఓర్పుగా లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం పాపాలు పెర్గియు వేదాన్ని తప్పుగా పట్టుటే మోసాలు చేసియు మోదాన్ని చూపుటే ఆశగా పాఠాలు నేర్చియు కాలాన్ని నమ్మకే లక్ష్మి కే ఆరాట పోరును కష్టాల్ని పెంచుటే ఎందుకో లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం రాజ్యాల్ని ఏలు నిధి వ్రాత దేహి గా దాహమై మోహమ్ము తోను మది జ్ణాన మంతయూ  సూణ్యమై కాలంతొ వేగక విజ్ణాన మేమియూ తెల్పకే దేహాన్ని బాధకు దించీ మనో సహా యమ్ముగా లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం కన్నీళ్లు ఎందుకు వస్తాయి అర్ధమే తెల్పవా   సామ్రాజ్య సంపద మీ సొంత మవ్వడం న్యాయమా   విశ్వాస సంపద పొందేందుకు స్వరం తప్పదా   ఆరోగ్య సంపద ఇబ్బంది పొందుటే మార్చుమా   లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం దుక్ఖాల సంతసమే దైవపెన్నిదే మేలుగా   సర్వత్ర సేవల భావాన్ని మానసం పంచెనే  ప్రాధాన్య మిచ్చెటి దైవాన్ని కోరడం తక్షణం  ఏకైక రక్షణ  సత్యాన్ని పల్కడం నీకృప   లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం --(())-- భా  జ  స  న   భా  జ  స  న గ గ   
* 🌹. నేను ఆత్మ స్వరూపుడను అని గుర్తించుటకు,  ఆత్మకు పరమాత్మకు బేధము లేదు అని తెలిసి కొనుటకు ఉపయోగ పడు ఏకైక ఉపాధి, ఈ మానవ ఉపాధి.  దానిని సవ్యంగా ఉపయోగించడం మన విధి. 🌹 భగవంతుడు మనకు చేసిన అతి పెద్ద సహాయము, అతి పెద్ద వరము  ఈ మానవ శరీరమును ఇవ్వటమే. ఎనుబది నాలుగు లక్షల జీవరాసులలో అత్యుత్తమ ఉపాధి  ఈ  మానవ ఉపాధి . నేను ఆత్మ స్వరూపుడను అని గుర్తించుటకు,  ఆత్మకు పరమాత్మకు బేధము లేదు అని తెలిసి కొనుటకు ఉపయోగ పడు ఏకైక ఉపాధి, ఈ మానవ ఉపాధి. భగవంతుడు మనందరికి బుద్ధిని , విచారణ చేయగలిగే శక్తిని అనుగ్రహించారు. ఈ విచారణా శక్తిని చక్కగా వినియోగించుకొని ఆత్మ జ్ఞానమును పొందే అర్హత మానవ శరీరము ధరించిన ప్రతి ఒక్కరికి ఉన్నది. శాస్త్రము మనకు గురువు అంటే ఎవరు? గురువుకు ఉండవలసిన లక్షణములు ఏమిటి? గురువును ఆశ్రయించి దేనిని గురించి తెలిసికొనవలెను? గురువును దేనిని గురించి ప్రశ్నించ వలెను అను ప్రాధమిక విషయముల గురించిన  అవగాహనను కలుగ చేస్తుంది.   శాస్త్రము మనకు సిద్ధాంతమును తెలియ చేస్తుంది. ఆ శాస్త్రములోని వాక్యములను  అనుభవములోనికి తెచ్చుకోనవలెననిన ఆత్మజ్ఞానమును అనుసరించి జీవించి అనుభవమును పొ